కల్లు కాంపౌండ్లపై చర్యలు తీసుకోవాలి.

కల్లు కాంపౌండ్లపై చర్యలు తీసుకోవాలి

కల్తీ కల్లు బాధితులు పెరగడం ఎక్సైజ్, ఆబ్కారీ శాఖ అధికారుల నిర్లక్ష్యమే

ఎన్ హెచ్ ఆర్ సి. గ్రేటర్ హైదరాబాద్ అధికార ప్రతినిధి ఎస్వి సురేష్ రెడ్డి

“నేటిధాత్రి”,

సెక్రటేరియట్ (హైదరాబాద్): నగరంలో పలుచోట్ల ప్రమాదకరమైన మత్తు పదార్థాలతో కల్లు తయారుచేసి విక్రయిస్తున్నట్లు తెలిసినా కూడా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే యదేచ్చగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నాయని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) గ్రేటర్ హైదరాబాద్ అధికార ప్రతినిధి ఎస్ వి సురేష్ రెడ్డి అన్నారు. దీనివల్ల నగరంలో కల్తీ కల్లు బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. నగరంలో పలుచోట్ల జరిపిన కెమికల్ ఎగ్జామినేషన్ లో ప్రమాదకరమైన ఆల్ఫ్రాజోలం పదార్థం ఉన్నట్లు తేలిందని అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే కల్తీ కల్లు విక్రయం నిరాటకంగా కొనసాగుతుందని ఆయన అన్నారు. కల్తీ కల్లు విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్, ఆబ్కారీ శాఖ అధికారులు అందుకు విరుద్ధంగా చట్టంలోని లొసుగులను విక్రయదారులకు చెప్పి మరీ అమ్మకాలు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని ఆయన అన్నారు. హైదరాబాదులో తయారవుతున్న కల్లు 90 శాతం కల్తీయేనని అధికారులు ఇప్పటికే గుర్తించారని అయినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సంబంధిత అధికారుల పాత్రపై విచారణ చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసలు నగరానికి కనుచూపుమేరలో తాడిచెట్లు లేని విషయం అందరికీ తెలుసని అయినప్పటికీ నగరంలో 97 కల్లు దుకాణాలు ఉన్నట్లు అధికారికంగా లెక్కలు చెబుతున్నప్పటికీ అంతకుమించి అనధికారికంగా ఇష్టానుసారం కల్లు దుకాణాలు నడుపుతున్నట్లు సమాచారం ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కల్లు దుకాణాల అనుమతులను రద్దు చేయాలని, వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు ఎలా వచ్చాయో సమగ్ర విచారణ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రెటరీ తిరునగరి లావణ్య, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాజీ సర్పంచ్ భాస్కర్ నాయుడు మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన.

మాజీ సర్పంచ్ భాస్కర్ నాయుడు మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన

చిత్తూరు ఎంపి
దగ్గు మళ్ళ ప్రసాద రావు

చిత్తూరు(నేటి ధాత్రి) జూలై 15:

గంగాధర నెల్లూరు నియోజకవర్గంవెదురుకుప్పం మండలం, గొడుగు చింత గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, టిడిపి పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ నాయుడు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు అలాగే ఆయన కుటుంబ సభ్యులకు
ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారురాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఢిల్లీ పర్యటన నేపథ్యంలో
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు మాజీ సర్పంచ్ భాస్కర నాయుడు మరణం వార్తను,టీడీపీ శ్రేణుల ద్వారా తెలుసుకున్నారు.ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
సౌమ్యలైన భాస్కర నాయుడు పార్టీ బలోపేతానికి అంకితభావంతో పని చేసారని గుర్తు చేసిన చిత్తూరు ఎంపీ భాస్కర నాయుడు లేని లోటు పార్టీకి తీర్చలేనిదన్నారు.
ఈ విషాద సమయంలో
ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం, శక్తిని ఇవ్వాలని, భాస్కర్ నాయుడు పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు,

లాదెళ్ల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం .

https://youtu.be/EC5Z8gibvKc?si=55Iebk-pbIpN8u87
లాదెళ్ల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం 
52మందికి రక్త,మూత్ర పరీక్షలు నిర్వహించి ఉచిత మందుల పంపిణీ 
పరకాల నేటిధాత్రి 
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ ఆధ్వర్యంలో మంగళవారం పరకాల నియోజకవర్గ పరిధి దామెర మండలంలోని లాదెళ్ల గ్రామంలో రూరల్ హెల్త్ సెంటర్ లో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా బిపి.ల్,షుగర్,రక్త  పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు.ఈ సందర్బంగా చైర్మన్,పాలకవర్గం మాట్లాడుతూ లాదెళ్ల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించి 52 మందికి ఉచితంగా మందులు పంపిణి చేయడం జరిగిందని తెలిపారు.సీజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.ఈ ఆరోగ్య శిబిరంలో రెడ్ క్రాస్ డాక్టర్లు డాక్టర్.కిషన్ రావు,డాక్టర్.మొహమ్మద్ తయార్ మసూద్,రెడ్ క్రాస్ సిబ్బంది గుల్లెపెల్లి శివకుమార్,గంగాధర్,సతీష్, శ్రీకాంత్,నర్సింహ చారి,కిట్స్, జి.వర్షిత్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

దేశాన్ని రక్షించేది కమ్యూనిస్టులే…

దేశాన్ని రక్షించేది కమ్యూనిస్టులే…

సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు

నర్సంపేటలో ఘనంగా సిపిఐ మండల మహాసభలు

నర్సంపేట,నేటిధాత్రి:

CPI State Assistant

ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని రక్షించేది కమ్యూనిస్టులేనని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు.మంగళవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో సీపీఐ మండల 14 వ మహాసభ ఘనంగా జరిగింది.పట్టణంలోని మేర భవన్ లో గడ్డం నాగరాజు, పిట్టల సతీష్ అధ్యక్షతన జరిగిన మహాసభకు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మతతత్వ రాజకీయాలతో దేశ ప్రజలను బీజేపీ విభజిస్తున్నదని విమర్శించారు.కేంద్రంలోని నరేంద్ర మోడీ పాలనలో ప్రజాస్వామ్యం గొంతునొక్కుతూ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ శక్తులకు దాసోహం అయిందని పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ ను పరుస్తూ లక్షల కోట్ల రూపాయలను రాయితీలు ఇస్తూ ప్రజల సంక్షేమం మరిచి ప్రజాస్వామ్య గొంతును, ప్రజల గొంతుకను అణిచివేస్తూ కేంద్రం రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను తుంగలో తొక్కుతున్నదన్నారు. రచయితలను, కవులను, కళాకారులను, విద్యావేత్తలను అణిచివేస్తూ ప్రజాస్వామ్య మంటగలుపుతున్నారని, కేంద్రంలో జాతీయవాదం పేరుతో హిందుత్వ ఏజెండాతో ముస్లిం, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులపై విషం కక్కుతూ ప్రశ్నించే గొంతుకను నొక్కుతున్నారని అన్నారు. నిరుద్యోగం, ఆకలి, దారిద్రం నిరంతరం పెరుగుతూ పేదలకు విద్య, వైద్యం అందక ప్రజలు ఆందోళన కు గురవుతున్నా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలను ఆదుకోవాలని, పేదలు వేసుకున్న గుడిసెలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి పక్కా ఇల్లు నిర్మించాలని ఆయన అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం ఆదివాసీలను హత్య చేస్తున్నదని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ఫాసిస్ట్ చర్యలను మేధావులు, విద్యార్థులు ఐక్యంగా వ్యతిరేకించాలన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తొలుత సిపిఐ సీనియర్ నాయకులు సుంకరనేని బాలనరసయ్య అరుణ పథకాన్ని ఆవిష్కరించారు.ఈ మహాసభలలో సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ బాసు మియా,పనాస ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు అక్కపల్లి రమేష్, గుంపెల్లి మునిశ్వరుడు, గుండె బద్రి, తోట చంద్రకళ,సిపిఐ జిల్లా సమితి సభ్యులు కందిక చెన్నకేశవులు దిండి పార్థసారథి మియాపురం గోవర్ధన్ పాలక కవిత గడ్డం యాకయ్య పిట్టల సతీష్ ఇల్లందులో సాంబయ్య మమత శైలజ బాధరా పోయిన గడ్డం నాగరాజు వెంకన్న నాయకులు పాల్గొన్నారు.

