స్నేహితుల కుటుంబాలకు చేయూత అందించిన..

స్నేహితుల కుటుంబాలకు చేయూత అందించిన తోటి మిత్ర బృందం.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన మామిండ్ల రమేష్ తండి మరియు సంగ శ్రీనివాస్ తల్లి మృతి చెందిన విషయం తెలుసుకునీ1998-99 బ్యాచ్ కుచెందిన తమ స్నేహితుల కుటుంబాలకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందచేశారు
ఈ కార్యక్రమం లో మిత్రబృందం పాల్గొన్నారు.

స్నేహితులే రాజకీయ ప్రత్యర్థులు..

స్నేహితులే రాజకీయ ప్రత్యర్థులు

ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో ‘ప్రస్థానం’ ఫేమ్‌ దేవా కట్టా, జయకిరణ్‌కుమార్‌ సంయుక్తంగా తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ ‘మయసభ’. ‘రైజ్‌ ఆఫ్‌ ద టైటాన్స్‌’ ట్యాగ్‌లైన్‌…

ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో ‘ప్రస్థానం’ ఫేమ్‌ దేవా కట్టా, జయకిరణ్‌కుమార్‌ సంయుక్తంగా తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ ‘మయసభ’. ‘రైజ్‌ ఆఫ్‌ ద టైటాన్స్‌’ ట్యాగ్‌లైన్‌. విజయ్‌కృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మించారు. ఆగస్టు 7న ఓటీటీ వేదిక సోనీ లైవ్‌ ద్వారా అందుబాటులోకి రానుంది. తాజాగా, టీజర్‌ను విడుదల చేశారు. సంభాషణలు, ప్రధాన పాత్రధారుల మధ్య ఉన్న సంఘర్షణ, భావోద్వేగాలు ఆకట్టుకున్నాయి. ఇద్దరు స్నేహితులు కొన్ని పరిస్థితుల వల్ల రాజకీయ ప్రత్యర్థులుగా మారితే ఎలా ఉంటుందనేది కథాంశం. అయితే వీరిద్దరి పాత్రలు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిని పోలి ఉంటాయని సమాచారం.

స్నేహితురాలి కుటుంబానికి అండగా పాత మిత్రులు.

స్నేహితురాలి కుటుంబానికి అండగా పాత మిత్రులు.

కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయం.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

చిన్నతనంలో కలిసి చదువుకున్న తమ స్నేహితురాలు తల్లి లింగంపల్లి వినోద అనారోగ్య కారణంగా చనిపోవడం జరిగింది కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారుజయశంకర్ భూపాలపల్లి జిల్లా,మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో 2009-2010 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న బ్యాచ్కి చెందిన కోర్కిశాల గ్రామంలోని లింగంపల్లి అనిత అనే అమ్మాయి వాళ్ళ అమ్మ లింగంపల్లి వినోద ఈ నెల 02-07-2025 రోజున అనారోగ్యం కారణంగా చనిపోవడం జరిగింది 10వ తరగతి చదువుకున్న అప్పటి చిన్న నాటి స్నేహితులుకోర్కిశాల గ్రామంలోకి వెళ్ళి అనితని వాళ్ళ కుటుంబాన్ని పరమార్చించడం జరిగింది అనంతరం 11వరోజుకి(పెద్ధకర్మ)చేయవలసిన కార్యక్రమానికి అప్పటి చిన్న నాటి స్నేహితులు పదివేల రూపాయలు ఖర్చుల కోసం ఇవ్వడం జరిగింది..ఈ కార్యక్రమానికి వచ్చినవారు..దూడపాక.రాజు శెనిగరపు శ్రీనివాస్.దానబోయిన రామ్ కుమార్.దానబోయిన నరేందర్.శరత్ కుమార్.బండి అనిల్ కుమార్.సుప్రియ.శృతి సుమలత.సుజాత.మమత.నీలిమ.చామంతి పాల్గొనడం.జరిగింది

పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు.

పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు

రామేశ్వర యాత్రలో శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండలం ధర్మారావుపేట గ్రామ శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి సభ్యులు భారత దేశం లోని తమిళనాడు రాష్ట్రము లోని ప్రసిద్ధి గాంచినా పరమ పవిత్ర మైన రామేశ్వర క్షేత్ర విహార యాత్రలో శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి సభ్యులు ప్రతి సంవత్సరం దేశం నలుమూలల దేవాలయాలు సందర్శించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం దక్షిణ భారత దేశం పుణ్యక్షేత్రలు అనంత పద్మనాభ స్వామి మధుర మీనాక్సీ శ్రీరంగం తిరుచనూరు కన్యాకుమారి జంబూకేశ్వర్ తాంజవుర్ లాంటి దేవాలయాలు దర్శించినట్టుగా సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ పాత్రికేయలకు తెలిపారు.ఈ యాత్రలో ఆకుల రవీందర్ దామోదర్ బెనికి రాజు సింగం రాజవిరు పనికెలా శివకృష్ణ మొగిలి బండి రాజు ఆకుల సుజాత స్వర్ణలత లావణ్య సులోచన సారలక్ష్మి బెనికి స్వాతి వసంత అన్నపూర్ణ సంధ్య తదితరులు పాల్గొన్నారు

మృతుడి కుటుంబానికి మిత్రుల ఆర్థిక సాయం.

మృతుడి కుటుంబానికి మిత్రుల ఆర్థిక సాయం.

భూపాలపల్లి నేటిధాత్రి:

 

భూపాలపల్లి పట్టణంలో నీ సుభాష్ కాలనీకి చెందిన పులిగంటి రమేష్ గత వారం క్రితం గుండెపోటుతో మృతి చెందాడు గురువారం భూపాలపల్లి పట్టణానికి చెందిన పూర్వ పాఠశాల రాహుల్ విద్యానికేతన్ కు చెందిన తోటి మిత్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లట్ట రాజబాబు ,ఉపాధ్యాయులు. లట్ట వెంకటేష్, మేడ వెంకటస్వామి. మృతుడి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మిత్రులు మొదటి కుటుంబ సభ్యులకు రూ. 25 వేల తో పాటు 50 కిలోల బియ్యం ఇతర నిత్యవసర సరుకులు అందించారు.. కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా మిత్రులు తెలిపారు
ఈ కార్యక్రమంలో మిత్రులు దుండ్రా.కుమార్ యాదవ్, గాదం రాజు, అల్లెపు సతీష్, చెక్క గోపి. నాన్డ్రి కమలాకర్ ,. బి కొండ నరేందర్ , ఏలుగుల సురేష్ , బొల్లం నరేష్, పూల్యాల తిరుపతి, ఎలాకంటి విజయ్, కాలనీ వాసులు కొడపాక శంకర్, రఘుపతి తదితరులుపాల్గొన్నారు

స్నేహితుని కుటుంబానికి చేయూత.

స్నేహితుని కుటుంబానికి చేయూత
మొగులపల్లి నేటి ధాత్రి:

 

మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో తమతో పాటు చదువుకున్న 2007-08 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన ఇప్పకాయల శ్రీను తండ్రి ఇప్పకాయల రాజేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు 10 వేల ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో బండారి ఓదెలు, తిప్పారపు సురేందర్,ల్యాండిగా రాజేందర్, జునుమల తిరుపతి, నాగలగని రాజేందర్, పోతుగంటి దశరథం తదితరులు పాల్గొన్నారు.

మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన.

మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బాల్యమిత్రులు ..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:-

 

 

 

చిన్ననాటి కాలంలో వారితో పాటు చదువుకున్న మిత్రుడు ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబానికి తోటి విద్యార్థులు గురువారం ఆర్థిక సహాయం అందజేశారు. పొత్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-2003 సంవత్సరంలో వారితోపాటు విద్యను అభ్యసించిన ఎనగందుల రాజు ఇటీవల మల్లయ్య పల్లె గ్రామంలో గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో అప్పట్లో రాజు తో చదువుకున్న మిత్రులందరూ రాజు కుమార్తె పేరు మీద ఉన్నత చదువులు కొరకు రూ. ఇరవై ఐదు వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడిదుల రవీ గుండ్లపల్లి శ్రీనివాస్ వంగ కుమార్ గడ్డం ఉపేందర్ ఐలయ్య రవి పాల్గొన్నారు.

