బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన రానా దగ్గుబాటి

బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన రానా దగ్గుబాటి

 

తెలంగాణలో బెట్టింగ్ యాప్ కేసు ఇప్పుడు హాట్ టాపి‎క్‎గా మారింది. ఈ కేసులో వివిధ ప్రముఖులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో, తాజాగా టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఈడీ విచారణకు హాజరయ్యారు.

తెలంగాణలో బెట్టింగ్ యాప్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో తాజాగా టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. పలు రకాల ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు రానా ప్రమోట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్‌లను ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఫోకస్ చేసింది. మొత్తం 29 మందిపై ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేసింది. ఈ జాబితాలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి వంటి స్టార్లు ఉన్నారు

ఈడీ ముందుకు రానా

రానా ఈ రోజు ఈడీ అధికారుల ముందు హాజరై, తన గత ఐదేళ్ల బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను సమర్పించారు. జంగిల్ రమ్మీ అనే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన ఆరోపణలపై ఈడీ అధికారులు ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నారు. గతంలో రానాకు జూలై 23న విచారణకు రావాలని నోటీసులు వచ్చాయి.

కానీ షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఆయన రాలేకపోయారు. దీంతో ఈడీ మళ్లీ ఆగస్టు 11కి తాజా నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రానాతో పాటు, ప్రకాశ్ రాజ్ (జూలై 30), విజయ్ దేవరకొండ (ఆగస్టు 6) ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. మంచు లక్ష్మి ఆగస్టు 13న హాజరుకానుంది.

మనీ లాండరింగ్ కోణం

ఈడీ ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తోంది. బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు హవాలా ద్వారా డబ్బు తరలించారా? సెలబ్రిటీలకు రెమ్యునరేషన్ ఎలా చెల్లించారనే విషయాలపై ఈడీ లోతుగా విచారణ చేస్తోంది. పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈ విచారణ కొనసాగుతోంది. ఈ యాప్‌ల వల్ల అనేక మంది డబ్బు పోగొట్టుకోవడమే కాక, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పుడేం జరుగుతుంది?

తెలంగాణలోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్‌లపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ యాప్‌లు యువతకు ఆకట్టుకునేలా ఆఫర్స్ ఇచ్చి, వాటి మాయలో పడేలా చేస్తున్నాయి. దీంతో అనేక మంది వీటి బారిన పడి ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకుంటున్నారు. ఈ యాప్స్ మీద సరైన నియంత్రణ లేకపోవడం వల్ల మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ విచారణల నేపథ్యంలో త్వరలో ఈ కేసు గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.

జర్నలిస్ట్ రాజేందర్ పై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలి..

జర్నలిస్ట్ రాజేందర్ పై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలి

దళితుడని రాజేందర్ పై కుట్రలు

ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-02T124932.210.wav?_=1

పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లాలో ఇటీవల సీనియర్ జర్నలిస్టు దామెర రాజేందర్ పై ఐనవోలు పోలీసులు పెట్టిన తప్పుడు కేసును వెంటనే ఎత్తివేయాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ డిమాండ్ చేశారు.జర్నలిస్టు దామెర రాజేందర్ పై ఐనవోలు పోలీసులు బనాయించిన తప్పుడు కేసు పై మాట్లాడుతూ రాజేందర్ గతంలో దాదాపు పదేండ్లు వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా పనిచేశారని,ప్రస్తుతం సొంత పత్రికను నడుపుతున్నారని,ఐనవోలు తహశీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై రాజేం దర్ పత్రికలో వరుస కథనాలు ప్రచురించారని తెలిపారు.దీనిని మనసులో పెట్టుకున్న ఐనవోలు తహశీల్దార్ రాజేందర్ పై కుట్రపన్ని పథకం ప్రకారం యూట్యూబర్ సహాయంతో పోలీసులతో కుమ్ముక్కై కావాలని తప్పుడు కేసు నమోదు చేయించి జైలుకు పంపించారని ఆరోపించారు. నీతి,నిజాయితీతో వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం సరైంది కాదని అన్నారు.కావాలని ఒకరిద్దరు రాజేందర్ పై సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని,తప్పుడు ప్రచారాలు చేస్తున్న యూట్యూబర్ ను వదిలేసి ఏ తప్పు చేయని జర్నలిస్టు రాజేందర్ పోలీసులు అక్రమంగా కేసు బనాయించి వేధిస్తున్నారని అన్నారు.ఈ కుట్రపూరిత అక్రమ కేసు వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.జర్నలిస్టు రాజేందర్ పై పోలీసులు పెట్టిన కేసును ఉపసంహరింపజేయాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా ఐనవోలు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన భూములు,ప్లాట్ల అక్రమ రిజిస్ట్రేషన్ లపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.జర్నలిస్టులపై పోలీసులు పెట్టిన ఆ మ కేసులకు బాధ్యులైన ఐనవోలు తహశీల్దార్,ఎస్ ఐలను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్. చేశారు.ఈ విషయంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి జర్నలిస్టు దామెర రాజేందర్ పై అక్రమ కేసు తొలగించక పోతే మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేయాల్సి వస్తుందని మైస ఉపేందర్ మాదిగ హెచ్చరించారు.