చదువుకి దూరం అవుతున్నాడని తెలుసుకొని.

చదువుకి దూరం అవుతున్నాడని తెలుసుకొని సైకిల్ సహాయం చేసిన రవి

జహీరాబాద్ నేటి ధాత్రి:

చిలేమామిడి గ్రామం లోని పిచ్చకుంట్ల నాగరాజు అనే విద్యార్థి zphs జీర్లపల్లి పాఠశాలలో 6th class చదువుతున్నాడు నాగరాజు తండ్రి మరణించాడు తల్లి డబ్బులు లేక ఇంటి దగ్గరనే పిల్లల్ని ఉంచింది విషయం తెలుసుకున్న CRP చిరంజీవి చిలేమామిడి గ్రామం కి వెళ్లి పిల్లల్ని ZPHS జీర్లపల్లి స్కూల్ లో జాయిన్ చేయడం జరిగింది స్కూల్ కి రావడానికి ఇబ్బంది అవుతుంది అని తెలుసుకొని ఝరాసంగం రవి కి తెలియజేయగా వెంటనే విద్యార్థి కి సైకిల్ సహాయం చేయడం జరిగింది.

ఉపాధి హామీ కార్మికుల వేతన బకాయిలు విడుదల చేయాలి.

ఉపాధి హామీ కార్మికుల వేతన బకాయిలు విడుదల చేయాలి…

నేటి ధాత్రి -గార్ల :-

మండల పరిధిలోని గార్ల,ముల్కనూర్, చిన్నకిష్టపురం,పెద్దకిష్టాపురం, సత్యనారాయణపురం, శేరిపురం,మర్రిగూడెం, పుల్లూరు,పోచారం, గోపాలపురం, పినిరెడ్డిగూడెం, సీతంపేట,మద్దివంచ, రాంపురం తదితర గ్రామపంచాయతీలలో పనిచేసిన ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఉపాధి హామీ పథకం కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.అసౌకర్యాల నడుమ మండుటెండల్లో చెమట చిందించి పనిచేసిన కార్మికులకు 15 రోజులకు ఒకసారి వేతనాలు చెల్లించే విధానాన్ని పాలకులు స్వస్తి పలికారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేసి నెలలు గడుస్తున్నప్పటికీ వేతనాలు ఇవ్వకపోతే కూలీలు ఏమి తిని బ్రతుకుతారని ప్రశ్నిస్తున్నారు. వేతనాలు అందక అనేక కుటుంబాలు సుదుల ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి దాపురించిందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని లేనిపక్షంలో ప్రజలు సరైన సమయంలో పాలకులకు గుణపాఠం చెబుతారని ప్రజాసంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు..

కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుని జన్మదిన.!

ఘనంగా కాంగ్రెస్ మండల పార్టీ యువజన అధ్యక్షుని జన్మదిన వేడుకలు

పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల యువజ న కాంగ్రెస్ అధ్యక్షుడు సాధు నాగరాజు జన్మదినం సంద ర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నాగరాజుకు శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాగరాజు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరె న్నో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. భగవంతుడి ఆశీస్సులతో ఆయురారోగ్యా లతో ఉండాలని కోరారు.

సి ఆర్ నగర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ.

