ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల సాధనే లక్ష్యంగా పని చేస్తున్నాం..

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల సాధనే లక్ష్యంగా పని చేస్తున్నాం..

*ఏ.పీ. సర్వతో ముఖాభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్న తీరు అభినందనీయం..

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

చిత్తూరు (ఢిల్లీ)
నేటి ధాత్రి) ఆగస్ట్ 01:

ఆంధ్రప్రదేశ్ హక్కులు, ప్రయోజనాల సాధనే లక్ష్యంగా
ఏపీ కూటమి ఎంపీల బృందం పనిచేస్తుందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఓ ప్రకటనలో తెలియజేశారురాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఢిల్లీ పార్లమెంటు సమావేశాలు హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ…, ఏ.పీ. సర్వతో ముఖాభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం.., శాఖల వారీగా.., అందిస్తున్న తోడ్పాటు అభినందినీయమని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో కొనియాడారు. ఇదే మోడీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు.., ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో చిత్తూరు పార్లమెంట్ ను ప్రగతి పథం వైపు అడుగులేయించాలన్నదే తన సంకల్పమన్నారు.ఈ నేపథ్యంలోనే లోకసభలో ఏపీ కూటమి ఎంపీల బృందం తమ వాణిని వినిపిస్తోందన్నారు.
ఏరోస్పేస్ ఇండస్ట్రీ,స్పేస్ సిటీ, పోలవరం-బనకచర్ల, హంద్రీనీవాకు సంబంధించిన అంశాలను పార్లమెంటులో లేవనెత్తి. కార్యరూపం దాల్చేవ్విధంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు.
అదేవిధంగా రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు వంటి విషయాలను ఎన్డీఏ సర్కార్ ముందుంచి, ఫలితాలను రాబట్టే దిశగా ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు.
అమరావతి అభివృద్ధికి సహకారం. మామిడిరైతుల సమస్యకు పరిష్కారమైన మార్గమైన మ్యాంగో బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్ ను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, మామిడి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు,వారి కలను సాకారం చేసే దిశగా కృషి చేస్తున్నట్లు చిత్తూరు ఎంపీ వివరించారు.

క్రీడ‌ల అభివృద్ధికి కూట‌మి ప్ర‌భుత్వం కృషి..

*క్రీడ‌ల అభివృద్ధికి కూట‌మి ప్ర‌భుత్వం కృషి..

*అమరావ‌తిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు త్వ‌ర‌లోనే శంకుస్థాప‌న‌..

*ఏపీ స్టేట్ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్ ప్రారంభోత్స‌వంలో శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-30T133904.551.wav?_=1

తిరుప‌తి(నేటి ధాత్రి) జూలై 30:

ఆనాడైనా ఈనాడైనా క్రీడ‌ల అభివృద్ధికి సీఎం చంద్ర‌బాబునాయుడు క‌ట్టుబ‌డి ప‌నిచేస్తున్నార‌ని, ఆయ‌న నేతృత్వంలో క్రీడ‌ల బ‌లోపేతానికి కూట‌మి ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు అన్నారు. తిరుప‌తిలోని శ్రీ శ్రీ‌నివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో చిత్తూరు డిస్ట్రిక్ట్ బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకూ నిర్వ‌హిస్తున్న ఏపీ స్టేట్ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్‌-2025(సీనియ‌ర్ మెన్ అండ్ ఉమెన్‌) పోటీల‌ను మాజీ శాస‌న స‌భ్యురాలు సుగుణ‌మ్మతో
ఆయ‌న కలిసి ప్రారంభించారుతొలుత ప‌లు జిల్లాల నుంచి వ‌చ్చిన క్రీడాకారుల‌ను ప‌రిచ‌యం చేసుకుని వారితో బ్యాడ్మింట‌న్ ఆడి పోటీల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ప్రారంభోత్స‌వ స‌భ‌లో క్రీడాకారుల‌ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు. సీఎం చంద్ర‌బాబునాయుడు మొద‌టి నుంచి క్రీడ‌ల‌కు అధిక ప్రాధాన్యత‌ క‌ల్పిస్తున్నార‌న్నారు. త్వ‌ర‌లోనే అమ‌రావ‌తిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ముఖ్య‌మంత్రి శంకుస్థాప‌న చేస్తార‌ని వివ‌రించారు. టీటీడీ, శాప్ నిధుల‌తో ఆనాడే శ్రీ శ్రీ‌నివాస స్పోర్ట్స్ కాంప్లెక్సును ఆయ‌న నిర్మించార‌న్నారు. ఏపీ నుంచి అంత‌ర్జాతీయస్థాయి క్రీడాకారుల‌ను త‌యారుచేయాల‌నే సంక‌ల్పంతో అంత‌ర్జాతీయ క్రీడాకారుల‌కు స్థ‌లాలనిచ్చి అకాడ‌మీల స్థాప‌న‌ల‌కు కృషి చేసిన వ్య‌క్తి చంద్ర‌బాబు నాయుడని కొనియాడారు. గత ముప్పై ఏళ్లుగా బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్, ఫెడ‌రేష‌న్లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తూ బ్యాడ్మింట‌న్ క్రీడ‌ను ముందుకు తీసుకెళ్ల‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ క్రీడాస‌దుపాయాల క‌ల్ప‌న‌కు సీఎం కృషి చేస్తున్నార‌న్నారు. అత్యుత్త‌మ క్రీడా విధానాల‌ను రూపొందించి అమ‌లు చేస్తున్నార‌న్నారు. అనంత‌రం తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ మాజీ శాస‌న స‌భ్యురాలు సుగుణ‌మ్మ మాట్లాడుతూ ఏపీలో క్రీడాభివృద్ధికి సీఎం చంద్ర‌బాబునాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, విద్యాశాఖామంత్రి నారా లోకేష్‌లు అపార‌మైన కృషి చేస్తున్నారన్నారు. అలాగే రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న క్రీడాస‌దుపాయాలు, క్రీడా ప్రోత్సాహ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకుని క్రీడాకారులు భ‌విష్య‌త్తులో మ‌రింత మెరుగ్గా రాణించాల‌ని సూచించారు. సీఎం చంద్ర‌బాబు ఆశ‌యాల‌కు అనుగుణంగా క్రీడాంధ్ర‌ప్ర‌దేశ్ సాధ‌న‌కు ప్ర‌తీ ఒక్క‌రూ కృషి చేయాల‌ని వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఎస్డీఓ శ‌శి, బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ స‌భ్యులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన…