బిగ్ బ్రేకింగ్………

 

బిగ్ బ్రేకింగ్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-30T115959.308.wav?_=2


“నేటిధాత్రి”, 

తెలంగాణ వ్యాప్తంగా ఈడీ దాడులు

గొర్రెల పంపిణీ కేసులో ఈడీ అధికారుల తనిఖీలు

హైదరాబాద్‌లో ఎనిమిది చోట్ల ఈడీ సోదాలు

రూ.700 కోట్ల వ్యవహారంలో ఈడీ తనిఖీలు

లోలోనా పేరుతో ప్రభుత్వ స్కీంను..స్కామ్‌గా మార్చిన మొయినుద్దీన్‌

మొయినుద్దీన్‌కు చెందిన లోలోనా కార్యాలయాల్లో సోదాలు

మొయినుద్దీన్‌, ఇక్రముద్దీన్‌ నివాసాల్లో ఈడీ సోదాలు

మాజీ డైరెక్టర్‌ రామచంద్రనాయక్..మాజీ మంత్రి ఓఎస్డీ కల్యాణ్‌ నివాసాల్లోనూ సోద

పిల్లలతో సహా తల్లి అదృశం, కేసు నమోదు చేసిన..

పిల్లలతో సహా తల్లి అదృశం, కేసు నమోదు చేసిన పోలీసులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

పిల్లలతో సహా తల్లి అదృశ్యం పై కేసు నమోదు చేసి నట్లు జహీరాబాద్ పట్టణ ఎస్సై కే వినయ్ కుమార్ తెలిపారు.ఈ కేసులో అమ్రేన్ బేగం (30)తో పాటు ఆమె పిల్లలు అలియా(9) మాహేర (7), ఆహిల్ (5) ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అమ్రేన్ తన భర్త మహమ్మద్ నూర్ ల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆ గొడవల కారణంగా తన పిల్లలతో పాటు రాంనగర్ లోని తన అన్న మహమ్మద్ హర్షద్ వద్దకు 20 రోజుల క్రితం వచ్చింది. గత 15వ తేదీ మధ్యాహ్నం కిరాణా షాప్ వె ళ్తానని చెప్పి తన ముగ్గురు పిల్లలతో సహా ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఇప్పటివరకు తిరిగి రాలేదని ఆమె అన్న హర్షద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ.కే.వినయ్ కుమార తెలిపారు.

అడవిని దున్నుతున్న ఒకరిపై కేసు నమోదు.

అడవిని దున్నుతున్న ఒకరిపై కేసు నమోదు

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి రేంజి పరిధిలోని బొమ్మెన 143 కంపార్ట్మెంట్ అడవిలో చామనపల్లికి చెందిన ధూపం కుమార్ ట్రాక్టర్ తో అడవిని దున్నతుండగా తమ సిబ్బంది పట్టుకున్నట్లు అటవీ రేంజ్ అధికారి హఫీజ్ ఖాన్ శనివారం తెలిపారు. ట్రాక్టర్ ను సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అటవీ భూమిని దున్నితే చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

వ్యక్తిపై దాడి కేసులో నిందితుని అరెస్టు..

వ్యక్తిపై దాడి కేసులో నిందితుని అరెస్టు.. రిమాండ్ కు తరలింపు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-24.wav?_=3

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉద్దేశపూర్వకంగా వ్యక్తిపై దాడి చేసిన కేసులో నిందితున్ని అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు జహీరాబాద్ పట్టణ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని మహేంద్ర కాలనీకి చెందిన కొత్తగోళ్ల హర్షవర్ధన్ తండ్రి శివకుమార్ శాంతినగర్ కు చెందిన పాలింకర్ కమల్ కుమార్ పై పాత కక్షలు మనసులో పెట్టుకొని బుధవారం రాత్రి బీరు సీసా తో కమల్ మెడపై, నడుంపై పొడిచి పారిపోయాడన్నారు.

ఎరువుల డీలర్ పై కేసు నమోదు.

ఎరువుల డీలర్ పై కేసు నమోదు.

#6 ఏ కేసు నమోదు చేసి యూరియా నిలువల అమ్మకాలు నిలిపివేశారు.

#యూరియా కొరతను డీలర్లు సృష్టిస్తే పీడీ యాక్ట్ తప్పదు.

#ఏడిఏ దామోదర్ రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

యూరియాను కృతిమ కొరత సృష్టిస్తే సంబంధిత డీలర్ పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి డీలర్ లైసెన్సులను రద్దు చేయడం జరుగుతుందని నర్సంపేట ఏ డి ఏ దామోదర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేపట్టారు. ఆదివారం రాత్రి యూరియా కోసం మండలంలోని బిల్లా నాయక్ తండా చెందిన రైతులు యూరియా కోసం మండల కేంద్రంలోని కర్ర మల్లారెడ్డి ఫర్టిలైజర్ షాపు వెళ్ళగా యూరియా నిలువలు ఉండంగా లేదని దురుసుగా రైతులపై మాట్లాడడంతో సదరు డీలర్ గోదాం దగ్గరికి వెళ్లి పెట్రోల్ బాటిల్ తీసుకొని ఆత్మహత్య ప్రయత్నానికి ప్రయత్నించగా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని రైతులను శాంత పరిచి సమాధానం చెప్పడంతో రైతులు శాంతించగా.

Fertilizer Dealer.

