ఆర్థిక ఇబ్బందుల్లో అంబులెన్స్ డ్రైవర్లు..

ఆర్థిక ఇబ్బందుల్లో అంబులెన్స్ డ్రైవర్లు

* 9 నెలలుగా పత్తాలేని జీతాలు
* బోరున విలపిస్తున్న అంబులెన్స్ డ్రైవర్లు

మహాదేవపూర్ జూలై 30 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆంబులెన్స్ డ్రైవర్లకు 9 నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులలో కొట్టుమిట్టాడుతున్నామని ఒక ప్రకటనలో బుధవారం రోజున తెలిపారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గత సంవత్సరం నవంబర్ నుండి ఈరోజు వరకు జీతాలు ఇవ్వలేదని తెలుపుతూ అప్పట్లో కలెక్టర్ కి మొర పెట్టుకోగా డిఏంటి నిధుల నుంచి జీతాలు వచ్చాయని ప్రస్తుతం సిపిఓ జీతాలను ఆపేసిండ్రని తెలుపుతూ 9 నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆర్థిక పరిస్థితి ధయనియంగా ఉందని మా గోడు మన్నించి మాకు జీతాలు వచ్చేలా చేయాలని బోరున విలపిస్తూ ఒక ప్రకటనలో తెలిపారు.

మృతిడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..

మృతిడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-25T141610.925.wav?_=1


శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం గంగిరెణిగూడెం గ్రామానికి చెందిన గుగులోతు మాన్య నాయక్ మరణించగా, వారి చిత్ర పటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామ ర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన బిఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రాంశెట్టి లత లక్ష్మారెడ్డి మాజి సర్పంచ్ శానంమంజుల పరమేష్, జాలిగాపు అశోక్, గండి రాజయ్య,పోతు రమేష్, శానం కుమారస్వామి, దాసరి రాజు, శ్రీపతి అశోక్, శానం నరేష్,గుగులోతు రమేష్, మల్రాజ్ జితేందర్, మహమ్మద్ మగ్దూన్ పాషా, శోభన్, రాజు, ఇర్యానాయక్ పాల్గొన్నారు.

ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక చేయూత.

ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక చేయూత….

ఆటో డ్రైవర్లకు ఆరోగ్య బీమా పథకంకు కృషి…

ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-20.wav?_=2

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

నిత్యం రోడ్ల పై తిరుగుతూ జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్లు వారి ఆరోగ్యం పై జాగ్రతలు తీసుకోకుండా అనారోగ్యాల బారిన పడుతున్నారని, వారికి ఎలాంటి ఆరోగ్య బీమాలపై సరైన అవగాహన ఉండట్లేదని అందుకే ఆటో డ్రైవర్లకు ఆరోగ్య భీమా పథకం అమలు చేయించేందుకు కృషి చేస్తానని రామకృష్ణాపూర్ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య అన్నారు.
రామకృష్ణాపూర్ పట్టణంలోని కనకదుర్గ కాలనికి చెందిన ఆటో డ్రైవర్ కొండ్ర రవి అనారోగ్యానికి గురై గత వారం మృతి చెందాడు.మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిది చాలా పేద కుటుంబం కావడంతో వారి ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని వారి కుటుంబానికి రామకృష్ణాపూర్ ఆటో యూనియన్ సభ్యులు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు ఎనగంటి సంపత్, ఉపాధ్యక్షులు పాక అంజయ్య, ప్రధాన కార్యదర్శి జీడి రవి, చెన్నాల సారయ్య ,ముల్కల నరసయ్య, ఆల్క పున్నం, వాసం సది తదితరులు పాల్గొన్నారు.

ఫోటోగ్రాఫర్ కిరణ్ కు 5000 ఆర్థిక సహాయం.

