అడవి తల్లి బాటపై ప్రత్యేక ఫోకస్..

అడవి తల్లి బాటపై ప్రత్యేక ఫోకస్.. అధికారులకు పవన్ కళ్యాణ్ సూచనలు

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రెండు వారాలకు ఒకసారి శాఖాపరంగా సమీక్షించి నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.

అమరావతి: రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో ‘అడవి తల్లి బాట’ పేరిట చేపట్టిన నూతన రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆయన సూచించారు. పనులు పూర్తయితే 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పాటవుతుందని తెలిపారు.

డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్…

డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్

మహాదేవపూర్ ఆగస్టు 01 (నేటి ధాత్రి) *
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కేంద్రంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం లో శుక్రవారం రోజున క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్ నవీన్ రెడ్డి పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ఎస్టి గర్ల్స్ హాస్టల్, స్కూల్ కాంప్లెక్స్, హెల్త్ సెంటర్ లను తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం దూర ప్రాంతాల వారికి హాస్టల్ సదుపాయం ను అందుబాటులో ఉంది కావున వినియోగించుకొని విద్య లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, హాస్టల్ లలో ఆహారవిషయం లో సమయ పాలన పాటించి మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని అన్నారు. హెల్త్ సెంటర్ లను ఉద్దేశించి మాట్లాడుతూ వర్షాకాలం లో ఎక్కువ గా ప్రజలు ఎలాంటి సమస్యలకు గురి అవుతారో ముందే గ్రహించి ప్రజలకు అవగాహన తో పాటు అన్ని రకాల వైద్యం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై ఆఫీసర్ కిరణ్, ఎంపీ ఓ ప్రసాద్, గ్రామ కార్యదర్శి కల్పన ఎస్టి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సరిత తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

కీరవాణి సలహాతోనే అలా.. స్పెషల్‌ సాంగ్‌పై క్లారిటీ….

కీరవాణి సలహాతోనే అలా.. స్పెషల్‌ సాంగ్‌పై క్లారిటీ

‘విశ్వంభర’లో ఓ స్పెషల్‌ సాంగ్‌కు మాత్రం భీమ్స్‌ స్వరాలు అందించారు. దీనిపై చర్చ నడుస్తోంది.  కీరవాణి ఇచ్చిన ట్యూన్‌ నచ్చకపోవడంతోనే భీమ్స్‌తో చేయించారిన టాక్‌ నడిచింది.  దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు 

చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ (Vassista) మల్లిడి తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). త్రిష కథానాయికగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యు.వి క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఎం.ఎం.కీరవాణి (MM Keeravani) సంగీత దర్శకుడు. అయితే ఇందులో ఓ స్పెషల్‌ సాంగ్‌కు మాత్రం భీమ్స్‌ స్వరాలు అందించారు. దీనిపై చర్చ నడుస్తోంది. కీరవాణి ఇచ్చిన ట్యూన్‌ నచ్చకపోవడంతోనే భీమ్స్‌తో చేయించారిన టాక్‌ నడిచింది. అది పూర్తిగా అవాస్తవమని దర్శకుడు వశిష్ట క్లారిటీ ఇచ్చారు. ‘పలు యూట్యూబ్‌ ఛానళ్లు ఆస్కార్‌’ వచ్చిన కీరవాణిని అవమానించారు’ అంటూ థంబ్‌నైల్స్‌ పెట్టి, ఎలాపడితే అలా రాతలు రాశాయి. ‘విశ్వంభర’లోని ప్రత్యేక గీతం చేయాల్సిన సమయానికి కీరవాణి.. ‘హరిహర వీరమల్లు’ ఆర్‌ఆర్‌తో బిజీగా ఉన్నారు. అందుకే ఆయనే ‘ఈ సాంగ్‌ని మరో మ్యూజిక్‌ డైరెక్టర్‌తో చేయిద్దాం’ అని సజెస్ట్‌ చేశారు. అదేంటి సర్‌ అని నేనంటే.. ‘ఇందులో తప్పేముంది? ఒక పాట ఒకరు రాేస్త.. మరో పాట వేరొకరు రాస్తారు. ఇదీ అంతే అని సింపుల్‌గా అన్నారు. నా తొలి సినిమా ‘బింబిసార’కి చిరంతన్‌ భట్‌తో కలిసి ఆయన వర్క్‌ చేశారు. ఈ విషయాన్నీ గుర్తు చేశారు. వర్క్‌ ఆగకూడదన్నది ఆయన ఉద్దేశం. ఈ విషయాన్ని చిరంజీవికీ ఆయనే చెప్పారు. అలా భీమ్స్‌ని ఎంపిక చేశాం. ఈ స్పెషల్‌ సాంగ్‌ చిరంజీవిగారు నటించిన చిత్రాలు ‘రిక్షావోడు’, ‘ముఠామేస్ర్తి’ చిత్రాల థీమ్‌ మ్యూజిక్‌ వినిపిస్తుందని కొందరు అంటున్నారు. అన్నయ్యలో ‘ఆట కావాలా పాట కావాలా’, ఖైదీ ‘రగులుతుంది మొగలిపొద వంటి సాంగ్‌ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అలాంటిదేమీ లేదు. ఇదొక ప్రెష్‌ సాంగ్‌’ అని అన్నారు.