బిఆర్ఎస్ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన
మాజీ ఎమ్మెల్యే

మొగులపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో :27/07/2025 న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు భూపాలపల్లి నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా మొగుళ్ళపల్లి మండలం, ఇస్సిపేట గ్రామ వాస్తవ్యులు మాజీ సర్పంచ్ కీ.శే కొడారి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి, అనంతరం మొగుళ్ళపల్లి లక్ష్మి సాయి గార్డెన్స్ నందు మండల ముఖ్య నాయకులతో కేటీఆర్ పర్యటన ఏర్పాట్లు మరియు కార్యకర్తల సమీకరణ పై సమీక్షా నిర్వహించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి.
వారి వెంట మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు..

సిరిసిల్ల ఎమ్మెల్యే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) 49వ జన్మదినం సందర్భంగా సిరిసిల్ల గాంధీ చౌక్ లో
బిఆర్ఎస్ పార్టీ నేతలు వైభవంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు ఏర్పాటు చేయడం జరిగినది. అంతేకాకుండా బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ సిరిసిల్లకే ఒక ఒక వరం మన అన్న కేటీఆర్ అని, అలాంటి వారి జన్మదినం ఈరోజు జిల్లాలో జరుపుకోవడం ఎంతో సంతోషకరమని అంతేకాకుండా ఈ సిరిసిల్లని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం గత ప్రభుత్వం పాలనాలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరగడం అని కొనియాడారు. అంతే కాకుండా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల తోట ఆగయ్య కూడా మాట్లాడుతూ


ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, మరియు తల్లి శిశువులకు సంబంధించిన కెసిఆర్ కిట్లు హాస్పటల్లో పంచడం జరిగినది తెలిపారు. అంతేకాకుండా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగినది.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ మాజీ చైర్పర్సన్ జిందo కళా చక్రపాణి, బోల్లి రామ్మోహన్, ధర్నాo లక్ష్మీనారాయణ, అడ్డగట్ల మురళి, తదితర బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

జిఓ నెంబర్ 49 రద్దు చేయాలి.

జిఓ నెంబర్ 49 రద్దు చేయాలి

జిఓ నెంబర్ 49 రద్దు చేయకపోతే కార్మికవర్గాన్ని కలుపుకొని ఐక్య పోరాటాలే…

బడాపెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు ఊడిగానికేనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా…

గందం రవి, పెద్దలచ్చన్న
సిఐటియు మందమర్రి మండల నాయకులు.

ఈరోజు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఏజెన్సీ బంద్ లో భాగంగా మందమర్రి మండలం రామకృష్ణపూర్ లో సింగరేణి సివిక్, రైల్వే సైడ్ అడ్డలలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు అధ్వర్యంలో నిరసన,జీఓ కాఫీల ధగ్దం చెయ్యడం జరిగింది.


బీజేపీ మోడీ ప్రభుత్వం ఆదివాసీ,
పేదలను వారి గ్రామల నుంచి,భూముల నుంచి వెళ్లగొట్టడం కోసం అనేక చట్టాలు తీసుకురావడం జరిగింది.వీటిని రాష్ట్రంలో అమలు జరపడం కోసం బిజెపి మోడీ ప్రభుత్వానికి మద్దతుగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీఓ నంబర్ 49 తీసుకురావడం జరిగింది. ఈ జి ఓ అమలు జరపడం కోసం దొడ్డి దారిన ప్రయత్నాలు చేస్తున్నది.దీని వలన 339 గ్రామాలు,3 లక్షల ఎకరాల భూమిని ఆదివాసీలు,పేదలు కోల్పోవడం జరుగుతుంది.మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే కవ్వల్ టైగర్ జోన్,ప్రాణహిత కృష్ణ జింకల ప్రాంతం,శివ్వారం మొసళ్ళ కేంద్రం పేర్లతో ఆంక్షలు విధించడం జరిగింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఆదివాసీలకు,పేదలకు వ్యతిరేకంగా, వారి జీవితాలను పూర్తిగా నాశనం చేసేలా ఉన్నాయి. అలాగే కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు, బడాపెట్టుబడిదారులకు బానిసలను చేసే కుట్రలను కూడా బిజెపి మోడీ ప్రభుత్వం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో ఆదివాసీ, గిరిజన, పేదలే కాకుండా కార్మికవర్గం కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధాలను విరమించుకోకుంటే ఐక్య
పోరాటాలను ఉధృతం చెయ్యడం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘం సిఐటియు డివిజన్ అధ్యక్షుడు గందం రవి, మండల నాయకులు పెద్దలచ్చన్న, లక్ష్మి, స్వరూప, రాజేశ్వరి, రాజయ్య, బానయ్య, రవీందర్, వెంకటేషశ్వర్ రావు, నరేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాదాసి రవి.

పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాదాసి రవి

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాదాసి రవి ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా మాదాసి రవి మాట్లాడుతూ పట్టణంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.రాబోయే మున్సిపల్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో సీట్లు గెలిపించేందుకు భాధ్యత వహిస్తానని పేర్కొన్నారు. నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నాకు అవకాశం కల్పించిన నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి, టిపీసీసీ సభ్యులు, పట్టణ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

పనిగంటలు పెంచడమంటే కార్మికుల .!

పనిగంటలు పెంచడమంటే కార్మికుల వ్యక్తిగత జీవితాలను హరించడమే.

మందమర్రి నేటి ధాత్రి

పెట్టుబడిదారుల ఖజానా నింపడానికి కార్మికవర్గాన్ని బానిసలుగా మారుస్తారా?

రాష్ట్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని గంటలు పెంచుతు తెచ్చిన జీవో నెం 282 ను వెంటనే రద్దు చేయాలి.

జీవో రద్దు చేయాలని నల్లారిబ్బన్నలతో విధులు నిర్వహిస్తున్న సింగరేణి కాంట్రాక్టు కార్మికులు.

గందం రవి
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు మందమర్రి డివిజన్ అధ్యక్షుడు.

రాష్ట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టుబడిదారుల, కార్పొరేటర్ల ఖజానా నింపడానికే 10 నుంచి 12 గంటల పనిగంటలు పెంచుతు బిజెపి మోడీ ప్రభుత్వానికి తానేమి తక్కువ కాదన్నట్టు జీవో నెం 282 ను విడుదల చేశారు. కార్మికవర్గాన్ని బానిసలుగా మార్చే పని గంటల పెంపు జీవోను వెంటనే రద్దు చేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో మందమర్రి డివిజన్ పరిధిలోని రామకృష్ణపూర్ ఏ-జోన్ సివిక్ కాంట్రాక్టు కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా గందం రవి ఎస్సీ కేఎస్ సిఐటియు డివిజన్ అధ్యక్షులు మాట్లాడుతూ…
సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు ఇప్పటికే పనిభారం పెరుగుతుంది. చేసే పనికి వచ్చే వేతనాలకు గొర్రెతోక బెత్తెడు చందంగా మా వేతనాలు ఉన్నాయి. మరోవైపు రోజు రోజు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవ్వని కలిసి ఇప్పటికే కార్మికుల బతుకులు ఆగమ్యగోచరంగా మారి మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతుంటే, ఇవేవి పరిష్కరించకుండా, వేతనాలు పెంచకుండా పైగా 10 నుంచి 12 గంటల పని చేయాలని జీవో నెంబర్ 282 ను విడుదల చేయడమంటే కార్మిక వర్గంపై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత కర్కషంగా వ్యవహారిస్తుందో అర్థం అవుతుంది. మమ్మల్ని బానిసలు, మా వ్యక్తిగత స్వేచ్ఛ జీవితాలను హరిస్తామంటే కార్మికులంత ఐక్యంగా రైతాంగ పోరాట స్పూర్తితో మరో మహత్తర పోరాటానికి సైతం సిద్ధమైతాము.
ఈ కార్యక్రమంలో శారధ, లక్ష్మి, స్వరూప, రాజేశ్వరి, అంజలి, రవీందర్, సంపత్, రాజేందర్, వెంకటేశ్వర్ రావు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

సార్వత్రిక సమ్మెకు టీడబ్ల్యూజేఎఫ్ సంఘీభావం..

సార్వత్రిక సమ్మెకు టీడబ్ల్యూజేఎఫ్ సంఘీభావం..

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

కార్మికుల హక్కుల కోసం చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. బుధవారం వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మహా ర్యాలీలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మచ్చిక వెంకటేశ్వర్లు, వరంగల్ జిల్లా అధ్యక్షులు పొడేటి అశోక్, ఉపాధ్యక్షులు ఈర్ల సురేందర్, కోశాధికారి గాయపు రాజురెడ్డి, చిలువేరు శ్రీకాంత్,గుర్రాల శ్రీనివాస్, సదిరం కుమార్,ఎండీ.అక్మల్ పాషా, మోడం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన శ్రామిక.

