యూరియా కోసం తెలంగాణ రైతులు ఎదురుచూపు…

యూరియా కోసం తెలంగాణ రైతులు ఎదురుచూపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో రైతు ఆవేదన పట్టించుకోవడం లేదు మహమ్మద్ ఇమ్రాన్ జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మరియు బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాదినం శివప్రసాద్ కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ వజిర్ అలీ రైతు ఆవేదన తెలంగాణ రాష్ట్రంలో రైతు అకాల వర్షాలతో సతమతమవుతుంటే యూరియా ఎరువు దొరకక విలవిలలాడుతున్నారు అప్పులు చేసి పంట
సాగు చేస్తున్న రైతుకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం అందడం లేదు రైతు కన్నీళ్లు దేశానికి మంచిది కాదు రైతు పండిస్తేనే దేశానికి అన్నం దొరుకుతుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడి తెలంగాణ రైతులకు న్యాయం చేయాల్సిందిగా సకాలంలో ఎరువులు అందుకేనే పంటలు పండుతాయి లేకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఎరువుల కొరత లేకుండా చూడాలి గత నెల రోజుల నుండి ఎండనక వాననక యూరియా కోసం తెలంగాణ రైతులు ఎదురుచూస్తున్నారు తక్షణమే యూరియా సరఫరా చేయాలి రైతులకు యూరియా సరఫరా చేయాలి,

ప్రజలు నూతన ఆర్టీసీ బస్సు సేవలు సద్వినియోగం చేసుకోవాలి.

 

ప్రజలు నూతన ఆర్టీసీ బస్సు సేవలు సద్వినియోగం చేసుకోవాలి.

ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్.

చిట్యాల, నేటిధాత్రి :

 

ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం ఉదయం భూపాలపల్లి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో భూపాలపల్లి – పరకాల(వయా మొరంచపల్లి, ఎస్ యం కొత్తపల్లి, ఒడితల, గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ, లింగాల, రేగొండ) సర్వీసును ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం బస్సులో భూపాలపల్లి బస్టాండ్ నుండి మొరంచపల్లి, ఎస్ఎం కొత్తపల్లి, ఒడితల, గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ వరకు సాధారణ పౌరుడిలా ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేశారు. ఎస్.యం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎలగొండ సమ్మక్క తో బస్సులో ప్రయాణం చేస్తూ సరదాగా ముచ్చటించారు. ఒడితల గ్రామానికి బస్సు చేరుకోగా మహిళలు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి స్వాగతం పలికారు. బస్సు వద్ద గ్రామస్తులు కొబ్బరికాయలు కొట్టారు. గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ గ్రామాల్లో కూడా గ్రామస్తులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పారు. కాకర్లపల్లిలో వినాయకస్వామి మండపం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని టెంకాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ప్రయాణం అనంతరం ఎమ్మెల్యే కొడవటంచలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహాలక్ష్మీ పథకం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుందన్నారు.
ఉదయం టైమింగ్స్:*
6:30 గంటలకు భూపాలపల్లి బస్టాండ్ నుండి బస్సు బయలుదేరి పరకాలకు 8 గంటలకు చేరుకుంటుంది.
తిరుగుప్రయణంలో ఉదయం 8:15 గంటలకు పరకాల బస్టాండ్ నుండి బస్సు బయలుదేరి 10 గంటలకు భూపాలపల్లి బస్టాండ్ కు చేరుకుంటుంది.
సాయంత్రం టైమింగ్స్:
5:15 గంటలకు భూపాలపల్లి బస్టాండ్ నుండి బస్సు బయలుదేరి 6:45 గంటలకు పరకాల చేరుకుంటుంది.
7:00 గంటలకు పరకాల బస్టాండ్ నుండి బస్సు బయలుదేరి 8:20 గంటలకు భూపాలపల్లి బస్టాండ్ కు చేరుకుంటుంది. ఎమ్మెల్యే వెంట అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బాలాజీ టెక్నో స్కూల్లో మాతృభాష దినోత్సవం…

బాలాజీ టెక్నో స్కూల్లో మాతృభాష దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట మండలం లక్నపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్ లో గిడుగు వేంకట రామమూర్తి పంతులు జన్మదినాన్ని పురస్కరించుకొని మాతృభాష దినోత్సవం జరుపుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు తెలుగు భాష మాధుర్యాన్ని తెలిపేందుకు వీలుగా పద్య రచన,కావ్యరచన పోటీలను నిర్వహించారు.పాఠశాల ప్రిన్సిపాల్ పి .రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషో ద్యమానికి మూలపురుషుడైన గిడుగు వెంకట రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు, బహుభాషావేత్త, చరిత్రకారుడు ,సంఘసంస్కర్త అయిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు 1863 ఆగస్టు 29 శ్రీకాకుళం జిల్లాలో పర్వతాలపేట గ్రామంలో జన్మించారన్నారు.తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని,వీలును తెలియజెప్పిన మహనీయుడని ,అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు అని, పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వీలైందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రియాజుద్దీన్,రమేష్ , రవీందర్ ,గణేష్, భాగ్యలక్ష్మి, నరేష్ ,విశాల, రంజిత్, విజయరాణి, రవీందర్ రెడ్డి, భవాని చంద్ ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

 