 

ఆ సాంగ్‌లో చిరంజీవితో కలిసి బాలీవుడ్‌ బ్యూటీ మౌనీరాయ్‌ స్టెప్పులేశారు. ‘ముందు అనుష్క, బాలీవుడ్‌ హీరోయిన్లను అనుకుని తర్వాత త్రిషను సెలెక్ట్‌ చేసినట్టున్నారు?’ అని అడగ్గా.. దర్శకుడు అవునని సమాధానమిచ్చారు. సెప్టెంబర్‌ 25న విడుదల అన్నదానిపై ఆయన మాట్లాడుతూ ‘అదే డేట్‌లో ‘ఓజీ’, ‘అఖండ 2’ వస్తుంటే మా సినిమాని ఎందుకు రిలీజ్‌ చేయాలనుకుంటాం. మేం ఇంకా ఏ డేట్‌ అనుకోలేదు. పరిపూర్ణంగా సినిమా పూర్తయ్యాక, సీజీ వర్క్‌ అంతా సంతృప్తికరంగా అనిపించిన తర్వాతే సినిమా విడుదల చేసప్తాం. పండగకు చిరంజీవి సినిమా రావాలని నేను అనుకోను. ఆయన సినిమా ఎప్పుడొస్తే అప్పుడే పండగ అనుకుంటా’ అని అన్నారు.

డిసిఎంఎస్ చైర్మన్ ఎం, శివకుమార్ కేతకిలో ప్రత్యేక పూజలు.

డిసిఎంఎస్ చైర్మన్ ఎం, శివకుమార్ కేతకిలో ప్రత్యేక పూజలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ ఎం శివకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం ప్రారంభం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఉదయం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి దర్శన నిమిత్తం రావడం జరిగింది. దీంతో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకోవడం జరిగింది. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు ఎం వెంకటేశం, కేతకి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నరసింహ గౌడ్, ఎంపీపీ మాజీ వైస్ ప్రెసిడెంట్ బి.సంగమేశ్వర్, మాజీ సర్పంచులు మాణిక్ ప్రభు పటేల్, శ్రీనివాస్ రెడ్డి, కేతకి ఆలయ మాజీ ధర్మకర్తలు సంతోష్ పటేల్, సత్యనారాయణ సింగ్, సంగమేశ్వర్, బి.ఆర్.ఎస్ ఝరాసంగం టౌన్ అధ్యక్షులు ఎజాస్ బాబా, నాయకులు ప్రవీణ్ పాటిల్, అశోక్ పాటిల్, వీరన్న పాటేల్, శ్రీనివాస్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి.

సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి
• పిచ్చి మొక్కలకు గడ్డి మందు పిచ్కారి.

నిజాంపేట: నేటి ధాత్రి

వర్షాకాలం సీజనల్ వ్యాధులను నేపథ్యంలో పారిశుద్ధ్యం పై గ్రామస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గ్రామ కార్యదర్శి మమత ఆదేశాల మేరకు పారిశుద్ధ కార్మికులు కలుపు మొక్కలకు గడ్డి మందు పిచికారి చేస్తున్నారు. కార్యక్రమంలో నర్సిములు, కొమ్మట రాజు, పోచవ్వ, ఎల్లవ్వ, జామున, ఎల్లయ్య లు ఉన్నారు.

సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు..

సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

 

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-56.wav?_=1

జహీరాబాద్ నేతి ధాత్రి:

దక్షిణ కాశీగా పిలిచే ఝరాసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయంలో సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం కృష్ణపక్షం, బహుళ దశమి పురస్కరించుకొని పార్వతి సహిత సంగమేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. సహస్రనామాలు, కుంకుమార్చన, బిల్వార్చన తదితర పూజలతో మంగళహారతి చేశారు. సోమవారం కావడంతో దూరప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు.

పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి.

పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి
• జాగ్రత్తలు పాటించాలి
• కార్యదర్శి చంద్రహాస్..

నిజాంపేట: నేటి ధాత్రి

పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి వహించాలని గ్రామ కార్యదర్శి చంద్రహాస్ అన్నారు. ఈ మేరకు మండలంలోని రాంపూర్ గ్రామంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం లో భాగంగా గ్రామాల్లో పారిశుధ్యం పై తనిఖీలు నిర్వహించారు. ఇంటి ఆరు బయట నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల దృశ్య ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి ఆరు బయట కలుపు మొక్కలు లేకుండా చూడాలన్నారు. గ్రామంలో వైద్య చికిత్స నిమిత్తం ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

కోట శ్రీనివాసరావు జీవితంలో విశిష్ట ఘట్టం..

కోట శ్రీనివాసరావు జీవితంలో విశిష్ట ఘట్టం

కోట శ్రీనివాసరావు జీవితంలో విశిష్ట ఘట్టం..1994 అక్టోబర్ లో చోటు చేసుకుంది.

కోట శ్రీనివాసరావు జీవితంలో విశిష్ట ఘట్టం..1994 అక్టోబర్ లో చోటు చేసుకుంది. దక్షిణ భారత చలనచిత్ర సమాఖ్య, ఆంధ్ర ప్రదేశ్ చలన చిత్ర సమాఖ్య మధ్య ఏర్పడిన వివాదం చిలికి చిలికి గాలివానై యావత్ పరిశ్రమే స్తంభించిన నేపథ్యం లో ఈ రెండు వర్గాల  కార్మికుల సంక్షేమం, సమైక్యత కోసం నిరాహార దీక్ష చేపట్టారు కోట. ఇది ఆయన జీవితంలోనే కాదు సినిమా చరిత్రలోనూ విశిష్ట ఘట్టమే.

ఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమ బలం ఏమిటో మద్రాసులోని ఫెఫ్సీ కి తెలిపిన కీలక ఘట్టం అది.  తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో స్థిరపడానికి ఇకపై ఏం చేయాలో  ఇటు ప్రభుత్వం, అటు పరిశ్రమ ఆలోచింపజేసేలా చేసిన సంఘటన అది. హీరోలందరూ కోట దీక్షా శిబిరానికి వచ్చి నిమ్మరసం తాగించి దీక్ష  విరమింపజేశారు. ఆ ఏడాది నవంబర్ 30 న హైదరాబాద్ లో మొక్కుబడిగా నైనా షూటింగ్స్ ప్రారంభమయ్యాయంటే దానికి కారణం కోట చేపట్టిన దీక్ష అనే చెప్పాలి.

ఆయన లక్కీ నంబర్ 8 (Kota lucky Number)

