మత్తడి పోస్తున్న చెరువులు, కుంటలు…

మత్తడి పోస్తున్న చెరువులు, కుంటలు

నిండుకుండలా మారిన చెరువులు కుంటలు

శాయంపేట నేటిధాత్రి:

ఇటీవల కురిసిన ఏకధాటి వర్షాలకు శాయంపేట మండ లంలోని పలు గ్రామాలలోని చెరువులకు జలకలను తెచ్చిపె ట్టాయి. వర్షాలు పడడంతో భారీగా వరదరావడంతో చెరువులు నుండి మత్తడి పోస్తూ నూతన శోభను సంతరించుకున్నాయి. పలు గ్రామాల్లోని కుంటలు జలకల ఉట్టిపడుతుంది. చాలా రోజుల తర్వాత వర్షం పడటంతో చెరు వులన్నీ నీళ్లతో కళకళ లాడు తున్నాయి. ఇక చేరువు కింద వరి సాగు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వరిసాగు చేస్తూ, మిగతా గ్రామాల్లో చెరువులు నిండు కుండలవుతూ ఖరీఫ్ పంట సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.

మాకు తాగడానికి నీళ్లు లేవు మమ్మల్ని పట్టించుకోండి మా ప్రభువు..

మాకు తాగడానికి నీళ్లు లేవు మమ్మల్ని పట్టించుకోండి మా ప్రభువు

జంగాలపల్లి వాసుల ఆవేదన

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-30T132810.272.wav?_=1

పలమనేరు(నేటి ధాత్రి) జూలై 30:

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు రూరల్ మండలంలో ఉన్న పెంగరగుంట గ్రామపంచాయతీ జంగాలపల్లి గ్రామంలో గత నెల రోజులుగా తాగడానికి నీళ్లు లేకుండా గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు గ్రామానికి ఏర్పాటుచేసిన రెండు బోర్లు ఉన్న కూడా గ్రామ ప్రజలకు నీళ్లు ఇవ్వడానికి స్థానిక అధికారులు కానీ సర్పంచ్ కానీ నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తూ తమకు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని గ్రామస్తులు మీడియా సమక్షంలో తెలిపారు 20 రోజులుగా గ్రామానికి నీటి సమస్య ఉందని స్థానిక సచివాలయ సిబ్బంది కూడా గ్రహించకపోవడం వారి పనితీరును గుర్తుచేస్తుంది ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన సర్పంచ్ కూడా ఇలా గ్రామ సమస్యను పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారంటే వారి నాయకత్వ లక్షణాలు కూడా తెలుస్తుంది ఏది ఏమైనా కానీ గ్రామంలో ఉన్న 40 కుటుంబాలకు అందులో ఉన్న వృద్ధులు చిన్న పిల్లలు నీటి సమస్య వల్ల అమితంగా ఇబ్బంది పడుతున్నట్లు మీడియా సమావేశంలో వారు ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో అభివృద్ధి ఏవిధంగా ఉందో తెలుసుకోవచ్చు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జంగాలపల్లె నీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించి వారికి నీటిని ఇస్తారో లేక వారు కూడా నిర్లక్ష్యం వహిస్తారు చూడాలి..

తాగునీటి సమస్య రాకుండా చూస్తాం..

తాగునీటి సమస్య రాకుండా చూస్తాం..

ప్రతి వార్డులో మిషన్ భగీరథ పైప్లైన్ పనులు..

టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు..

రామాయంపేట జూలై 25 నేటి ధాత్రి (మెదక్)

మిషన్ భగీరథ నీళ్లు రాని వార్డులకు తప్పనిసరిగా తాగునీరు అందించాలని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావ్ చెప్పడం జరిగిందని అందులో భాగంగానే రామాయంపేటలో పలు వార్డుల్లో మిషన్ భగీరథ పైప్లైన్ పనులు ప్రారంభించడం జరిగిందని టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డులో మంజీరా స్కూల్ వద్ద మిషన్ భగీరథ పైప్లైన్ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ నీళ్లు సరాపర కానీ కాలనీలకు పైప్లైన్ మరమత్తు పనులు చేయించి అందరికీ మిషన్ భగీరథ నీళ్లు అందేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా ఎమ్మెల్యే రోహిత్ రావ్ కృషి చేస్తున్నారని అన్నారు. ఆ కాలనీలో గత పది సంవత్సరాలుగా నీటి సమస్య, రోడ్లు డ్రైనేజీ సమస్య వచ్చిన ఎవరు పట్టించుకోలేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించడం పట్ల కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు ప్రెసిడెంట్ రెవెల్లి వినయ్ సాగర్, సీనియర్ నాయకులు చింతల స్వామి, ఎనిశెట్టి అశోక్, పోచమ్మల అశ్వినీ శ్రీనివాస్, మరియు కాలనీ పెద్దలు చిలుక ఎల్లయ్య, కరెంట్ గణేష్, ఎనిశెట్టి ఆంజనేయులు, శీలం నరసింహ రెడ్డి, ఎనిశెట్టి వికాస్ తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్ – భారత్‌కు నీటి యుద్ధం సంకేతమా?

బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్ – భారత్‌కు నీటి యుద్ధం సంకేతమా?

బ్రహ్మపుత్ర నది మీద చైనా నిర్మించిన భారీ డ్యామ్ ఇప్పుడు ఆసియా ఖండంలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. భారత్‌లో ఈ ప్రాజెక్టును నీటి యుద్ధానికి పునాదిగా భావిస్తున్నారు.

తిబెట్‌లోని మెడోగ్ ప్రాంతంలో యర్లంగ్ జంగ్‌బో నదిపై చైనా నిర్మిస్తున్న ఈ డ్యామ్ — భారత్‌లో బ్రహ్మపుత్రగా ప్రసరిస్తుంది — ప్రస్తుతం ప్రారంభ దశలోకి వచ్చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులలో ఒకటిగా దీనిని చైనా ప్రకటిస్తోంది.

అసలు సమస్య ఏంటి?

ఈ డ్యామ్ నిర్మాణం భారతదేశానికి, ముఖ్యంగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఆందోళనకరమైన పరిణామాలను తీసుకురావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. బ్రహ్మపుత్ర నది తిబెట్‌లో జన్మించి, భారతదేశంలోకి ప్రవహిస్తుంది. చైనా ఎప్పుడు ఎంత నీటిని నిలుపుతుంది, ఎంత నీటిని విడుదల చేస్తుంది అన్న దాని గురించి భారత్‌కు ముందుగానే సమాచారం ఉండదు.

ఈ విషయం వరదలకూ, కరవులకూ కారణమవుతుంది. అనేక మంది విశ్లేషకులు చైనా ఉద్దేశపూర్వకంగా నీటి ప్రవాహాన్ని నియంత్రించే అవకాశాన్ని ఖండించడం లేదు. ఇది నీటి ఆధిపత్యానికి చైనా ప్రయత్నంగా చూస్తున్నారు.

భారత్‌పై ప్రభావం ఎలా ఉంటుంది?

ఈ డ్యామ్ వల్ల అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లోని మానవ జీవితం, వ్యవసాయం, పర్యావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వరదల ముప్పు పెరగొచ్చు. మరోవైపు, కరవు పరిస్థితులు తలెత్తే అవకాశం కూడా ఉంది.

ముఖ్యంగా, చైనా ముందుగా సమాచారం ఇవ్వకుండా భారీగా నీటిని విడుదల చేస్తే, ఆ ప్రాంతాల్లో ప్రజలపై భారీ విపత్తుల ప్రభావం ఉంటుంది.

ప్రభుత్వ స్పందన:

భారత ప్రభుత్వం ఇప్పటికే చైనా చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాల మధ్య 2002లో “ట్రాన్స్ బౌండరీ రివర్స్” పై ఓ ఒప్పందం ఉన్నా, ఆ ఒప్పందాన్ని చైనా ఉల్లంఘిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందం ప్రకారం, చైనా ఏదైనా చర్య తీసుకునే ముందు భారత్‌కు సమాచారం ఇవ్వాలి.

నిపుణుల హెచ్చరిక:

ఈ ప్రాజెక్ట్ ఒక సాధారణ విద్యుత్ ప్రాజెక్ట్ కాదని, ఇది భవిష్యత్తులో జల రాజకీయాల పేలుడు బిందువుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిపై చైనా ఆధిపత్య ప్రయత్నాన్ని భారత్ నిర్లక్ష్యం చేయకూడదని, నీటి భద్రతపై భారత ప్రభుత్వం మరింత వ్యూహాత్మకంగా పని చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

త్రాగునీరు వృథా కాకుండా పైపులైన్ మరమ్మత్తులు చేపట్టండి..