ఈ సంఘటన రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా సంచలనం కాగా అధికారులు స్పందించి కర్ర కృష్ణారెడ్డి డీలర్ల వద్ద ఉన్న ఎరువుల నిలువలపై స్టాక్ రిజిస్టర్ను పరిశీలించి 1000 బస్తాలు ఉండడంతో అట్టి యూరియా నిలువలను అధికారులకు సమాచారం ఇవ్వకుండా అమ్మరాదని సదర్ డీలర్ కర్ర కృష్ణారెడ్డిని హెచ్చరించారు. అనంతరం ఆయనపై 6 ఏ కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అలాగే మండలంలోని ఏ డీలర్ కూడా యూరియాకు లింకు పెట్టి అమ్మితే చట్ట రిత్యా చర్య తీసుకొని సంబంధిత డీలర్ లైసెన్సును రద్దు చేయబడుతుందని ఆయన పలువురు డీలర్లకు సూచించారు. ఆయన వెంట ఏవో బన్న రజిత, ఏ ఈ ఓ శ్రీకాంత్ రెడ్డి, రైతులు తదితరులు ఉన్నారు.

అసత్య ప్రచారం చేసిన ఒకరిపై కేసు నమోదు.

అసత్య ప్రచారం చేసిన ఒకరిపై కేసు నమోదు

నెన్నెల,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

నెన్నెల మండలంలో అసత్య ప్రచారం చేసిన ఒకరిపై కేసు నమోదు
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన బెల్లంపల్లి మండలం చాకెపల్లికి చెందిన దుర్గం రవిపై గురువారం కేసు నమోదు చేసినట్లు నెన్నెల ఎస్సై ప్రసాద్ శుక్రవారం తెలిపారు.ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడని నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన అత్తిని బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

జగన్‌పై కేసు.. వైసీపీ నేతలకు నోటీసులు.

జగన్‌పై కేసు.. వైసీపీ నేతలకు నోటీసులు

 

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మిర్చియార్డు పర్యటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

 

అలాగే పలువురు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు.

 

 

 

గుంటూరు, జూన్ 24: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) మరో కేసు నమోదు అయ్యింది.

జగన్ మిర్చి యార్డ్ పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ కీలక నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు.

గత ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం యార్డ్‌కు వెళ్లారు జగన్.

కానీ అనుమతి లేకుండా యార్డ్‌లోకి వచ్చి వైసీపీ నేతలు నానా హంగామా సృష్టించారు.

దీంతో జగన్‌తో పాటు పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫ్యాన్ పార్టీ నేతలకు 41 ఏ నోటీసులు అందజేస్తున్నారు.

మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు, అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి , అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు, కృష్ణా జిల్లాకు చెందిన కీలక నేతలు పేర్నినాని, కొడాలి నాని, తలశిల రఘురాంతో పాటు జగన్‌పై గతంలోనే నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లోనే కేసు నమోదు అయ్యింది.
ఇప్పుడు నాలుగు నెలల తర్వాత అందుబాటులో ఉన్న నేతలకు నోటీసులు జారీ చేశారు.
పిలిచినప్పుడు నల్లపాడు స్టేషన్‌కు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.

కాగా.. మిర్చి రైతులను పరామర్శించేందుకు గత ఫిబ్రవరి 19న గుంటూరులోని మిర్చియార్డుకు వచ్చారు వైఎస్ జగన్.

 

ఆ సమయంలో గుంటూరు – కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని పెద్ద సంఖ్యలో ర్యాలీలు, పరామర్శకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే చెప్పారు. అయినప్పటికీ…

 

జగన్, వైసీపీ నేతలతో కలిసి భారీగా మిర్చియార్డుకు వచ్చి నానా హంగామా సృష్టించారు.

మిర్చి బస్తాలను ధ్వంసం చేశారు.

అంతేకాకుండా కొన్ని మిర్చి బస్తాలను అపహరించారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలో నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫిబ్రవరి 19న తొమ్మిది మందిపై కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు..

వారికి నోటీసులు పంపిస్తున్నారు.

ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలని, తమకు చెప్పకుండా ఊరు వదిలి, దేశం వదిలి పోవొద్దని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

వైసీపీ నేతలకు నోటీసులు ఇస్తున్న పోలీసులు జగన్‌కు నోటీసులు ఇస్తారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది.

గతంలో నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో రఘురామకృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి జగన్‌పై కేసు నమోదు చేసి ఏడాది దాటింది.

ఇంత వరకు ఆయనకు నోటీసులు ఇవ్వలేదు.

ఇప్పుడు నాలుగు నెలల క్రితం మిర్చి యార్డులో ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించి యార్డులో హంగామా సృష్టించిన కేసులో వైసీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం మొదలు పెట్టారు.

మరి జగన్‌కు నోటీసులు ఇవ్వడంపై ఉత్కంఠ నెలకొంది.

అటవీ అధికారుల పై అట్రాసిటీ కేసు నమోదుకు కలెక్టర్.

అటవీ అధికారుల పై అట్రాసిటీ కేసు నమోదుకు కలెక్టర్ ఆదేశం.

రైతులపై అక్రమ కేసుల నమోదుకు నిరసనగా ధర్నా

పోలీస్ అధికారులకు వెంటనే ఫోన్లో ఆదేశం

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి.

