గంగమ్మ తల్లి బోనాల జాతర,

గంగమ్మ తల్లి బోనాల జాతర,

రాయికల్,జులై 31, నేటి ధాత్రి:

రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో గురువారం రోజున పెద్దవాగు నది తీరాన గంగమ్మ కమిటీ ఆధ్వర్యంలో గంగాదేవి, మరియు పరమశివుని విగ్రహల ప్రతిష్టలు పండితులు కృష్ణ ప్రసాద్ శర్మ, సంతోష్ లు ఘనంగా నిర్వహించారు.. మహిళలు బెల్లపు అన్నం వండుకొని బోనం నెత్తిపై పెట్టుకుని జంబి గద్దె నుండి పురవీధుల గుండా డప్పు చప్పుళ్ల మధ్య, భక్తి పాటలతో పెద్దవాగు గంగమ్మ తల్లికి, మా పిల్లలు, మా కుటుంబాలు, బాగుండాలని మనసారా మొక్కుకొని నైవేద్యం సమర్పించారు.. అనంతరం భక్తులందరికీ అన్నదానం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి, గంగమ్మ తల్లి కమిటీ సభ్యులు, గ్రామ సేవా సమితి కార్యవర్గ సభ్యులు, గంగపుత్ర సంఘ సభ్యులు, దాతలు, డాక్టర్ కాటిపెల్లి నారాయణరెడ్డి, కొడిమ్యాల భూoరావు, సురభి భూo రావు, విగ్రహ దాతలు ఉట్నూరి రవి, మరిపెళ్లి నారాయణ గౌడ్, చెన్నమనేని వంశీయులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, యువకులు, మహిళా సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మడేలేశ్వర స్వామి బోనాల జాతర….

ఘనంగా మడేలేశ్వర స్వామి బోనాల జాతర….

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-86.wav?_=1

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని బిజొన్ రజక సంఘం అధ్యక్షులు నడిగోట తిరుపతి ఆధ్వర్యంలో రజకుల కుల దైవం మడేలేశ్వర స్వామి,సీతాలమ్మ బోనాల జాతర ఘనంగా నిర్వహించారు.మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు చేసి రజక సంఘం కార్యాలయం నుండి అమరవాది చెరువు సమీపంలోని మడేలేశ్వర స్వామి గుడి వద్దకు పెద్ద ఎత్తున వెళ్లి బోనాలు సమర్పించారు. అనంతరం బిజొన్ రజక సంఘం అధ్యక్షుడు నడిగోట తిరుపతి మాట్లాడారు.

Seethalamma Bonala Jatara.

ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో రజకుల కుల దైవం అయిన మడేలయ్య కు భక్తి శ్రద్ధలతో బోనాలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తామని అన్నారు.దేవుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు నడిగోట శంకర్, కోశాధికారి కంచర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పున్నం సమ్మయ్య,తిరుపతి, కనకయ్య,రాజేశ్వరి, మాజీ కౌన్సిలర్ పోగుల మల్లయ్య, జిల్లా కార్యదర్శి రాములు, సహాయ కార్యదర్శి పైతరి ఓదెలు, సంఘం సభ్యులు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఘనంగా పోచమ్మ తల్లి బోనాల జాతర.

ఘనంగా పోచమ్మ తల్లి బోనాల జాతర

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని 23వ వార్డులో ఆదివారం ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు అమ్మవారికి సమర్పించినట్లు ఆలయ కమిటీ వారు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేడుకలు జరపడం తృతీయ సంవత్సరమని ప్రతి సంవత్సరం అమ్మవారిని అలంకరించి బోనాలతో అమ్మవారికి మొక్కలు చెల్లిస్తామని అన్నారు.అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి వద్ద పెద్ద ఎత్తున బోనాల సందడి నెల కోవడం జరిగింది.నస్పూర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి పోచమ్మ దేవాలయం వరకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో అక్కడికి చేరుకొని, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి మొక్కులు సమర్పించుకున్నారు.డప్పు చప్పుళ్ళు తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మారు మోగింది.శివ సత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది.ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం చాలా సంతోషంగా ఉందని,అమ్మవారి ఆశీస్సులు ప్రజల అందరిపై ఉండి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా చూడాలని అమ్మవారికి ఆలయ కమిటీ వారు ప్రత్యేక పూజలు సమర్పించారు.

నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ.

నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ, ఉపాధి మేళా

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

తేదీ. 03/07/2025. గురువారం రోజున ఉదయం 10 గంటలకి నడికూడ మండల ప్రజా పరిషత్ నడికూడ కార్యాలయంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి మేళ నడికూడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గజ్జెల విమల ఆధ్వర్యంలో మేళా నిర్వహించబడును.ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలోని పేద నిరుద్యోగ యువతీ యువకులకు కంప్యూటర్,స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్స్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు లాజిస్టిక్స్ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇచ్చి శిక్షణానంతరము ప్రముఖ కార్పొరేట్ కంపెనీల యందు ఉద్యోగ అవకాశం కల్పించబడును శిక్షణ కాలంలో ఉచిత భోజనము మరియు వసతి యూనిఫామ్స్ స్కాలర్షిప్ మరియు కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు రాష్ట్ర ప్రభుత్వం చే ఎంప్లాయిమెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ సర్టిఫికెట్ ఇవ్వబడును.ఈ అవకాశాన్ని నడికూడ మండలంలోని అన్ని గ్రామాల నుండి
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ యొక్క విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు మరియు రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ తీసుకొని తేదీ.03/07/2025. రోజున గురువారం ఉదయం 10 గంటలకి నడికూడ మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి హాజరు కాగలరని ఎంపీడీవో గజ్జెల విమల తెలిపారు‌. పూర్తి వివరణ కోసం 9849131050,9642141539. సంప్రదించగలరు.

అల్ఫోర్స్ హై స్కూల్ (సి బి ఎస్ ఈ) వర్ధన్నపేట లో ఘనంగా బోనాల జాతర.

అల్ఫోర్స్ హై స్కూల్ (సి బి ఎస్ ఈ) వర్ధన్నపేట లో ఘనంగా బోనాల జాతర.

వర్దన్నపేట (నేటిధాత్రి):

బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప ప్రతీక అని మరియు మతసామరస్యానికి నాంది పలికేటువంటి విశిష్టమైన పండుగ అని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత & విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వి. నరేందర్ రెడ్డి స్థానిక అల్ఫోర్స్ హై స్కూల్ వర్ధన్నపేట (సీబీఎస్ఈ) లో వేడుకగా నిర్వహించినటువంటి బోనాల ఉత్సవ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలో అందంగా అలంకరించినటువంటి అమ్మవారి విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి జ్యోతిని వెలిగించి పూజ కార్యక్రమాన్ని ఆచరించి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాడమాసంలో జరుపుకునేటువంటి ఈ బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలరోజుల పాటు దేదీప్యమానంగా వేడుకగా కుటుంబ సభ్యుల ఆనందోత్సవాల మధ్య చాలా ఘనంగా జరుపుకుంటారని గుర్తు చేశారు. ఈ పండుగ తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చే పండుగ అని ఈ పండుగ ద్వారా కుటుంబాలలో సుఖసంతోషాలతో పాటు ఆయురారోగ్యాలు వెళ్లి విరిస్తాయని అభిప్రాయపడ్డారు.మన రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులో నెల రోజుల పాటు వేడుకగా జరిగే ఈ సంబరాలు ఆకాశమే హద్దుగా అన్నట్టుగా జరుపుకుంటారని తెలిపారు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో సైతం ఈ సంప్రదాయాన్ని క్రమం తప్పకుండా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు విద్యాసంస్థల మీదనే కాకుండా విద్యార్థుల మీద వారి పరివారాల మీద ఎల్లప్పుడూ పుష్కలంగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుండడం చాలా హర్షించదగ్గ విషయమని చెప్పారు.వేడుకలలో భాగంగా విద్యార్థుల ప్రదేశించినటువంటి పలు అమ్మవారి నృత్యాలు పోతురాజు వేషాలు చాలా ఆకర్షణంగా నిలిచాయి
ముఖ్యంగా విద్యార్థులు ప్రదేశించినటువంటి గ్రామదేవతల వైభవం నృత్య ప్రదర్శన ఆలోచింపజేసింది.ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు వివిధ ఆకర్షణీయమైన సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి ప్రాంగణానికి వన్నె తెచ్చారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

ఘనంగా కొనసాగుతున్న గోల్కొండ బోనాల జాతర.

ఘనంగా కొనసాగుతున్న గోల్కొండ బోనాల జాతర

 

 

 

 

గోల్కొండ బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది.

రెండో పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది.

దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.

గోల్కొండలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

Hyderabad: తెలంగాణ సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస (Aashada Masam) బోనాల సందడి (Bonala Festival) మొదలైంది.

చారిత్రాత్మక గోల్కొండ కోట (Golconda Fort)లో బోనాల సమర్పణ ప్రారంభమయ్యాయి.

దీంతో ఆదివారం (Sunday) తెల్లవారుజామునుంచే భక్తులు (Devotees) గోల్కొండకు చేరుకుని ముక్కులు చెల్లించుకుంటున్నారు.

ఈ సందర్భంగా గోల్కొండ కోట పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

గోల్కొండ బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది.

రెండో పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది.

దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.

భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు..

సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

పోతురాజుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో గోల్కొండలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

ఈ నెల 26వ తేదీ గురువారం నుంచి ఆషాడ మాస బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి.

గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో బోనాల జాతర మొదలైంది.

ప్రతి గురు, ఆదివారాల్లో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించనున్నారు.

అమ్మవార్లకు 9 పూజలతో గోల్కొండ బోనాలు జరుగుతాయి.

గోల్కొండ కోటలో నెలరోజుల పాటు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి.

గోల్కొండ కోటాలో మొదలైన బోనాలు జులై 24న తిరిగి గోల్కొండ కోటలో వేడుకలు ముగియనున్నాయి.

లష్కర్ బోనాల జాతరకు అంకురార్పణ..

కాగా తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాల జాతరకు ఆదివారం అంకురార్పణ జరగనుంది.

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళీ బోనాల జాతరలో తొలి ఘట్టమైన అమ్మవారి ఘటం ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి గుత్తా మనోహర్ రెడ్డి, ఆలయ ఫ్యామిలీ ట్రస్టు చైర్మన్ సురిటి రామేశ్వర్, కామేశ్వర్లు తెలిపారు.

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారి ఆభరణాలను అప్పగించడం ద్వారా ఘటం ఎదుర్కోలు ప్రారంభమవుతుందన్నారు.

వచ్చే నెల 13వ తేదీన బోనాలు జరుగుతాయని, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, పూజలు చేస్తారని వారు తెలిపారు.

14న ఉదయం 8.30 గంటలకు రంగం (భవిష్యవాణి) కార్యక్రమం జరుగుతుందని వివరించారు.

జర్నలిస్టుల జాతర ను విజయవంతం చేద్దాం.

జర్నలిస్టుల జాతర ను విజయవంతం చేద్దాం.

జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సభ కు పెద్ద సంఖ్యలో తరలిరావాలి.

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వాల్పోస్టర్ ఆవిష్కరణ.

“నేటిధాత్రి”,వేములవాడ.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పురుడు పోసుకున్న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవాలను జయప్రదం చేద్దామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (H143) రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు లాయక్ పాషా పిలుపునిచ్చారు.

వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భవించి మే 31వ తేదీతో 25 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా హైదరాబాద్ జలవిహార్ లో నిర్వహిస్తున్న సంబరాల సభ కు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తల్లి రావాలని కోరారు.

Journalists’

 

తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన చారిత్రాత్మక పాత్రను తెలియజేయడం కోసం మే 31న టీజేఎఫ్ రజతోత్సవాలను నిర్వహిస్తుందని తెలిపారు.

తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు నినాదం తో 2001 మే 31న ఆవిర్భవించిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు 2014 వరకు అన్ని వర్గాల ప్రజలను,ఉద్యమ సంఘాలను సంఘటితం చేసిన ఘనత టీజేఎఫ్ అల్లం నారాయణ లతో పాటు యావత్ తెలంగాణ జర్నలిస్టుల కృషి అని గుర్తు చేశారు.

ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సంబరాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి జిల్లా నుండి జర్నలిస్ట్ లు అధిక సంఖ్యలో తరలివచ్చి జర్నలిస్టుల జాతరను విజవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి ఆయాచితుల జితేందర్, ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, జిల్లా రమేష్, దేవరాజ్, ప్రచార కార్యదర్శి షేక్ రియాజ్, కోడం గంగాధర్, హరీష్, విష్ణు, రాజేందర్, వెంకటేష్, ఇమ్రాన్, ఫహద్ పాషా, సల్మాన్, శ్యామ్, షోయబ్ లతోపాటు కార్యవర్గం సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

మైసమ్మ తల్లి జాతర ఉత్సవాలు.

మైసమ్మ తల్లి జాతర ఉత్సవాలకు రూ.50 వేలు తన వంతు కర్తవ్యంగా ఇచ్చిన పారిశ్రామిక వేత్త కె.ప్రసాద్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహీర్ మండలంలో దిగ్వాల్ గ్రామంలో పారిశ్రామిక వేత్త జహీరాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ నాయకులు కె.ప్రసాద్ రెడ్డి ఈరోజు మైసమ్మ తల్లి ఆలయ కమిటీ పిలుపు మేరకు ఆలయం వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు.ఈ నేల 31,జూన్ 1,2,తేదీలో జరిగే మైసమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్బంగా రూ. 50 వేల రూపాయలు కమిటీ సభ్యులకు అందజేశారు. అలాగే కోహీర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ లో వున్న బిసి, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ నాయకులు ఏకమయ్యి ఏలాలని అన్నారు.కావున రాబోయే ఎన్నికల్లో యువ కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర కులాల పార్టీ కాదని అనగారని కులాల పార్టీ అని గట్టిగా నమ్ముతున్నాను అని చెప్పారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ మైసమ్మ తల్లి జాతర మహోత్సవము.

