మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి…

మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి

మాజీ సర్పంచుల జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ అక్కనపల్లి కరుణాకర్ డిమాండ్

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-02T133644.758-1.wav?_=1

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ సర్పంచులు 2019 -24 సంవత్సరానికి పని చేసినటువంటి మాజీ సర్పంచులు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. మాజీ సర్పంచుల జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ అక్కనపల్లి కరుణాకర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వo కాలనీలో, గ్రామాల్లో సర్పంచులు చేసినటువంటి అభివృద్ధి
పనులకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. గత ప్రభుత్వ కాలం పోయి నూతన ప్రభుత్వం వచ్చినాక కూడా బిల్లులు చెల్లించకపోవడం వల్ల చాలామంది సర్పంచులు తమ ఇల్లు, పొలాలు తాకట్టు పెట్టి గత ప్రభుత్వంలో సర్పంచుల సొంత నిధులతో ఖర్చు పెట్టించి నా గత బిఆర్ఎస్ ప్రభుత్వం. నేడు నూతన ప్రభుత్వంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా పోవడం వల్ల మాజీ సర్పంచులకు కుటుంబ పరంగా మరియు ఆర్థిక పరంగా నష్టపోయారని సర్పంచుల జిల్లా ఫోరం పేర్కొన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో సర్పంచులు కట్టించినటువంటి కార్యాలయాలల్లో
నేడు నూతనంగా వచ్చిన ప్రభుత్వ, అధికారులు గానీ నాయకులు గానీ ఉండలేరా అని ప్రశ్నించడం జరిగినది. కాబట్టి వెంటనే మాజీ సర్పంచుల బిల్లులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయాలని ప్రెస్ మీట్ ద్వారా కోరడం జరిగినది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ సర్పంచుల జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్. అక్కనపల్లి కరుణాకర్ జిల్లా అధ్యక్షులు దుమ్మ అంజయ్య. గుణాల లక్ష్మణ్. సిరికొండ శ్రీనివాస్. ఆరే మహేందర్. రవి నాయక్. శ్రీనివాస్. తదితరులు పాల్గొన్నారు.

విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు ఎస్ పి సి) ఆధ్వర్యంలో మూడు దశల పోరాటం.

మొదటి దశలో భాగంగా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మండల స్థాయిలో తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పణ

విద్యారంగంలో పేరుకుపోయిన 51 సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నపం.

ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించాలి. సిపిఎస్ ను రద్దు చేయాలి.

317 బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలి.

టి పి టీ ఎఫ్ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు చీకటి వెంకట్రాం నర్సయ్య, కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్, యుటిఎఫ్ అధ్యక్షులు భూక్య శ్రీను, డి టి ఎఫ్ అధ్యక్షులు కీర్తి నాగయ్యల డిమాండ్ .

కేసముద్రం/ నేటి దాత్రి

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రభుత్వం ముందుంచిన దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పిఆర్సి, డిఏ, ఏకీకృత సర్వీస్ రూల్స్ మొదలగు 51 అపరిష్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టిపిటిఎఫ్ మహబూబాద్ జిల్లా శాఖ ఉపాధ్యక్షులు చీకటి వెంకట్రామ్ నర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడం లో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి( యు.ఎస్.పి.సి ) చేపట్టిన మూడు దశల పోరాటం లో, మొదటగా మండల కేంద్రంలో తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించాలన్న పిలుపు మేరకు గురువారం మండలంలోని యు. ఎస్. పి. సి. భాగస్వామ్య సంఘాలైన టీ.పి.టీ. ఎఫ్, డి. టీ. ఎఫ్. సంఘాల నేతృత్వంలో కేసముద్రం మండల తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్, యు.టి. ఎఫ్ అధ్యక్షులు భూక్య శ్రీను, డి టి ఎఫ్ అధ్యక్షులు కీర్తి నాగయ్య లు మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉపాధ్యాయులకు, విద్యారంగానికి సంబంధించిన అనేక సమస్యలను పెండింగ్లో ఉంచిన గత ప్రభుత్వాన్ని గద్దె దించామని అన్నారు. కానీ ఏరి కోరి తెచ్చుకున్న ఈ ప్రజా ప్రభుత్వం కూడా ఆ సమస్యలను అలాగే కొనసాగించి ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇచ్చిన ఉచితాల హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం పరుగులు తీస్తుందని విమర్శించారు. కానీ ఉద్యోగస్తులకు మాత్రం హక్కుగా రావాల్సిన వాటిని పెండింగ్లో పెడుతుందని వాపోయారు. విద్యారంగంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పిఆర్సి ,డి ఏ లు ప్రకటించాలని,,ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేయాలని, కస్తూరిబాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని, గురుకుల వ్యవస్థను తొలగించి గ్రామాలలో ఉండే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఆ రోజె అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ ప్రధాన కార్యదర్శి నన్నపురాజు నరసింహరాజు, కార్యదర్శులు వీసం నర్సయ్య, ఊట్కూరి ప్రణయ్ కు మార్, జి. శ్రీనివాస్, తండా సదానందం ,జిల్లా కౌన్సిలర్ సదయ్య, యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి లావుడ్యా భద్రాసింగ్, కార్యదర్శి భట్టు భద్రు, డి టి ఎఫ్ జిల్లా కౌన్సిలర్ గంగుల శ్రీనివాస్, కార్యదర్శి సుంకరి రవి తదితరులు పాల్గొన్నారు.