*-స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం *

*-స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం *
మొగుళ్ళ పల్లి: నేటి ధాత్రి

 

సొంత రక్తసంబంధీకులే వివిధ కారణాలతో విడిపోయి..గొడవలు పడి..మానవత్వ విలువలను మంటగలుపుతున్న తరుణంలో..తోటి స్నేహితుడి తండ్రి మరణం పట్ల స్పందించి..ఆర్థిక సహాయాన్ని అందించి..తోటి స్నేహితులు మానవత్వాన్ని చాటుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నవీన్ తండ్రి కుమ్మరి సమ్మయ్య ఇటీవల మృతి చెందాడు. కాగా 2012-2013 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన కుమ్మరి నవీన్ స్నేహితులు జన్నే రాజ్ కుమార్, ఇల్లందుల విజయ్ కుమార్, బొచ్చు ప్రకాష్, నాగన బోయిన రాకేష్ యాదవ్, వైనాల అజయ్, బొచ్చు రాజు, తంగళ్ళపల్లి హరీష్, జన్నే రేష్మ, కట్ల మమత, వనపర్తి రుతీష, చల్ల మమత, పోతరాజు జ్యోతి, పసరగొండ శ్రీలత, గాదే రమ్య, చేపూరి రజిత, వైనాల శిరీషలు విరాళాలుగా వేసుకుని 5000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించారు.

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

చిట్యాల మండల కేంద్రానికి చెందిన అనుమ రాజు ఇటీవల కాలంలో అనారోగ్యంతో అకాల మరణం చెందారు.  విషయం తెలుసుకున్న 2005-06 పదవ తరగతి  బ్యాచ్ మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించి రూ.40,000 లను సేకరించిన నగదును మృతుని పిల్లల పేరు మీదుగా పోస్ట్ ఆఫీస్ లో జమ చేసి  జమ చేసిన ధ్రువపత్రాలను శుక్రవారం మృతుని దశదినకర్మ రోజు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ.. ఈ లోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటి లేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్త మిత్రుడు దూరమవ్వడం చాలా బాధాకరమని, భౌతికంగా మా మధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మా మధ్య మెదలాడుతూనే ఉంటాయని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మిత్రుడు రాజు కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
     ఈ కార్యక్రమంలో చింతల మహేందర్, మురహరి భానుచందర్, ఉయ్యాల  రమేష్, కల్వచర్ల రాము, పాసిగంటి మహేందర్, ఏకు అశోక్, రాయిని శ్రీకాంత్, ఎండి సాజిత్, కమ్మగాని బాలకృష్ణ, శ్రీపతి రమేష్, నాగబాబు, తిరుపతి, క్రాంతి, రామచందర్, రవీందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

మీడియా మిత్రులకు శ్రీవారి భక్తుల అభివందనాలు.

మీడియా మిత్రులకు శ్రీవారి భక్తుల అభివందనాలు

సీఎం నోట శుభవార్త విన్నాము

తిరుపతిని మధ్య రహిత క్షేత్రంగా సాధిద్దాం

తిరుపతి(నేటి ధాత్రి)మార్చి 24:

శ్రీనివాస సదానంద స్వామి స్వాముల ఆధ్వర్యంలో చేపట్టిన తిరుమల పవిత్రతను కాపాడుకుందాం శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ ను నిలిపివేయాలని నిరసనలు నిరాహార దీక్షలు పాదయాత్రలో చేపట్టిన కార్యక్రమాలను మీడియా మిత్రులు ప్రత్యేకంగా పలుమార్లు ప్రచురించి నందుకు మీడియా మిత్రులకు స్వామివారి భక్తులైన మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో బీసీ నాయకులు శ్రీవారు భక్తుల జగన్నాథం మరియు అభయ హస్త గోవింద సేవ మండలి అధ్యక్షులు చంద్రమౌళి లు అన్నారు,సీఎం తిరుమలకు వస్తున్నారు. సీఎం నోటి శుభవార్త విందురని టిటిడి పాలకమండలి చైర్మన్ స్వాములకు ఫోన్ చేసి స్వయంగా తెలిపారని హిందూ పరిషత్ ఓంకార్ తెలిపారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల ప్రక్షాళన ముంతాజ్ హోటల్ తోనే మొదలెట్టారని ముఖ్యమంత్రి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు,
అలాగే సైనికులకు హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నీ మధ్య రహిత క్షేత్రంగా కలిసి పోరాడుదాం అని పలు పుణ్యక్షేత్రాలలో మధ్యరహిత పుణ్యక్షేత్రాలు గా ఎలాగైతే చేశారో అలాగే తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కూడా మధ్యాహ్నం క్షేత్రంగా చేసేంతవరకు హిందువులందరు కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అభయాస్త గోవింద మండలి సేవా సభ్యులు సురేష్ , రోహిత్ బాబు తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version