శ్రీ మైసమ్మ తల్లి జాతర మహోత్సవము.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల్ మరియు ఝరాసంగం మండల సరిహద్దు ప్రాంతందిగ్వాల్. ఈదులపల్లి ప్రాంతం లో గల శ్రీ మైసమ్మ దేవాలయం లో జరిగే జాతర ఉత్సవాలసందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని స్థానిక యం యల్ ఏ మాణిక్ రావ్ ఆఫీస్ .లో ఝరాసంగం మండలం మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ .ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరణ చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగా ఉస్త వాలు ఘనంగా నిర్వహిస్తారాని ఇట్టి కార్యమం లో ప్రజా ప్రతినిధు స్థానిక అధికారులు నాయకులు .మైసమ్మ తల్లి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి ఉస్తావాలను విజయవంతం చెయ్యాలని పరమేశ్వర్ పాటిల్ పిలుపు నిచ్చారు.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

మాజీ సర్పంచ్ మోటి ధర్మారావు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

 

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో. ఈనెల 27న జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మొగుళ్ళపల్లి తాజా మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు తెలిపారు. శుక్రవారం రోజున ఆయన మాట్లాడుతూ. మొగుళ్లపల్లి మండలంలోని అన్ని గ్రామాలలోని నిరుద్యోగ యువతీ,యువకులకు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతీ యువకులు . ఈ జాబ్ మేళాకు 18 నుండి 35 సంవత్సరాల వయసుగల చదువుకున్న, చదువు లేని నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని మోటె ధర్మారావు తెలిపారు.

మండల కేంద్రంలోపోషణ జాతర.

మండల కేంద్రంలోపోషణ జాతర

ఇబ్రహీంపట్నం, నేటి ధాత్రి

 

మండల కేంద్రంలోని సంఘం భవనంలో పోషణ అభయన్ లో భాగంగా పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ మణెమ్మ మాట్లాడుతూ మొదట 1000 రోజులు సంరక్షణ తల్లి బిడ్డలకు జీవిత కాలపు రక్షణ బిడ్డ పుట్టగానే ముర్రుపాలు పట్టాలి. పౌష్టిక ఆహారం వైవిద్యం. పరిశుభ్రత,, తల్లిపాలు బిడ్డకు సురక్షత అని ఆమె అన్నారు, అనంతరం ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభారాణి మాట్లాడుతూ కిషోర్ బాలికలకు ఐరన్ ఒక్క ప్రాముఖ్యత, మిల్లెట్స్ మరియు గిరిజన సంప్రదాయ ప్రాంతీయ స్థానిక ఆహార పద్ధతులు, చిరుధాన్యాలు కొర్రలు, సామలు, హారికలు, ఊదలు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు రోజువారి తినే ఆహారంలో తీసుకోవాలి అని ఆమె అన్నారు, ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ హేమలత, ఏఎన్ఎమ్ లు, అంగన్వాడి ఉపాధ్యాయురాలు, బాలింతలు, గర్భిణీలు, కిషోర్ బాలికలు తదితరులు పాల్గొన్నారు

జాబ్ మేళాకు అత్యధికంగా నిరుద్యోగుల రిజిస్ట్రేషన్.

జాబ్ మేళాకు అత్యధికంగా నిరుద్యోగుల రిజిస్ట్రేషన్.

వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ జిల్లా చిట్యాల మండలం గోపాలపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నీలం కుమారస్వామి ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రియతమ నాయకులు పేదల పెన్నిధి యువతీ యువకులు నిరుద్యోగుల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న మన నాయకుడు గౌరవ శ్రీ గండ్ర సత్యనారాయణ రావు గారు ఆదేశాల మేరకు ఈనెల 26 తారీఖున జరగబోయే మేఘా జాబ్ మేళా కు గోపాలపురం మూర్తి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్, పంచాయతి కార్యదర్శి రమాదేవి ఎ ఎస్ ఐ సమ్మిరెడ్డి అంగన్వాడీ టీచర్స్ శ్రీదేవి, జ్యోతి, నీలవర్ణ ఆశ వర్కర్స్ మహిళా సమైక్య CA కోడూరు ఓంకార్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోవిందుల భద్రయ్య హెడ్ కానిస్టేబుల్ యాకయ్య పిసి నాగరాజ్ యూత్ నాయకులు పనస రాకేష్, సునీల్ కుంచాల, కత్తి మహేష్ శ్రీకాంత్ మూల నాగరాజ్, గ్రామంలోని యువతీ యువకులు మెగా జాబ్ మేళా లో అధికసంఖ్యలో పాల్గొని 70 మంది యువతి యువకులు, పేర్లు నమోదు చేసుకున్నారు.