ఫోటోగ్రాఫర్ కిరణ్ కు 5000 ఆర్థిక సహాయం

జిల్లా అధ్యక్షుడు రఘోత్తం రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

నూతన జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టగానే ఫోటో గ్రాఫర్ల సంక్షేమం కోసం పని చేస్తూ అందరి మన్ననలను పొందుతున్నాడు ఫోటోగ్రాఫర్ల సంఘం జిల్లా అధ్యక్షులు రఘోత్తం రెడ్డి మంగళవారం
రేగొండ మండలం కొడవటంచ గ్రామ ఫోటోగ్రాఫర్ సింగరి కిరణ్ ఇటీవల బైక్ పై నుండి కిందపడి కాలు ప్యాక్చర్ కావడం జరిగింది. విషయం తెలుసుకున్న నూతన జిల్లా అధ్యక్షులు బండ రగోతంరెడ్డి ఫోటోగ్రాఫర్కు ఆపుద వస్తే నేనున్నానని భరోసానిస్తూ 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ మండల అధ్యక్షులు జంబుల రఘు, ఫోటోగ్రాఫర్స్ జిల్లా కోశాధికారి ఎల్దండి రాకేష్, టేకుమట్ల మండల ఫోటోగ్రాఫర్స్ అధ్యక్షులు దాసారపు సదానందం, ప్రధాన కార్యదర్శి గుగులోతు రాజేందర్ నాయక్, కోశాధికారి బండి కమలాకర్,రేగొండ ఫోటోగ్రాఫర్స్ మోరే మొగిలి, మల్లె బోయిన స్వామి, సింగరి సతీష్, సామల సురేందర్ రెడ్డి, కోల రాజు,చుక్క ప్రశాంత్, పబ్బ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

పేద విద్యార్థి రాము 20 వేలు ఆర్థిక సాయం

పేద విద్యార్థి రాము 20 వేలు ఆర్థిక సాయం

శ్రీ శ్రీనివాస లైన్స్ క్లబ్ సభ్యులు లయన్ శాంతి

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 11:

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఓ పేద విద్యార్థి రాము ఉన్నత చదువుల కోసం 20000 రూపాయలు శ్రీ శ్రీనివాస లయన్స్ క్లబ్ సభ్యురాలు శాంతి ఆర్థిక సాయం అందజేశారు. తిరుపతి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆర్కాడ్ కృష్ణ ప్రసాద్ వేలూరు జగన్నాథం ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాసా లయన్స్ క్లబ్ సభ్యురాలు శాంతి తన పుట్టినరోజు సందర్భంగా ఓ పేద విద్యార్థి ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ వారు మాట్లాడుతూ ఆ భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో శాంతి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని అలాగే ప్రతి సంవత్సరం ఇలాంటి పేదవారికి సహాయాన్ని అందించాలని ఆమెకు ఆసక్తిని భగవంతుడు ఇవ్వాలని ఆ విద్యార్థి మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలను నిర్వహించి తను కూడా ఇలాంటి సహాయ సహకారాలు మరి కొంతమందికే అందించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు,
ఈ కార్యక్రమంలో ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, వేలూరు జగన్నాథం, శంబోలా హరి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు .

చర్చలకు తమ వంతు ఆర్థికసాయం అందజేసిన..

చర్చలకు తమ వంతు ఆర్థికసాయం అందజేసిన బొల్లారం రత్నం

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో నూతనంగా నిర్మిస్తున్న చర్చీలకు దేవుని ప్రేమనుబట్టి మన బొల్లారం,రత్నం తమ వంతు ఆర్థికసాయం అందజేయడం జరిగింది.
అల్గోల్,ఖానాపూర్,బిడెకన్య ,ఇటికేపల్లి,ఈదులపల్లి,జహీరాబాద్,మహేంద్ర కాలనీ,తుమ్మన్ పల్లి ఏడాకులపల్లి,హత్నూర,కుప్పనగర్.ఇట్టి గ్రామాలకు దేవుని ప్రేమనుబట్టి వివిధ గ్రామ సంగ కాపరులకు అందజేయడం జరిగింది రత్నం మాట్లాడుతూ ఇంకా రాబోయే కాలంలో దేవుని ప్రేమఅనుబట్టి ఇంకా కొన్ని సంగాలకు కూడా సహకారం అందిస్తాను అని సానుకూలంగా స్పందించి తన ప్రేమను తెలియజేశారు ఇట్టి కార్యక్రమములో వివిధ గ్రామాల నాయకులు పాల్గొనడం జరిగింది.

ఎస్ హెచ్ జీ సభ్యులకు బీమాతో ఆర్థిక భరోసా.