తానే నటుడి రిఫరెన్స్ తీసుకోకుండా తానే పదిమందికి రిఫరెన్స్ లా నిలిచారు కోట శ్రీనివాసరావు. ఆయనకి సెంటిమెంట్స్ ఎక్కువ. మానవతా సంబంధమైన సెంటిమెంట్స్ నీ ఆయన ఎక్కువగా గౌరవించే వారు. 8 తన లక్కీ నంబర్ గా కోట చెప్పేవారు. తెలుగులో తన పేరు ఎనిమిది అక్షరాలు అని, ఇంగ్లీష్ లోని అక్షరాలు కూడిన ఎనిమిది వస్తుందని చెప్పేవారు. తనకు ఎంతో పేరు తెచ్చిన ప్రతిఘటన చిత్రం విడుదల తేదీ, సంవత్సరం, నెల .. అన్నీ , కూ డితే 8 వస్తుందని, తానుడే రోడ్ నంబర్ కూడా ఎనిమిదె నని ఆయన చెప్పేవారు. ఇది యాదృచ్చికంగా తనకు ఎదురవుతున్న నంబర్ అని, దాని మీద గౌరవం పెంచుకున్నానని కోట శ్రీనివాసరావు చెప్పేవారు

జిల్లాలో పని చేస్తున్న హోం గార్డ్స్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు.

జిల్లాలో పని చేస్తున్న హోం గార్డ్స్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్న హోం గార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని డిజిపి కార్యాలయం నుండి వచ్చిన ఉలెన్ జాకెట్స్ & రెయిన్ కోట్స్ ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో వారికి అందజేసిన జిల్లా ఎస్పీ.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..జిల్లాలో విధులు
నిర్వహిస్తున్న హోమ్ గార్డ్స్ పోలీసు శాఖలో అంతర్గత భాగమని,పోలీసులతో పాటే నిరంతరం తమ సేవలను అందిస్తున్నారని,ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీసు సిబ్బందితో పాటు విధులు నిర్వహిస్తున్నారని, క్లిష్ట పరిస్థితులలో కూడా వివిధ బందోబస్తు విధుల్లో చాలా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు.

welfare

హోమ్ గార్డ్స్ అధికారులు,సిబ్బంది ఎవరికైన సమస్యలు ఉంటే నేరుగా తనని సంప్రదించవచ్చని,రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.నిరంతరం ఎండనకా,వాననకా రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసే సిబ్బందికి అత్యవసర సమయాలలో ఉలెన్ జాకెట్స్ & రెయిన్ కోట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.విధి నిర్వహణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని,క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో పనిచేస్తూ నిబంధనలు ఉల్లగింస్తే భవిష్యత్తులో శాఖ పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు యాదగిరి, మధుకర్, హోమ్ హార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు.

వనపర్తి లో వీరభద్ర స్వామి సమేత శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు.

వనపర్తి లో వీరభద్ర స్వామి సమేత శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు
వనపర్తి నెటిదాత్రి:

 

వనపర్తి పట్టణంలో పాత కోటలో పురాతన వీరభద్ర స్వామి సమేత శివకేషవ ఆలయం
అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకము నిమ్మకాయలతో అలంకరణ ప్రసాద వితరణ చేయడం జరిగినదనిఆలయ చైర్మన్ పూరి సురేష్ శెట్టి తెలిపారు అనారోగ్యం వల్ల దేవాలయానికి రావడం లేదని పూరి తెలిపారు ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో ప్రతి నెల అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానం చేశామని పూరి సురేష్ తెలిపారు ఈ సమావేశంలో ఆలయ కమిటీ కార్యదర్శి ఏర్పుల సాయి కోశాధికారి ఈశ్వరమ్మ ఉపాధ్యక్షులు శ్రీరామమూర్తి స్వప్న ఫోటో స్టూడియో రవి రామస్వామి రాజేష్ తదితరులు పాల్గొన్నారు

తీర్థయాత్రల కోసం రైల్వే శాఖ ప్రత్యేక ప్యాకేజీలు.

తీర్థయాత్రల కోసం రైల్వే శాఖ ప్రత్యేక ప్యాకేజీలు

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

 

 

తీర్ధ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూలై 05 వ తేదీ నుండి జూలై 13 వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు IRCTC టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ DSGP కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు.

యాత్రకి సంబందించిన వివరాలు వెల్లడించారు.

ప్యాకేజీ వివరాలు : (ఐదు జ్యోతిర్లింగ యాత్ర – SCZBG43):* ఉజ్జయిని (మహాకాళేశ్వర్ – ఓంకారేశ్వర్) – త్రయంబకేశ్వర్ – భీమశంకర్ – ఘృష్ణేశ్వర్).