“కొండా” జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్.

“కొండా” జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్..

మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో వరంగల్‌లో మెగా జాబ్ మేళా..

నిరుద్యోగులతో కిక్కిరిసిన హోటల్ ప్రాంగణం

వరంగల్ తూర్పు, నేటిధాత్రి:

 

వరంగల్ తూర్పు నియోజక వర్గ పరిధిలోని ఏం.కే నాయుడు కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ ( సీతక్క) తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ. వరంగల్‌లో మెగా జాబ్‌మేళా ప్రారంభించిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క లు మాట్లాడుతూ, 60 కంపెనీల ద్వారా 11 వేల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం చేశాం అని అన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టం అని, ఎవరి ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు దక్కుతాయి అని అన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్‌ హయాంలో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అని విమర్శించారు. మా ప్రభుత్వంలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం అని మంత్రులు కొండా సురేఖ, సీతక్క లు అన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అప్జల్ బియాబాని, ఖుస్రో పాషా, అదనపు కలెక్టర్ సంధ్య రాణి, తూర్పు కార్పొరేటర్లు, జిడబ్ల్యూఎంసీ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగులతో కిక్కిరిసిన హోటల్ ప్రాంగణం

మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో వరంగల్‌లో నిర్వహించిన జాబ్ మేళా నిరుద్యోగుల విశేష స్పందనతో కిక్కిరిసిపోయింది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ మేళాకు ఊహించిన దానికంటే భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. దీంతో ప్రాంగణం నిండిపోవడంతో, పరిస్థితిని సమర్థంగా నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్తగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 100 కంపెనీలు పాల్గొన్నాయి. వివిధ రంగాల్లో మొత్తం 8,000కి పైగా ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

జాబ్ మేళాలో తొక్కిసలాట, పలువురికి గాయాలు

భారీగా సంఖ్యలో చేరుకున్న నిరుద్యోగులు.

హోటల్ ప్రధాన ద్వారం అద్దం పగిలి ముగ్గురు మహిళ నిరుద్యోగులకు గాయాలు.

వరంగల్ రైల్వే స్టేషన్ రోడ్డులోని ఎంకే నాయుడు హోటల్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో పలువురు ఉద్యోగార్థులకు గాయాలయ్యాయి. ఎక్కువ మంది నిరుద్యోగులు హాజరు కావడంతో హోటల్ ప్రధాన ద్వారం వద్ద జరిగిన తొక్కిసలాటలో అద్దం పగిలి పలువురికి గాయాలయ్యాయి. ఈ జాబ్ మేళాకు సుమారు 10వేల మంది వరకు హాజరైనా, కనీస ఏర్పాట్లు కూడా చేయలేదని, హాలు సరిపోలేదని నిరుద్యోగులు విమర్శించారు. వీరితో పాటు పార్టీ కార్యకర్తలు, ఇతర నాయకులు హాజరవడం వల్లే తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు.

26న జరిగే జాబ్ మేళపై అవగాహన కార్యక్రమం.

26న జరిగే జాబ్ మేళపై అవగాహన కార్యక్రమం.

ఎంపీడీవో జై శ్రీ

చిట్యాల, నేటి ధాత్రి ;

 

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం రోజున ఎంపీడీవో జయ శ్రీ అధ్యక్షతన జాబ్ మేళపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 26న భూపాల పెళ్లిలో పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ లో నిర్వహించే జాబ్ మేళను మండలంలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని వారికి మండలంలో ఉన్న అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి నిరుద్యోగులను అధిక సంఖ్యలో 26న జరిగే జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేయాలని మండల గ్రామ అధికారులను కోరినారు ,ఈ కార్యక్రమంలో తాసిల్దార్ హేమ, ఎంపీ ఓ ,రామకృష్ణ, ఎస్సై, ఏపీఓ, పంచాయితీ కార్యదర్శులు ఐకెపి ఏపిఎం, సీసీలు ,వివోఏలు, అగ్రికల్చర్ అధికారులు అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు టెక్నికల్ అసిస్టెంట్లు పంచాయతీరాజ్ ఏఈ మండల గ్రామ అధికారులు పాల్గొన్నారు.

జాతర మహోత్సవ గోడ పత్రిక ఆవిష్కరణ.

