వాయు కాలుష్యం జల కాలుష్యం చేస్తున్న పరిశ్రమలపై తగు చర్య తీసుకోవాలి
★పి. రాములు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలో ఉన్న పరిశ్రమలు తమ పరిశ్రమల నుండి వచ్చే చెత్తను స్థానికంగా ఉన్న చెత్త వ్యాపారం చేసే వాళ్లకు ఇస్తున్నారు ఈ వ్యాపారులు చెత్తలో నుండి పునరుత్పత్తి అయ్యే వస్తువులను సేకరించి దేనికి పనికిరాని వస్తువులను అనగా ఫైబర్ రెగ్జిన్ ధర్మాకోల్ లాంటి వస్తువులు బహిరంగ ప్రదేశాలలో వేసి కాల్చి వేస్తున్నారు ఇలా కాల్చివేయడంతో భయంకరమైన వాయు కాలుష్యం ఏర్పడుతుంది అదేవిధంగా చెత్తను కాల్చివేసిన తర్వాత మిగిలిపోయిన బూడిద వర్షపు నీళ్లతో కలిసిపోయి చిన్నచిన్న కాలువల ద్వారా వాగులలోకి చెరిపోతుంది ఇలా చేరిపోయిన నీటిని తాగిన మూగజీవాలు అనేక సందర్భాలలో చనిపోతున్నాయి మరియు చెత్తను కాల్చి వేస్తుండగా ఎవరైనా ప్రశ్నిస్తే కొద్ది రోజులు మానుకొని చెత్తనంతా తీసుకెళ్లి వ్యవసాయ భూముల దగ్గర ఉన్న వ్యవసాయ బావులలో నింపి వేస్తున్నారు. వ్యవసాయ బావులలో నింపివేసిన చెత్తతో అనేక సందర్భాలలో భూగర్భ జలాలు కూడా కాలుష్యం అవుతున్నాయి ఈ విషయాలన్నింటిని కూడా కాలుష్య నియంత్రణ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు ప్రతిరోజు పరిశ్రమల నుండి పనికిరాని టన్నులకొద్ది చెత్త చెత్తలో అనేక రసాయనాలు తో కూడుకున్న వస్తువులను కూడా కాల్చి వేస్తున్నారు వ్యవసాయ భూములలో ఉన్న బావులలో నింపి వేస్తున్నారు. కావున భవిష్యత్తులో జహీరాబాద్ ప్రాంత ప్రజల మూగజీవాల ఆయురారోగ్యాలు కాపాడే విషయంలో తమ ఆదేశాలతో జిల్లా కాలుష్య నియంత్రణ అధికారులతోని కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టేలా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.