త్రాగునీరు వృథా కాకుండా పైపులైన్ మరమ్మత్తులు చేపట్టండి..

*కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 23:

నగరంలోని ప్రజలకు సరఫరా అయ్యే త్రాగునీటి పైపులైన్లు మరమ్మత్తులు చేసి నీరు వృథా కాకుండా అరికట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం నగరంలోని 45 వ వార్డులో ప్రజల నుండి వచ్చిన సమస్యలను కార్పొరేటర్ అనీష్ కుమార్, అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పలుచోట్ల త్రాగునీటి పైప్ లైన్ పగిలి నీరు వృథా అవుతోందని పిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఇంజినీరింగ్ అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తులు చేయించాలని అన్నారు. త్రాగునీటి తో మురుగునీరు కలవకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మురుగునీటి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అన్నారు. కొర్లగుంట ఆరోగ్య ఫార్మసీ వద్ద జరుగుతున్న డ్రైనేజీ కాలువ కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవిన్యూ ఆఫీసర్ రవి, ఏసిపి మూర్తి, డి.ఈ.లు రమణ, శిల్ప, శానిటరీ సూపర్ వైజర్ సుమతి తదితరులు ఉన్నారు.

ఎస్సారెస్పీ కాలువకు నీటిని విడుదల చేయాలి-సుంకె..

ఎస్సారెస్పీ కాలువకు నీటిని విడుదల చేయాలి-సుంకె

కరీంనగర్, నేటిధాత్రి:

రైతు వ్యతిరేక కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ బిఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసనకు చేశారు. చొప్పదండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి(హ) ఎస్సారెస్పీ కాలువ నీరు లేక ఎండిపోవడంతో క్రికెట్ ఆడుతూ ప్రభుత్వ పాలనను ఎద్దేవాచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎత్తిపోతల పథకం ద్వారా దిగువనున్న జలాలను ఎగువకు మళ్ళించి ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా లోయర్ మానేరు డ్యాం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, తదితర జిల్లాలకు నీరందించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు ఇచ్చే ఉండి అవకాశం ఉన్నా కూడా పంపులను ఆన్ చేయకుండా వృధాగా దిగువకు విడుదల చేస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. సాగు, త్రాగు నీటికి ఇబ్బంది గురిచేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు రోజుల్లోగా నీటిని విడుదల చేసి రైతులకు అందించకపోతే భారీ ఎత్తున రైతులతో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, మాజీ జడ్పిటిసిలు, మాజీ సర్పంచులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

బీసీ బాలికల హాస్టల్ కు వాటర్ ఫిల్టర్ బహుకరణ..

బీసీ బాలికల హాస్టల్ కు వాటర్ ఫిల్టర్ బహుకరణ

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రం లోని వెనుకబడిన తరగతుల బాలికల హాస్టల్ కు శాయం పేటకు చెందిన క్రీస్తు శేషులు బాసని శంకరయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారులు వినయ భూషణ్ శైలేష్ కుమార్ వాటర్ ఫిల్టర్ ను బహుకరిం చారు. ఈ మేరకు శంకరయ్య సోదరుడు బాసని సుబ్రహ్మ ణ్యం మంగళవారం హాస్టల్ కు వెళ్లి 25 వేల విలువగల వాటర్ ఫిల్టర్ ను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సుష్మాకు అందజేసి ఫిట్టింగ్ చేయించి హాస్టల్ బాలికలకు పరిశుభ్రమైన తాగునీరు కోసం చర్యలు తీసుకున్నారు. ఈ సంద ర్భంగా హాస్టల్ బాలికలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

వాయు కాలుష్యం జల కాలుష్యం చేస్తున్న.