భూభారతిని తక్షణమే అమల్లోకి తీసుకురావాలి..

భూభారతిని తక్షణమే అమల్లోకి తీసుకురావాలి

పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలివ్వాలి ..ఎం సి పి ఐ ( యు) డిమాండ్

నర్సంపేట,నేటిధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎం సిపిఐ (యు ) నాయకులు నర్సంపేట ఆర్డీవో ద్వారా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూ భారతి అమలు చేయకపోవడం మూలంగా రైతుల భూముల సమస్యలు తీవ్రతరం అయ్యాయని అన్నారు.గత 15 ఏళ్లుగా నర్సంపేట పట్టణంలో 111 లో సర్వే నెంబర్ లో పేదలు వేసుకున్న గుడిసెలకు ఇప్పటివరకు పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కాలనీ వాసుల కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని అన్నారు.అంతర్గత రోడ్లు , డ్రైనేజీ,మంచినీటి సౌకర్యం వెంటనే కల్పించాలని కోరారు.సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న క్రమంలో కాలనీలో హెల్త్ క్యాంపులను తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కన్నం వెంకన్న,మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వంగల రాగసుధ,రైతు సంఘం రాష్ట్ర నాయకులు నాగేల్లి కొమురయ్య , ఎంసీపీఐ (యు)డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ,ఏఐసిటియు జిల్లా అధ్యక్షులు ఎండి మా షూక్ పాల్గొన్నారు.

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి.

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:*

Dr. Satya Sarada.

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ త్వరగా పరిష్కరించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి , జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డిఆర్డిఓ కౌసల్యాదేవి,ఆర్డీవోలు వరంగల్ సత్యపాల్ రెడ్డి, నర్సంపేట ఉమారాణి ,హౌసింగ్ పీడీ గణపతి పాల్గొని ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరించారు.ఈ ప్రజావాణిలో మొత్తం 150 దరఖాస్తులు రాగా ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించినవి 58, పిడి హౌసింగ్ 25, జి డబ్ల్యూ ఎం సి 13 దరఖాస్తులు రాగా, మిగతా శాఖలకు సంబందించిన దరఖాస్తులు 54 స్వీకరించామని కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో స్వీకరీంచిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ,డిసిఓ నీరజ, డిబిసిడివో పుష్పలత, కలెక్టరేట్ పరిపాలన అధికారి విశ్వప్రసాద్ వరంగల్, ఖిలా వరంగల్ తహసిల్దార్లు ఇక్బాల్,నాగేశ్వర్ రావు, సంబంధిత శాఖల అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

51 శాతం ఫిట్మెంట్తో ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణమే పిఆర్సి అమలు చేయాలి

*51 శాతం ఫిట్మెంట్తో ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణమే పిఆర్సి అమలు చేయాలి*

*డి ఏ లు,జూలై 2023 నుండి అమలు కావలసిన పిఆర్సి ఇంకా పెండింగ్ లోనే….!!*

*ఆర్థికంగా ఎంతో నష్టపోతున్న ఉద్యోగ ఉపాధ్యాయులు.*

*ఉచితాలకు పెద్దపీట వేస్తూ, ఉద్యోగ ఉపాధ్యాయులు కొట్లాడి తెచ్చుకున్న ఆర్థిక హక్కులను కాలురాస్తున్న ప్రభుత్వాలు.*

*కోరి తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వం సత్వరమే తగిన చర్యలు గైకొనాలి.*

*తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు బాలాష్టి రమేష్ డిమాండ్*

*కేసముద్రం/ నేటి ధాత్రి*

జూలై 2023 సంవత్సరం నుంచి అమలు చేయాల్సిన పిఆర్సిని 51 శాతం ఫిట్మెంట్తో తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు బాలాస్టి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం టిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు గుండు సురేందర్, ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు ల నేతృత్వంలో కేసముద్రం మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శిస్తూ రెండో రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా శాఖ అధ్యక్షులు బాలాష్టి రమేష్ మాట్లాడుతూ డిఏలు, మెడికల్ రీయంబర్స్మెంట్, జిపిఎఫ్ ఉపసంహరణ లతో పాటు 2023 జూలై నుంచి అమలు కావల్సిన పి ఆర్ సి ఇంతవరకు అమలు చేయకపోవడం బాధాకరమని తద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఇవ్వకూడని హామీలు ఇస్తూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఉచితాల హామీలను నెరవేర్చడానికి నానా తంటాలు పడుతున్నారని, కానీ ఉపాధ్యాయ,ఉద్యోగ వర్గాలకు హక్కుగా ఇవ్వాల్సిన డి ఏలు, పిఆర్సీలు మొదలగు వాటిని ఆమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఏరి కోరీ తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే వీటిని అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని, అంతేకాదు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

అనంతరం మండల శాఖ అధ్యక్షులు అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ రెండో రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గురువారం కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, కస్తూరిబా గాంధీ, మోడల్ స్కూల్, కల్వల తాళ్లపూసపల్లి ఉన్నత పాఠశాలలను, అన్నారం ప్రాథమికొన్నత పాఠశాలలను సందర్శించామని తెలిపారు
ఈ కార్యక్రమంలో మండలశాఖ ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, జిల్లా శాఖ ఉపాధ్యక్షులు చీకటి వెంకట్రామ్ నర్సయ్య, మండల శాఖ ఉపాధ్యక్షులు ఆంజన్న, కొమ్ము రాజేందర్, కార్యదర్శులు బి విజయ్ చందర్, జీ.మోహనకృష్ణ, బబ్బులు సురేష్ , పి రామారావు తదితరులు పాల్గొన్నారు.

జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం

జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 282 ను వెంటనే ఉపసంహరించుకోవాలి

సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో హాస్పిటల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 282 ని ఉపసంహరించుకోవాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మిక హక్కులను హరించే విధంగా , కార్మికులను కట్టు బానిసలు చేసే విధంగా తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కార్డులను రద్దు చేయాలని కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు అందించాలని తదితర డిమాండ్లతో జూలై 9న చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ , పేషంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.

 

 

 

 

కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 282 ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు*

 

 

 

 

జూలై 9వ తేదీన సిరిసిల్ల ఎమ్మార్వో ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు వేలాది మంది కార్మికులతో ర్యాలీ ప్రదర్శన చేపట్టి అంబేద్కర్ చౌక్ వద్ద మహా ధర్నా చేపట్టడం జరుగుతుందని ఇట్టి కార్యక్రమంలో హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ , పేషెంట్ కేర్ , కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సుజాత , నాగమణి , పద్మ , రజిత , దేవలక్ష్మి , రాజవ్వ , లక్ష్మి , శ్రీను , తిరుపతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలి.

పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలి

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లాలోని పోస్టుమెట్రిక్ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న నైట్ వాచ్మెన్,డే వాచ్మెన్,కుక్,స్లీపర్,స్కావెంజర్స్ వేతనాలు గత ఏడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు.ఈ వేతనాలను తక్షణమే చెల్లించాలని కార్మికులను ఆదుకోవాలని శనివారం రోజున భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు ఆధ్వర్యంలో దళిత అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ సిహెచ్.దుర్గ ప్రసాద్ కి మెమోరండం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి డి.బ్రహ్మానందం మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా పరిధిలోని పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే కుక్,స్వీపర్ అండ్ స్కావెంజర్,నైట్ వాచ్మెన్,డే వాచ్మెన్ లకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు.మంచిర్యాల జిల్లాలోని పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పని చేసే వర్కర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనల వల్ల తీవ్ర జాప్యం జరుగుతుంది.రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసిన అనంతరం కంటిన్యూషన్ లెటర్ రాలేదని బిల్లులు పెట్టకుండా పెండింగ్ లో పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది.అనంతరం సంబంధిత శాఖ నుంచి ట్రెజరీ కి బిల్లులు పెట్టాల్సి ఉంటుంది.ఈ బిల్లులు పెట్టే కోణంలో ప్రొఫెషనల్ టాక్స్, టి.డి.ఎస్ కట్టకుండా బిల్లులు పంపించడం వల్ల ట్రెజరీ లో బిల్లులు చేయకుండా పెండింగ్ లో పెడుతున్నారు.బిల్లులు రిటర్న్ చేస్తున్నారు.ఒకవేళ ట్రెజరీ నుంచి బిల్లులు చేసి ప్రభుత్వ ఖజానాకు పంపిస్తే ఈ కుబేర్ అని,బ్రీజింగ్ అని నెలలు గడిచి పోతుంటాయి.ఈ విధానం వల్ల దళిత అభివృద్ధి శాఖ పోస్టుమెట్రిక్ హాస్టల్ లో పనిచేసే వర్కర్స్ కు వేతనాలు రాకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు.కనుక ఇప్పటికైనా ప్రభుత్వం,ప్రభుత్వ యంత్రాంగమంతా ఈ విధానాన్ని మార్చి కాంట్రాక్ట్ ,ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు కలెక్టర్ ఖాతా నుంచి చెల్లించే విధంగా ప్రణాళిక రూపొందించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఐఎఫ్ టియు) డిమాండ్ చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో సంపత్,సునీత, మల్లేశ్వరి,హేమ,పద్మ,లక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.

తహశీల్దార్ కార్యాలయం ముట్టడి .