బెల్లంపల్లి నేటిధాత్రి:

వేమనపల్లి మండలంలోని చామనపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులపై అటవీశాఖ అధికారులు అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపడాన్ని తీవ్రంగా పరిగణించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అటవీశాఖ అధికారుల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ రోజు న్యాయవాది, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు రైతులకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేశారు. గత యాభై సంవత్సరాల నుండి రైతులు చామనపల్లి శివారులోనీ సర్వే నెంబర్ 65, 67 లో సాగు చేస్తున్నారని అన్నారు. ఆ భూముల్లో విద్యుత్ మోటార్లు, స్తంభాలు, బోర్లు వేసుకొని వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం పట్టా పాసు పుస్తకాలు ఇచ్చిందని, లోన్లు, రుణమాఫీ చేసిందని అన్నారు. 1997లోనే ఫైనల్ పట్టా ఇచ్చిందని తెలిపారు. గత సంవత్సరం నుండి అటవీశాఖ అధికారులు ఈ భూములు అటవీ శాఖ కు చెందినవని రైతులపై దాడులు చేస్తూ, అక్రమంగా కేసులు నమోదు చేసి రైతులను జైలుకు పంపించారని తెలిపారు. అటవీశాఖ అధికారుల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే జైపూర్ ఏసీపికి, నీల్వాయి ఎస్ఐ కి పోన్ చేసి అటవీశాఖ అధికారుల పై కేసు నమోదు చేసి జైలుకు పంపాలని ఆదేశించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో నీల్వాయి పోలీస్ స్టేషన్ లో రైతులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు మున్నరాజ సిసోడియా, బిజెపి జిల్లా నాయకులు దుర్గం ఎల్లయ్య, రైతులు బానయ్యా, లింగయ్య, పర్వతాలు, మధుకర్, బాధిత రైతులు పాల్గొన్నారు.

కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు.

కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు
హైకోర్టును ఆశ్రయించిన కౌశిక్ రెడ్డి
ఈనెల 28 వరకు అరెస్టు వద్దని ఆదేశించిన హైకోర్టు
జమ్మికుంట: నేటిధాత్రి

 

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై 21వ తారీకు రోజు కమలాపూర్ మండలం గుండేడు క్వారీ యజమాని అయిన కట్ట మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి హనుమకొండ పోలీస్ స్టేషన్లో నా భర్తను డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు 50 లక్షలు కావాలని వేధిస్తున్నాడని మానసికంగా కృంగిపోతున్నాడని మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి ఫిర్యాదు చేయగా దానిపై కేసు నమోదయింది అది అలా ఉండగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి వాదన ఏమనగా గతంలో క్వారీ చుట్టూ ప్రక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు దానివల్ల నష్టం జరుగుతుంది కనుక మా ఊరికి ఏదైనా ఒక అభివృద్ధి చేయాలని చెప్పడం వల్ల అప్పుడు 25 లక్షలు ఒప్పుకున్నాడు 15లక్షలు ఇచ్చాడు ఇంకా మిగతా 10 లక్షల రూపాయలు ఇవ్వలేదని నాకు గ్రామస్తులు నా దగ్గరికి రావడం వల్ల ఫోన్ చేసి ఇవ్వాలని చెప్పాను దాని విషయంపై నాపై నేనే వసూలు చేస్తున్న నేనే అడుగుతున్నాను నేనే ఒత్తిడి చేస్తున్న అని దురుద్దేశంతో బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభ 27వ తారీకు ఉంది ఆ సభకు నేను ఉండకూడదని ప్రత్యర్థులు ఆలోచించి నాపై అక్రమ కేసును బనాయించి నన్ను అరెస్టు చేసి ఉండకుండా నేను సభలో ఉంటే ఆ సభకు పూర్తిస్థాయిలో జనాన్ని సమీకరిస్తా సక్సెస్ అవుతది కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి లేకుంటా ఉంటే ఈ సభ నీరుగారిపోతుంది అనేటువంటి ఉద్దేశంగా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టే ఆ సభను ఆపడానికి ఆ సభను విజయవంతంగా జరగకుండా ఉండడానికి ఎన్నో రకాల పాచికలు రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ రైతుల అనుమతి లేకుండా రైతుల భూములను స్వాధీన పరచుకొని మీటింగ్ పెడుతున్నారు కొన్ని కాలువలు మొరంతో కూడిపినారని కూడా ఆరోపణ చేసినారు నన్ను అరెస్టు చేసి నేను ఉండకుండా చేస్తే ప్రభావం తగ్గుతది అనేటువంటి ఉద్దేశంతో దేశ పూర్వకంగా తప్పుడు కేసు పెట్టారు దానిపై నేను హైకోర్టును సంప్రదించగా ఈరోజు నాకు స్టే వచ్చింది నా ప్రజల వైపున కొట్లాడుతున్న భగవంతుని ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కనుకనే న్యాయం గెలిచింది న్యాయ పరంగానే నేను వెళ్తా న్యాయ పరంగానే నాకు స్టే వచ్చింది ఎవరు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు సభను ఆపాలన్న ఆగదు ఎందుకంటే ప్రజల మద్దతు ఉంది ప్రజల యొక్క సంఘీభావంతో ఆ సభ జరుగుతుంది కనుక సభ విజయవంతం అయితది కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఈ సభతో ని   తెలుస్తది.

జాన్ పాకలో ఎక్సైజ్ దాడులు,ఇద్దరిపై కేసు నమోదు.

జాన్ పాకలో ఎక్సైజ్ దాడులు,ఇద్దరిపై కేసు నమోదు.  