వాయు కాలుష్యం జల కాలుష్యం చేస్తున్న పరిశ్రమలపై తగు చర్య తీసుకోవాలి

★పి. రాములు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో ఉన్న పరిశ్రమలు తమ పరిశ్రమల నుండి వచ్చే చెత్తను స్థానికంగా ఉన్న చెత్త వ్యాపారం చేసే వాళ్లకు ఇస్తున్నారు ఈ వ్యాపారులు చెత్తలో నుండి పునరుత్పత్తి అయ్యే వస్తువులను సేకరించి దేనికి పనికిరాని వస్తువులను అనగా ఫైబర్ రెగ్జిన్ ధర్మాకోల్ లాంటి వస్తువులు బహిరంగ ప్రదేశాలలో వేసి కాల్చి వేస్తున్నారు ఇలా కాల్చివేయడంతో భయంకరమైన వాయు కాలుష్యం ఏర్పడుతుంది అదేవిధంగా చెత్తను కాల్చివేసిన తర్వాత మిగిలిపోయిన బూడిద వర్షపు నీళ్లతో కలిసిపోయి చిన్నచిన్న కాలువల ద్వారా వాగులలోకి చెరిపోతుంది ఇలా చేరిపోయిన నీటిని తాగిన మూగజీవాలు అనేక సందర్భాలలో చనిపోతున్నాయి మరియు చెత్తను కాల్చి వేస్తుండగా ఎవరైనా ప్రశ్నిస్తే కొద్ది రోజులు మానుకొని చెత్తనంతా తీసుకెళ్లి వ్యవసాయ భూముల దగ్గర ఉన్న వ్యవసాయ బావులలో నింపి వేస్తున్నారు. వ్యవసాయ బావులలో నింపివేసిన చెత్తతో అనేక సందర్భాలలో భూగర్భ జలాలు కూడా కాలుష్యం అవుతున్నాయి ఈ విషయాలన్నింటిని కూడా కాలుష్య నియంత్రణ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు ప్రతిరోజు పరిశ్రమల నుండి పనికిరాని టన్నులకొద్ది చెత్త చెత్తలో అనేక రసాయనాలు తో కూడుకున్న వస్తువులను కూడా కాల్చి వేస్తున్నారు వ్యవసాయ భూములలో ఉన్న బావులలో నింపి వేస్తున్నారు. కావున భవిష్యత్తులో జహీరాబాద్ ప్రాంత ప్రజల మూగజీవాల ఆయురారోగ్యాలు కాపాడే విషయంలో తమ ఆదేశాలతో జిల్లా కాలుష్య నియంత్రణ అధికారులతోని కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టేలా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పంట పొలాలకు తాలిపేరు నీటిని విడుదల చేసిన..

పంట పొలాలకు తాలిపేరు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

నేటిదాత్రి చర్ల

చర్ల మండలం పెదమిడిసిలేరు గ్రామంలో తాలిపేరు ప్రాజెక్టు నుంచి ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలకు సాగునీరు అందించడం కొరకు కాలువ గేట్లు ఎత్తి నీళ్లును విడుదల చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

MLA Dr. Tellam Venkat Rao

ఈ ప్రాజెక్ట్ 0. 5 టిఎంసి నీటిని ఉపయోగించుకుంటూ ఈ ఆయకట్టు ద్వారా చర్ల దమ్ముగూడెం మండలాల్లోని గ్రామాలకు చెందిన సుమారు 25000 ఎకరాలకు సాగునీరును అందిస్తుందని తెలిపారు

MLA Dr. Tellam Venkat Rao

ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

MLA Dr. Tellam Venkat Rao

 

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download.wav?_=2

 

జోగంపల్లి చలివాగుప్రాజెక్టు నీటిని విడుదల చేసిన..

జోగంపల్లి చలివాగుప్రాజెక్టు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం జోగం పల్లి చలివాగు ప్రాజెక్టు చెరువు నీటిని దిగువన ఉన్న పంట పొలాలకు నీటిపారుదల శాఖ, ఇతర శాఖల అధికారులు మరియు కాంగ్రెస్ నేతలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొ న్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నీటిని విడుదల చేశారు. అక్కడ తూము వద్ద ఎమ్మెల్యే టెంకాయ కొట్టి, చెరువులోకి పూలు చల్లారు. అనంతరం తూము గేట్ వాల్వ్ ను తిప్పి కిందికి నీటిని వదిలారు. అనం తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రైతులకుఏకకాలం లో రెండు లక్షల రుణమాఫీ చేసిందన్నారు. రైతులు బాగుం టేనే గ్రామాలు అభివృద్ధిచెందు తాయన్నారు.ఈ కార్యక్రమం లో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను అందించిన.!

ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను అందించిన పూర్వ విద్యార్థులు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ 1990-91 పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు రూ .30 వేల విలువైన ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను అందజేశారు. బుధవారం పాఠశాలలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగంగా క్యా తనపల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు మందమర్రి మండల విద్యాధికారి దత్తు మూర్తి చేతుల మీదుగా ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, మండల విద్యాధికారి మాట్లాడుతూ… పాఠశాల విద్యార్థులకు శుద్ధమైన తాగునీటిని అందించేందుకు 1990- 91 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను అందజేయడం అభినందనీయమన్నారు.

ఈ పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని పాఠశాల చదివిన ఇతర విద్యార్థులు కూడా పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధికి అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నత స్థాయికి చేరుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ .శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కోమల, పూర్వ విద్యార్థుల కమిటీ కన్వీనర్ లక్షెట్టి లక్ష్మణ్ మూర్తి, కో కన్వీనర్లు బావండ్ల పెల్లి శ్రీనివాస్, ఈదునూరి సారంగరావు, పి. రమాదేవి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

అధికారుల నిర్లక్ష్యంతో.. నీటి కటకట.

అధికారుల నిర్లక్ష్యంతో.. నీటి కటకట.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

మిషన్ భగీరథ నీరు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు బంద్ అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది దీనికంతటికి కారణం అధికారుల నిర్లక్ష్యం అలసత్వం అసలు పట్టింపు లేకుండా వ్యవహరించడంతో నెలలో ఎన్నోసార్లు నీరు బంద్ కావడం జరుగుతుంది* దీంతో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అధికారుల పనితీరుపై ప్రజా ప్రతినిధులు ఓ కన్ను వేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు నాయకులే నాలుగు గ్రూపులుగా ఉండడమే దీనికి అంతటికి కారణంగా భావిస్తున్నారు.

 

 

Mission Bhagiratha

 

అధికారులకు నాయకుల గ్రూప్ తగాదాలతో ఎవరు పట్టించుకోరు అనే విషయం తెలుసుకున్న అధికారులు దానిని ఆసరాను చేసుకొని జహీరాబాద్ లో అధికారుల నిర్లక్ష్యం చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. కావున అధికారులను పనితీరుపై జహీరాబాద్ లో లీడర్ లు అని చెప్పుకుంటున్న నాయకులు అధికారుల తీరు పై సమీక్షించాలని కోరుతున్నారు.

మంచినీటి బోర్ వెల్ తో ఊరట.

మంచినీటి బోర్ వెల్ తో ఊరట

మందమర్రి నేటి ధాత్రి:

మందమర్రి 24 వ వార్డులో బోర్వెల్ను ప్రారంభించిన యాదవ సంఘం అధ్యక్షుడు బండి సదానందం యాదవ్. మందమర్రి పట్టణంలోని 24వ వార్డులో ఈరోజు యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానంద యాదవ్ నూతన బోర్వెల్ ను ప్రారంభించారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామికి పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణకు పాలాభిషేకం చేసి ఈ సందర్భంగా బండి సదానంద్ యాదవ్ మాట్లాడుతూ 24వ వార్డు ప్రజలకు త్రాగునీటి కోసం పడుతున్న కష్టాలు చూసి ఎమ్మెల్యే గనుల మంత్రి వివేక్ వెంకట స్వామికి చెప్పగా వెంటనే మందమర్రి మున్సిపల్ కమిషనర్ కు ఇంజనీర్ కు ఫోన్ చేసి బోర్వెల్ వేయించమని ఆదేశించగా.

Borewell.

ఈ వార్డులో బోర్వెల్ వేయడం ఈరోజు ప్రారంభించడం జరిగిందన్నారు. మందమర్రి పట్టణ ప్రజలకు ఎలాంటి కష్టాలు ఎదురైనా నేనున్నానంటూ అండగా ఉన్న చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకట స్వామికి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

మంచినీటి బోరు మోటారు ను మరమ్మతులు చేయించిన కాంగ్రెస్ నాయకులు.