జాతర మహోత్సవ గోడ పత్రిక ఆవిష్కరణ.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రమైన తెలంగాణ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన రాయికోడ్ గ్రామంలో ప్రసిద్ది చెందిన భద్రకాళి సమేత వీరభద్రేశ్వర జాతర. మహోత్సవం ఏప్రిల్ 17వ తేదీ గురువారం నుండి 22వ తేదీ మంగళవారం వరకు నిర్వహించునున్న శుభ సందర్భంగా సోమవారం నాడు ఏర్పాటుచేసిన అనే చైర్మన్ కులకర్ణి ప్రభాకర్ రావు (సతీష్) ఆలయ కార్య నిర్వహణ అధికారి శివ రుద్రప్ప. అధ్యక్షతన ధర్మకర్త మండలి సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ చైర్మన్ కార్య నిర్వాణ అధికారి వారు మాట్లాడుతూ ఆలయంలో చలువ పందిళువిద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని భోజనాలు ఏర్పాటుకై జాతర మహోత్సవం గురించి గ్రామ గ్రామాన తెలియపరచాలని జాతరకు వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తదితర అంశాలపై వాటి నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం ఆలయ చైర్మన్ కార్యనిర్మాణ అధికారి శివ రుద్రప్ప ఆధ్వర్యంలో ఆదివారం జాతర మహోత్సవ కార్యక్రమం వివరాల ఆహ్వాన పత్రిక గోడ పత్రికను ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో. ఆలయ చైర్మన్ కులకర్ణి ప్రభాకర్ రావు (సతీష్) కార్యనిర్వాన అధికారి శివ రుద్రప్ప. మాజీ చైర్మన్ నట్కరి మావయ్య. గ్రామ పెద్దలు యువకులు ఆలయ సిబ్బందులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ఆవిష్కరణ.

పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ఆవిష్కరణ

 

మహబూబ్ నగర్ /నేటి ధాత్రి

ఏప్రిల్ 27 న మహబూబ్ నగర్ పట్టణం లోని ఎంబిసి మైదానంలో నిర్వహించనున్న పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. మహబూబ్ నగర్ పట్టణం లోని అంబేద్కర్ కళాభవన్ లో పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పూలె- అంబేద్కర్ జాతర పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పూలే – అంబేద్కర్ జాతర విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బోయపల్లి నర్సింహులు, వేంకట స్వామి, సామెల్, సిరసనోళ్ళ బాలరాజు, గువ్వ లక్ష్మణ్, యాదగిరి నాయక్, జంగయ్య, మాసయ్య, ఆది విష్ణు, విద్యావతి, బాబమ్మ, నర్సింహులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

జాతరకు ముస్తాబవుతున్న బద్ది పోచమ్మ ఆలయం..

జాతరకు ముస్తాబవుతున్న బద్ది పోచమ్మ ఆలయం..

# 20 దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్న బద్ధి పోచమ్మ తల్లి..

# జాతరలో అలరించునున్న ప్రభ బండ్లు.

#పకడ్బద్ధంగా పోలీసుల భారీ భద్రత ఏర్పాటు.

#గ్రామంలో రెండు రోజుల ముందే పండుగ వాతావరణం.

#ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతరకు హాజరు కానున్న భక్తులు.

 

నల్లబెల్లి,నేటిధాత్రి:

 

కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారమైన శ్రీ బద్ది పోచమ్మ జాతర ఈనెల 28 న వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో బోల్లోనిపల్లి (పోచంపల్లి)లో అంగరంగ వైభవంగా జాతరను జరగనున్నది.జాతరను దిగ్విజయం చేయడం కోసం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో చలవ పందిళ్ళు, విద్యుత్ దీపాల అలంకరణతో సుందరంగా ఆలయం చుట్టూ అలంకరించారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర నిర్వహించడం ఆనవాయితీ వస్తున్నది. ఈ జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లా లోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు.

బద్ది పోచమ్మతల్లి ఎక్కడి నుండి వచ్చి వెలసింది..!

బద్ది పోచమ్మ తల్లి మొదటగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని దుద్యాల గ్రామంలో గల కూన వంశస్థులు ఆరాధ్య దైవంగా పూజలు చేసేవారు తదనంతరం కూన అమ్మక్క బోల్లోనిపల్లి గ్రామానికి తీసుకువచ్చి ప్రతిష్టాపన చేసి నేటికీ 20 దశాబ్దాలు కావస్తుంది.నాటి నుండి నేటి వరకు గ్రామస్తులతోపాటు, చుట్టుప్రక్కల గ్రామ ప్రజల సహకారంతో ఆలయ నిర్వాహకులు జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

Baddi Pochamma Temple

ఆకర్షించనున్న ప్రభ బండ్లు…

జాతరలో ప్రత్యేక ఆకర్షణగా ప్రభ బండ్లు ఆకర్షిస్తాయి.భక్తులు తమ కోరిన కోర్కెలు తల్లి తీర్చడం వల్ల భక్తులు మొక్కుబడిగా ప్రభ బండ్లు కట్టి తమ మొక్కును చెల్లించుకుంటారు. అలాగే సంతానం లేని వారికి సంతానం కలగడంతో తల్లి బద్దిపోచమ్మ పేరుతో వచ్చే అక్షరాలతో నామకరణం చేసి ఆ తల్లి యొక్క ఆశీర్వాదాన్ని బిడ్డలకు అందించే విధంగా ఆలయ ప్రాంగణంలో నామకరణం చేసి మొక్కును చెల్లిస్తారు.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ భద్రత.

హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతరలో రాజకీయ ప్రభ బండ్ల అత్యుత్సాహంతో ఏర్పడిన ఉద్రిక్తత వాతావరణం పునరావృతం కాకుండా బద్ది పోచమ్మ జాతరలో పకడ్పద్దంగా అన్ని ఏర్పాట్లు చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. జాతరలో ఎలాంటి అవచనీయ సంఘటనలు జరగకుండా,రాజకీయ వాతావరణానికి తావు లేకుండా చుట్టుపక్కల గ్రామాల అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి గొడవలకు తావులేకుండా జాతరను సజావుగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరగా అన్ని పార్టీ నాయకులు సానుకూలంగా స్పందించారని ఎస్సై వి గోవర్ధన్ తెలిపారు.

వైభో పేతంగా బోనాలు..

Baddi Pochamma Temple

ప్రతీ రెండు సంవత్సరాలకు ఒక్కసారి ఉగాది పండుగకు ముందు వచ్చే శుక్రవారం బద్ది పోచమ్మతల్లి బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.ఈ నేపథ్యంలో
ఈనెల 28 న శుక్రవారం జరిగే బద్ది పోచమ్మ జాతరకు బొల్లోనిపల్లి గ్రామంతో పాటు నల్లబెల్లి మండలం, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు.ఈ క్రమంలో ప్రతి ఇంటి నుండి బోనాలతో పాటు యాటా పోతులతో బయలుదేరగా శివసత్తులు పూనకాలతో ఊగిపోతూ తల్లిని స్మరించుకుంటారు. ఊరిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా జాతర సమయంలో సొంత ఊరికి చేరుకొని పిల్ల పాపలతో , బంధువులతో కలిసి పండుగను సంబరంగా జరుపుకుంటారు.

జాతరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం.

ఆలయ నిర్వాహకులు..కూన నారాయణస్వామి

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల వసతులు , తాగునీటి,ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో భక్తుల తాకిడికి అనుగుణంగా భారీ కేడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ నిర్వాహకులు..కూన నారాయణస్వామి తెలిపారు. గురువారం నుండి శుక్రవారం సాయంత్రం వరకు జాతర సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం కోసం పోలీస్ శాఖను కోరడం జరిగిందని అన్నారు.

అంగన్వాడి కేంద్రంలో ప్రీ స్కూల్ మేళా.

అంగన్వాడి కేంద్రంలో ప్రీ స్కూల్ మేళా

వీణవంక, (కరీంనగర్ జిల్లా ):నేటి ధాత్రి :

వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో అంగన్వాడి కేంద్రం- 2 ఫ్రీ స్కూల్ మేళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పిల్లలకు పౌష్టికాహారం అందించి ఆహాల్లదకరమైన వాతావరణంలో చిన్నారులకు ఆటలు పాటలతో డ్రాయింగ్, రంగు రంగుల బొమ్మలతో విద్యాబోధన చేపట్టారు తల్లిదండ్రులకు పిల్లలకు నేర్పించే అంశాల పై అవగాహన కల్పించడం జరిగింది 3 సంవత్సరాల వయస్సు నుండి నుండి 6 ఏళ్లలోపు పిల్లలకు నర్సరీ, ఎల్కేజీ,యూకేజీ,అంగన్వాడి స్కూల్ లో అయిపోగా ప్రేరణాత్మక బోధన అభ్యసించి అవగాహన కల్పిస్తున్నామని అంగన్వాడీ టీచర్ మా దేవి అన్నారు అంతేకాకుండా గర్భిణులకు బాలింతలకు పాలు గుడ్లు బాలామృతం మంచి పౌష్టిక ఆహారం అందజేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ రేణుక పాఠశాల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఏఎన్ఎం లు ఆశ వర్కర్లు, ఆయా స్వరూప తదితరులు పాల్గొన్నారు.

కొమ్మాల జాతరలో ఏరులై పారుతున్న మద్యం.

కొమ్మాల జాతరలో ఏరులై పారుతున్న మద్యం.

పవిత్ర దేవాలయం వద్ద మద్యం అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ అధికారుల అనుమతులు.?

అడుగడుగునా మద్యం బెల్టు దుకాణాలే జాతరలో దర్శనం.

దేవాలయం అధికారుల పర్మిషన్ లెటర్ ద్వారానే అనుమతులు ఇచ్చమంటూ వివరణ?

