జర్నలిస్ట్ రాజేందర్ పై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలి..

జర్నలిస్ట్ రాజేందర్ పై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలి

దళితుడని రాజేందర్ పై కుట్రలు

ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-02T124932.210.wav?_=1

పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లాలో ఇటీవల సీనియర్ జర్నలిస్టు దామెర రాజేందర్ పై ఐనవోలు పోలీసులు పెట్టిన తప్పుడు కేసును వెంటనే ఎత్తివేయాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ డిమాండ్ చేశారు.జర్నలిస్టు దామెర రాజేందర్ పై ఐనవోలు పోలీసులు బనాయించిన తప్పుడు కేసు పై మాట్లాడుతూ రాజేందర్ గతంలో దాదాపు పదేండ్లు వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా పనిచేశారని,ప్రస్తుతం సొంత పత్రికను నడుపుతున్నారని,ఐనవోలు తహశీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై రాజేం దర్ పత్రికలో వరుస కథనాలు ప్రచురించారని తెలిపారు.దీనిని మనసులో పెట్టుకున్న ఐనవోలు తహశీల్దార్ రాజేందర్ పై కుట్రపన్ని పథకం ప్రకారం యూట్యూబర్ సహాయంతో పోలీసులతో కుమ్ముక్కై కావాలని తప్పుడు కేసు నమోదు చేయించి జైలుకు పంపించారని ఆరోపించారు. నీతి,నిజాయితీతో వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం సరైంది కాదని అన్నారు.కావాలని ఒకరిద్దరు రాజేందర్ పై సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని,తప్పుడు ప్రచారాలు చేస్తున్న యూట్యూబర్ ను వదిలేసి ఏ తప్పు చేయని జర్నలిస్టు రాజేందర్ పోలీసులు అక్రమంగా కేసు బనాయించి వేధిస్తున్నారని అన్నారు.ఈ కుట్రపూరిత అక్రమ కేసు వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.జర్నలిస్టు రాజేందర్ పై పోలీసులు పెట్టిన కేసును ఉపసంహరింపజేయాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా ఐనవోలు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన భూములు,ప్లాట్ల అక్రమ రిజిస్ట్రేషన్ లపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.జర్నలిస్టులపై పోలీసులు పెట్టిన ఆ మ కేసులకు బాధ్యులైన ఐనవోలు తహశీల్దార్,ఎస్ ఐలను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్. చేశారు.ఈ విషయంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి జర్నలిస్టు దామెర రాజేందర్ పై అక్రమ కేసు తొలగించక పోతే మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేయాల్సి వస్తుందని మైస ఉపేందర్ మాదిగ హెచ్చరించారు.

ఉపాధి హామీ డబ్బులు కాజేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.

ఉపాధి హామీ డబ్బులు కాజేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-30T131704.246.wav?_=2

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామపంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనులలో 40 లక్షల రూపాయల వరకు అవినీతి జరిగిందని సోషల్ ఆడిట్లో తేల్చడం జరిగింది దీనికి సంబంధించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మండల అధికారి స్థానిక పంచాయతీ కార్యదర్శి పూర్తి బాధ్యత వహిస్తూ ఎవరైతే అవినీతికి పాలు పడ్డారో వారి నుండి డబ్బులు రికవరీ చేసి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల కాలంలో ఉపాధి హామీ పనులు ఆ గ్రామంలో ఎక్కడెక్కడ జరిగినవో సమగ్రమైన విచారణ చేసి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ చేసి అక్రమానికి పాల్పడిన ఎవరైనా వారి మీద తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని నిరుపేద ప్రజలకు అండగా నిలబడి వారు కష్టపడి పని చేసిన వారికి వారి అకౌంట్లో డబ్బులు జమ చేయాలి అని అన్నారు సమగ్ర విచారణ జరగకపోతే చర్యలుతీసుకోకపోతే ఆ గ్రామ ప్రజలను సమీకరించి ఆందోళనకు సిద్ధం చేస్తామని తెలియజేస్తున్నాను ఐసా జిల్లా కార్యదర్శి శిలపాక నరేష్ రాజు పాల్గొన్నారు.

చిత్రపురి కాలనీపై ఆరోపణలు.. అధ్యక్షుడు అనిల్‌ క్లారిటీ..

