ఫోటోగ్రాఫర్ కిరణ్ కు 5000 ఆర్థిక సహాయం.

ఫోటోగ్రాఫర్ కిరణ్ కు 5000 ఆర్థిక సహాయం

జిల్లా అధ్యక్షుడు రఘోత్తం రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

నూతన జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టగానే ఫోటో గ్రాఫర్ల సంక్షేమం కోసం పని చేస్తూ అందరి మన్ననలను పొందుతున్నాడు ఫోటోగ్రాఫర్ల సంఘం జిల్లా అధ్యక్షులు రఘోత్తం రెడ్డి మంగళవారం
రేగొండ మండలం కొడవటంచ గ్రామ ఫోటోగ్రాఫర్ సింగరి కిరణ్ ఇటీవల బైక్ పై నుండి కిందపడి కాలు ప్యాక్చర్ కావడం జరిగింది. విషయం తెలుసుకున్న నూతన జిల్లా అధ్యక్షులు బండ రగోతంరెడ్డి ఫోటోగ్రాఫర్కు ఆపుద వస్తే నేనున్నానని భరోసానిస్తూ 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ మండల అధ్యక్షులు జంబుల రఘు, ఫోటోగ్రాఫర్స్ జిల్లా కోశాధికారి ఎల్దండి రాకేష్, టేకుమట్ల మండల ఫోటోగ్రాఫర్స్ అధ్యక్షులు దాసారపు సదానందం, ప్రధాన కార్యదర్శి గుగులోతు రాజేందర్ నాయక్, కోశాధికారి బండి కమలాకర్,రేగొండ ఫోటోగ్రాఫర్స్ మోరే మొగిలి, మల్లె బోయిన స్వామి, సింగరి సతీష్, సామల సురేందర్ రెడ్డి, కోల రాజు,చుక్క ప్రశాంత్, పబ్బ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా నూతన కార్యవర్గం ఎన్నిక.

ఘనంగా నూతన కార్యవర్గం ఎన్నిక….

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ శాసన పరిధిలోని జల సంఘం మండలం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం వారు నూతన కార్యవర్గం ఏర్పరచారు. అందులో అధ్యక్షుడు దినకర్ కార్యదర్శి కృష్ణ క్యాషియర్ ప్రకాష్, ఇతర తదితర స్థానాల్లో నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు. అనంతరం వర్ధంతి నిర్వహించారు.

ఫోటో గ్రాఫర్ ను పరామర్శించిన చిలువేరు సమ్మి గౌడ్.

ఫోటో గ్రాఫర్ ను పరామర్శించిన చిలువేరు సమ్మి గౌడ్

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి:

కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ బండారు శీనుకు ఇటీవల పక్షవాతం వచ్చి వరంగల్ హాస్పిటల్ నుండి తిరిగి ఇంటికి చేరుకున్న విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి గురువారం పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు…అనంతరం వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, ఇకనుండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఫిజియోథెరపీ ద్వారా త్వరగా కోలుకుంటావని, ఇక నుండి అన్ని విధాల మా యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో చీకటి కిరణ్,బండారు గోపి పబ్బతి సారంగం, మోరపాక యాకయ్య, రేగుల వెంకటరమణ, ఎసల్ల సత్యనారాయణ, చాగంటి శ్రీను,కొండేటి కళాధర్,పబ్బతి ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version