తహశీల్దార్ కార్యాలయం ముట్టడి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపల్ హోతి(కె)లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ తాళాలు లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని, అధికారులు 20 రోజుల్లో ఇస్తామన్న హామీ నిలబెట్టుకోక పోవడంతో నిరసిస్తూ మంగళవారం రోజు సిపిఎం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించి తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. తాసిల్దార్ కార్యాలయం ముట్టడించి బైటాయించిన సందర్భంగా అధికారులతో వాగ్వాదం జరిగింది, స్పష్టమైన తేదీ ప్రకటించే వరకు కదిలేది లేదని కూర్చోవడం జరిగింది. తాహసిల్దార్ డిప్యూటీ తహసిల్దార్ తో సిపిఎం నాయకులతో ఫోన్లో మాట్లాడి 7వ తేదీలోగా ఇళ్ల తాళాలు అప్పచెబుతామని, అప్పటివరకు వేచి ఉండాలని ఆలోపు కచ్చితంగా ఇస్తామన్నా స్పష్టమైన హామీతో ఆందోళన విరమించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జహీరాబాద్ ఏరియా కమిటీ సభ్యులు ఎస్.మాట్లాడుతూ పేదలకు వచ్చిన ఇళ్లను ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని, తక్షణమే లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటి అద్దెలు చెల్లించలేక పేదలు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే ఇంటి తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈసారి కూడా అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం ఏడవ తేదీ లోపు ఇళ్ళ తాళాలు ఇవ్వకుంటే లబ్ధిదారులే వెళ్లి ఇళ్లల్లో ఉంటారని, నివసిస్తారని అన్నారు. ఆ పరిస్థితి వరకు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వెంటనే ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తిరుపతి, సలీం, బక్కన్న, డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు శ్రీనివాస్, శివకుమార్, యాదుల్, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి.

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి నేటిధాత్రి:

ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతీ దరఖాస్తును వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, డియార్వో విజయలక్ష్మి , జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డిఆర్డిఓ కౌసల్యాదేవి,ఆర్డీవోలు వరంగల్ సత్యపాల్ రెడ్డి,నర్సంపేట ఉమారాణి గార్లు పాల్గొని ప్రజలనుండి స్వీకరించారు.స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ త్వరగా పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.ఈ ప్రజావాణిలో మొత్తం 130 దరఖాస్తులు రాగా ఎక్కువగా రెవెన్యూ 54, హౌసింగ్ 20 దరఖాస్తులు వచ్చాయని మిగతా శాఖలకు సంబందించిన దరఖాస్తులు 56 వచ్చాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖ అధికారుల దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం లభించకపోవడంతో ప్రజావాణికి దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని,మీ పరిధిలో పరీక్షించవలసిన సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సంబంధిత జిల్లా అధికారులకు సూచించారు.ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలి ఆదేశించారు.ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని, పరిష్కరించుటకు వీలుకాని సమస్యలను ఎందుకు పరిష్కరించబడవో దరఖాస్తుదారునికి వివరించే ప్రయత్నంచేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లా అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టిఐ ,గ్రీవెన్స్ పెండేల్సి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని,e ఫైలింగ్ లో ఫైల్స్ సర్క్యులేట్ చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించారు.వ్యవసాయ,ఆరోగ్య, విద్యాశాఖ తదితర శాఖలు శాఖపరమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి నిర్ణీత గడువులోగా పనులు చేయించాలని పనులపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణచేసి లక్ష్యాలను సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమం జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ, కలెక్టరేట్ పరిపాలన అధికారి విశ్వప్రసాద్ వరంగల్, ఖిలా వరంగల్ తహసిల్దార్లు ఇక్బాల్,నాగేశ్వర్ రావు, హార్టికల్చర్ అధికారి అనసూయ, డిబిసిడివో పుష్పలత,జిల్లా విధ్యా శాఖ అధికారి జ్ఞానేశ్వర్,నర్సంపేట ఆర్డీఓ ఇమారాణి,సంబంధిత అధికారులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.

అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు

పారిశ్రామిక వాడలో జరిగిన అగ్నిప్రమాద ఘటన స్థలిని పరిశీలించిన హరీష్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి

 

 

 

 

 

పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన
అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కనీసం సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం అత్యంత దారుణమని ఎద్దేవా చేశారు.

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలిని ఎమ్మెల్యేలు మాణిక్ రావు,చింతా ప్రభాకర్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ,ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడి అందిస్తున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఘటన జరిగి ఐదు గంటలు గడుస్తున్నా సహాయక చర్యలు అందించడంలో, కుటుంబ సభ్యులకు వివరాలు తెలపడంలో వైఫల్యం అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం ఇంత పెద్ద పేలుడు జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.

వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, ప్రమాదం జరిగే సమయంలో కంపెనీలో మొత్తం 140 మంది పని చేస్తున్నట్లు తెలుస్తున్నది.

మొత్తం నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది.

8 మంది మృతి చెందగా, దాదాపు 26 మందిని పలు ఆసుపత్రులకు తరలించారు.మిగతా వారి పరిస్థితి తెలియరావడం లేదు.

ఎంత మంది బయటికి రాగలిగారు అనేది అర్థం కాని పరిస్థితి కుటుంబ సభ్యులు వచ్చి ఆందోళన చెందుతున్నారు.

తమవారి జాడ చెప్పాలని అధికారులను వేడుకుంటున్నారు.

కుటుంబ సభ్యులకు వివరాలు తెలిపే ప్రయత్నం చేయాలని కలెక్టర్, ఎస్పీ లను కలిసి చెప్పాను.

ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ పని చేస్తున్నారు.

కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు.

ప్రమాదం జరిగి 5 గంటలు గడుస్తున్నా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.కంట్రోల్ రూం పెట్టండి, కామన్ ఫోన్ నెంబర్ పెట్టండి అని అధికారులకు సూచించారు.ప్రమాదం జరిగి 5 గంటలు అవుతున్నది ఏం చేస్తున్నారు?