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన శ్రామిక వర్గానికి అభినందనలు

పాలకులు ఇప్పటికైనా శ్రమ దోపిడి విధానాలను మానుకోవాలి

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

వినాశనకర దోపిడీ విధానాలను నిరసిస్తూ చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన కార్మిక కర్షక ఉద్యోగులకు అభినందనలు తెలియజేస్తూ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ విధానాలకు చరమగీతం పాడి శ్రామికులకు అనుకూలంగా పాలన కొనసాగించాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం అయిన సందర్భంగా స్థానిక వరంగల్ పట్టణ ఓంకార్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్దారపు రమేష్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సహజ సంపదను, ఆర్థిక వ్యవస్థను, మానవ శ్రమను పెట్టుబడుదారులకు కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టే విధంగా విధానాల రూపకల్పన చేస్తూ అందుకు అనుకూలంగా చట్టాలను రూపొందించి ఊడిగం చేస్తున్నదని అన్నారు.మరోవైపు నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక కర్షక ఐక్య పోరాటాలు రాజకీయాలకతీతంగా ఉధృతం అవుతున్నాయని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రైతు కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని రైతులు పండించిన పంటకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా మద్దతు ధర చట్టాన్ని రూపొందించాలని తెలిపారు. కార్మికులకు పాత చట్టాలను పునరుద్ధరించి కనీస వేతనం అమలు 26వేల రూపాయలు చేయాలని అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 10 గంటల పని దినం పెంపును ఉపసంహరించుకొని ఎనిమిది గంటల పని విధానాన్ని యధావిధిగా అమలు చేయాలని కోరారు.ఈ సమావేశంలో ఎంసిపిఐ యు జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్,నాయకులు ఎగ్గని మల్లికార్జున్, నలివెల రవి, రాయినేని ఐలయ్య, జటబోయిన నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

4 లెబర్ కోడ్ లు అంటేనే కార్మికవర్గానికి బానిస

4 లెబర్ కోడ్ లు అంటేనే కార్మికవర్గానికి బానిస ఉరికంబాలు

మందమర్రి నేటి ధాత్రి

లెబర్ కోడ్ లను రద్దు చేయాలని నినాదాలతో హోరెత్తిన నిరసనలు

బిజెపి మోడీ ప్రభుత్వానికి మీమేమి తక్కువ కాదని పనిగంటలు పెంచిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

బడా పెట్టుబడిదారులకు కార్మిక వర్గాన్ని బానిసలను చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందు దొందే.

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసిన కార్మిక వర్గం

సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మానవహరం.

దూలం శ్రీనివాస్
సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు.

కార్మిక వర్గాన్ని బడా పెట్టుబడిదారులకు, కార్పొరేటర్లకు కట్టు బానిసలు చేయడానికి బిజెపి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా జరిగిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మంచిర్యాల జిల్లా మందమర్రిలో అన్ని విభాగాలకు చెందిన కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసు ముందు నుండి బస్టాండ్ సెంటర్ వరకు భారీ ర్యాలీని నిర్వహించి, బస్టాండ్ సెంటర్లో మానవహారంగా లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, పని గంటలు పెంచుతు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 282 ను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా నాయకులు దూలం శ్రీనివాస్ సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు, కాసర్ల రాజలింగు తెలంగాణ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ…

 

 

దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి మోడీ ప్రభుత్వం మొదటి నుండే కార్మిక వర్గంపై అనేక విధాల కర్కషత్వాన్ని పరిదర్శిస్తూ చివరకు విదేశీ, స్వదేశీ బడ పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా, పనిచేసే యంత్రాలుగా అప్పజెప్పడానికే ఈ నాలుగు లేబర్ కోడ్ లను తీసుకురావడం జరిగింది. లెబర్ కోడ్ ల అమలు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ బడా పెట్టుబడిదారుల ఖజాన నింపాలని మోడీ ప్రభుత్వం ఊవ్విర్లు ఊరుతుంది. బిజెపి మోడీ ప్రభుత్వానికి మేమేం తీసిపోమన్నే విధంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈనెల 5వ తేదీన 10 నుంచి 12 గంటల పని గంటలు పెంచుతూ 282 జీవోను విడుదల చేసింది. కాంగ్రెస్,బిజెపి ప్రభుత్వాల జెండాలు వేరు కావచ్చు, కానీ వారి ఎజెండా మాత్రం ఒక్కటే అనేది ఆచరణలో నిరూపించారు.

 

 

 

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను మార్చుకోకుంటే, 4 లెబర్ కోడ్ లను రద్దు చేయకుంటే రైతాంగ పోరాట స్పూర్తితో పోరాటాలను తీవ్ర స్థాయిలోకి తీసుకుపోతామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ & వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వి. నిర్మల, సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘం సిఐటియు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు గందం రవి, రమేష్, మందమర్రి మున్సిపల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు యం. నర్సయ్య, జి. ఐలయ్య, మున్సిపల్ నాయకులు సంగి పోషం, ప్రసాద్, లింగంపల్లి రవి, పోసు, లత, రజిత, ఎస్సీ కేఎస్ సిఐటియు నాయకులు తిరుపతి, రాయమల్లు, కళ, లక్ష్మి, పద్మ, రాజేశ్వరి, రవీందర్, వెంకటేష్, తిరుపతి, ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు కేటాయించి.

వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ పథకంలో ఇండ్లు ఇవ్వండి

ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేసిన టి డబ్ల్యూ జె ఎఫ్ నాయకులు

మంచిర్యాల,నేటి ధాత్రి

జర్నలిస్టులు ఏలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజ జాగృతికి నిరంతరం కృషి చేస్తున్నారని, వర్కింగ్ జర్నలిస్ట్ లందరికీ షరతులు లేకుండా ఇంటి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ పథకంలో ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు బుధవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ పెడరేషన్ నాయకులు వినతిపత్రం అందజేశారు.

 

 

 

ఈ సందర్బంగా టి డబ్ల్యూ జె ఎఫ్ సంఘం జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి మధు, కార్యదర్శి గడ్డం సత్యా గౌడ్ లు మాట్లాడుతూ భూముల ధరలు ఆకాశాన్ని అంటగా, వైద్యం చాలా పిరమైపోయిందని, ఈ నేపథ్యంలో వర్కింగ్ జర్నలిస్టులు ఇంటి స్థలం కొనలేని పరిస్థితిలో అద్దె ఇండ్లలో ఉండి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తెలిపారు. నేటికీ పాత్రికేయుల సొంతింటి కల కలగానే మిగిలి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కొందరికి ఇండ్ల స్థలాలు ఇచ్చారని గుర్తు చేశారు. గత పదేళ్ల కాలంలో

 

 

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకు ( జర్నలిస్టులకు) ఆశలు చిగురించాయని అన్నారు. అవినీతి అక్రమాలను వెలికితీసి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడుతున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని తెలిపారు. గత ప్రభుత్వం మాట్లాడే హక్కును హరించినా.. మీడియా ఎంతో ధైర్యంగా ప్రజా సమస్యలను ఎత్తి చూపిందని తెలిపారు.

 

 

ప్రజలకు పూర్తి పారదర్శక పాలన అందించడంలో పాత్రికేయుల సహకారం ఎంతో అవసరమని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని కోరారు. ఏ ప్రభుత్వానికైనా చెవులు, కళ్లు మీడియానే కాబట్టి, మీడియాలో పనిచేసే విలేకరుల సంక్షేమాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవడం వల్ల పారదర్శకమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుందని వివరించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచి, సమాజహితం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసినట్లైతే వారి కుటుంబాల స్వంతింటి కళను సహకారం చేసినట్లు అవుతుందని తెలిపారు.

 

 

 

శాసనసభ్యులుగా తమ పరిధిలో ఉన్న సమస్యను పరిష్కరించి, ఈ జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ పథకంలో ఇల్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాద్యక్షలు కామెర వెంకటస్వామి, జే సతీష్, కోశాధికారి సబ్బని భాస్కర్, జాయింట్ సెక్రెటరీ బి సుమన్, జి సురేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈ సురేష్, ఈసీ మెంబర్స్ ఎం వేణుగోపాల్ గౌడ్, ఏ శ్రీనివాస్, వీరస్వామి, యూనియన్ సభ్యులు దేవరపల్లి ప్రభాకర్, మహమ్మద్ అమీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో పని చేస్తున్న హోం గార్డ్స్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు.

జిల్లాలో పని చేస్తున్న హోం గార్డ్స్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్న హోం గార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని డిజిపి కార్యాలయం నుండి వచ్చిన ఉలెన్ జాకెట్స్ & రెయిన్ కోట్స్ ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో వారికి అందజేసిన జిల్లా ఎస్పీ.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..జిల్లాలో విధులు
నిర్వహిస్తున్న హోమ్ గార్డ్స్ పోలీసు శాఖలో అంతర్గత భాగమని,పోలీసులతో పాటే నిరంతరం తమ సేవలను అందిస్తున్నారని,ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీసు సిబ్బందితో పాటు విధులు నిర్వహిస్తున్నారని, క్లిష్ట పరిస్థితులలో కూడా వివిధ బందోబస్తు విధుల్లో చాలా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు.

welfare

హోమ్ గార్డ్స్ అధికారులు,సిబ్బంది ఎవరికైన సమస్యలు ఉంటే నేరుగా తనని సంప్రదించవచ్చని,రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.నిరంతరం ఎండనకా,వాననకా రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసే సిబ్బందికి అత్యవసర సమయాలలో ఉలెన్ జాకెట్స్ & రెయిన్ కోట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.విధి నిర్వహణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని,క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో పనిచేస్తూ నిబంధనలు ఉల్లగింస్తే భవిష్యత్తులో శాఖ పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు యాదగిరి, మధుకర్, హోమ్ హార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇండస్ట్రీలో పనిగంటలపై చర్చ రానా దగ్గుబాటి కీలకవ్యాఖ్యలు.

ఇండస్ట్రీలో పనిగంటలపై చర్చ.. రానా దగ్గుబాటి కీలకవ్యాఖ్యలు

 

నేటిధాత్రి:

 

 

 

 

ఇటీవల పని గంటలపై జరుగుతున్న చర్చలు చిత్ర పరిశ్రమకు కూడా వ్యాపించాయి. ‘స్పిరిట్’ (Spirit) సినిమా నుంచి దీపికా పదుకొణె (Deepika Padukone) వైదొలగడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) తనదైన శైలిలో స్పందించారు. పని సంస్కృతి, ఆర్థిక పరిస్థితులపై చర్చలు అనవసరమని, నిరంతర సాధన, కృషే పని జీవితానికి నిజమైన విలువని అన్నారు. భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమని, అధిక సామర్థ్యం, ఎక్కువ పని గంటలు దేశ అభివృద్ధికి అవసరమని పేర్కొన్నారు.

