ఇతర రాష్ట్రాల మాదిరిగా జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్ ఇవ్వాలి
ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన సీనియర్ జర్నలిస్ట్ రాజమల్లు యాదవ్
కేసముద్రం/ నేటి ధాత్రి
సీనియర్ జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల మాదిరిగా పించను ఇప్పించి జర్నలిస్ట్ ల జీవితానికి భరోసా కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కి, శాసనసభ్యులు భూక్య మురళి నాయక్, పార్లమెంట్ సభ్యులు కోరిక బలరాం నాయకుల సమక్షంలో వేం నరేందర్ రెడ్డి కి జర్నలిస్టుల సమస్యల ను వివరిస్తూ కేసముద్రం సీనియర్ జర్నలిస్ట్ వేల్పుల రాజమల్లు యాదవ్ వినతి పత్రం అందజేయడం జరిగింది. బీహార్ రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్టులకు నెలకు రూ.15 వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజాగా నిర్ణయించి ప్రకటించారని పేర్కొన్నారు.జర్నలిస్ట్ మరణిస్తే వారి భాగస్వామి కి నెలకు రూ10 పింఛను ఇవ్వాలని ఆ ముఖ్యమంత్రి నిర్ణయించారని.తమిళనాడు కూడ సీనియర్ జర్నలిస్ట్ లకు పింఛన్లు అందిస్తుందని.పక్కనున్న ఏపీ లో కూడా అంతో,ఇంతో అందిస్తున్నది.
తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్ట్ లకు ఆలాంటి పథకం అమలులో లేవని.తెలంగాణలో కూడ సీనియర్ జర్నలిస్ట్ లకు జర్నలిజం లో 20 ఏళ్ళు గా పనిచేస్తూ 57 ఏళ్ళు దాటిన ప్రతి జర్నలిస్ట్ కు రూ.15 వేలు పింఛను మంజూరు చేయాలని కోరుతున్నానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రమాదంలో
మరణిస్తే రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారని.ఐతే
జర్నలిస్టులు సహజంగా మరణించిన వారి కుటుంబాలకు కూడా వర్తించే విధంగా అమలు చేసి
రూ.10 లక్షల కు పెంచాలని.,మరణించిన జర్నలిస్ట్ జీవిత భాగస్వామి కి జీవితాంతం వరకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3 వేల నుంచి రూ 10వేలు ఇప్పించాలని.
అలాగే ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ కు ప్రభుత్వం తరఫున
ప్రతి నెల జీవన భృతి కింద రూ. 5 వేలు మంజూరు చేసి వారి జీవితానికి భరోసా కల్పించాలని కోరుతున్నానని పేర్కొన్నారు.
ఇళ్లు లేక జర్నలిస్ట్ లు ఇబ్బంది పడుతున్నారని. ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేయాలని జిల్లాలో సీనియర్ జర్నలిస్టుగా
మనవి చేస్తున్నానని పేర్కొన్నారు.