ఈ యాత్రలో మహాకాళేశ్వర్ / ఓంకారేశ్వర్ / త్రయంబకేశ్వర్ / భీంశంకర్ / ఘృష్ణేశ్వర్ / ఎల్లోరా / మోవ్/ నాగ్పూర్ ప్రాంతాలు సందర్శించవచ్చు.

ఈ యాత్ర జూలై 05 వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు ఉంట్టుంది.

దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 14700, 3 ఏసీ ధర 22900, 2 ఏసీ ధర 29900 ఉంటుంది.

ఈ యాత్ర సికింద్రాబాద్ కామారెడ్డి నిజామాబాద్ ధర్మాబాద్ నాందేడ్ ముధ్ఖడ్ మరియు పూర్ణ మీదుగా వెళ్తుంది.

సౌకర్యాలు :రైలు, బస్సు, హోటల్, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనం), వాటర్ బాటిల్ మరియు టూర్ ఎస్కాట్ సేవలతో సందర్శనా స్థలాలు, (అదనపు ఖర్చు లేదు), ప్రయాణ బీమా, ఇన్సూరెన్స్ అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగ ఉచితం.

ప్రతి రైలు లో 718 మంది ప్రయాణికులు ఉంటారు.

ప్రతి 70 మందికి ఇద్దరు కోర్డినెటర్లు అందుబాటులో ఉండి అన్ని సావకార్యాలు సమకురుస్తారు.

కోచ్ కి ఒక సెక్యూరిటీ గార్డ్ అలాగే రైలు లో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందని తెలియజేశారు.

టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు
9701360701,9281495843,9281030750,9281030749 లకు సంప్రదించాలని మరిన్ని వివరణలకు www.irctctourism.com వెబ్సైట్ ని సంప్రధించాలని తేలిపారు.

తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్.

తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TGSP)
ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణి*

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

shine junior college

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం పరిధిలోని సర్ధాపూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 17వ బెటాలియన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TGSP) ఆధ్వర్యంలో ఉచితంగా విద్యా సామగ్రి, వాటర్ ప్యూరిఫైయర్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం బెట్టాలియన్ కమాండెంట్ ఎం.ఐ. సురేష్.
ఆధ్వర్యంలో బుధవారం సర్ధాపూర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగినది. పోలీస్ కానిస్టేబుల్ అయినా ఇటువంటి రామ్- అంజలి దంపతుల కుమార్తె లక్ష్మి వర్ణిక పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు పంపిణి చేశారు.అనంతరం బేటాలియన్ పోలీసు సిబ్బంది పిల్లలకు నోట్ పుస్తకాలు, ఎగ్జామ్ ప్యాడ్‌లు, వాటర్ బాటిల్, ఇతర స్టేషనరీ వస్తువులు పంపిణీ చేశారు, అదే విధంగా బెట్టాలియన్ పోలీస్ క్రికెట్ టీం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో
వాటర్ ప్యూరిఫైయర్ అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమాండెంట్ ఎం.ఐ. సురేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఈ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కూడా తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మొదటి విడతలో భాగంగా.

సర్ధాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగా ఎంచుకొని, పాఠశాలకు పెయింటింగ్ వేయడం, మెరుగైన విద్యకు తోడ్పడటం, మంచి తాగునీటిని అందించడం వంటి పనులకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. పోలీస్ క్రికెట్ టీమ్ నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడానికి, వారి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మంచి తాగునీరు అందించడానికి కృషి చేస్తుందని కమాండెంట్ అన్నారు. ఈ గ్రామానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తమ వంతు సాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ జే. రాందాస్, పాఠశాల ఎం.ఈ.ఓ దూస రఘుపతి,
ఏఏపీసీ చైర్మన్ లక్ష్మి, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ బి. స్వాతి, పోలీస్ ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, 17వ బెటాలియన్ పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

దైవ దర్శనం కొరకు ప్రత్యేక టూర్ ప్యాకేజ్ లు.

