ఘనంగా ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం వేడుకలు
నస్పూర్ నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా పరిధిలోని సిసిసి కార్నర్ లోని ఆటో కార్మికులు ఘనంగా ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తూముల నరేష్ ఆదేశాల మేరకు శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు చిలుక మల్లేష్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని ఆటో కార్మికులు నియమ నిబంధనలను పాటిస్తూ ప్రజలు,ప్రయాణికుల పట్ల గౌరవ మర్యాదలతో నడుచుకుంటున్నారని అన్నారు.ప్రతి ఆటో కార్మికుడు క్రమశిక్షణతో నడుచుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బచ్చలి మల్లేష్, పట్టణ అధ్యక్షులు అంకతి సత్తన్న,ప్రధాన కార్యదర్శి రాజు,వైస్ ప్రెసిడెంట్ చంద్ర య్య,బింగి రవి,అంజన్న, జగదీష్,నస్పూర్ మండల గౌరవ అధ్యక్షులు భూపతి శ్రీను,సిసిఎక్స్ రోడ్ల అడ్డా అధ్యక్షులు రామన్న పాల్గొ్నారు.