చిత్రపురి కాలనీపై ఆరోపణలు.. అధ్యక్షుడు అనిల్‌ క్లారిటీ

హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీపై వస్తున్న ఆరోపణలపై అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్‌ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీపై (Chitrapuri colony issue) వస్తున్న ఆరోపణలపై అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్‌ (Anil Kumar) క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. చిత్రపరి కాలనీలో కొత్తగా నిర్మించబోతున్న సఫైర్‌ సూట్‌, రో హౌసెస్‌, డూప్లెక్స్‌ తదితర నిర్మాణాలకు సంబంధించి అలాగే టవర్స్‌ కి సంబంధించిన అంశాలపై మాట్లాడారు. ‘చిత్రపురి కాలనీలో ఆరు నెలలకు ఓసారి సమావేశం జరుగుతుంది. అందరం కలిసి సమస్యల గురించి చర్చించుకుంటాం. ఈ మధ్యన కొందరు సమావేశంలో మాట్లాడకుండా చలో ఫిలిం ఛాంబర్‌, ఛలో గాంఽధీభవన్‌ అంటూ బయటికి వస్తున్నారు. అందులో చాలామంది చిత్రపురి కాలనీకి సంబంధం లేనివారు ఉండటం ఆశ్చర్యకరంగా ఉంది. కాలనీలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు, కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు మాట్లాడుతున్నారు. ఈ కారణంగా కాలనీలో ఉండే ఎంతోమంది కొన్ని భయాందోళనకు గురవుతున్నారు. ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలి అని ఒక కుటుంబం లాగా అందరం కలిసి ముందుకు వెళ్తున్నాము. అవినీతి జరిగిందంటూ మా దగ్గర ఆధారాలు ఉన్నాయని మాట్లాడేవారు. అవేంటో చెబితే బహిరంగంగా మాటాడటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. కానీ ఎవరూ ముందుకు రారు. చిత్రపురి కాలనీలో 4713 కుటుంబాలు ఇప్పటికే నివాసం ఉంటున్నారు. 700 నుండి 850 కోట్ల మధ్య ఉన్న చిత్రపురి కాలనీ పై సుమారు 3000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు మాట్లాడుతున్నారు. చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు. ఆరోపించేవారు ముందుకొస్తే సమాధానం చెప్పడానికి కమిటీ సిద్ధంగా ఉంది. కోర్టులో ఉన్న కొన్ని విషయాలపై నేను మాట్లాడలేను కానీ మిగతా వాటిపై నేను మాట్లాడతాను’  అన్నారు. 

* చిత్రపురి కాలనీలో జాయిన్ కావాలంటే కచ్చితంగా సినీ కార్మికులయ్యే ఉండాలి. ప్రస్తుతానికి సుమారు 60 శాతం మాత్రమే అలా ఉన్నారు. కొంతమంది అమ్ముకుని బయటకు వెళ్లిపోయారు.

* 2009లోనే పర్మిషన్లు తీసుకుని రో హౌసులు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత 2017లో కూడా మరికొన్ని పర్మిషన్లతో G+2గా మరి కొన్ని రో హౌసులు నిర్మించడం జరిగింది. అవి అన్ని పెర్మిషన్ తోనే జరిగాయి కాని కొంతమంది కేసులు పెట్టిన కారణంగా ఆ కట్టడాలు ఆపడం జరిగింది.

* ఇప్పటికీ ఉన్న రేట్లు అన్ని సమావేశంలో చర్చించుకుని ఫిక్స్ చేసినవే. అలాగే కాలనీ పై ఉన్న అప్పును దృష్టిలో పెట్టుకొని ఆ రేట్లు నిర్ణయించడం జరిగింది. సఫైర్ సూట్ నిర్మించేందుకు అన్ని పర్మిషన్లతోనే ముందుకు వెళ్తున్నాము.

* శ్రావణమాసంలో కొత్త నిర్మాణాలు మొదలుపెట్టనున్నాము. చుట్టుపక్కల ఉన్న ఎన్నో గేటెడ్ కమ్యూనిటీలకు తగ్గట్లు అన్ని రకాల ఎమినిటీస్ తో సఫైర్ సూట్ నిర్మించబోతున్నాము. ఈ కొత్త ప్రాజెక్టు పూర్తి కాకపోతే కాలనీ మనుగడకే సమస్య వచ్చే అవకాశం ఉంది. అందుకే పూర్తిగా పర్మిషన్లు తీసుకుని ముందుకు వెళ్తున్నాము. దానిని పూర్తి చేసి ఉన్న సమస్యలు అన్నిటిని సాల్వ్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నాము. మొత్తం 51 అంతస్థుల భవనంలో సఫైర్ సూట్ ప్లాన్ చేస్తున్నాము.

* చిత్రపురి కాలనీలో నీటి సమస్య అనేదే లేదు. నిరంతరం మంజీరా నీటి సరఫరా ఉంటుంది.

* కాలనీలో చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ సరైన మెంబర్షిప్ లు ఉంటే కచ్చితంగా వారికి ఫ్లాట్ వచ్చేందుకు మా కమిటీ పూర్తి సహకారం అందించి వారికి ఫ్లాట్ వచ్చేలా పనిచేస్తుంది. వారికి ఫ్లాట్లు ఇచ్చేందుకు కూడా రెడీ గానే ఉన్నాయి.

* వచ్చే సెప్టెంబర్ నెలలో జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో ఆరోపణలు చేసేవారు వివరణ ఇవ్వాలి. ఆ వివరణ ఆధారంగా చర్యలు ఉండబోతాయి.

* ఇప్పటికీ చిత్రపురి కాలనీ పై ఉన్న సుమారు 170 కోట్ల రూపాయల అప్పును తీర్చాలంటే సఫైర్ సూట్ కేవలం 48 నెలలలో పూర్తి చేస్తే ఆ అప్పును తీర్చే అవకాశం ఉంది. అంతేకానీ చత్రపతి కాలనీలో సభ్యులపై ఆ అప్పు పడదు.

* 2023 తర్వాత ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేయలేదు. ఒకవేళ అలా చేసిన 336లో సినీ కార్మికులు కాని వారు ఎవరైనా ఉంటే వారిని తీసేయడానికి అనిల్ కుమార్ కమిటీ సపోర్ట్ చేస్తుంది.

* సినీ జర్నలిస్టులకు కూడా చిత్రపురిలో ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా సినీ జర్నలిస్టులకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు అలాగే 24 క్రాఫ్ట్స్ లో తమ అసోసియేషన్ ద్వారా వస్తే ఫ్లాట్లు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాము.