సి ఆర్ నగర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపాలిటీ పరిధిలోని సి ఆర్ నగర్ లో భూపాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. వార్డు ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అనంతరం
సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించారు
ఈ కార్యక్రమంలో డాక్టర్ శారద, వి బృందా. శ్రీదేవి ఏఎన్.ఎంలు రమ, కరుణ,ఆశ వర్కర్లు స్వరూప,అరుణ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం.. ఇందిరమ్మ పాలన.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం.. ఇందిరమ్మ పాలన

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

బిఆర్ఎస్ బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

నర్సంపేట,నేటిధాత్రి:

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం అని.. నేడు రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఇందిరమ్మ పాలన నడుస్తుందని
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.
దుగ్గొండి మండలం గుడ్డేలుగులపల్లి గ్రామం నుంచి బిఆర్ఎస్,బిజెపి పార్టీలకు చెందిన 9 కుటుంబాలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే
దొంతి మాధవ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు.ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.తనను నమ్మివచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని,ప్రజా ప్రభుత్వ ప్రతి సంక్షేమ పథకాన్ని నర్సంపేట నియోజకవర్గంలో అర్హుడైన ప్రతి లబ్ధిదారుడికి అందే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారు.పార్టీలో చేరిన వారిలో ఏడ్డే బాపూరావు, పేరం రాజు,వేల్పుల అశోక్, వేల్పుల నాగరాజు, వేల్పుల సిద్దు,తౌట్ రెడ్డి రాజిరెడ్డి, కొమాండ్ల రాజేందర్, నల్ల సంజీవ, మంద కుమారస్వామి ఉన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నూరు కిరణ్ రెడ్డి,మండల కోశాధికారి జంగిలి రవి,గుడ్డెలుగులపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు జంగిలి నగేష్,తొర్రూరు నర్సయ్య, జంగిలి రాజు, జంగిలి రమేష్,తొర్రూర్ రవి, తొర్రుర్ రామన్న, గుండెకారి సునీల్, , పిఎసిఎస్ దుగ్గొండి మాజీ డైరెక్టర్ పొగాకు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ బాలికల హాస్టల్ కు వాటర్ ఫిల్టర్ బహుకరణ..

బీసీ బాలికల హాస్టల్ కు వాటర్ ఫిల్టర్ బహుకరణ

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రం లోని వెనుకబడిన తరగతుల బాలికల హాస్టల్ కు శాయం పేటకు చెందిన క్రీస్తు శేషులు బాసని శంకరయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారులు వినయ భూషణ్ శైలేష్ కుమార్ వాటర్ ఫిల్టర్ ను బహుకరిం చారు. ఈ మేరకు శంకరయ్య సోదరుడు బాసని సుబ్రహ్మ ణ్యం మంగళవారం హాస్టల్ కు వెళ్లి 25 వేల విలువగల వాటర్ ఫిల్టర్ ను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సుష్మాకు అందజేసి ఫిట్టింగ్ చేయించి హాస్టల్ బాలికలకు పరిశుభ్రమైన తాగునీరు కోసం చర్యలు తీసుకున్నారు. ఈ సంద ర్భంగా హాస్టల్ బాలికలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

బాలాజీ టెక్నో స్కూల్ లో ప్రపంచ యువజన.

బాలాజీ టెక్నో స్కూల్ లో ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్లో ఎన్.సి.సి పదవ బెటాలియన్ ఆదేశాల మేరకు సోషల్ సర్వీస్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ యం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ పి.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ యువతకు నైపుణ్యాలు చాలా అవసరమని, నైపుణ్యాలతోటే భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు పాఠశాల దశ నుండే చదువుతో పాటుగా వివిధ రంగాల్లో నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి రాజీవ్ యువ వికాసం లాంటి అనేక సంక్షేమ పథకాలను అందించేందుకుఅనేక కార్యక్రమాలను, నైపుణ్య శిబిరాలను నిర్వహిస్తున్నాయని, వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు నైపుణ్యాల యొక్క ప్రాముఖ్యతను, ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం- 2025 యొక్క ఉద్దేశం గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భవాని చంద్,రమేష్,నరసింహారెడ్డి, కృష్ణవేణి,అనిత,హేమలత, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

బాలాజీ ఇంటిగ్రేటెడ్ అక్షరలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం.