మంచినీటి బోరు మోటారు ను మరమ్మతులు చేయించిన కాంగ్రెస్ నాయకులు

గణపురం నేటి ధాత్రి:

 

 

shine junior college

గణపురం మండల కేంద్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని గణప సముద్రం చెరువు కట్ట వద్ద ఉన్న బోరు బావికి భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాలతో మోటార్ బిగించి ప్రారంభించిన మండల అధ్యక్షులు వ్యవసాయ శాఖ ఉపాధ్యక్షులు రేపాక రాజేందర్ వారితో మాజీ వైస్ ఎంపీపీ విదినేని అశోక్ భూపాల్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కటుకూరి శ్రీనివాస్ అధికార ప్రతినిధి మామిండ్ల మల్లికార్జున్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కృష్ణ గోలి రవి గ్రామపంచాయతీ సిబ్బంది సాంబయ్య

3 మండలాలకు నిలిచిపోనున్న మిషన్ భగీరథ నీరు.

3 మండలాలకు నిలిచిపోనున్న మిషన్ భగీరథ నీరు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

హుగ్గేలి చౌరస్తా వద్దా NIMZ రోడ్డు విస్తరణ లో మిషన్ భగీరథ పైపు లైన్ రోడ్డు కిందకి పోతున్నందున కొత్త పైప్‌లైన్ వేయడం జరుగుతుంది.ఇందుచేత 2 రోజుల పాటు జహీరాబాద్ మున్సిపాలిటీ, జహీరాబాద్, మొగుడంపల్లి,కోహీర్ మండలంలో మరియు ఝరాసంగం లో 10 గ్రామాలు మిషన్ భగీరథ నీరు నిపివేయడం జరుగుతుంది.

నల్లాల నీళ్లు రాకపోవడంతో.

నల్లాల నీళ్లు రాకపోవడంతో
రవినగర్ గ్రామస్తుల నిరసన

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండలంలోని పరశురాంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రవి నగర్ లో నల్లాలు రాకపోతుండడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా గ్రామస్తులు గ్రామంలో నీటి వసతి కొరకు ఏర్పాటుచేసిన బోర్ లు పనిచేయకపోతుండటంతో పాటు ఓహెచ్ ద్వారా అందించాల్సిన తాగు నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి తమకు నీటి వసతి ఏర్పాటు చేయాలని శుక్రవారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ పని ప్రదేశంలో ప్రథమ చికిత్స నీడ నీటి సౌకర్యాలు కల్పించాలి.

ఉపాధి హామీ పని ప్రదేశంలో ప్రథమ చికిత్స నీడ నీటి సౌకర్యాలు కల్పించాలి.

డి ఆర్ డి ఓ.పోరిక బాల కృష్ణ

చిట్యాల నేటిధాత్రి:

జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల ప్రజా పరిశత్ కార్యాలయం వారంతా సమావేశంనకు ముఖ్య అడతిథులు గా డి ఆర్ డి ఓ పోరిక బాల కృష్ణ (జిల్లా గ్రామీన అభివృద్ధీ అధికారి హాజరయ్యారు
ఈ సందర్బంగా డిఆర్ ర్డీవో మీటింగ్ లో మాట్లాడుతూ దీనసరి కూలి 307/- రూపాయలు వచ్చు విధంగా మా సిబ్బంది కి సూచనలు చేశాము వాళ్ళు చెప్పిన కొలతల ప్రకారం పని చేసి 300 ల నుండి 307 రూపాయలు వచ్చు విధంగా పని చేయమని చెప్పారు
అదేవిధంగా పని వద్ద కచ్చితంగా నీడ, ప్రధమ చికిత్స పెట్టె, నీటి సౌకర్యం విధిగా పంచాయతీ కార్యదరషులకు కల్పించాలని చెప్పారు
తర్వాత రేపు రాబోయే వనమహోత్సవం కార్యక్రమమాo క్రింద తీసుకున్న స్థలాలను పంపించి టార్గెట్ ప్రకారం నాటించాలి అని చెప్పారు
ఎస్సి ఎస్టీ చిన్న సానకారు రైతులకు పండ్ల తోటలపథకం క్రింద అర్హులైన లబ్దిదారులను గుర్తించాలని చెప్పాడు
మండల కార్యాలయనకు వచ్చిన పంచాయతీ కార్యదర్శులకి ఫీల్డ్ అసిస్టెంట్స్ కి సమీక్ష సమావేశం తీసుకున్నారు
ఈ కార్యక్రమం లొ జయశ్రీ ఎంపీడీఓ క్వాలిటీ కాట్రోలర్ ధర్మషింగ్ , ఏపీవో అలీం,సాంకేతిక సహాయకులు, సుధాకర్, అపర్ణ, స్వామి, స్రవంతి , పంచాయతీ కార్యదర్శలు,స్వచ్చా జిల్లా కోర్డినేటర్ వెంకటేష్, ఫీల్డ్ అసిస్టెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

గోపన్ పల్లి చెరువుకు చుక్క నీరు ఇవ్వలేదు.