వివరాలు తెలియక కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నరు?

ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ వెతికేందుకు ఎన్డీఆర్ఎఫ్ అద్బుతంగా పని చేస్తున్నది.

కానీ, ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వం, అధికార యంత్రాంగం పని చేస్తున్నది అని ప్రశ్నించారు.

ప్రత్యేక అధికారులను పెట్టుకోండి, అటెండెన్స్ లిష్ట్ పెట్టుకోండి.డ్యూటీలో ఎంత మంది ఉన్నరు అంటే కలెక్టర్ ఒక లెక్క, ఎస్పీ ఒక లెక్క చెబుతున్నారని ఆరోపించారు.

5 గంటల నుంచి ఏ వివరాలు లేవు, బాధ్యత రాహిత్యంగ పని చేస్తున్నది ప్రభుత్వం
అసలు కార్మిక శాఖ, ప్రభుత్వం ఏం చేస్తున్నది?

ఇక్కడకు వచ్చే కుటుంబ సభ్యులు ఎవరిని కలవాలో చెప్పండి.

హ్యాండ్ మైక్ పెటుకొని గైడ్ చేసే బాధ్యత లేదా?

గాయపడ్డ వారిని ప్రైమేరీ కేర్ ఆసుపత్రుల్లో జాయిన్ చేస్తున్నారు.

30శాతం కాలితే డేంజర్, కార్పొరేట్ ఆసుపత్రులకు వారిని ఎందుకు పంపడం లేదు ఏఐజీ, కేర్, అపోలో ఆసుపత్రులకు పంపండి.

మొదటి గంటలో ట్రీట్మెంట్ అందితే ప్రాణాలు కాపాడవచ్చు.

నిర్లక్ష్యంతో గోల్డెన్ అవర్ మిస్ చేస్తున్నారు.

క్షతగాత్రులకు మంచి వైద్యం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని పేర్కొన్నారు.

కుటుంబాలకు సమాచారం అందించడంలోనూ ఫెయిల్ ఎంత మంది డ్యూటీలో ఉన్నారో గుర్తించడంలో ఫెయిల్ పారిశ్రామిక వాడలో వరుసగా ఇది మూడో సంఘటన.

గతంలో జరిగిన సంఘటనలో 5గురు చనిపోయారు.

వరుస అగ్రి ప్రమాదాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు?

ఏడాదిలో మూడో సంఘటన జరగటం దురదృష్టకరం.

ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది.

సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ఫెయిల్ దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలి.

ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే కాపాడే విధంగా చర్యలు రూపొందించాలి.

చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు మంచి వైద్యం అందించి 50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు.

సిపిఎస్ కు ప్రభుత్వ వాటా వెంటనే చెల్లించాలి.

సిపిఎస్ కు ప్రభుత్వ వాటా వెంటనే చెల్లించాలి

మంచిర్యాల జూన్ 30 నేటి దాత్రి

 

 

 

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ మంచిర్యాల జిల్లా శాఖ కార్యనిర్వాహకవర్గ సమావేశం ఆదివారం రోజున తపస్ సంఘ కార్యాలయం, మంచిర్యాల శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో జరిగింది.

ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధనపు ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ పాల్గొన్నారు.

కంచే చేను వేసిన చందంగా సిపిఎస్ కు గత 13 నెలలుగా ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడం శోచనీయమని వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తనిఖీలకు ఉపాధ్యాయులు వెళ్తే పాఠాలు ఎవరు బోధిస్తారని, సంబంధిత ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధమని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో ప్రతి 20 మందికి ఒక టీచర్ ను ఇవ్వాలని, 100 మంది విద్యార్థులు ఉంటే 5 ఐదుగురు ఉపాధ్యాయులతో పాటు ఒక ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని, బదిలీలు చేపట్టి, వందలాదిగా ఖాళీగా ఉన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టులను పదోన్నతులతో భర్తీ చేయాలని, పాఠశాలల్లో ఉన్న వివిధ ఖాళీలను డీఎస్సీ ద్వారా వెంటనే భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్యను అందించాలని, ఎన్ ఈ పి ని తెలంగాణలో వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షనర్ల బిల్లులను విడుదల చేయాలని, ఉద్యోగ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చిన మేరకు వెంటనే హెల్త్ కార్డులు జారీ చేయాలని, ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతాలు ప్రతినెల 1వ తారీఖున చెల్లించాలని, కేజీబీవీ లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, సిబ్బందికి మినిమం టైమ్స్ స్కేల్ అమలు చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను చెల్లించాలని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరావు, రవికుమార్ లు డిమాండ్ చేశారు. మెడికల్ బిల్లులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఈ సమావేశంలో జిల్లా నాయకులు నీలేశ్ కచ్వాల్, భారతీ అశోక్, గోపాలరావు, మండల నాయకులు శ్రీకాంత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు

బీడీ కార్మికుల వేతనాలు వెంటనే ఇవ్వాలి.