పరకాల నేటిధాత్రి

గుడుంబా నిర్ములన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శనివారంరోజున పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని జాన్ పాక శివారులో దాడులు నిర్వహించారు.గుడుంబా తయారీ కోసం నిల్వ ఉంచిన 500 లీటర్ల షుగర్ పానకం ను ధ్వంసం చేసి,5 లీటర్ల గుడుంబా,25 కేజీల షుగర్ ను స్వాధీనం చేసుకొని బాదావత్ శ్రీను,బానోత్ సురేష్ ల పై కేసు నమోదు చేసినట్టు సీఐ తాతజీ తెలిపారు.ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్ఐ వై.జ్యోతి
సిబ్బంది లక్ష్మణ చారి,రవీందర్,సమ్మయ్య,విజయ్ కుమార్ పాల్గొన్నారు.

హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీ పై కేసులు.

హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీ పై కేసులు వెంటనే ఎత్తివేయాలని నిరసన

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలో కూడలి వద్ద హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని నిరసనగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందులో నంబర్ వన్ గా సోనియాగాంధీ,నెంబర్ టు గా రాహుల్ గాంధీ పేర్లు ప్రస్తావించింది మరోవైపు ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది.దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయా త్రకు ప్రజల నుండి వస్తున్న ఆదరణతో నరేంద్ర మోడీ గుండెల్లో రైళ్లు పరిగెడుతు న్నాయి.రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు.

 

Congress

సోనియా గాంధీ రాహుల్ గాంధీ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్రమంగా పెట్టించిన హెరాల్డ్ కేసులను వెంటనే ఎత్తివేయా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, బాసని చంద్రప్రకాష్ మార్కండేయ, చిందం రవి, మారేపల్లి రవీందర్, కట్టయ్య, రాజేందర్ మోత్కూరు భాస్కర్, చింతల రవిపాల్, పోలపెల్లి శ్రీనివాసరెడ్డి, ఎండి రఫీ, బాసని శాంత- రవి, అన్ని గ్రామాల కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మహిళ మృతి కేసు నిందితుడు అరెస్ట్….

మహిళ మృతి కేసు నిందితుడు అరెస్ట్….

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ లో మహిళను హత్య చేసిన నిందితుడు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో పత్రిక ప్రకటన లో డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. సత్యారం రమేశ్ అనే వ్యక్తి చిలమామిడి గ్రామానికి చెందిన మ్యాతరి లక్ష్మితో సహజీవనంచేస్తున్నాడు. అయితే, అతని ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో లక్ష్మి అతనికి దూరమైంది. కోపోద్రిక్తుడైన రమేశ్, తొలుత ఆమెపై పెట్రోల్ పోసి దాడి చేయడానికి ప్రయత్నించగా, స్థానికుల కారణంగా అది విఫలమైంది. తర్వాత, ఆమె ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకొని, ఖాళీ గ్యాస్ సిలిండర్తో తలపై కొట్టి ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతురాలి సెల్ఫోన్ తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. జహీరాబాద్ బస్టాండ్ వద్ద హైదరాబాద్కు పారిపోడానికి ప్రయత్నిస్తుండగా, పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నిందితుడిని త్వరగా పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, సమర్థవంతంగా చర్యలు తీసుకుని అతడిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచామని తెలిపారు. ఈ ఆపరేషన్ పాల్గొన్న పోలీసు అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం, ఎస్పై కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు.

వ్యక్తులు కనిపించడం లేదనే ఫిర్యాదులపై కేసు నమోదు చేసిన పోలీసులు.

 

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

ఇద్దరు వేర్వేరు వ్యక్తులు కనిపించడం లేదని కచ్చిన పిర్యాదులపై కేసు నమోదు చేసినట్లు జహీరాబాద్ పట్టణ ఎస్సై ఎం. కాఠినార్ యాకర్ తెలిపారు.

ఇంటి నుండి వెళ్లిన భర్త తిరిగి రాలేదని, ఆచూకీ కనుక్కోవాలని మహిళ పిర్యాదు చేసిందని ఎప్ని యం. కాశీనాధ్ యాదవ్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా బహీరా బాద్ పట్టణం రాంనగర్ నివాసి అయిన హాసిల్యాండ్ మోసిన్ (19), ఆటో డ్రైవర్ ఈ నెల 17న ఉదయం 10 గంటల సమయంలో టీన్ 157637 సంబరు గం లో తీసుకుని అద్దెలో హైదరాబాద్ వెళ్ళాడు.

హైదరాబాద్ కి ఆర్థిలో వెళ్లిన తన భర్త ఇంత వరకు ఇంటికి రాలేదని పాసిల్యాండ్ మోసిన భార్య పాస్ బ్యాండ్ సహారా పాలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది.

పిర్యాదు తీసుకున్న ఎసీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.కూతురు కనిపించడం లేదని తల్లి పిర్యాదు తన రెండవ కూతుడు రాథోడ్ ని రుషా (24) కనిపించ డం లేదని తల్లి రాథోడ్ కవిత భర్త విక్కి బహీరాబాద్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసింది.

జహీరాబాద్ పట్టణం రాంనగర్ లో తాము నివాసం ఉండే ఇంటి నుండి ఈ.నెల 14వతేదీ ఉదయం 10 గంటల 300 మిషముల సమయంలోబయటికి వెళ్లి తిరిగినాలేనని పిర్యాదులో పిర్యాదురాలు పేర్కొన్నది.

కవిత ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుసున్నట్లు జహీరాబాద్ పట్టణ ఎస్ఐ యం కాశీనాధ్ తెలిపాడు.

రాజలింగమూర్తి హత్య కేసులో ప్రధాన నిందితుడు.!