ఎస్ హెచ్ జీ సభ్యులకు బీమాతో ఆర్థిక భరోసా

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

37 మందికి రూ.38 లక్షల లోన్ బీమా చెక్కులు,
ఇద్దరికి ప్రమాద బీమా రూ. 20 లక్షలు పంపిణీ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్.హెచ్.జీ) సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం బీమా కల్పిస్తూ ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలకు బీమా, సభ్యులకు ప్రమాద బీమా చెక్కులను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులతో కలిసి సోమవారం పంపిణీ చేశారు. ముస్తాబాద్ మండలంలో 14 మందికి రూ. 14,96,457, తంగళ్ళపల్లి మండలంలో ఒకరికి రూ. 30 వేలు, గంభీరావుపేట మండలంలో 8 మందికి రూ.7,66,925, వీర్నపల్లి మండలంలో ఇద్దరికి రూ.2,67,434, ఎల్లారెడ్డిపేట మండలంలో 12 మందికి రూ.13,04,133 మొత్తం రూ. 38, 64,949 విలువైన చెక్కులు ఆయా స్వయం సహాయక సంఘాల బాద్యులకు అందజేశారు.
ఇద్దరికి ప్రమాద బీమా పంపిణీ అలాగే ముస్తాబాద్ మండలంలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన ఇద్దరు సభ్యులు ప్రమాదవశాత్తూ మరణించగా, వారికి నామిని లకు రూ. 10 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షల విలువైన చెక్కులు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పంపిణీ చేశారు.కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, డీఆర్డీఓ శేషాద్రి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సహాయం.

ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సహాయం

మందమర్రి నేటి ధాత్రి:

మందమర్రి ఫోటో&వీడియో గ్రాఫర్స్. వెల్ఫేర్ అసోసియేషన్ శాశ్వత సభ్యుడు మామిడాల మధుకర్ గారికి ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది విషయం తెలుసుకుని.ఈరోజు వల్ల స్వగృo మందమర్రి పాత బస్టాండ్ కు వెళ్లి యోగ క్షేమములు తెలుసుకొని. మా యూనియన్ సంఘం ఫాండ్ నుండి తక్షణ సహాయం కింద 5000/- రూపాయల చెక్కు కుటుంబానికి అందజేయడం జరిగినది
కార్యక్రమంలో. రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు వడ్లకొండ కనకయ్య గౌడ్. మందమరి పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి. ప్రధాన కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్. కోశాధికారి బద్రి సతీష్.. గౌరవ సలహాదారులు నక్క తిరుపతి. జాడి ముకుందం. వర్కింగ్ ప్రెసిడెంట్ వలస మణిరాజ్ ఉపాధ్యక్షులు లక్కిరెడ్డి అనిధర్ రెడ్డి. ఆర్ సుజిత్. నక్క పవన్.ప్రచార కార్యదర్శి కందుకూరి శ్రీకాంత్
మాజీ ఉపాధ్యక్షులు విక్టరీ అశోక్. బసం అంజి. వరుణ్. తదితరులు పాల్గొన్నారు

ఆర్ధిక సహాయం అందించిన శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్.

ఆర్ధిక సహాయం అందించిన శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్

మంగపేట నేటిధాత్రి:

 

శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అకినేపల్లి మాల్లారం గ్రామానికి చెందిన ఆవిరి.సూరిరావు కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంవల్ల వారి కుటుంబంలో ఆర్థిక సమస్యలమ ఏర్పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్ చైర్మన్ ఈశ్వర్ చంద్ తెలుసుకొని వారి కుటుంబానికి సహాయంగా 50 కేజీల బియ్యం,ఐదు కేజీల ఆయిల్ క్యాన్ ను ట్రస్ట్ సభ్యుల ద్వారా అందించడం జరిగింది..

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ట్రస్ట్ మండలం అధ్యక్షులు:నూతులకంటి.ఈశ్వర్ చంద్, ట్రస్ట్ సభ్యులు నన్ను బోయిన. సాంబయ్య,నూతులకంటి.గౌరీ శంకర్,జై భీమ్ రామ్మోహన్,రవి తదితరులు పాల్గొన్నారు

శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మెన్ బాడిశ నాగరమేష్ ఆర్ధిక సహాయం.