‘గోపన్ పల్లి చెరువుకు చుక్క నీరు ఇవ్వలేదు’

దేవరకద్ర నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోపన్ పల్లి గ్రామ రైతు వేదిక వద్ద ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి రైతులకు శనివారం జీనుగ విత్తనాలు, సబ్సిడీ స్ప్లింక్లర్ పైపులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి.. గోపన్ పల్లి సమీపం మీదుగా వెళుతున్న.

Gopanpalli pond

గోపన్ పల్లి చెరువుకు చుక్క నీరు ఇవ్వలేదని విమర్శించారు. గత ప్రభుత్వం రైతులకు సబ్సిడీ పైపులను, విత్తనాలను ఇవ్వలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అనేక సబ్సిడీ పథకాలు ప్రవేశపెట్టి రైతులకు అందజేశామన్నారు. తమది రైతుల ప్రభుత్వమన్నారు. అనంతరం గ్రామంలో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

ఆగని నీటి కష్టాలు….

ఆగని నీటి కష్టాలు….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ 12వ వార్డులో గత వారం పది రోజులుగా ప్రజలకు సరిపడా మంచి నీరు బోర్, మంజీరా నీరు రావటం లేదు. ప్రతి ఎండాకాలం వచ్చిందంటే చాలు హౌసింగ్ బోర్డు చివరి కాలనీ లో నీటి సమస్య ప్రతిసారి ఉంటుంది. అంబంధిత అధికారులకు తెలిసిన పటించుకోవడం లేదు. వాటర్ మ్యాన్ డబ్బులు తీసుకొని తెలిసిన వారికి గంటల కొద్ది నీరు వదులుతున్నారు. కాని సామన్య ప్రజలకు మాత్రం కొద్దిసేపు వదిలి ఆఫ్ చేస్తున్నారు. పై స్థాయి అధికారులు స్పందించి కాలనీ వాసులు కొత్త బోర్ వేయించి మంచి నీటి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.

తాగునీటి ఎద్దడి పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం.

ఝరాసంగం తాగునీటి ఎద్దడి పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం

జహీరాబాద్ నేటి ధాత్రి :

 

 

జహీరాబాద్ ఝరాసంగం మండల గ్రామాల్లో బంగ్లాగడ్డ కాలనీ ప్రజలు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురైతున్న సంఘటనలు బంగ్లాగడ్డ కాలనీ చోటుచేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముందే ఎండాకాలం భానుడి భగభగ తో మునిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు సాధారణంగా అరకొరగా సప్లై అవుతున్న మంచి నీరు ఎండాకాలం వచ్చేసరికి మంచి నీటి సరఫరాలో తీవ్ర అంతరాయము ఏర్పడి నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులకు గురైతూన్నట్లు ప్రజలు తమ గోస చెప్పారు.

 

Jhara Sangam

జిల్లా కలెక్టర్‌ గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా మండల, గ్రామ స్థాయి మిషన్ భగీరథ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. 5 రోజుల నుంచి గ్రామంలో గల వేసిన బోరులో నీరు రావడం లేదని, మిషన్‌ భగీరథ నీటి సరఫరా కూడా మాత్రం రావడం లేని వల్ల బంగ్లా గడ్డ కాలనీ గ్రామస్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామంలో ఒకటి బోరు ఉన్నా,ఆ బోరులో నీళ్లు సరిగా లేవని స్థానిక అధికారులు తెలిపారు. ఈ విషయమై పలు మార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో పక్కన ఉన్న ఇళ్లలో ఉన్న బోర్ల యజమాన్యులను అడిగి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.ఇంటింటికీ తాగునీరందించేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో తీసుకువచ్చిన మిషన్‌ భగీరథ పథకంపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో నీరు వృథాగా పోతున్నది.అయినప్పటికీ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రజలు తెలిపారు.

Jhara Sangam

ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అవసరపడిన గ్రామాలకు చేసి నీటి వృథాను అరికట్టాలని డిమాండ్‌ చేశారు.ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని, లేకుంటే ఆందోళన చేయాల్సి వస్తోందని ప్రజలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version