రాజలింగమూర్తి హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిబాబు సహా మరో ఇద్దరు అరెస్ట్

భూపాలపల్లి నేటిధాత్రి:

గత నెల భూపాలపల్లి పట్టణంలో జరిగిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో ప్రధాన నిందితుడైన కొత్త హరిబాబు ఖాసింపల్లి , భూపాలపల్లి అను అతనిని భూపాలపల్లి పోలీసులు అరెస్టు చేశారు. హరిబాబు పారిపోవడానికి సహకరించిన ములుగు జిల్లాకి చెందిన వట్టే రమణయ్య రమ అనే ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినారు. ఈ అరెస్ట్ నిమిత్తమై మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఢిల్లీ, జైపూర్ ,ఆగ్రా తదితర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి చివరికి నిందితుని ఆచూకీ తెలుసుకొని పోలీసులు అరెస్టు చేశారు.
ఇప్పటికే అరెస్టు అయిన నిందితులను మరల పోలీస్ కస్టడీ తీసుకొని పూర్తిస్థాయిలో విచారించి తదుపరి చర్య తీసుకోబడునని భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ ఎస్సై సాంబమూర్తి తెలిపారు

బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యక్తల పై కేసు నమోదు.

బి. ఆర్. ఎస్ పార్టీ నాయకులు, కార్యక్తల పై కేసు నమోదు

– అనుమతి లేకుండా ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం,ధర్నా
సిరిసిల్ల (నేటి ధాత్రి):

సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసి ధర్నాచేసిన బి. ఆర్. ఎస్ పార్టీ నాయకులు, కార్యక్తల పై కేసు నమోదు చేసారని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే. కృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఈ సందర్భంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే. కృష్ణ మాట్లాడుతూ తేది 13-03-2025 రోజున అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని శాసనసభ సమావేశాలకు సస్పెండ్ చేసినదానికి భేషరతుగా జగదీశ్వర్ రెడ్డి పైన వేసిన సస్పెన్షన్ వేటును వెంటనే ఉపసంహరించుకోవాలని, శుక్రవారం సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఎలాంటి అనుమతి లేకుండా వాహన దారులను అడ్డుకొని వారికి ఇబ్బంది కల్గించి ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసి ధర్నా చేసిన బి. ఆర్. ఎస్ పార్టీ నాయకులు, కార్యక్తల పై కేసు నమోదు చేసినట్లు తెలిపినారు.

వ్యక్తి అదృశ్యం పై కేసు నమోదు.

వ్యక్తి అదృశ్యం పై కేసు నమోదు

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ మండల పరిధిలోని అల్గోల్ గ్రామానికి చెందిన ఏర్పుల రాజు వయస్సు 40 సంవత్సరలు అనే వ్యక్తి అదృశ్యమైనట్లు జహీరాబాద్ పట్టణ ఎస్సై ఎం. కాశీనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్గోల్ గ్రామానికి చెందిన ఏర్పుల పద్మ చర్చికి వెళ్లే ముందు భర్తతో పాటు తన కూతురు ఇంట్లోనే ఉందని ఆయన తెలిపారు ఎప్పటిలాగే సాయంత్రం ఇంటికి వచ్చిన ఏర్పుల పద్మ చూసేసరికి భర్త లేకపోవడంతో చుట్టుపక్కల వారిని అడగగా వారి నుంచి కూడా కనిపించలేదని సమాధానం వచ్చిందని ఆయన తెలిపారు. రాజు భార్య ఏర్పుల పద్మ జహీరాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.కాశీనాథ్ తెలిపారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదుగురుపై కేసు నమోదు.!

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదుగురుపై కేసు నమోదు చేసిన పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం గుంపుల భారత్ పెట్రోలియం బంక్ పక్కనగల రైస్ మిల్లు స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను నిల్వ చేసి హైదరాబాద్ కు తరలించడానికి లోడ్ చేస్తుండగా పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ కంటైనర్ లారీని మరియు లోడర్ని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ నిల్వ చేసిన దాదాపు 20 ట్రాక్టర్ల ఇసుక గూర్చి ఓదెల తాసిల్దార్ కు సమాచారం ఇవ్వడం జరిగిందని నేరస్తులైన పెద్దిరెడ్డి జనార్దన్ రెడ్డి, మణిదీప్, పొన్నగంటి సురేష్, కోర్రి భాస్కర్, రాజన్ కుమార్ లు ఉనుకమరియు ఇసుక ను కలిపి కంటైనర్ లో తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు.ఇసుకను అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిలువచేసి హైదరాబాదుకు తరలించడానికి సిద్దం చేస్తున్న నేరస్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను నిలువ చేసిన, తరలించిన చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకోబడును అని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

డాక్టర్ పై హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్..

డాక్టర్ పై హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్

అక్రమ సంబంధమే దాడికి కారణమని తేల్చిన పోలీసులు

ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన ఖిలాడి భార్య

భార్యే ప్రధాన నిందితురాలు, ప్రియుడు సామ్యూల్ తో కలిసి భర్తను లేపేసేందుకు పన్నాగం పన్నిన భార్య. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సహకారం

కొంపముంచిన జిమ్ ట్రైనింగ్.., జిమ్ లో సుమంత్ భార్య ఫ్లోరా, జిమ్ ట్రైనర్ సామ్యూల్ ల ప్రేమాయణం

ఫిబ్రవరి 20న వరంగల్ భట్టుపల్లి రోడ్డులో వెళ్తున్న కారును అడ్డగించి, సుమంత్ పై ఐరన్ రాడ్లతో దాడి చేసిన దుండగులు

నేటిధాత్రి వరంగల్.