దశ దిన కర్మలకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మెన్ బాడిశ నాగరమేష్ ఆర్ధిక సహాయం

మంగపేట నేటిధాత్రి:

 

ములుగు జిల్లా మంగపేట మండలం ప్రొద్దుమూర్ గ్రానానికి చెందిన బద్ది పాపారావు ఇటీవల రోడ్ ఆక్సిడెంట్ లో మరణించగా వారి కుటుంబం తీవ్ర దుఃఖం లో వున్నారు.రోజు వారి పనులకు వెళ్లి జీవనం సాగించే ఇంటి పెద్ద అనుకోని ప్రమాదం లో చనిపోవడం ,మృతునికి ఇద్దరు చిన్న పిల్లలు ఉండటం ఏం చేయలేని నిస్సహాయ స్థితి లో ఉన్న వారి కుటుంబ పరిస్థితి ని స్థానికులు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ వారికి తెలియజేయగా దశదినకర్మల నిమిత్తం (4000 రూపాయలవిలువైన)50 కేజీల బియ్యం,నిత్యవసర సరుకులు స్థానికులు చే వారి కుటుంబానికి అందజేశారు.అడగగానే సహాయం అందజేసిన శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ కు మరియు ట్రస్ట్ సభ్యులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియచేసారు .ఈ కార్యక్రమంలో మాను పెళ్లి. వేణు,కలల రాంబాబు,గుగ్గిల సురేష్,బద్ది రఘుబాబు,మానపల్లి రోహిత్. బద్ది సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

మృతి చెందిన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక చేయూత.

మృతి చెందిన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక చేయూత..

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కే ఫోర్ గడ్డ ఏరియాలో నివాసం ఉండే ఆటో డ్రైవర్ గోగర్ల భీమయ్య గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 9న మృతి చెందగా శుక్రవారం గోగర్ల భీమయ్య కుటుంబానికి ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షులు ఎనగంటి సంపత్ ఆధ్వర్యంలో 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ మనోధైర్యాన్ని అందించారు. భీమయ్య మృతి తోటి డ్రైవర్లను కలిచివేసింధని తోటి డ్రైవర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు పాక అంజయ్య, కమిటీ సభ్యులు ఆల్క పున్నం, చెన్నాల సారయ్య, శ్రీనివాస్, కున్సోత్ సీతారాం నాయక్, నర్సయ్య, రవి,కిషన్ తదితరులు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి మిత్రుల ఆర్థిక సాయం.

మృతుడి కుటుంబానికి మిత్రుల ఆర్థిక సాయం.

భూపాలపల్లి నేటిధాత్రి:

 

భూపాలపల్లి పట్టణంలో నీ సుభాష్ కాలనీకి చెందిన పులిగంటి రమేష్ గత వారం క్రితం గుండెపోటుతో మృతి చెందాడు గురువారం భూపాలపల్లి పట్టణానికి చెందిన పూర్వ పాఠశాల రాహుల్ విద్యానికేతన్ కు చెందిన తోటి మిత్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లట్ట రాజబాబు ,ఉపాధ్యాయులు. లట్ట వెంకటేష్, మేడ వెంకటస్వామి. మృతుడి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మిత్రులు మొదటి కుటుంబ సభ్యులకు రూ. 25 వేల తో పాటు 50 కిలోల బియ్యం ఇతర నిత్యవసర సరుకులు అందించారు.. కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా మిత్రులు తెలిపారు
ఈ కార్యక్రమంలో మిత్రులు దుండ్రా.కుమార్ యాదవ్, గాదం రాజు, అల్లెపు సతీష్, చెక్క గోపి. నాన్డ్రి కమలాకర్ ,. బి కొండ నరేందర్ , ఏలుగుల సురేష్ , బొల్లం నరేష్, పూల్యాల తిరుపతి, ఎలాకంటి విజయ్, కాలనీ వాసులు కొడపాక శంకర్, రఘుపతి తదితరులుపాల్గొన్నారు

బైక్ యాక్సిడెంట్ బాధితులకు ఆర్థిక సహాయం.