దైవ దర్శనం కొరకు ప్రత్యేక టూర్ ప్యాకేజ్ లు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భక్తుల కొరకు  జహీరాబాద్ డిపో నుండి 02 ప్రత్యేక టూర్ ప్యాకేజ్ లను అందుబాటులోనికి తెచ్చింది అని జహీరాబాద్ ఆర్టీసీ విలేజ్ బస్సు ఆఫీసర్స్ ఎం శివప్రసాద్, ప్రసాద్ లు తెలిపారు శనివారం ఝరాసంగం మండలంలోని బోపంపల్లి.బోరేగావ్,.జీర్లపల్లి చిలమామిడి.ఎడాకులపల్లి. గ్రామాలలో ప్రత్యేక దర్శనo కొరకు ప్రత్యేక టూర్ బస్సుల కోసం గ్రామాల ప్రజలకు వివరించడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జహీరాబాద్ డిపో బస్ స్టేషన్ నుండి ఉదయం 06:00 గం.లకు బయలుదేరి యాదగిరిగుట్ట శ్రీ.లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కు 10:00 గం.లకు చేరుకొని, అక్కడి నుండి దర్శనానంతరం 15:00 గం.లకు బయలుదేరి స్వర్ణగిరి దేవాలయం కు చేరుకుంటుందన్నారు…. దర్శనానంతరం  తదుపరి రాత్రి 19:00 గం.లకు తిరుగు ప్రయాణమై జహీరాబాద్ బస్ స్టేషన్ కు 23:00 గం.లకు డిపో కు రావడం జరుగుతుంది అన్నారు.

భక్తుల సౌకర్యార్థం ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులు అందుబాటులో తీసుకోరావడం జరిగింది అన్నారు.
శ్రీ.దత్తాత్రేయ స్వామి దేవాలయం జహీరాబాద్ బస్ స్టేషన్ నుండి ప్రతీ పౌర్ణమి కి ముందు రోజు సాయంత్రం 16:00 గం.లకు ఈ నెల 27 .06.25 మంగళవారం న బయలుదేరి కర్ణాటక రాష్ట్రంలో గానుగాపూర్ లో గల శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం కు రాత్రి 20:00 గం.లకు చేరుకొని, అక్కడి నుండి దర్శనానంతరం ఉదయం 07:00 గం.లకు బయలుదేరి జహీరాబాద్ కి 11:00 గం.లకు  చేరుకోనును అని తెలిపారు.భక్తుల సౌకర్యార్థం ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులు అందుబాటులో గలవు…. ఎక్స్ ప్రెస్ బస్సులలో కనీసం 50 మంది మరియు డీలక్స్ బస్సులలో 40 మంది ప్రయాణికులు ఉంటే బస్సులు నేరుగా బుక్ చేసుకోవచ్చును అన్నారు.

101 కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు.

101 కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు

మందమర్రి నేటి ధాత్రి:

మందమర్రి మండలం తిమ్మాపూర్ లోని జగదాంబేశ్వర ఆలయం లో వివేక్ వెంకటస్వామి కి మంత్రి పదవి రావడం తో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు మొక్కులు చెల్లించుకున్నా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అఖిలభారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు బండి సదానందం యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.

అలాగే మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ఆలయంలో నూతన బోర్ వెల్ ను ప్రారంభించిన నాయకులు.

ఈ సందర్భంగా బండి సదానందం మాట్లాడుతూ.

ఆలయానికి బోర్ కావాలని అడగ్గానే మంత్రి స్పందించి వెంటనే మంజూరు చేశారు

రోడ్డు వేసి ఇబ్బందులు తొలగించారు.

ప్రజా సేవ కోసమే కాక కుటుంబం ఉంది.

మంత్రి పదవి వస్తె 101 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్నాం అందుకే మొక్కలు చెల్లిస్తున్నాం

రెండు నెలల నుంచి చాలా మంది లీడర్లు వివేక్ వెంకటస్వామి పై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు

ఆరోపణలు చేస్తున్న వారి మెదడు తలలో ఉందో మోకాళ్ళో లో ఉంది అర్థం కావడం లేదు

తెలంగాణ ఉద్యమం కోసం బుల్లెట్ గాయాలు తిన్నది కాక వెంకటస్వామి కాదా

అదే సిద్ధాంతాన్ని కొడుకు వివేక్ వెంకటస్వామి పాటిస్తూ తెలంగాణ కోసం పార్లమెంట్ లో గళం విపిన నాయకులు వివేక్

పుణ్యక్షేత్రాలకు, విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు.