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన భార్య, వారికి సహకరించిన ప్రియుడి స్నేహితుడు రాజ్ కుమార్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్. భట్టుపల్లి రోడ్డులో డాక్టర్ పై దాడి సంచలనం కలిగించిన కేసులో, వారం రోజుల్లోనే చేదించిన మిల్స్ కాలనీ పోలీసులు. వరంగల్ లో యువ వైద్యుడు డాక్టర్ సుమంత్ రెడ్డిపై ఇటీవల జరిగిన హత్యాయత్నం ఘటనలో నిందితులను అరెస్టు చేశారు వరంగల్ మిల్స్ కాలని పోలీసులు. డాక్టర్ పై దాడి ఘటనలో సెన్సేషనల్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో అక్రమ సంబంధమే డాక్టర్ ప్రాణాలను తీయాలని వేసిన పన్నాగం బయటపడింది. కట్టుకున్న భార్యే సుమంత్ రెడ్డి మర్డర్ కోసం ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా తన ప్రియుడు సామ్యూల్ తో కలిసి భర్తను అడ్డు తొలగించుకునేందుకు స్కెచ్ వేయగా, దీనికి ఏఆర్ కానిస్టేబుల్ రాజు సహకరించినట్లు పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ముగ్గురు నిందితులను ఆరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు మిల్స్ కాలని పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ భార్య పెట్టుకున్న అక్రమ సంబంధం కారణంగా ఈ దాడి జరిగినట్లు తెలిపారు.

అసలేం జరిగింది?

crime

 

ఫిబ్రవరి 20న వరంగల్ బట్టుపల్లి ప్రధాన రహదారిపై దాక్టర్ సుమంత్ పై దాడి జరిగింది. కారులో వెళ్తున్న డాక్టర్ సుమంత్ రెడ్డి కారుకు గుర్తు తెలియని వ్యక్తులు కారుకు అడ్డు వచ్చి.. కారును ఆపారు. ఆయనను కారులో నుంచి కిందకు లాగి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని స్థానికుల సహాయంతో కొన ఊపిరితో ఉన్న బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి చంపడానికి ప్రయత్నించినారని బాధితుడి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మిల్స్ కాలని పోలీసులు. దాడికి పాల్పడిన వారు ఎవరు.? వైద్యుడు సిద్దార్థ్ ను ఎందుకు చంపాలనుకున్నారు? వ్యక్తిగత కక్ష్యలు ఏమైనా ఉన్నాయా? లేక గంజాయి బ్యాచ్ ఏమైనా డాక్టర్ పై దాడికి పాల్పడిందా అన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేశారు. అయితే.. ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన ఖిలాడి భార్య

హంటర్ రోడ్డులో నివాసం ఉంటున్న డాక్టర్ సుమంత్ రెడ్డి కి, వరంగల్ షిరిడీ సాయి నగర్ కి చెందిన ఫ్లోరా మరియా అను ఆమెతో 2016 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత 2018 సంవత్సరంలో సంగారెడ్డిలో డాక్టర్ సుమంత్ రెడ్డి బందువుల విద్యాసంస్థలు ఉండగా, వాటిని చూసుకోవడం కోసం భార్య భర్త లు సంగారెడ్డి కి షిఫ్ట్ అయితారు. అక్కడ డాక్టర్ సుమంత్ రెడ్డి సంగారెడ్డి పి.ఎచ్.సి లో, కాంట్రాక్టు పద్ధతిన మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తుండగా, తన భార్య ఫ్లోరా మరియా వారి బంధువుల స్కూల్లో టీచర్ గా పనిచేస్తుండేది.

కొంపముంచిన జిమ్ ట్రైనింగ్.., జిమ్ లో సుమంత్ భార్య ఫ్లోరా, జిమ్ ట్రైనర్ సామ్యూల్ ల ప్రేమాయణం