* గతంలో లోన్స్ కట్టలేని పరిస్థితులలో ఆక్షన్ వేసే పరిస్థితి వచ్చింది. అటువంటి సమయంలో చదలవాడ శ్రీనివాస్ గారు చిత్రపురి కాలనీకి అండగా నిలబడ్డారు.

* ప్రభుత్వం వారు ఇప్పటికే వేసిన కమిటీ వారు ఎవరైనా సినీ కార్మికులకు న్యాయంగా ఫ్లాట్ వెళుతుంది అని చెప్తే కచ్చితంగా వారికి ఫ్లాట్ ఇస్తాము.

* సభ్యులను తీయాలంటే రెండు ప్రక్రియలు మాత్రమే ఉంటాయి. ఒకటి సరైన సమయంలో డబ్బులు కట్టకపోవడం వల్ల తీసేస్తాము. లేదా సినీ కార్మికులు కాని వారిని తీసేస్తాము. ఈ రెండు కారణాలు కాకుండా సభ్యులను తీసేసే అవకాశం ఎవరికీ లేదు. 

దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఎన్నికల్లో ఓటర్లు ప్రలోభాలకు తలొగద్దు

అవగాహన కార్యక్రమంలో ఎస్సై రణధీర్

నర్సంపేట,నేటిధాత్రి:

గ్రామాల్లో రోజురోజుకు గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రావుల రణధీర్ తెలిపారు.దుగ్గొండి మండల కేంద్రంలో ప్రాధమిక వ్యవసాయ సహాయ సహకార సంఘం ఆవరణలో గ్రామస్తులు,రైతులతో సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.అలాగే గత కొన్ని రోజులుగా జరుగుతున్న దొంగ తనాలు,చైన్ స్నాచింగ్,పట్ల వివరించారు.అలాగే రాబోయే ఎన్నికల్లో ప్రజలు,ఓటర్లు పాటించ వలసిన జాగ్రత్తల గురుంచి క్షుణ్ణంగా వివరించారు.

ElectionsSI Randhir

మండలంలో ఎవరైనా అనుమానిత వ్యకలు కనపడితే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలని కోరారు.రాబోయే ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనవద్దని ఎస్సై రణధీర్ తెలిపారు.

అడవిని దున్నుతున్న ఒకరిపై కేసు నమోదు.

అడవిని దున్నుతున్న ఒకరిపై కేసు నమోదు

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి రేంజి పరిధిలోని బొమ్మెన 143 కంపార్ట్మెంట్ అడవిలో చామనపల్లికి చెందిన ధూపం కుమార్ ట్రాక్టర్ తో అడవిని దున్నతుండగా తమ సిబ్బంది పట్టుకున్నట్లు అటవీ రేంజ్ అధికారి హఫీజ్ ఖాన్ శనివారం తెలిపారు. ట్రాక్టర్ ను సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అటవీ భూమిని దున్నితే చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు

చెన్నూరు రూలర్ సిఐ బన్సీలాల్

జైపూర్,నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-41.wav?_=3

మంచిర్యాల జిల్లా కోటపల్లి, నీల్వాయి మండలాలలో ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన,ఉద్దేశ్య పూర్వకంగా శాంతి భద్రతలకు విఘాతం కల్గించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్ అన్నారు.అదేవిధంగా అక్రమ ఇసుక రవాణా,పిడిఎస్ బియ్యం రవాణా,గుడుంబా రవాణా చేయడం,గంజాయి అమ్మకం సేవించడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు చేపట్టి వారిపై పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు.చట్టాన్ని అతిక్రమించి గొడవలకు పాల్పడడం,ఉదేశ్య పూర్వకంగా దాడులకు పాల్పడుతూ,శాంతి భద్రతలకు విఘాతం కల్గించిన వారిపై కఠిన చర్యలు చేపట్టి అటువంటి ప్రవర్తన కలిగిన వారిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామన్నారు.కాబట్టి ప్రతి ఒక్కరు చట్టానికి లోబడి వుంటూ పోలీస్ వారికి సహకరించాల్సిందిగా చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్, కోటపల్లి,నీల్వాయి ఎస్సై లు రాజేందర్,శ్యామ్ పటేల్ తెలిపారు.

కల్లు కాంపౌండ్లపై చర్యలు తీసుకోవాలి.