బీడీ కార్మికుల వేతనాలు వెంటనే ఇవ్వాలి

ఠాగూర్, సౌదే కర్ బీడీ యాజమాన్య కంపెనీలు ఆరు నెలల నుండి ఇవ్వడం లేదు

లేనిపక్షంలో హైదరాబాద్ లేబర్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేస్తాము

*బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు
జిల్లా అధ్యక్షులు ముశం రమేష్*

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బి. వై నగర్ అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ము శం రమేష్ మాట్లాడుతూ..
ఠాగూర్ సౌదే కర్ బి.డి కంపెనీ యజమాన్యం కార్మికులకు నెల నెల వేతనాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది గత ఆరు మాసాల నుండి కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదు ఈరోజు కూలి వస్తే ఆ రోజు పూట గడిచే కార్మికులకు ఆరు నెలల నుండి వేతనాలు యజమానికి ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య పనిచేసిన అప్పులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి వచ్చింది.చేసిన అప్పుకు మిత్తి కట్టలేక అప్పులు తెంపలేక తీవ్ర ఇబ్బందిలకు గురవుతున్నారు.దీనికి తోడు కార్మికులను విపరీతంగా శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు కంపెనీ సెంటర్ల కిరాయిలు కూడా కార్మికుల కూలి నుండి వసూలు చేయడం జరుగుతుంది.ఇలాంటి చర్యలను బీడీ యజమాన్యం మానుకోవాలని వెంటనే కార్మికులకు రావలసిన ఆరు నెలల వేతనం మొత్తం అందించాలని
లేనిపక్షంలో హైదరాబాద్ లేబర్ కమిషనర్ కి ఫిర్యాదు చేస్తామని కార్మికులతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.
ఈ సమావేశంలో బీడీ జిల్లా నాయకులు
,సూరం పద్మ శ్రీరాముల రమేష్ చంద్ర, జిందం కమలాకర్ తదితరులు పాల్గొన్నారు

ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి.

ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి

భూభారతి లోని లోపాలను వెంటనే సవరించాలి

ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో విఫలం చెందిందని, తక్షణమే పూర్తిస్థాయిలో 6 గ్యారంటీలను అమలు చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించుకోవాలని మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ( ఐక్య)- ఎం సి పి ఐ (యు) రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబురావు అన్నారు.ఆ పార్టీ పిలుపులో భాగంగా దుగ్గొండి మండల తహసిల్దార్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి పలు డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కుసుంబ బాబురావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంలోని లోపాలను తక్షణమే సవరించి పేద ప్రజలకు అండగా నిలవాలని, పెంచిన విద్యుత్ బస్ చార్జీలను తగ్గించాలని అంతేకాకుండా గ్రామాలలో కేటాయిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.తద్వారా పేద బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా 6 గ్యారంటీలను అమలు సంపూర్ణంగా అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలని, లేనియెడల ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజాఉద్యమాలను నిర్మిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నాగేల్లి కొమురయ్య, పేరబోయిన చేరాలు,మేరుగు సుధాకర్, ఐలోని, సురేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి కంపెనీలో వచ్చిన వార్షిక లాభాలను వెంటనే ప్రకటించాలి.

సింగరేణి కంపెనీలో వచ్చిన వార్షిక లాభాలను వెంటనే ప్రకటించాలి

భూపాలపల్లి నేటిధాత్రి:

 

తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
2024 2025 ఆర్థిక సంవత్సరం పూర్తయిన సింగరేణి యాజమాన్యం కంపెనీకి వచ్చిన లాభాలను ప్రకటించకపోవడంలో అంతరాయం ఏమిటి వెంటనే పూర్తిస్థాయిలో లాభాలు ప్రకటించి ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న కార్మికులకు లాభాల నుండి 40 శాతం వాటాను కార్మికులకు పంచాలని కార్మికుల పిల్లలకు విద్య కోసం ఉపయోగపడతాయని ఇప్పటికే స్కూలు కాలేజీలు స్టార్ట్ అయినాయని 2024 2025 సంవత్సరం సింగరేణి యాజమాన్యం కార్మికుల పైన పెట్టిన ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తి చేసి మూడు నెలలు అవుతున్న సింగరేణి యాజమాన్యం ఇంకా లాభాలను ప్రకటించలేదు లాభాలను ఇంకా ఎప్పుడు వెల్లడిస్తారు కార్మికులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి మార్చి వరకు సింగరేణి ఉత్పత్తి ఏడాదిగా పరిగణిస్తారు లాభాల టర్నవర్ను ఏప్రిల్ నుండి మార్చి వరకు లెక్కించి అందులో కొంత శాతాన్ని కార్మికుల ప్రకటిస్తూది ఈసారైనా తమకు రావలసిన వాటాను త్వరగా చెల్లించాలని ఇట్టి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకొని వెంటనే యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలి ప్రాతినిత్య కార్మిక సంఘాలు కార్మికుల పక్షాన చొరవ తీసుకొని లాభాల వాటను ప్రకటింపచేసి కార్మికుల పక్షాన నిలబడాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తుంది
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
టి ఎస్ యు ఎస్ కార్మిక సంఘం నాయకులు
దాసరి జనార్ధన్
కాసర్ల ప్రసాద్ రెడ్డి
నామాల శ్రీనివాస్
రాళ్ల బండి బాబు
జయశంకర్
ఎండి సాజిత్
తదితరులు పాల్గొన్నారు

కేబినెట్‌ మీటింగ్‌కు వచ్చిన పవన్..