ఈ నెల 16 తో ముగిసిన మద్యం అమ్మకాల గడువు..

మద్యం బెల్టు షాపులకు అనుమతులు ఇవ్వలేదు..

దేవాలయ ఈ.ఓ నాగేశ్వర్ రావు..

బెల్టు షాపుల నిర్వహికులపై చర్యలు తీసుకుంటాం.

ఎక్సైజ్ శాఖ సీఐ తాతాజీ.

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

Liquor

పవిత్రమైన దేవాలయం వద్ద మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.భక్తి శ్రద్ధలతో కొమ్మాల జాతరకు వెళ్లిన భక్తులకు ముందుగా మద్యం దుకాణాలు,బెల్టుషాపులే దర్శనం ఇస్తాయి.ఈ నేపథ్యంలో కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరలో ఎక్కడ చూసినా మద్యం ఏరులైపారే పరిస్థితి నెలకొన్నది.

వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల లక్ష్మినరసింహస్వామి జాతర గత ఐదు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నది.వివిధ రాజకీయ పార్టీలు,ఇతర ప్రభ బండ్లతో మొదలైన జాతర మంగళవారం ఐదవరోజు రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది.దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ ఆలయ ప్రాంగణంలో మద్యం దుకాణాలు,బెల్టు షాపుల జోరు కొనసాగుతూనే ఉన్నది.దైవ దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు కొందరు ఉద్యోగులు,రైతులు రాత్రివేళలో వస్తున్నారు.ఐతే జాతరలో ఎక్కడ చూసినా బెల్టు షాపులు,అక్కడే మద్యం సేవించి మత్తులో తిరగటం వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అవేదన వ్యక్తం చేస్తున్నారు.ఐతే దేవాలయం వద్ద పోలీస్ కంట్రోల్ రూం వద్దనే బెల్టు షాపులు ఏర్పాట్లు చేసి విచ్చలవిడిగా అమ్మకాలు చేపట్టడం పలు అనుమానాలకు దారితీస్తున్నది.పవిత్రమైన దేవాలయం వద్ద జాతరలో ఫెస్టివల్ ఈవెంట్ అనుమతులు అంటూ ఎక్సైజ్ శాఖ అనుమతులు ఇవ్వడం ఒకెత్తు అయితే అక్కడ మద్యం దుకాణాలకు ఈవెంట్ కు దేవాలయం అధికారులు పర్మిషన్ లెటర్ ఇస్తారు.. వారు ఇస్తేనే మూడు రోజులకు పర్మిషన్ ఇచ్చాము అని గీసుకొండ పరిధిలో ఎక్సైజ్ శాఖ సీఐ తాతాజీ పేర్కొనడం కొసమెరుపు.
ఐనప్పటికీ తాత్కాలిక మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చిన గడువు ఈ నెల 16 తో ముగిసినప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం అని భక్తులు వాపోతున్నారు.ఇప్పటికైనా పవిత్రమైన దేవాలయం వద్ద మద్యం అమ్మకాలు ఆపివేసి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజలు,భక్తులు కోరుతున్నారు.

బెల్టు షాపుల నిర్వహికులపై చర్యలు తీసుకుంటాం.

ఎక్సైజ్ శాఖ సీఐ తాతాజీ.

పవిత్రమైన శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై చర్యలు తీసుకొని వాటిని నిలుపదల చేస్తామని గీసుకొండ మండల పరిధి ఎక్సైజ్ శాఖ సీఐ తాతాజీ నేటిధాత్రికి వివరణ ఇచ్చారు.

మద్యం బెల్టు షాపులకు అనుమతులు ఇవ్వలేదు..

Liquor

దేవాలయ ఈ.ఓ నాగేశ్వర్ రావు..

కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని విధాల జాగ్రత్తగా తీసుకున్నామని దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు తెలిపారు. దేవాలయము పరిసర ప్రాంతాలకు 200 మీటర్ల లోపు మద్యం బెల్టు షాపులకు ఎలాంటి అనుమతులు లేవని ఈ.ఓ తెలిపారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆటంకం కల్పిస్తున్న బెల్టు షాపులపై చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని కొమ్మాల దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు తెలిపారు.

కొడవటంచ జాతరకి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు..

కొడవటంచ జాతరకి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచలో ఈనెల 14, 15, తేదీల్లో కొడవటంచ దేవ స్థానంలో జరిగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతరకి పరకాల భూపాలపల్లి నుంచి ప్రత్యేకంగా బస్సు లు నడిపిస్తున్నట్లు భూపాలపల్లి డిపో మేనేజర్ ఏ .ఇందు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని బట్టి బస్సులు నడిపిస్తామన్నారు. భూపాలపల్లి బస్ స్టేషన్ ఎంక్వయిరీ నెంబర్ 7382854256 ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version