కల్లు కాంపౌండ్లపై చర్యలు తీసుకోవాలి

కల్తీ కల్లు బాధితులు పెరగడం ఎక్సైజ్, ఆబ్కారీ శాఖ అధికారుల నిర్లక్ష్యమే

ఎన్ హెచ్ ఆర్ సి. గ్రేటర్ హైదరాబాద్ అధికార ప్రతినిధి ఎస్వి సురేష్ రెడ్డి

“నేటిధాత్రి”,

సెక్రటేరియట్ (హైదరాబాద్): నగరంలో పలుచోట్ల ప్రమాదకరమైన మత్తు పదార్థాలతో కల్లు తయారుచేసి విక్రయిస్తున్నట్లు తెలిసినా కూడా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే యదేచ్చగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నాయని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) గ్రేటర్ హైదరాబాద్ అధికార ప్రతినిధి ఎస్ వి సురేష్ రెడ్డి అన్నారు. దీనివల్ల నగరంలో కల్తీ కల్లు బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. నగరంలో పలుచోట్ల జరిపిన కెమికల్ ఎగ్జామినేషన్ లో ప్రమాదకరమైన ఆల్ఫ్రాజోలం పదార్థం ఉన్నట్లు తేలిందని అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే కల్తీ కల్లు విక్రయం నిరాటకంగా కొనసాగుతుందని ఆయన అన్నారు. కల్తీ కల్లు విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్, ఆబ్కారీ శాఖ అధికారులు అందుకు విరుద్ధంగా చట్టంలోని లొసుగులను విక్రయదారులకు చెప్పి మరీ అమ్మకాలు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని ఆయన అన్నారు. హైదరాబాదులో తయారవుతున్న కల్లు 90 శాతం కల్తీయేనని అధికారులు ఇప్పటికే గుర్తించారని అయినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సంబంధిత అధికారుల పాత్రపై విచారణ చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసలు నగరానికి కనుచూపుమేరలో తాడిచెట్లు లేని విషయం అందరికీ తెలుసని అయినప్పటికీ నగరంలో 97 కల్లు దుకాణాలు ఉన్నట్లు అధికారికంగా లెక్కలు చెబుతున్నప్పటికీ అంతకుమించి అనధికారికంగా ఇష్టానుసారం కల్లు దుకాణాలు నడుపుతున్నట్లు సమాచారం ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కల్లు దుకాణాల అనుమతులను రద్దు చేయాలని, వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు ఎలా వచ్చాయో సమగ్ర విచారణ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రెటరీ తిరునగరి లావణ్య, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎరువుల డీలర్ పై కేసు నమోదు.

ఎరువుల డీలర్ పై కేసు నమోదు.

#6 ఏ కేసు నమోదు చేసి యూరియా నిలువల అమ్మకాలు నిలిపివేశారు.

#యూరియా కొరతను డీలర్లు సృష్టిస్తే పీడీ యాక్ట్ తప్పదు.

#ఏడిఏ దామోదర్ రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

యూరియాను కృతిమ కొరత సృష్టిస్తే సంబంధిత డీలర్ పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి డీలర్ లైసెన్సులను రద్దు చేయడం జరుగుతుందని నర్సంపేట ఏ డి ఏ దామోదర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేపట్టారు. ఆదివారం రాత్రి యూరియా కోసం మండలంలోని బిల్లా నాయక్ తండా చెందిన రైతులు యూరియా కోసం మండల కేంద్రంలోని కర్ర మల్లారెడ్డి ఫర్టిలైజర్ షాపు వెళ్ళగా యూరియా నిలువలు ఉండంగా లేదని దురుసుగా రైతులపై మాట్లాడడంతో సదరు డీలర్ గోదాం దగ్గరికి వెళ్లి పెట్రోల్ బాటిల్ తీసుకొని ఆత్మహత్య ప్రయత్నానికి ప్రయత్నించగా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని రైతులను శాంత పరిచి సమాధానం చెప్పడంతో రైతులు శాంతించగా.

Fertilizer Dealer.

ఈ సంఘటన రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా సంచలనం కాగా అధికారులు స్పందించి కర్ర కృష్ణారెడ్డి డీలర్ల వద్ద ఉన్న ఎరువుల నిలువలపై స్టాక్ రిజిస్టర్ను పరిశీలించి 1000 బస్తాలు ఉండడంతో అట్టి యూరియా నిలువలను అధికారులకు సమాచారం ఇవ్వకుండా అమ్మరాదని సదర్ డీలర్ కర్ర కృష్ణారెడ్డిని హెచ్చరించారు. అనంతరం ఆయనపై 6 ఏ కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అలాగే మండలంలోని ఏ డీలర్ కూడా యూరియాకు లింకు పెట్టి అమ్మితే చట్ట రిత్యా చర్య తీసుకొని సంబంధిత డీలర్ లైసెన్సును రద్దు చేయబడుతుందని ఆయన పలువురు డీలర్లకు సూచించారు. ఆయన వెంట ఏవో బన్న రజిత, ఏ ఈ ఓ శ్రీకాంత్ రెడ్డి, రైతులు తదితరులు ఉన్నారు.

పేలుడు ఘటనపై పూర్తి విచారణ చేయాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

 

పేలుడు ఘటనపై పూర్తి విచారణ చేయాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

పాశమైలారం సిగాచి పరిశ్రమలో ఘోర ప్రమాదం చాలా దురదృష్టకరం

మృతుల సంఖ్య పై స్పష్టత ఇవ్వాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి

ఎన్ హెచ్ ఆర్ సి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాయకోటి నరసింహ

“నేటిధాత్రి”,పటాన్ చెరు / సంగారెడ్డి జిల్లా:

పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటన చాలా దురదృష్టకరమని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాయకోటి నరసింహ అన్నారు. మృతుల సంఖ్య పై స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని, ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు, క్షతగాత్రులకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసలు ఈ ఘటన జరగడానికి కారణాలు ఏమిటనే అంశంపై పూర్తి విచారణ చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఇప్పటివరకు 36 మృతదేహాలు లభ్యమయ్యాయని, ఇంకా 13 మంది మృతదేహాల అచూకీ వెంటనే కనుగొనడానికి ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రతి ఇండస్ట్రియల్స్ ను రద్దు చేయాలని, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం మరియు సిగాచి రసాయనిక పరిశ్రమ యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు..

 

రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు”

● – ఎస్సై వినయ్ కుమార్….