బాలాజీ ఇంటిగ్రేటెడ్ అక్షరలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం

నర్సంపేట,నేటిధాత్రి:

బాలాజీ విద్యాసంస్థల్లో ఒక్కటైన అక్షర ద స్కూల్, బిట్స్ స్కూల్లో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమం పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

Dr. A. Rajendra Prasad Reddy, Head of Balaji Educational.

బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ వనజ పాల్గొని వన మహోత్సవం సందర్భంగా విద్యార్థులు గ్రీన్ కలర్ దుస్తులు ధరించి ఇంటి వద్ద నుండి తీసుకొచ్చిన మొక్కలను పాఠశాల ఆవరణలో పిల్లలతో మొక్కలు నాటించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో దోహదపడతాయని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని తెలిపారు.అనంతరం వన మహోత్సవం పై డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల సెక్రటరీ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి,బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి,అక్షర స్కూల్ ప్రిన్సిపల్ జి. భవాని,ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.

కబడ్డీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోలేపాక జనార్ధన్.

తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోలేపాక జనార్ధన్

ములుగు జిల్లా, నేటిధాత్రి

ములుగు జిల్లా పత్తిపల్లి గ్రామస్తుడైన పోలేపాక జనార్దన్ చిన్నప్పటినుండి గురుకులంలో చదువుకుంటూ కబడ్డీలో రాణిస్తూ చాలా రోజులుగా ములుగు జిల్లా కబడ్డీ అసోసియేషన్ లో సెక్రెటరీ గ ఉంటూ అదనంగా జనార్ధన్ కు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గ ఎన్నిక కావడం జరిగింది. పోలెపాక జనార్దన్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు బాధ్యతలు అప్పగించినందుకు అదేవిధంగా దీనికి ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాసాని వీరేశం అదేవిధంగా రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సెక్రెటరీ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇండియన్ కబడ్డీ ప్లేయర్ కబడ్డీ రథసారథి మహేందర్ కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

వనపర్తిలో ఎమ్మెల్యే కృషితో మిగిలిపోయిన..

వనపర్తిలో ఎమ్మెల్యే కృషితో మిగిలిపోయిన రోడ్ల విస్తరణ పనులు ప్రారంభం

వనపర్తి నేటిదాత్రి ,

వనపర్తి పట్టణంలో కర్నూల్ రోడ్డు పాన్ గల్ కొత్తకోట రోడ్డులో నిలిచి పోయిన రోడ్ల విస్తరణ పనులు స్థానిక ఎమ్మెల్యే ప్రజల కోరిక మేరకు రోడ్ల విస్తరణ పనులు చేయిస్తున్నందుకు ప్రజలు హర్షం
వ్యక్తం చేస్తున్నారు ఎంతో కాలం గా కర్నూల్ రోడ్ పా న్ గల్ కొత్తకోటరోడ్డు విస్తరణకు నోచుకోకపోవడంతో రోడ్డు కటింగ్ పెండింగ్ లో ఉంచినట్లు ప్రచారంలో ఉంది . వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి కర్నూల్ రోడ్ పానగల్ రోడ్డు విస్తరణలో నష్టపోయే బాధితులను స్వయంగా కలిసి వారి అభిప్రాయాలు తీసుకున్నారు . కర్నూల్ రోడ్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ తన భవనాన్ని స్వచ్ఛందంగా కూలగొట్టుటకు ముందుకు వచ్చినందుకు ఎమ్మెల్యే మెగా రెడ్డి అభినందించారు . భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని వివేకానంద రాజావారి పాలిటెక్నిక్ కళాశాల రోడ్డు నుండి మరి కుంట వరకు పానగల్ రోడ్డు కొత్తకోట రోడ్డు వెడల్పు పనులు చేయిస్తున్నందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతునారు వనపర్తి లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వనపర్తి లో రోడ్ల విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయించాలని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఫాదర్ పాషా ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి జిల్లా కలెక్టర్ మున్సిపల్ ఆర్ అండ్ బి అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు రోడ్ల విస్తరణ పనులు చేయిస్తున్న వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి జిల్లా అధికారులకుఒక ప్రకటన లో కృతజ్ఞతలు తెలిపారు

వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన.

వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో పర్యటించారు. రూ.52 లక్షలతో వివిధ గ్రామాలల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా ధర్మారావుపేట గ్రామంలో ఎమ్మెల్యే యంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలతో గ్రామంలోని శివాలయం ప్రహరీ గోడ నిర్మాణ పనులు పూర్తి చేయగా, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం బసవరాజుపల్లి గ్రామంలో యంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు, రూ.12 లక్షలతో నూతన అంగన్వాడి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. గొల్లపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో పంచాయతీరాజ్ రోడ్డు నుండి పోచమ్మ ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. భూపాలపల్లి నియోజకవర్గంలో అన్ని గ్రామాల సమగ్రాభివృద్దే తన ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేసి, రాష్ట్రంలోనే భూపాలపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే వెంట పలువురు అధికారులు, ఎంపీడీవో ఎల్ భాస్కర్ మండల అధ్యక్షుడు జిల్లా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ ఎంపీటీసీ భవిత సుధాకర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కట్ల మల్లయ్య భాస్కరరావు చింతకుంట్ల శ్రీను పైసా మొగిలి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

తీన్మార్ మల్లన్న పై దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన.

తీన్మార్ మల్లన్న పై దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద మొన్న తీన్మార్ మల్లన్న పై జరిగిన దాడిని ఖండిస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈసందర్భంగా బీసీ నాయకులు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న అనుచిత వాక్యాలు చేశాడు.అని చెప్పి తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి చేయడాన్ని బీసీ సమాజం పై దాడిగా భావిస్తున్నాం అని అన్నారు.ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం మన సంస్కృతి కాదు మల్లన్న పై దాడికి ఉసిగొలిపిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.తీన్మార్ మల్లన్న పార్టీ పెడితే మా పప్పులు ఏమి ఉడకవని అన్న ఉద్దేశంతో దాడికి పాల్పడిందని భావిస్తున్నట్లు తెలిపారు.ఇలాంటి ఘటన పునరావృత్తం అయితే కలవకుంట్ల కవిత బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు అని హెచ్చరిస్తున్నాం.తీన్మార్ మల్లన్నకు బీసీ సమాజం అండగా నిలుస్తుందని ఈసందర్భంగా తెలియజేస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, తుల మధుసూదన్ రావు, శాఖ పురం భీమ్సేన్,గజ్జెల్లి వెంకన్న,చంద్రగిరి చంద్రమౌళి, ఆరెంధుల రాజేశం,వేముల అశోక్,శాఖ పురం కోటేశ్వరరావు,కీర్తి బిక్షపతి, అంకం సతీష్,నగునూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

దుండగుడిని శిక్షించాలి.

దుండగుడిని శిక్షించాలి
ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు గరుగుల శ్రీనివాస్

నిజాంపేట: నేటి ధాత్రి

కుల్చారం మండలంలో సబ్ స్టేషన్ సమీపంలో పైతారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత అనిల్ ను దారుణంగా హత్య చేసిన దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని మెదక్ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు గరుగుల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చైతన్య కార్యకర్తగా పేరు తెచ్చుకున్న వ్యక్తిని హత్య చేయడం దారుణమన్నారు. హత్య చేసిన దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి దుండగులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల త్వరగా పూర్తి చేయాలి.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల త్వరగా పూర్తి చేయాలి

ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలోని డిగ్రీ కళాశాల త్వరగా పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు
బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ వివిధ గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు చదువుకుందామని
కాలేజీకి వస్తే రూమ్స్ లేక
తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని,ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాణ్యతగా నిర్మించి త్వరగా పూర్తిచేయలన్నారు.స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వెంటనే స్పందించి కాంట్రాక్టర్ లకు ఆదేశాలిచ్చి త్వరగాతినా బిల్డింగ్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్,పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్,ఎస్ఎఫ్ఐ నాయకులు అరవింద్,మహేష్,విజయ్,అరుణ్,సాయి కృష్ణ పాల్గొన్నారు.

నూతన కలెక్టరేట్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలి.