బైక్ యాక్సిడెంట్ బాధితులకు ఆర్థిక సహాయం

ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం మైలారం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన దసరాపు భద్రయ్య కు ముత్యాల సంపత్ కు ఇటీవల బైక్ ఆక్సిడెంట్ కావడం జరిగింది దీనితో వారికి తలకు బాడీకి తీవ్రమైన దెబ్బలు తగలడంతో హైదరాబాదులోని హాస్పిటల్ తీసుకువెళ్లడం జరిగింది వారిది నిరుపేద కుటుంబం కావడంతో వారి కుటుంబం దాతల సహకారం కోరగా విషయం తెలుసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్నికి మనోధైర్యం కల్పించి వారి వైద్యానికి 5,000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అలాగే వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటారని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఇంచార్జ్ ఆకుల ప్రతాప్,మొర్రి గణేష్, తది ఇతర సభ్యులు పాల్గొన్నారు

ఆర్థిక సహాయం అందించిన మండల అధ్యక్షులు.

ఆర్థిక సహాయం అందించిన మండల అధ్యక్షులు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం

జిల్లా..నేటిధాత్రి..

 

 

shine junior college

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం గ్రామానికి చెందిన బంధు ప్రవీణ్ అనే యువకుడు ప్రమాదంలో గాయపడి భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని ఆసుపత్రికి వెళ్లి యువకుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకొని తనవంతుగా ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

మెడికల్ విద్యార్థికి ఆర్థిక సహాయం.

మెడికల్ విద్యార్థికి ఆర్థిక సహాయం…

కల్వకుర్తి నేటి ధాత్రి:

shine junior college

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు మండలం నుచ్చుగుట్ట తండాకు చెందిన నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన వర్త్యావత్ యశస్వినికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో చదివి సోమవారం వెలువడిన మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 445 ర్యాంకు సాధించింది. ఉత్తమ ఫలితాలు కనబరిచిన గిరిజన పుత్రిక యశస్విని సన్మానించిన ఉప్పల వెంకటేష్ యశస్విని మెడిసిన్ పూర్తి చేయడం కోసం పూర్తిగా ఉప్పల చారిటబుల్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అండగా నిలుస్తానని భరోసా కల్పించారు. గిరిజన తండాల్లో పుట్టి, కన్నా తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ పెరిగి నేడు ఉస్మానియా, గాంధీ వంటి మెడికల్ కళాశాలలో సీటును సాధించిన యశస్విని ఎంతోమంది గిరిజన బిడ్డలకు ఆదర్శమని ఉప్పల వెంకటేష్ కొనియాడారు.

దశ దిన కర్మలకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆర్థిక సహాయం.

దశ దిన కర్మలకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆర్థిక సహాయం

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ట్రస్ట్ సభ్యులు

మంగపేట నేటిధాత్రి

 

 

 

వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ లోగల నిరుపేద కుటుంబానికి చెందిన బుడుగుల పిచ్చయ్య ఇటీవల అనారోగ్యం తో మృతి చెందాడు. కన్నీరు మున్నీరు అవుతున్న బాధిత కుటుంబాన్ని ట్రస్ట్ సభ్యులు కలిసి పరామర్శించి,25 కేజీ ల బియ్యాన్ని మరియు ఆర్థిక సహాయంని శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగరమేష్ ఆదేశాలమేరకు ట్రస్ట్ సభ్యులు వారి కుటుంబ సభ్యులైన భార్య కాంతమ్మ, కొడుకు రమేష్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమరం శివాజీ ,ఆలం శ్రీను, గట్టిపల్లి అర్జున్, చౌలం బాబు,గట్టిపల్లి బాలకృష్ణ మరియు గ్రామస్తులు గట్టిపల్లి సమ్మయ్య ,చౌలం నవీన్ ,చౌలం సుధాకర్, కొట్టెం రాము, బుడుగుల కృష్ణ,
పూనెం గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

మహోత్సవానికి ఉప్పల వెంకటేష్ ఆర్థిక సహాయం.!

ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఉప్పల వెంకటేష్ ఆర్థిక సహాయం.