ఫ్లోరా బరువు తగ్గడానికి సంగారెడ్డి లోని సిద్దు జిమ్ సెంటర్ కి వెళ్తుండేది. ఆ జిమ్ సెంటర్లో కోచ్ గా పని చేస్తున్న ఏర్రోల్ల శామ్యూల్ అనే అతనితో పరిచయం ఏర్పడుతుంది. జిమ్ ట్రైనింగ్ పేరిట అయినా పరిచయం కాస్త వారిద్దరి మధ్య అక్రమ సంబంధంనకు దారితీసింది. వీరి అక్రమ సంబంధం గురించి డాక్టర్ సుమంత్ రెడ్డికి తెలవగానే, భార్యా భర్తలకు గొడవలు జరిగాయి. ఈ గొడవల వలన డాక్టర్ సుమంత్ రెడ్డి అక్కడి నుండి తన ఫ్యామిలీని వరంగల్ కి షిఫ్ట్ చేసినారు. తరువాత 2019 సంవత్సరంలో సదరు ఫ్లోరా మరియా, ప్రభుత్వ లెక్చరర్ ఉద్యోగం పొంది, జనగాం జిల్లాలోని పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం చేసుకుంటూ అక్కడ వుండేవారు. తర్వాత ఆ కాలేజ్ వరంగల్ లోని రంగశాయిపేట్ కు మారడంతో, డాక్టర్ సుమంత్ రెడ్డి కూడా వరంగల్ లోని వాసవి కాలనీలో ఉంటూ, కాజీపేటలో ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకుంటూ, ఉదయం వెళ్లి రాత్రి తన ఇంటికి వస్తుండేవాడు. సదరు ఫ్లోరా మరియా మాత్రం సంగారెడ్డిలో పరిచయమై వివాహేతర సంబంధం పెట్టుకున్న శామ్యూల్ తో తరచుగా ఫోన్లు మాట్లాడడం, వీడియో కాల్స్ మాట్లాడడం, డాక్టర్ సుమంత్ రెడ్డి లేని సమయంలో సదరు శామ్యూల్ నీ ఇంటికి పిలిపించుకొని అతనితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అది తెలుసుకున్న డాక్టర్ సుమంత్ రెడ్డి ఆమెను మందలించేవారు. ఈ విషయంలో వారిద్దరికీ తరుచుగా గొడవలు జరుగుతుండేవి. దానితో సదరు ఫ్లోరా మరియా, ప్రియుడు శామ్యూల్ లు కలిసి, డాక్టర్ సుమంత్ రెడ్డిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. తరువాత శామ్యూల్ ఈ విషయాన్ని తన స్నేహితుడైన రాజ్ కుమార్ అనే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కి తమ మర్డర్ ప్లాన్ విషయం చెప్పి, డాక్టర్ సుమంత్ రెడ్డి హత్య కి సహకరిస్తే నీకు సంగారెడ్డిలో ఇంటిని నిర్మించి ఇస్తానని చెప్తాడు. దానికి సదరు ఆ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ ఒప్పుకొన్నాడు. తరువాత అందాదా 15 రోజుల క్రితం ఒక్క లక్ష రూపాయలు ఫ్లోరా మరియా, తన ప్రియుడు శామ్యూల్ కి ట్రాన్స్ఫర్ చెయ్యగా, అందులో నుండి ఖర్చులకు 50వేల రూపాయలు శామ్యూల్ తీసుకోని, మిగిలిన 50 వేల రూపాయలు హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ కి ఇస్తాడు.

crime

 

భట్టుపల్లి రోడ్డులో మర్డర్ ప్లాన్

నిందితులు వారి మర్డర్ ప్లాన్ లో భాగంగా తేదీ20.02.2025 రోజున మధ్యాహ్నం సంగారెడ్డిలో ఒక సుత్తిని కొనుగోలు చేసి, హెడ్ కానిస్టేబుల్ రాజకుమార్ యొక్క రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్ పై బయలుదేరి, కాజీపేటకు వచ్చి ముందుగా వారు అనుకున్న ప్రకారం, డాక్టర్ సుమంత్ రెడ్డిని సీసీ కెమెరాలు, జనసంచారం లేని చీకటి ప్రదేశాన్ని ఎంచుకొని, రెక్కీ చేసుకుని వాళ్లు అనుకున్న పథకం ప్రకారం డాక్టర్ సుమంత్ రెడ్డి రాత్రి వేళ, తన క్లినిక్ ముగించుకొని కారులో బట్టుపల్లి రోడ్డు నుండి రంగాశాయపేట కు, వెళ్తున్న క్రమంలో తన వెనుక ఫాలో అయ్యి బట్టుపల్లి శివారులో ఎస్ఆర్ స్కూల్ దాటిన తరువాత ఉన్న, చిన్న బ్రిడ్జి వద్ద డాక్టర్ తన కారు వేగాన్ని తగ్గించగా, అట్టి చీకటి ప్రదేశంలో అదే అదునుగా భావించిన శామ్యూల్ తనతో తెచుకున్న సుత్తితో కారు వెనుక ఇండికేటర్ ను కొడుతాడు. ఆ శబ్దానికి డాక్టర్ సుమంత్ రెడ్డి తన కారును పక్కకు ఆపి ఇండికేటర్ వద్దకు వచ్చి చూస్తుండగా, శామ్యూల్ అతని స్నేహితడు రాజ్ కుమార్ లు, సదరు డాక్టర్ సుమంత్ రెడ్డిని విచక్షణారహితంగా కొట్టి, గాయపర్చి, అతడు చనిపోయాడు అని భావించి అక్కడి నుండి వారు పారిపోతారు.

వారం రోజుల్లో కేసును ఛేదించిన వరంగల్ పోలీసులు

బాధితుడి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఈ కేసును వరంగల్ ఏసిపి నంది రామ్ ఆధ్వర్యంలో, మిల్స్ కాలనీ సిఐ వెంకటరత్నం, టాస్క్ ఫోర్స్ సీఐ రంజిత్ కుమార్, మిల్స్ కాలనీ ఎస్సై సురేష్, కానిస్టేబుల్ లు బావ్ సింగ్, చంద్రశేఖర్, వెంకన్న, రాజు, జెలెందర్, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ఎండి గౌస్, సల్మాన్ ఐటీ కోర్ టీం కానిస్టేబుల్ నగేష్ లు నిందితుల కోసం ప్రత్యక బృందాలుగా ఏర్పడి, సంచలనం సృష్టించిన కేసులోని నిందితులైన సంగారెడ్డి కి చెందిన ఏర్రోల్ల శామ్యూల్ (ఏ1), డాక్టర్ భార్య గాదె ఫ్లోరా మరియా (ఏ2), వీరికి సహకరించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మంచుకురి రాజ్ కుమార్ (ఏ3) లను పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనభరిచిన పోలీస్ అధికారులను వరంగల్ ఏసిపి నందిరామ్ నాయక్ అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version