కేబినెట్‌ మీటింగ్‌కు వచ్చిన పవన్.. వెంటనే హైదరాబాద్‌కు పయనం

 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఏపీ కేబినెట్‌ సమావేశానికి వచ్చిన ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

 

 

 

అమరావతి, జూన్ 24: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) హైదరాబాద్‌కు పయనమయ్యారు. పవన్ తల్లి అంజనా దేవి (Anjana Devi) స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పవన్ హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈరోజు (సోమవారం) ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి కూడా వచ్చారు. కేబినెట్ సమావేశం మొదలవగానే తల్లికి అనారోగ్యంగా ఉందని సమాచారం అందింది. దీంతో కేబినెట్ అనుమతి తీసుకుని మరీ పవన్ హైదరాబాద్‌కు వెళ్లారు. కేబినెట్‌కు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు (CM Chandrababu Naidu) చెప్పి పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరి వెళ్లారు.

మరోవైపు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అమరావతికి వివిధ కంపెనీల రాకకు సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఏడవ ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28,546 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.

అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో 1450 ఎకరాల్లో మౌలికవసతుల కల్పనకు టెండర్ పిలవడానికి ఈ సమావేశంలో మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విశాఖలో దిగ్గజ ఐటి సంస్థ కాగ్నిజెంట్‌కు 22.19 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకు కేటాయించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. 49వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్ణయాలకు కూడా ఆమోదం తెలుపనుంది కేబినెట్. పురపాలక శాఖలో 40 బిల్డింగ్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులను అప్‌గ్రేడ్‌ చేసేందుకు కేబినెట్ అంగీకారం తెలుపనుంది. కొత్తగా మరో 7 అన్నాక్యాంటీన్లు ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది.

చర్ల మేజర్ పంచాయతీలో నెలకొన్న సమస్యలను వెంటనే..

చర్ల మేజర్ పంచాయతీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి

బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతరావు

నేటిధాత్రి చర్ల

 

shine junior college

 

 

చర్ల మేజర్ పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి అని బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆద్వర్యంలో పంచాయతీ సెక్రటరీ సురేష్ కు వినతిపత్రం అందజేశారు మండల కన్వీనర్ దొడ్డి తాతారావు మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్టిలో వుంచుకొని ముందుగానే సైడ్ డ్రెయిన్ లను శుభ్రం చేయాలి అని రోడ్డు కి ఇరువైపులా వున్న పిచ్చి మొక్కలను తొలగించాలి అని అదేవిధంగా దోమల మందు పిచికారి చేయాలి అని వీధి దీపాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలి అని రోడ్లమీద నిలువ నీరు లేకుండా చూడాలి అని తెలియచేశారు సానుకూలంగా స్పందించిన పంచాయతీ సెక్రటరీ సురేష్ సమస్యలను తొందర్లోనే పరిస్కరిస్తము అని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ డివిజన్ యువజన నాయకులు కాకి అనిల్ బీసీ సెల్ అధ్యక్షులు గోరంట్ల వేంకటేశ్వరరావు ఎస్సి సెల్ అధ్యక్షులు కొంబత్తిని రాము మహిళా ఉపాధ్యక్షురాలు కొప్పుల సౌజన్య టౌన్ కార్యదర్శి గాధంసెట్టి కిషోర్ యువజన నాయకులు తడికల బుల్లెబాయ్ ఎన్నామూరి సృజన్ గంపల రమేష్ మైప వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

డీఎస్సీ ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి.

ఫిబ్రవరిలో నియామకమైన 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి.

ఐదు నెలలుగా అందని జీతాలు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులు.

2008 డిఎస్సి లో సెలెక్ట్ అయి డీ.ఎడ్ రిజర్వేషన్ తో నియామకం నిలుపుదల.

కోర్టు నాశ్రయించిన బాధితులు, ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి పదిహేను సంవత్సరాల సుదీర్ఘ పోరాటం

కోర్టు అనుకూల తీర్పుతో కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చి తీరని అన్యాయం చేసిన ప్రభుత్వం.

ఐదు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం సమంజసం కాదు

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్.

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

shine junior college

 

 

 

