ఘనంగా పోచమ్మ తల్లి బోనాల జాతర
నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని 23వ వార్డులో ఆదివారం ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు అమ్మవారికి సమర్పించినట్లు ఆలయ కమిటీ వారు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేడుకలు జరపడం తృతీయ సంవత్సరమని ప్రతి సంవత్సరం అమ్మవారిని అలంకరించి బోనాలతో అమ్మవారికి మొక్కలు చెల్లిస్తామని అన్నారు.అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి వద్ద పెద్ద ఎత్తున బోనాల సందడి నెల కోవడం జరిగింది.నస్పూర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి పోచమ్మ దేవాలయం వరకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో అక్కడికి చేరుకొని, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి మొక్కులు సమర్పించుకున్నారు.డప్పు చప్పుళ్ళు తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మారు మోగింది.శివ సత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది.ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం చాలా సంతోషంగా ఉందని,అమ్మవారి ఆశీస్సులు ప్రజల అందరిపై ఉండి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా చూడాలని అమ్మవారికి ఆలయ కమిటీ వారు ప్రత్యేక పూజలు సమర్పించారు.