నూతన కలెక్టరేట్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

* నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన కలెక్టర్*

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:*

Collector

నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణా పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం వరంగల్ లోని పాత ఆజంజాహి మీల్స్ గ్రౌండ్లో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన సముదాయాలను సందర్శించి పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ కార్యాలయాల సముదాయాలలో మూడు అంతస్తుల నిర్మాణాలను,కలెక్టర్ క్వార్టర్స్,అడిషనల్ కలెక్టర్ క్వార్టర్స్ మొదటి, రెండవ అంతస్తులలో

Collector

డిజైన్ ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అని పరిశీలించారు. స్ట్రక్చరల్ పనులు పూర్తయినందున ఫీనిషింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, అవసరమైన సిబ్బందిని వనరులను వియోగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.రోడ్లు,కాంపౌండ్ వాల్, పైప్ లైన్ తదితర నిర్మాణ పనులను కూడా ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించి సమర్థ నిర్వహణకు పలు సూచనలు చేశారు.కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి,జిల్లా రోడ్ల భవన అధికారి రాజేందర్,డి.ఈ శ్రీధర్,నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ సందీప్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ వసూళ్ల దోపిడీ.

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ వసూళ్ల దోపిడీ

యూరియా కోసం చెప్పులను లైన్ లో పెట్టే పరిస్థితి

అధికారపార్టీ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాం.

నర్సంపేట,నేటిధాత్రి:

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఠా వసూళ్ల దోపిడీ చేస్తున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం,స్థానిక కాంగ్రెస్ నాయకులపై ఫైర్ అయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ,ఎమ్మెల్యేలు,నాయకులు ప్రాముఖ్యతను తగ్గించారని పేర్కొన్నారు.నర్సంపేటలో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వందల కోట్ల నిధులతో పనులను చేపట్టగా ఆ పాత పనులను మాధవరెడ్డి సొంత కాంట్రాక్ట్ మార్చుకుంటున్నాడని ఆరోపించారు.అలాగే తండాలలో కొన్ని కోట్ల బిటి రోడ్ల పనులు చేపట్టగా వంద శాతం పనులను రద్దుచేసారని ధ్వజమెత్తారు.అలాగే రైతులకు రుణమాఫీ పట్ల ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం వల్లనే ఆ రుణ మాఫీ పూర్తికాలేదన్నారు.రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు పేరుతో రద్దుచేస్తుందని ఎద్దేవా చేశారు.
జిల్లా వ్యాప్తంగా వాటాల కోసం కాంగ్రెస్ నాయకుల మధ్య కొట్లాట కుక్కల కొట్లాటగా మారిందని, సొంత కాంట్రాక్ట్ పనుల కోసం పాత పనులను రద్దు చేసి, సొంత కాంట్రాక్ట్ కంపెనీకి అగ్రిమెంట్ అయ్యేలా వాటినే కొత్తగా మంజూరు అయ్యాయంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపై పరోక్షంగా ఆరోపించారు.
రైతుల కోసం యూరియాపై సంబంధిత అధికారులతో ఎప్పుడైన సమీక్షించారా.?అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు.కాగా మళ్ళీ పాతరోజులు తెస్తామంటూ చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నేడు రైతులు యూరియా కోసం చెప్పులను లైన్ లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు.
నర్సంపేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా మట్టిదందా చేస్తుంటే రెవిన్యూ అధికారులు దందాలో వాటా దారులుగా ఉన్నారని పేర్కొన్నారు.గత ప్రభుత్వ హాయంలో మంజూరైన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అడ్డుకున్న వివరాలు,ఆయన అనుచరుల అరాచకాలను రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలకు వివరించి ప్రజల తీర్పుతో అధికారపార్టీ నాయకులు ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, మాజీ ఎంపీపీ పద్మనాభరెడ్డి ,మాజీ జెడ్పీటీసీ జయ గోపాల్ రెడ్డి , మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నరసింహరాములు, మోటూరి రవి,వల్లాల కర్నాకర్,అల్లి రవి,క్లస్టర్ బాధ్యులు,మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version