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేనిపక్షంలో నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని జహీరాబాద్ పట్టణ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. గురువారం జహీరాబాద్ పట్టణ పరిధిలోని భవాని మందిర్ చౌరస్తా, బీదర్ చౌరస్తా లలో పోలీస్ సిబ్బంది తో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు సలహాలు చేస్తూ, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించి డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, సంబందిత పత్రాలు కల్గి ఉండి మంచి కండిషన్ గల వాహనల్ని నడపాలని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మానవ ప్రాణం అత్యంత విలువైనదాని అన్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ వైలేషన్, ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్ సరిగా లేని, పత్రాలు లేని, సెల్ ఫోన్ డ్రైవింగ్ తదితర నిబంధనలు ఉల్లంగించిన వాహనాలకు రూపాయలు 17100 జరిమానా విధించడం జరిగిందని తెలిపారు.

అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోండి..

*అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోండి..

కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 01:

 

 

 

 

నగరపాలక సంస్థ అనుమతులు లేకుండా నగరంలో నిర్మిస్తున్న భవనాలు, నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని 45 వ వార్డు లోని శివజ్యోతినగర్, ప్రగతి నగర్, అయ్యప్ప కాలని, అంధుల శరణాలయం తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య, అభివృద్ధి పనులను కార్పొరేటర్ అనీష్ రాయల్, వివిధ శాఖల అధికారులతో కమిషనర్ పరిశీలించారు. శివజ్యోతి నగర్ వద్ద వేసిన కొత్త రోడ్డులో వాహనాలు పార్కింగ్ చేయడం, మద్యం సేవిస్తున్నారని, రోడ్లలో గుంతలు ఎక్కువగా ఉన్నాయి పూడ్చాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పోలీసుల సాయంతో వాహనాలు పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. డ్రైనేజీ కాలువల్లో ఉన్న చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించి నోటీసులు ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ప్రగతి నగర్, అయ్యప్ప కాలనీల్లో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బైపాస్ రోడ్డులోని ఓరియన్ హోటల్ నుండి మురుగునీటి కాలువల్లో కలుస్తున్న వ్యర్థాలను అరికట్టి తగు చర్యలు చేపట్టాలని హెల్త్ ఆఫీసర్ ను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి,డి.ఈ. రమణ, శిల్ప, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ రవి, ఏసీపీ మూర్తి, సర్వేయర్ కోటేశ్వర రావు, శానిటరీ సూపర్ వైజర్ సుమతి, తదితరులు ఉన్నారు.

అక్రమంగా భూములను అమ్ముతున్న వారిపై కఠిన.

అక్రమంగా భూములను అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.

తాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన వి సి కె పార్టీ నాయకులు.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

 

 

 

చిట్యాల మండలం కేంద్రంలో మంగళవారం రోజున వీసీకే పార్టీ నాయకులు తాసిల్దారును మర్యాదపూర్వకంగా కలసి చల్లగరిగ గ్రామానికి 308 గల సర్వే నెంబర్ కు సంబంధించిన ప్రభుత్వ భూములను కాపాడాలని ఎమ్మార్వో దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది, అన్నారు ప్రభుత్వం అణగారిన వర్గాల ప్రజలకు పేదలకు ఇచ్చిన భూములను చల్లగరిగ గ్రామానికి సంబంధించిన కొంతమంది దళారులు ఆ భూములపై ఎలాంటి హక్కు లేకుంన్నా వారు ఇష్టానుసారంగా ప్రభుత్వ ఆస్తులను సాగు చేసుకుంటూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు పి ఓ టి 1977 చట్టం ప్రకారం ప్రభుత్వ భూములను అమ్మకూడదు కొనకూడదు అని తెలిసినా కూడా ప్రభుత్వం మీద గౌరవం లేకుండా ప్రభుత్వ అధికారులకు తెలియకుండా గ్రామంలో ఉన్న కొంతమంది అక్రమ దారుల అండదండలతో ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన భూములను అన్యాయంగా అమ్ముకోవడం చట్ట విరుద్ధం నేటి వరకు ఎన్ని భూములు అమ్ముకున్నారో ఇంకా మిగులు భూమి ఎంత ఉన్నది అనే విషయాలపై తక్షణమే విచారణ జరిపించి అక్రమ దారులపై తగిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు పెట్టాలని గౌరవనీయులు అయినా చిట్యాల మండలం ఎమ్మార్వో కి వివరించడం జరిగింది పలు ప్రభుత్వ భూముల విషయం విన్న ఎమ్మార్వో వెంటనే స్పందించారు తక్షణమే విచారణ జరిపించి పేద ప్రజలకు న్యాయం చేస్తానని ప్రభుత్వ భూములు కాపాడుతానని ఎమ్మార్వో హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో విసికే విముక్త చిరుతల పార్టీ రాష్ట్ర యాత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ విసికే పార్టీ జిల్లా అధ్యక్షులు సిరిపెల్లి రమేష్ మరియు ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు కొల్లూరి అశోక్ నోముల శివశంకర్ సిరిపెల్లి తిరుపతి సిరిపెల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

చిట్యాల ఎస్సై పై ఎస్పీకి ఫిర్యా దు చేసిన రైతులు.