కల్వకుర్తి/నేటి ధాత్రి :

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం, కల్వకుర్తి మున్సిపల్ పట్టణానికి చెందిన భగత్ సింగ్ తండాలోని నూతన దేవాలయంలోని విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, తెలంగాణ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ & ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ రూ.25 వేల ఆర్థిక సహకారం అందించారు. ఈనెల 16,17,18,19 తేదీలలో జరిగే బ్రహ్మోత్సవాలకు కూడా రావలసిందిగా ఉప్పల వెంకటేష్ ఆహ్వానం అందించిన భగత్ సింగ్ తండా ఆలయ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు.ఈ కార్యక్రమంలో ఉప్పల వెంకటేష్ సైన్యం & తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధమోని రమేష్ గౌడ్ ,భగత్ సింగ్ తండా నాయకులు రాజు నాయక్, బాలు నాయక్, హర్యా నాయక్, దేవేందర్ నాయక్, భాస్కర్ నాయక్, బోడు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్.!

విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు నరేష్ గౌడ్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం ఇటీవల విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ప్రతిభకనబరిచిన విద్యార్థులకు సన్మానం చేసి ఆర్థిక సహాయాన్ని అందించారు. జహీరాబాద్ నియోజకవర్గ రంజోల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని 600 మార్కులకు గాను 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థినిలు వినాయక,ఎం. భవాని, ఫర్హిన్ లకు యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ శాలువాలతో సన్మానం చేసి రూ. 5 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రభుత్వం పాఠశాలలో చదువుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించడం హర్షించదగ్గ విషయం అన్నారు. భవిష్యత్తులో కూడా ఉన్నత చదువులు చదివి, ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. గ్రామస్తులంతా పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వైజ్య నాథ్, రవీందర్ రెడ్డి, బాబు, మాజీ ఎంపిటిసి ఖలీల్, నాయకులు చంద్రన్న, గుండారెడ్డి, రాజు, మల్లేష్, రవి, శశి, షబ్బీర్, మస్తాన్, సర్దార్, ఎల్లారెడ్డి, మల్లారెడ్డి, దత్తు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నానో సింగ్ రాథోడ్, ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, నిజాముద్దీన్, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత..

ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణం లోని సింగరేణి ఏరియా హాస్పిటల్ సమీపంలో నివాసం ఉండే అరికపురం రాజేశ్వరి అనే నిరుపేద మహిళ ఇటీవల అనారోగ్య రీత్యా మరణించింది.దశదినకర్మ సైతం చేయలేని దిన స్థితిలో ఉన్న కుటుంబానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించి పదివేల ఆర్థిక సహాయం అందించారు. ఈకార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సట్ల మహేందర్,కోశాధికారి తూముల సురేష్ , ఉపాధ్యక్షుడు బొద్దుల సతీష్ సభ్యులు జెట్టి శ్రీనివాస్, జె సతీష్, మోటం తిరుపతి , కొండ కుమార్ తదితరులు పాల్గొన్నారు

*-స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం *

*-స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం *
మొగుళ్ళ పల్లి: నేటి ధాత్రి

 

సొంత రక్తసంబంధీకులే వివిధ కారణాలతో విడిపోయి..గొడవలు పడి..మానవత్వ విలువలను మంటగలుపుతున్న తరుణంలో..తోటి స్నేహితుడి తండ్రి మరణం పట్ల స్పందించి..ఆర్థిక సహాయాన్ని అందించి..తోటి స్నేహితులు మానవత్వాన్ని చాటుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నవీన్ తండ్రి కుమ్మరి సమ్మయ్య ఇటీవల మృతి చెందాడు. కాగా 2012-2013 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన కుమ్మరి నవీన్ స్నేహితులు జన్నే రాజ్ కుమార్, ఇల్లందుల విజయ్ కుమార్, బొచ్చు ప్రకాష్, నాగన బోయిన రాకేష్ యాదవ్, వైనాల అజయ్, బొచ్చు రాజు, తంగళ్ళపల్లి హరీష్, జన్నే రేష్మ, కట్ల మమత, వనపర్తి రుతీష, చల్ల మమత, పోతరాజు జ్యోతి, పసరగొండ శ్రీలత, గాదే రమ్య, చేపూరి రజిత, వైనాల శిరీషలు విరాళాలుగా వేసుకుని 5000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version