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నియామకమైన డీఎస్సీ 2008 కాంట్రాక్టు ఉపాధ్యాయులకు నియామకమైన నెల నుండి నేటి వరకు ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదని, తక్షణమే ప్రభుత్వం వారికి జీతాలు చెల్లించేలాగా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్ చేశారు. కేసముద్రం విలేజ్ ప్రాథమిక పాఠశాలలో భోజన విరామ సమయంలో టి పి టి ఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ సంఘ మండల శాఖ అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ..
డీఎస్సీ 2008లో సెలెక్ట్ అయి,నియామకం పొందే సమయంలో డి.ఎడ్ వారికి 30% రిజర్వేషన్ ఇవ్వాలన్న నిర్ణయంతో ఈ నియామకం ఆగిపోయిందని, ఈ విషయమై ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ప్రభుత్వం వీరికి ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. విధి లేని పరిస్థితుల్లో వీళ్ళు కోర్టు ను ఆశ్రయించి, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి 15 సంవత్సరాలుగా పోరాటం చేశారని వివరించారు. చివరకు వీరికి అనుకూలంగా కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో వీరిని రెగ్యులర్ ఉపాధ్యాయులుగా కాకుండా కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా నియమించి వారికీ తీరని అన్యాయం చేశారని ఆయన వాపోయారు. ఈ పదిహేను సంవత్సరాలు వారు ఎంతో మనోవేదనకు గురయ్యారని, శారీరకంగా ఆర్థికంగా వారు ఎంతో నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో వీరికి కాంట్రాక్టు ఉద్యోగాన్ని అంటగట్టిన ప్రభుత్వం నియామకమైన ఫిబ్రవరి నెల నుండి నేటి వరకు సుమారు ఐదు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదని, ఎందుకీ వివక్ష అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వీరంతా ఐదు నెలలుగా తమ విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారని, కానీ జీతాలు రాక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోయారని అన్నారు.

ప్రభుత్వం వీరికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని హితువు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి జీతాలు ఇవ్వడానికి అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని సురేందర్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల శాఖ కార్యదర్శి వీసం నర్సయ్య, ఉపాధ్యాయులు అప్పాల నాగరాజులు పాల్గొన్నారు.

పెంచిన స్టూడెంట్స్ బస్ పాస్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలి.

పెంచిన స్టూడెంట్స్ బస్ పాస్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలి

జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తూ అడ్మిషన్స్ చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన

ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజినీకాంత్

సిరిసిల్ల టౌన్( నేటి ధాత్రి ):

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం విద్యార్థులు బస్ పాస్ ఛార్జీలను 20% పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తూ అడ్మిషన్స్ చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేయడం జరిగినది.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజినీకాంత్ మాట్లాడుతూ
ఇప్పటికే గతంలో పెంచిన బస్ ఛార్జీలు, స్టూడెంట్స్ పాస్ ఛార్జీలు కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ 20% ఛార్జీలు పెంచి అమలు చేస్తే బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రధానంగా ఉన్నత విద్య కోసం బస్ నమ్ముకున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోని చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే చాలా రూట్లలో విద్యార్థులు కోసం బస్సులు నడపడం లేదు. ఒక ప్రక్క బస్సులు సంఖ్య పెంచి, ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఛార్జీలు, బస్ పాసులు పెంచే ఆలోచన చేయడం దుర్మార్గపు చర్య. తక్షణమే పాసుల ఛార్జీలు పెంపు ఆలోచనలు విరమించుకోవాలి. లేకుంటే అన్ని డిపోల ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామని అన్నారు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని పాఠశాలలు ఉన్నాయని వాటిని పర్యవేక్షణ చేయడంలో జిల్లా విద్యాధికారుల లోపం స్పష్టంగా కనబడుతుందని వెంటనే పర్మిషన్ లేని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను సీజ్ చేయాలని అన్నారు అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభమైతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లకు ,పక్కా భవనాలు నిర్మించాలని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రినీ నియమించాలని డిమాండ్ చేశారు, లేని యెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉదృతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ కుమార్, జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, జిల్లా గర్ల్స్ కన్వీనర్ సంజన, జిల్లా కమిటీ సభ్యులు సాయి భరత్, శివ ,నాయకులు జస్వంత్, అఖిల్, అక్షయ్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను తక్షణమే నిలిపివేయాలి.

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను తక్షణమే నిలిపివేయాలి.

 

 

 

 

 

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను ఆపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తుమ్మల ప్రఫూల్‌ రాంరెడ్డి చెప్పారు…

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను ఆపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తుమ్మల ప్రఫూల్‌ రాంరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను ఆంధ్రా సినిమాలకు ఇవ్వవద్దని హైకోర్టులో ఫిటిషన్‌ వేశామని, శుక్రవారం వాదనలు వినిపించబోతున్నామని వారు చెప్పారు. కోర్టు ద్వారా తెలంగాణ సినిమాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు.

పెంచిన ఆర్టీసీ బస్ టికెట్లను ధరను వెంటనే తగ్గించాలి.

పెంచిన ఆర్టీసీ బస్ టికెట్లను ధరను వెంటనే తగ్గించాలి

బిజెపి పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్

పరకాల నేటిధాత్రి

 

బస్సు పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ సామాన్య ప్రజలతోపాటు,విద్యార్థుల బస్సు పాస్ 20 శాతం,పెంచిన తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రం
ఆర్డినరీ పాస్ ధరను రూపాయలు 1150 నుండి రూ.1400కు,మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధరను 1300 నుండి 1600 కు,డీలక్స్ పాస్ ధరను 1450 నుండి 1800 పెంచిన టీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడవారికి ఉచితమని మగవారి దగ్గర టికెట్ రేట్లు పెంచి ప్రజల మీద భారం వేస్తుంన్నారని,పెంచిన ఆర్టీసీ టికెట్ ధరను వెంటనే తగ్గించాలని లేనియెడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో
ప్రజల తరఫున ధరలు తగ్గించేవరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని
బిజెపి పరకాల పట్టణ అధ్యక్షులు
గాజుల నిరంజన్ డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version