ఘనంగా జరుపుకున్న నాగుల పంచమి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలంలో మంగళవారం రోజు హిందువుల పండుగ అయినటువంటి నాగుల పంచమిని ఘనంగా నిర్వహించారు. ఉదయం పూట ని ప్రతి ఇంటిలో పండుగ సందడి నెలకొంది. ఈ రోజు ప్రత్యేకంగా జొన్నపేలాలు, వేయించిన శనగలు, పూజ సామాగ్రి,ఆవు పాలు, నాగులు (ఇంట్లోలోహంతో తయారు చేసేవి,) తదితరాలు తీసుకెళ్లి పాముల పుట్ట వద్ద నాగ దేవతకు పూజలు చేసి పుట్టలో పాలు పోసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి టెంకాయలు కొట్టి నాగదేవతకు ఘనంగా పూజలు చేశారు. అనంతరము ఇళ్లల్లోకి చేరుకున్న పిదప ఆడపడుచులు ముందు మిత్రులను కలుసుకుని కళ్ళు కలగడం ఆనవాయితీగా వస్తోంది. ఆడపడుచులకు వారి సోదరులు ఎంతో కొంత నగదును లేదా సారె లాంటివి సమర్పించుకొని ఆడపడుచుల ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ విధంగా పంచమి రోజు బంధుమిత్రులు కలుసుకోవటం ఇది ఒక మంచి అవకాశంగా ఆనాటి పెద్దలు నిర్ణయించిన పండుగ నే నాగుల పంచమి. అనంతరం కొన్ని ఊళ్లలో ఉయ్యాలలు, నిచ్చెనలు ఏర్పాటుచేసి ఆనందంతో ఆడ మగ అందరు కలిసి అక్కడ ఊయలలు ఊగడం, నిచ్చెనలు ఎక్కడం ఈ రోజంతా ఆనందంగా గడుపుతారు. మంగళవారం రోజు జహీరాబాద్ మొగుడంపల్లి నాల్కల్ కోహిర్ ఝరాసంగం మండలకి చెందిన పలువురు మహిళలు శివాలయం వద్ద గల పుట్ట వద్ద నాగ దేవతకు పూజలు చేశారు. కొంతమంది ఊరి బయట చేను లలో గల పుట్టల వద్దకెళ్లి అక్కడ పూజలు చేశారు. ఈరోజు శివాలయంలో భక్తులతో సందడి నెలకొంది. నాగ దేవతకు పూజలు చేసిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ఉండే శివలింగానికి పూజలు చేసి టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఊరిలో గల జంట నాగుల ఆలయంలో కూడా భక్తులతో సందడి నెల కొంది. హనుమాన్ మందిరంలో కూడా ఆయా గ్రామాలలో పూజలు చేసి పండుగ జరుపుకున్నారు.