సినీ పరిశ్రమలో పని గంటలు ప్రాజెక్ట్ను బట్టి మారతాయని రానా వివరించారు. “భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. తలసరి ఆదాయంలో మన ఆర్థిక వ్యవస్థ 186వ స్థానంలో ఉంది. తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కు మారినప్పుడు వందలమంది కుటుంబాలతో వలస వచ్చారు. నా దృష్టిలో అది కేవలం పని కాదు, జీవనశైలి. ప్రతి ప్రాజెక్టు, దానిలో పనిచేసే వ్యక్తులను బట్టి పని గంటలు మారతాయి” అని అన్నారు.

 

మహారాష్ట్రలో 12 గంటల షిఫ్ట్ విధానం, తెలుగు పరిశ్రమలో 8 గంటల షిఫ్ట్ సాధారణమన్నారు. అయితే షూటింగ్ షెడ్యూల్లు లొకేషన్, సెట్, స్టూడియో వంటి అంశాలపై ఆధారపడతాయని రానా వివరించారు. “మహారాష్ట్రలో ఉదయం 9 గంటలకు షూటింగ్ మొదలవగా, తెలుగులో 7 గంటలకే ప్రారంభమవుతుంది. సెట్ సన్నద్ధత, లొకేషన్ ఎంపిక వంటివి సులభమైనవి కావు. దేశంలో 70-80% మంది రోజువారీ సంపాదన వంద రూపాయలే. ఈ విషయాలను సూక్ష్మంగా చూడాలి” అని ఆయన అన్నారు.

నటులు సెట్ లో ఎక్కువ సమయం గడపడానికి బలవంతంగా ఒత్తిడి ఉంటుందనే వాదనపై రానా స్పందిస్తూ.. “ఎవరూ బలవంతంగా ఉండమని చెప్పరు. సినిమా ఒక వృత్తి. ఒత్తిడి చేయడం జరగదు. ఇందులో పనిచేయాలనుకుంటే చేయొచ్చు. అది వ్యక్తిగత ఎంపిక. కొంతమంది నటులు 4 గంటలు మాత్రమే పనిచేస్తారు, అది వారి విధానం” అని పేర్కొన్నారు.

మహాప్రస్థానంలో పని చేస్ కార్మికులుకు సన్మానం.

మహాప్రస్థానంలో పని చేస్ కార్మికులుకు సన్మానం
శేరిలింగంపల్లి,నేటి ధాత్రి :-

 

కార్మికుల దినోత్సవం సందర్బంగా రాయదుర్గం లోని వైకుంఠ మహా ప్రస్థానం లో పనిచేసేవారందరికీ శాలువాతో సత్కరించిన శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు మరియు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా కార్మికులు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహా ప్రస్థానంలో పనిచేసేవారందరికీ బహుమతులను మరియు స్వీట్ బాక్స్ లను అందజేశారు. అనంతరం అయన మాట్లాడుతూ “ప్రతి మనిషి ఆఖరి మజిలీ చావు, అట్టి ఆఖరి గమ్యంలో మీరంతా అందించే సేవలు ఆదర్శప్రాయం అని, అతి ముఖ్యంగా కరోనా సమయం లో మహా ప్రస్థానం సిబ్బంది అందించిన సేవలను ఎప్పటికి మర్చిపోలేమనీ కొనియాడారు.

Corona

 

ఒక మనిషి చనిపోతే సొంత కుటుంబికులే రాలేని రోజుల్లో మీరే అన్ని అయ్యి అంత్యక్రియలు చేయడం ఎంతో ఆదర్శం. మీరు అందించే సేవలకు మేము మా తృప్తి కొరకు అందిస్తున్న ఈ చిన్న కానుక”.భవిష్యత్తులో ఏవరికి ఏ అవసరం వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహాప్రస్థానం మేనేజర్ రాజ్ కుమార్, మహా ప్రస్థానం సిబ్బంది మరియు నాయకులు అంజమ్మ, దారుగుపల్లి నరేష్, రమేష్ గౌడ్, శామ్లెట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మేడే స్ఫూర్తితో కార్మిక వర్గ పోరాటాలను.