చిట్యాల ఎస్సై పై ఎస్పీకి ఫిర్యా దు చేసిన రైతులు

భూపాలపల్లి నేటిధాత్రి:

సమస్యలను పరిష్కరించాలని చిట్యాల పోలీస్ స్టేషన్ కు వెళ్ళితే ఎస్సై తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చిట్యాల మండలానికి చెందిన రైతులు మంగళవారం జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
చిట్యాల మండలం చింతకుంట రామయ్య పల్లి కి చెందిన అబ్బెంగుల రాజయ్య ,కైలాపూర్ కు చెందిన బూదారపు మార్కండేయ ,చల్లగరిగే కు చెందిన ఇంచర్ల లక్ష్మీ అనే ముగ్గురు రైతులు చిట్యాల ఎస్సై శ్రావణ్ కుమార్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే కు ఫిర్యాదు చేశారు..అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఇంచర్ల లక్ష్మి మార్కండేయ అనే రైతులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా భూమిని వేరే వాళ్ళు దున్నుకుంటున్నారు అని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా ఎస్సై తమని నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు…ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకోని తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు జిల్లా ఎస్పీని కోరారు

టీమిండియా కోసం ఇంగ్లండ్ లెజెండ్ సొంతజట్టుకు వ్యతిరేకంగా ప్లాన్

టీమిండియా కోసం ఇంగ్లండ్ లెజెండ్ సొంతజట్టుకు వ్యతిరేకంగా ప్లాన్…

 

టీమిండియా ప్రతీకారంతో రగిలిపోతోంది. లీడ్స్ టెస్ట్‌లో జరిగిన పరాభవానికి రివేంజ్ తీర్చుకోవాలని చూస్తోంది. స్టోక్స్ సేన బెండు తీయాలని పట్టుదలతో కనిపిస్తోంది.

ఇంగ్లండ్ పర్యటనను పరాభవంతో మొదలుపెట్టిన టీమిండియా.. ఇప్పుడు ప్రతీకారంతో రగిలిపోతోంది. లీడ్స్ టెస్టులో ఓటమి గిల్ సేనను నిరాశలో ముంచేసింది. అయితే వెంటనే తేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టిన భారత జట్టు.. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్ట్ కోసం జోరుగా సన్నద్ధమవుతోంది. స్టోక్స్ సేన బెండు తీసి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని చూస్తోంది. ఈ తరుణంలో మెన్ ఇన్ బ్లూకు అండగా నిలబడుతున్నాడో ఇంగ్లండ్ స్టార్. సొంతజట్టుకు వ్యతిరేకంగా, గిల్ సేనకు అనుకూలంగా పని చేస్తున్నాడు. అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
మైండ్‌సెట్ ముఖ్యం..

భారత జట్టు ఆటగాళ్లకు సాయం చేస్తున్నాడు ఇంగ్లండ్ దిగ్గజం కెవిన్ పీటర్సన్. స్పిన్నర్లకు అంతగా అచ్చిరాని ఇంగ్లీష్ కండీషన్స్‌లో వికెట్లు ఎలా తీయాలో నేర్పిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ బయటపెట్టాడు. ‘కెవిన్ పీటర్సన్ నాకు కొన్ని సలహాలు ఇచ్చాడు. ఇంగ్లండ్‌లో ఎలా రాణించాలో చెప్పాడు. ఇక్కడి ఫీల్డింగ్ పొజిషన్స్, పిచ్‌ల గురించి అర్థం అయ్యేలా వివరించాడు. ఎలాంటి మైండ్‌సెట్‌తో బౌలింగ్ చేయాలో సూచించాడు అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.

జూరాల ప్రాజెక్టు పై అసత్య ఆరోపణలు తగవు.

“జూరాల ప్రాజెక్టు పై అసత్య ఆరోపణలు తగవు’

బీఆర్ఎస్ నాయకుల దొంగ ఏడుపు మానుకోవాలి.

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కుట్రలు

ఎమ్మెల్యేలు జి.మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

 

 

 

 

జూరాల ప్రాజెక్ట్ గురించి పని పాట లేని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు, రేపే ప్రాజెక్టు కూలిపోతుందాన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ను పార్టీ ప్రతిష్టను దెబ్బ చేసేందుకు, BRS పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ పత్రిక తప్పుడు రాతలు రాసిందన్నారు. జూరాల ప్రాజెక్టు నిర్మాణంను కాంగ్రెస్ హయంలో 1981లో ప్రారంభిస్తే.. 1995లో ప్రాజెక్ట్ పూర్తి అయ్యిందన్నారు.
62 గేట్లతో నిర్మించిన ప్రాజెక్టు జూరాల ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నారు. బీఆర్ఎస్ నాయకులకు మాట్లాడటానికి సబ్జెక్ట్ లేక, జూరాల గేట్ల అంశాన్ని గోరంతది కొండంత చేసి చూపిస్తున్నారన్నారు.
పని పాటా లేకుండా ఖాళీ తిరుగుతున్న కేటీఆర్ వాస్తవాలకు సంబంధం లేకుండా, ఏదీ దొరికితే దాన్ని ట్విట్టర్ లో పెట్టి శునకానందం పొందుతున్నారన్నారు.
జూరాల పైన మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. జూరాల ప్రాజెక్టు గేట్లు తుప్పు పట్టినట్లు 2019లో బయటపడ్డ, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.
2021లో గేట్ల నుంచి పెద్ద ఎత్తున నీళ్లు లీక్ అయిన అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
గేట్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులు 2018లో రూ.19 కోట్ల అంచనాలతో అధికారులు నివేదికను ప్రభుత్వానికి పంపించారు, అయిన అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు.
అధికారుల నుంచి ఒత్తిడి తీవ్రంగా పెరగడంతో 2022లో రూ.11 కోట్లతో టెండర్లు అప్పటి ప్రభుత్వం పిలిచి, చేతులు దులుపుకుందన్నారు.
గత రెండేళ్ల నుంచి కృష్ణా ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయి. ఇప్పటికిప్పుడు జూరాల గేట్ల కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, 10 లక్షల క్యూసెక్ ల వరద నీరు వచ్చినా గేట్ల కు ఏమీ కాదని ఇంజనీర్లు తెలియజేశారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలన్నారు.
ప్రస్తుతం ప్రాజెక్ట్ కు లక్ష క్యూసెక్ ల వరద మాత్రమే వస్తోంది.. జూరాల పైన బీఆర్ఎస్ నాయకులు దొంగ ఏడుపులు ఆపాలన్నారు. 10 ఏళ్ల పాటు జూరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు దావత్ చేసుకోవడానికి వెళ్లి, జూరాల వద్ద షో చేశారు. ప్రాజెక్ట్ వద్ద అసలు మోటర్లే బిగించలేదు, పైగా కరెంటు బిల్లు వస్తుందన్న కారణంతో కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లు ప్రారంభించడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించడం  తగదన్నారు.