పుణ్యక్షేత్రాలకు, విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు

*ఆర్టిసి టూర్ ప్యాకేజీలను వినియోగించుకోవాలి *

నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఆర్టీసీ టూర్ ప్యాకేజీలను ప్రజలు వినియోగించుకోవాలని నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ కోరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సంపేట నుండి
1)భద్రాచలం-పర్ణశాల-కిన్నెరసాని-మల్లూరు-బొగత జలపాతం.
2)కొమురవెల్లి-వేములవాడ-కొండగట్టు-ధర్మపురి-గూడెంగుట్ట.
3)నాగార్జునసాగర్-స్వర్ణగిరి-యాదగిరిగుట్ట.
4)పంచారామాలు:అమరావతి, ద్రాక్షారామం, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, మరియు విజయవాడ.
5)విజయవాడ, ద్వారాకాతిరుమల, భద్రాచలంకు మరియు 40మంది ప్రయాణకులు ఉంటే మీరు కోరుకున్న ప్రదేశాలకు బస్సులను నడుపబడునని తెలియజేసారు. వివరాలకు 9959226052,9866373825, 9989038476 నంబర్లను సంప్రదించగలరని డిపో మేనేజర్ కోరారు.

కేతకిలో ప్రత్యేక పూజలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే.

కేతకిలో ప్రత్యేక పూజలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో ఝరాసంఘం మండలం కేంద్రంలో దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన దేవాలయం శ్రీ కేతక సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవ్ రెడ్డి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేకి ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు ఎమ్మెల్యే వారికి శాలువాతో సన్మానించారు.

ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు.

తీవ్రవాదం అంతమొందాలి
ప్రపంచ శాంతి వర్ధిల్లాలి

ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాములు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

ప్రపంచ దేశాలను పట్టి పిడిస్తున్న తీవ్రవాదం అంతమొందించాలని. అదేవిధంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలని కోరుతూ అఖిలభారత హనుమాన్ ప్రచార రాష్ట్ర అధ్యక్షుడు. శ్రీరామ ధర్మ ప్రచారకుడు గాదెపాక రాములు స్వామి మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అఖండ దీపాన్ని వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నిన్న మొన్నటి వరకు మన దేశంపై ఉగ్రవాదులు దాడులు నిర్వహించి అమాయకులైన ప్రజలను పొట్టన పెట్టుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి తీవ్రవాదాన్ని ప్రోత్సహించే ఎంతటి వారినైనా ఆ భగవంతుడు క్షమించడని వారికి అంతకంటే ఎక్కువ నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రార్థించే చేతుల కన్నా తోటి వారికి సేవ చేసే భాగ్యం మిన్న అనే సూక్తితో ఒకరినొకరు సేవ. స్నేహభావంతో మెలిగినప్పుడే ప్రపంచ శాంతి వర్ధిల్లుతుందని ఆయన అన్నారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అనే భావన ప్రతి మనిషిలోని ఉన్నప్పుడే ప్రపంచంలోని అన్ని దేశాలు ఆర్థిక అభివృద్ధితోపాటు సుఖసంతోషాలతో ఉంటాయని ఆయన తెలిపారు. నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బాధ్యతగా సమాజంలోని గౌరవింపబడే విధంగా ఉన్నత స్థానాల్లో నిలబడాలని ఆయన కోరారు. దీనికోసం స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అఖండ జ్యోతిని వెలిగించానని ఆయన తెలిపారు.

నకిలీ విత్తనాల రవాణా,ఉత్పత్తి విక్రయాలపై ప్రత్యేక నిఘా.

నకిలీ విత్తనాల రవాణా,ఉత్పత్తి విక్రయాలపై ప్రత్యేక నిఘా.