మేడే స్ఫూర్తితో కార్మిక వర్గ పోరాటాలను బలోపేతం చేద్దాం

టియుసిఐ నేత కొమరం శాంతయ్య

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

టియుసిఐ గుండాల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో గురువారం మే డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మేడే సందర్భంగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంధా) కార్యాలయం వద్ద టియుసిఐ జెండాను ఆ సంఘం గుండాల ఏరియా కమిటీ కార్యదర్శి కొమరం శాంతయ్య ఆవిష్కరించారు. జవ్వాజి సెంటర్ లో టియుసిఐ గుండాల ఏరియా కమిటీ అధ్యక్షులు గడ్డం రమేష్ ఆవిష్కరించారు. పెట్రోల్ బంకు వద్ద టియుసిఐ ఏరియా కమిటీ సభ్యులు వసంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో టియుసిఐ ఏరియా కమిటీ కార్యదర్శి కొమరం శాంతయ్య, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంధా) జిల్లా నాయకులు ఈసం శంకర్, వాంకుడోత్ అజయ్ లు మాట్లాడుతూ కార్మికులు చికాగో నగరంలో 1986 మే 1న పాలకవర్గాల దమన కాండలో తమ రక్తాన్ని చిందించి, ఉరికొయ్యాలని సైతం లెక్కచేయకుండా పోరాడిన పోరాట ఫలితంగా ఎనిమిది గంటల పని దినాన్ని ప్రపంచమంతా ఆమోదించిందని వారన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మిక హక్కుల్ని కాలరాస్తుందని, కార్మిక వర్గం పోరాడి సాధించిన 44 కార్మిక చట్టాలలో 15 చట్టాలను ప్రభుత్వం అడ్రస్ లేకుండా చేస్తూ ,మిగతా 29 చట్టాలను నాలుగు లేబర్ కోడులను ఆమోదించి అమలు చేయడం వల్ల కార్మికులు కట్టు బానిసలుగా మారబోతున్నారని అన్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాంత్రీకరణ పేరుతో ఎనిమిది గంటల పనిని పెంచుతూ 12 గంటలు పనిచేయిస్తూ కార్మికుల రక్తాన్ని మరింత పీల్చి పిప్పి చేస్తున్నారని వారన్నారు. భారత రాజ్యాంగం, కోర్టుల గురించి గొప్పలు వల్లించే పాలకులు సమాన పనికి సమాన వేతనం అనే సుప్రీంకోర్టు తీర్పుని ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని వారు ప్రశ్నించారు. శ్రామిక వర్గం జీవించడానికి సరిపడే వేతనాలు ఇచ్చేంతవరకు కార్మిక లోకం పోరాడాలని వారు పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం కార్పోరేట్లకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అప్పగించడం హేయమైన చర్యాగా వారు పేర్కొన్నారు. కార్మిక లోకం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ,కార్మికుల రెగ్యులరైజేషన్ ,సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వ ఉద్యోగ భద్రతకై జీవించడానికి సరిపడే వేతనాలు ,పెన్షన్ పెంపు, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ అమలు నిలుపుదల కోసం 139వ మే డే స్ఫూర్తితో పోరాటాలను ఉదృతం చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ ఏరియా కమిటీ నాయకులు మొక్క నరి, కోడూరి జగన్, మాచర్ల కోటి సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ నాయకులు పూనెం మంగయ్య, తెల్లం రాజు , పూనెం లక్ష్మయ్య ,ఈసం కృష్ణ , వూకే శ్రావణ్, ధరావత్ వాగ్య, కల్తి వెంకన్న, సనప కిషెంధర్, మోకాల పాపయ్య, ధరావత్ ఆల్యా ,ధరావత్ మోహన్, ఉప్పు రాజ్ కుమార్, ఉప్పు వెంకటేశ్వర్లు, జాటోత్ భాను , ఎస్ కే వసీం, నునావత్ శంకర్, ఉప్పు మహేష్ ,గంగాధరి కార్తీక్, నాగెల్లి తరుణ్ ,వాగబోయిన జగ్గారావు, ఎస్కె కర్ముళ్లా, ఎస్కె బిల్లా తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్ట్ ల.!

వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్ట్ ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధనకై జర్నలిస్టులు చేపట్టిన నిరహార దీక్షకి,

“నేటిధాత్రి”

దినపత్రిక ఎండీ కట్ట రాఘవేంద్రరావు,

డైరెక్టర్ కట్టా శివ సుబ్రమణ్యం లు హాజరై సంఘీభావం తెలిపారు..

ప్రజా పాలనలోనే వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేస్తాం.

ప్రజా పాలనలోనే వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేస్తాం

రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క..

కొత్తగూడ, నేటిధాత్రి :

 

ప్రజా పాలన లోనే వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని, అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టుల యొక్క చిరకాల ఆకాంక్ష అయిన ఇళ్ల స్థలాల మంజూరు సమస్యను కూడా పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క పేర్కొన్నారు.

గురువారం నాడు టీయూడబ్ల్యూజే (ఐజేయు) కొత్తగూడ మండల కమిటీ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ స్థానిక శాసన సభ్యురాలు, రాష్ట్ర మంత్రివర్యులు సీతక్కకు ములుగు క్యాంప్ కార్యాలయంలో ఐజేయు సభ్యులు కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి వర్కింగ్ జర్నలిస్టులను అన్యాయాలకు గురి చేసినటువంటి దుస్థితి గత పాలకులదేనని, కెసిఆర్ కు వత్తాసు పలికే కొన్ని మీడియా యాజమాన్య సంస్థలతో కుమ్మక్కై మీడియా రంగాన్ని అనేక విభాగాలుగా విభజించి ఫోర్త్ ఎస్టేట్ అనే రంగాన్ని పూర్తిగా కనుమరుగు అయ్యే విధంగా వ్యవహరించిన తీరు నాటి పాలకుల పాపమేనని, కచ్చితంగా వర్కింగ్ జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం లోనే ఇళ్ల స్థలాల మంజూరు,ఆరోగ్యశ్రీ ,హెల్త్ కార్డుల మంజూరు, వర్కింగ్ జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించే విధంగా

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మరియు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సారథ్యంలో విధి విధానాలు చేపడుతున్నామని, కచ్చితంగా వర్కింగ్ జర్నలిస్టులకు చిరకాల ఆకాంక్ష కోరికైనా ఇళ్ల స్థలాల మంజూరుకు కచ్చితంగా తన వంతు కృషి ఉంటుందని అన్నారు..

ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) కొత్తగూడ మండల అధ్యక్షుడు ఎస్. కె .సల్మాన్ పాషా, జిల్లా నాయకులు శెట్టి పరశురాం, మహమ్మద్ అజ్మీర్, మండల ఉపాధ్యక్షులు గోగు విజయ్ కుమార్, దేశ వెంకటేశ్వర్లు, మండల ప్రచార కార్యదర్శిలు తీగల ప్రేమ్ సాగర్, ఈక నరేష్, ఉబ్బని శ్రీహరి, గంగిశెట్టి రాకేష్ వర్మ, ముఖ్య సలహాదారులు బొజ్జ సునీల్, యూనియన్ నాయకులు చాపల శ్రీనివాస్, నాంపల్లి రాజ్ కుమార్, తాటి సుదర్శన్, బిక్షపతి, గట్టి సుధాకర్, అశోక్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు…

టీఆర్పీఎస్ మండల కార్య వర్గం ఎన్నిక.

టీఆర్పీఎస్ మండల కార్య వర్గం ఎన్నిక

శాయంపేట నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం(టీఆర్పీఎస్ ) మండల కార్యవర్గాన్ని గురువారం మండల కేంద్రంలోని చేనేత సహకార సొసైటీలో ఎన్ను కున్నారు.

మండల అధ్యక్షుడి గా సామలమధుసూదన్ ఇటీవల ఎన్నిక కాగా, గౌరవ అధ్యక్షులుగా వావిలాల వేణుగోపాల్ ప్రసాద్, కందగట్ల ప్రకాష్, ఉపాధ్యక్షులుగా బాసని చంద్రమౌళి, గుర్రం అశోక్, ప్రధాన కార్యదర్శి సామల రవీందర్, కోశాధికా రిగా రంగు శ్రీధర్, సహాయ కార్యదర్శులు బడుగు రవీందర్, బాసని సదాశివుడు, కార్యనిర్వాహకులు బాసని నాగభూషణం, సోషల్ మీడియా ఇంచార్జిలు బడుగు అశోక్, దాసి శ్రావణ్ కుమార్, ముఖ్య సలహాదారులు పల్నాటి జలేందర్, బాసని లక్ష్మీ నారాయణ, బూర ఈశ్వరయ్య, సామల మల్లయ్య, బాసని కుమార స్వామిలు ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు రాష్ట్రనాయకుడు బాసని చంద్ర ప్రకాష్ వెల్లడించారు.

ఈ సందర్భంగా చంద్రప్రకాశ్ పాటు పలువురు నూతన కార్యవ ర్గానికి శుభాకాంక్షలు తెలిపి, గ్రామాలలో సంఘసభ్యత్వా లు చేయించాలని సభ్యత్వ పుస్తకాలను గ్రామ కమిటీలకు అందజేశారు. పద్మశాలి సంఘం సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు.

చేనేత చౌక్ లో పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్..

చేనేత చౌక్ లో పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్..

రాజన్న సిరిసిల్ల టౌన్,నేటిదాత్రి:

గత వారం రోజుల నుండి సిరిసిల్లా జిల్లా చేనేత చౌక్ లో ప్రధాన రహదారిపై ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయడం లేదు.దీంతో
రహదారిలో వెళ్లే వాహనదారులకు గాని, బాటసారులకు గాని ఇబ్బందులు తలెత్తడం జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా చేనేత చౌక్ లో ఓల్డ్ బస్టాండ్ సమీప నా ఎక్కువ రద్దీగా జనసంచారం ఉన్న ప్రదేశంలో సిగ్నల్ పనిచేయకపోవడం అధికారుల నిర్లక్ష్య ధోరణికి ఇదొక విడ్డూరమని చెప్పవచ్చు అని భావిస్తున్నారు. వాహనదారులకు గాని,బాటసారిలకు గాని ప్రమాదం తలెత్తకుండా వెంటనే అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

స్కావెంజర్స్ వేతనాలు విడుదల చేయాలి.!

పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్స్ వేతనాలు విడుదల చేయాలి

విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డి ఈ వో కు వినతి పత్రం అందజేత

హనుమకొండ, నేటిధాత్రి :

అనంతరం ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్, స్వేరోస్ మాజీ అధ్యక్షుడు రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పనిచేస్తూనా స్కావెంజర్స్ వర్కర్ల వేతనాలు 7 నెల నుండి రాలేకపోవడం వలన కుటుంబాలు గడవడం ఇబ్బందిగా మారుతుందని అన్నారు. పాఠశాలలో పచ్చదనం పరిశుభ్రత, పాఠశాల ఆవరణం మొత్తం పరిశుభ్రం చేస్తున్న క్రమంలో వేతనాలు రాలేకపోవడం వలన ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. కావున జిల్లా కలెక్టర్, డీఈవో జ్ఞానేశ్వర్ స్పందించి స్కావెంజర్స్ వర్కర్ల వేతనాలు విడుదల చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version