అసత్య ప్రచారం చేసిన ఒకరిపై కేసు నమోదు.

అసత్య ప్రచారం చేసిన ఒకరిపై కేసు నమోదు

నెన్నెల,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

నెన్నెల మండలంలో అసత్య ప్రచారం చేసిన ఒకరిపై కేసు నమోదు
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన బెల్లంపల్లి మండలం చాకెపల్లికి చెందిన దుర్గం రవిపై గురువారం కేసు నమోదు చేసినట్లు నెన్నెల ఎస్సై ప్రసాద్ శుక్రవారం తెలిపారు.ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడని నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన అత్తిని బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

మోడీ పాలనలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాలి.

మోడీ పాలనలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాలి

సిపిఎం జిల్లా నాయకులు ఈసంపెల్లి బాబు

నర్సంపేట నేటిధాత్రి:

 

కేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాలని
సిపిఎం జిల్లా నాయకులు ఈసంపెల్లి బాబు అన్నారు.ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా దుగ్గొండి మండలంలోని గిర్నిబావిలో నిర్వహించిన ఎమర్జెన్సీ వ్యతిరేక సదస్సు మండల కమిటీ సభ్యుడు అక్కపెల్లి సుధాకర్ అధ్యక్షతన జరిగింది.బాబు మాట్లాడుతూ 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను తుంగలో తొక్కి దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్ష పార్టీల నేతలను, కార్యకర్తలను నిర్బంధించి నెలల తరబడి జైల్లోపెట్టారని, ప్రధానంగా సిపిఎం నాయకులపై తీవ్రనిర్భందం ప్రయోగించారని అన్నారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు దేశంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేశాయని పోరాటాలకు తలొగ్గి 21 నెలల అమలులో ఉన్న ఎమర్జెన్సీనీ ఎత్తివేశారని అన్నారు.

గత 10 సంవత్సరాలుగా దేశంలో అధికారం లో ఉన్న మోడి ప్రభుత్వం ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాలరాశి, ప్రతిపక్ష పార్టీల నేతలను, కార్యకర్తలను జైల్లోపెడుతూ అప్రకటిత ఎమర్జెన్సీనీ దేశంలో అమలు చేస్తూ, దొంగేదొంగా దొంగా అన్నట్లు నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా ప్రకటనలు ఇవ్వడం మోడి దివాలాకోరుతనానికి నిదర్శనం అని పేర్కొన్నారు.నాటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడే నైతిక అర్హత మోడీకి లేదని అన్నారు. ప్రస్తుతం దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలుచేస్తున్న అప్రకటిత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలను పొరటాల్లోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఈ సదస్సులో మండల కార్యదర్శి బోళ్ళ సాంబయ్య, మండల కమిటి సభ్యులు పుచ్చకాయల నర్సింహ్మ రెడ్డి,కొంగర నర్సింహస్వామి,చల్ల నరసింహరెడ్డి,తాల్లపెల్లి రవి,నల్లగొండ మొగలి, పుచ్చకాయల మహేందర్ రెడ్డి,ఈసంపెల్లి మహేందర్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నర్సంపేట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో…

మోడీ పాలనలో అమలు అవుతున్న అప్రకటిత ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరబోయిన కుమార స్వామి పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్బంగా వ్యతిరేక దీనంగా సిపిఎం పట్టణ కమిటి సభ్యులు కామ్రేడ్ గడ్డమిది బాలకృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పార్టీ నాయకులు బుర్రి ఆంజనేయులు, అన్వర్,కందికొండ రాజు,కార్తీక్,అనీల్, ఫరీద,విజయ,స్వప్న,నాగమణి, రుదర్రపు లక్ష్మి ,శ్రీనివసరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నాయకుడి పైనా చర్యలు తీసుకోవాలి.