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐ.పి.ఎస్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రం పరిధిలో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా,రవాణా, ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం అందింతే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు,రైతులకు జిల్లా ఎస్పీ సూచించారు. వానాకాలం సాగు ప్రారంభమవుతున్న వేళను దృష్టిలో వుంచుకోని రైతన్న నకిలీ విత్తనాల బారీన పడకుండా ముందస్తు చర్యలకై జిల్లా పోలీసులు సిద్ధంగా ఉందని నకిలీ విత్తనాల సరఫరా,ఉత్పత్తి,అమ్మకాలు అరికట్టడానికి వ్యవసాయ శాఖ,జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో తరచు తనిఖీలు చెప్పట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో నకిలీ విత్తనాల అక్రమ రవాణా, విక్రయాలను అడ్డుకోవడానికి పోలీస్,వ్యవసాయ అధికారులచే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని,గతంలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారియెక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనించడం జరుగుతుందన్నారు.నకిలీ విత్తనాలు కలిగి ఉన్నా, అమ్మిన,రవాణా చేసే వ్యక్తుల పై క్రిమినల్ కేసులు,పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందన్నారు.జిల్లాలో ఒక్క రైతుకు కూడా నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూసే బాధ్యత వ్యవసాయ, పోలీసు అధికారులు పై ఉంటుందని,
జిల్లా పరిధిలో ఉన్న ఫర్టిలైజర్ షాప్, సీడ్స్ షాప్స్ లపై నిఘా ఉంచి ఆకస్మిక తనికిలు చేస్తూ నకిలీ విత్తనాల విక్రయాలను,రవాణాను అడ్డుకట్ట వేయడం జరుగుతుందని,రైతులు సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ షాప్ నుండి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా బిల్ తీసుకోవాలని సూచించారు.జిల్లా ప్రజలకు, రైతులకు ఎవరైనా నకిలీ విత్తనాలు,నకిలీ పురుగుల మందులు అమ్ముతున్నారని సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యేక పథకాలు.

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యేక పథకాలు.

యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ గంటి.కమలాకర్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యేక రుణ పథకాలు అందజేయనున్నట్లు యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ గంటి. కమలాకర్ తెలిపారు.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయ రంగ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని “అగ్రికల్చర్ రైజ్” పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా వరి మిల్లులు, తడి మరియు పొడి ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్‌లు, గ్రేడింగ్, ప్యాకింగ్ మరియు ఇతర వ్యవసాయ ఆధారిత చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తక్కువ వడ్డీ రేటుతో ప్రత్యేక రుణాలు మంజూరు చేయబోతున్నది. ఈ నేపథ్యంలో నర్సంపేట యూనియన్ బ్యాంకు మేనేజర్ జీ బాలాజీ ఆధ్వర్యంలో మిల్లర్ల సంఘ భాద్యులతో, వర్తక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా యూనియన్ బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ “వ్యవసాయ రంగానికి విలువ జోడించే పరిశ్రమల ప్రోత్సాహంతో రైతులకు మెరుగైన ధరలూ, ఉపాధి అవకాశాలూ అందుతాయన్నారు. ఈ క్రమంలోనే రుణాల ప్రక్రియను వేగవంతం చేసి, సులభంగా రుణాలు అందుబాటులోకి తెస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రీజినల్ హెడ్ గంటి. కమలాకర్, డిప్యూటీ రీజినల్ హెడ్ మహేష్, బ్రాంచ్ మేనేజర్ జీ.బాలాజీ, ఫీల్డ్ ఆఫీసర్ శుశాంత్, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు గోనెల రవీందర్, ఇరుకు కొటేశ్వర్, కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు దాసరి నర్సింహ రెడ్డి,బ్యాంక్ మిత్ర అడ్డగట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు..

హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణంలో అభయ అంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకొని స్థానిక విజయగణపతి దేవాలయ ఆవరణలోని హనుమాన్ ఆలయంలో పూజారి సతీష్ శర్మ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని యజ్ఞశాలలో నిర్వహించిన మహా యజ్ఞంలో హనుమాన్ మాలాధారులు పాల్గొన్నారు. పట్టణంలోని భక్తులు ఆయురారోగ్యాలతో సుఖ జీవనం సాగించాలని, స్వామివారి ఆశీస్సులు భక్తులకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version