కాంగ్రెస్ నాయకుడి పైనా చర్యలు తీసుకోవాలి
బిఆర్ఎస్ నాయకుల డిమాండ్

మందమర్రి నేటి ధాత్రి:

 

మందమర్రి లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినా పాత్రికేయుల సమావేశం లో ఇటీవల పాత్రికేయుని పైన అనుచిత వాక్యాలు చేసిన కాంగ్రెస్ నాయకుడు పైడిమల్ల నర్సింగ్ బేషరతుగా క్షమాపణ లు చెప్పాలని బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జె. రవీందర్ ఆరోపించారు.ప్రజలకి రాజకీయ నాయకుల మధ్యలో వారధి గా వ్యవహరిస్తున విలేఖరులకి రక్షణ లేకుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. మందమర్రి లోని జర్నలిస్ట్ లు అందరూ కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం అన్నారు . పోలీస్ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది అధికారం లో ఉన్న నాయకుల కోసం కాకుండా ప్రజల గురించి వారి సమస్యల పైన విధులు నిర్వహించాలని కోరారు . ఇప్పటికైనా చెన్నూరు ఎమ్మెల్యే కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి వివేక్ స్పందించి తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిబిజికెస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ సీనియర్ నాయకులు ఓ.రాజశేఖర్,మద్ది శంకర్ ,ఎండీ అబ్బాస్, బండారి సూరిబాబు, మల్లేష్, తోట సురేందర్,కనకం రవీందర్, అందే శ్రీకాంత్,ఎం.డి ముస్తఫా ముల్కల్ల రమేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

జగన్‌పై కేసు.. వైసీపీ నేతలకు నోటీసులు.

జగన్‌పై కేసు.. వైసీపీ నేతలకు నోటీసులు

 

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మిర్చియార్డు పర్యటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

 

అలాగే పలువురు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు.

 

 

 

గుంటూరు, జూన్ 24: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) మరో కేసు నమోదు అయ్యింది.

జగన్ మిర్చి యార్డ్ పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ కీలక నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు.

గత ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం యార్డ్‌కు వెళ్లారు జగన్.

కానీ అనుమతి లేకుండా యార్డ్‌లోకి వచ్చి వైసీపీ నేతలు నానా హంగామా సృష్టించారు.

దీంతో జగన్‌తో పాటు పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫ్యాన్ పార్టీ నేతలకు 41 ఏ నోటీసులు అందజేస్తున్నారు.

మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు, అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి , అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు, కృష్ణా జిల్లాకు చెందిన కీలక నేతలు పేర్నినాని, కొడాలి నాని, తలశిల రఘురాంతో పాటు జగన్‌పై గతంలోనే నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లోనే కేసు నమోదు అయ్యింది.
ఇప్పుడు నాలుగు నెలల తర్వాత అందుబాటులో ఉన్న నేతలకు నోటీసులు జారీ చేశారు.
పిలిచినప్పుడు నల్లపాడు స్టేషన్‌కు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.

కాగా.. మిర్చి రైతులను పరామర్శించేందుకు గత ఫిబ్రవరి 19న గుంటూరులోని మిర్చియార్డుకు వచ్చారు వైఎస్ జగన్.

 

ఆ సమయంలో గుంటూరు – కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని పెద్ద సంఖ్యలో ర్యాలీలు, పరామర్శకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే చెప్పారు. అయినప్పటికీ…

 

జగన్, వైసీపీ నేతలతో కలిసి భారీగా మిర్చియార్డుకు వచ్చి నానా హంగామా సృష్టించారు.

మిర్చి బస్తాలను ధ్వంసం చేశారు.

అంతేకాకుండా కొన్ని మిర్చి బస్తాలను అపహరించారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలో నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫిబ్రవరి 19న తొమ్మిది మందిపై కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు..

వారికి నోటీసులు పంపిస్తున్నారు.

ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలని, తమకు చెప్పకుండా ఊరు వదిలి, దేశం వదిలి పోవొద్దని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

వైసీపీ నేతలకు నోటీసులు ఇస్తున్న పోలీసులు జగన్‌కు నోటీసులు ఇస్తారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది.

గతంలో నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో రఘురామకృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి జగన్‌పై కేసు నమోదు చేసి ఏడాది దాటింది.

ఇంత వరకు ఆయనకు నోటీసులు ఇవ్వలేదు.

ఇప్పుడు నాలుగు నెలల క్రితం మిర్చి యార్డులో ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించి యార్డులో హంగామా సృష్టించిన కేసులో వైసీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం మొదలు పెట్టారు.

మరి జగన్‌కు నోటీసులు ఇవ్వడంపై ఉత్కంఠ నెలకొంది.

జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి.

జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి
మల్లాపూర్ జూన్ 16 నేటి ధాత్రి:

 

shine junior college


ప్రశ్నించే గొంతును నొక్కడం సరికాదు ప్రెస్ క్లబ్ జిల్లా ఉపాధ్యక్షులు కనుక సంజీవ్
జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై అక్రమంగా పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహసిల్దార్ రమేష్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు.ప్రెస్ క్లబ్ జిల్లా ఉపాధ్యక్షులు కనుక సంజీవ్, మల్లాపూర్ ప్రెస్ క్లబ్ 143 అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ…జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘటనతో ఏటువంటి సంబంధంలేని జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటాన్ని జనంసాక్షి పత్రికలో కథనాలు ప్రచురిస్తే ఫ్యాక్టరీ యాజమాన్యం తప్పుడు ఫిర్యాదు ఇచ్చి, అక్రమంగా ఎడిటర్ పై కేసులు పెట్టారన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కటం ఏమిటని మీడియా సభ్యులు మండిపడ్డారు. తక్షణమే జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై పెట్టిన కేసును ఎత్తివేయాలని తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల ప్రెస్ క్లబ్ సభ్యులు తోకల పవన్, రుద్ర రాంప్రసాద్, చింతలూరి రంజిత్, తోట శేఖర్, మిడిదొడ్డి మల్లేష్, ఉడుగుల గంగాధర్, రాజేందర్, మోర సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version