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం…

గొప్ప ఫీల్డ్ ఆటగాడు, దిగ్గజ మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్.సి. సి థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో బాలాజీ టెక్నో స్కూల్ లో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ పి. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఆగస్టు 29 ని భారతదేశం జాతీయ క్రీడా దినోత్సవం గా జరుపుకుంటామని పేర్కొన్నారు.ఈ సంవత్సరం క్రీడా వేడుకలకు ఫిట్ ఇండియా మిషన్ నాయకత్వం వహిస్తుందని, ప్రతి సంవత్సరం “ఖేల్ కే మైదాన్ మై” అనే థీమ్ తో దేశవ్యాప్తంగా క్రీడలను నిర్వహిస్తారని తెలిపారు.మేజర్ ధ్యాన్ చంద్ 1929 నుండి 1936 వరకు ఒలంపిక్స్ లో భారతదేశ ఆధిపత్యం చెలాయించేలా కృషి చేశాడని వీరి నాయకత్వంలో భారత్ 1948లో హాకీ క్రీడలో స్వర్ణం సాధించిందని తెలిపారు.అనంతరం విద్యార్థులకు, ఎన్.సి.సి క్యాడేట్లకు క్రీడా పోటీలను నిర్వహించారు పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు భవాని చంద్ ,రవీందర్ రెడ్డి, పార్వతి ,వినోద్ ,గోపి, సతీష్, అరుంధతి, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.

అక్షర ద స్కూల్,బిట్స్ లో జాతీయ క్రీడా దినోత్సవం..

నర్సంపేట పట్టణంలోని బాలాజీ విద్యా సంస్థలలో ఒక్కటైనా అక్షర ద స్కూల్,బిట్స్ స్కూల్ లో లో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిదులుగా బాలాజీ విద్యాసంస్థలు చైర్మన్ డాక్టర్ ఆండ్ర రాజేంద్రప్రసాద్ రెడ్డి హాజరైయ్యారు.హాకీ క్రీడ దిగ్గజం ధ్యాన్ చంద్ జయంతి సందర్బంగా క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.ఒలంపిక్ క్రీడలలో మూడు బంగారు పథకాలు తెచ్చిన అందించిన గొప్ప క్రీడాకారుడు ధ్యాన్ చంద్ అని తెలిపారు.చదువులతో పాటు అన్ని రకాల క్రీడల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు.కోశాదికారి డాక్టర్ వనజ, ఈ కార్యక్రమంలో బిట్స్ స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి గౌడ్,అక్షర ద స్కూల్ ప్రిన్సిపల్ భవాణి,ఉపాద్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

చిత్తారమ్మ దేవాలయంలో వినాయక విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T154736.629.wav?_=1

 

చిత్తారమ్మ దేవాలయంలో వినాయక విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు..

రామాయంపేట ఆగస్టు 29 నేటి ధాత్రి (మెదక్)

 

 

రామాయంపేట పట్టణంలోని చిత్తారమ్మ దేవాలయంలో భక్తి శ్రద్ధల మధ్య వినాయక విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మర్కు బాలరాజు దంపతులు తమ కుటుంబ తరపున వినాయక విగ్రహాన్ని ఆలయానికి అందజేశారు. అనంతరం పురోహితుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించబడ్డాయి. ఆలయంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు.
ప్రతిష్ఠ అనంతరం వినాయకునికి అర్చనలు, అష్టోత్తర శతనామ పూజలు, హారతులు నిర్వహించగా, తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడి, మంగళవాయిద్యాలతో కేరింతలు కొట్టింది.
ఈ సందర్భంగా మర్కు బాలరాజు దంపతులు మాట్లాడుతూ.. “గణపతి బాప్పా ఆరాధనతో అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. కుటుంబానికి, సమాజానికి శాంతి, ఐశ్వర్యం కలుగుతుందని విశ్వసిస్తున్నాం” అని తెలిపారు. ఆలయ కమిటీ సగర సంగం సభ్యులు, పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T154024.514.wav?_=2

 

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో మహానీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో హాకీ ధ్యాన్ చంద్ 120వ జయంతిని ఘనంగా నిర్వహించారు
మహానీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రజావాగ్గేయకారుడు
రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ
ధ్యాన్ చంద్ పుట్టిన రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో కవి పండితుడు బూరోజు గిరిరాజాచార చింతకుంట కుర్మ య్య రిటైర్డ్ఉద్యోగుల సంఘం జిల్లాఅధ్యక్షుడు శ్రీనివాసులు శెట్టి
ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు నిరంజనయ్య
పెదమందడి మాజీ జెడ్పిటిసి కొమ్ము వెంకటస్వామిరెడ్డి సేవాసంఘం నాయకుడు రఘునాథ్ రెడ్డిబిజెపి నాయకుడు సూగూరి రాము వాల్మీకి సంఘం నాయకుడు వెంకటేష్ విశ్వబ్రాహ్మణ సంఘం నాయకుడు నాగార్జునరిటైర్డ్ ఆర్మీ గబ్బర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు

ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతాం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T153405.039.wav?_=3

 

ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతాం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడతామని అందుకోసం నర్సంపేట డివిజన్ లో గడపగడపకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటారని ఎంసిపిఐ (యు) వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ వెల్లడించారు.పార్టీ నర్సంపేట మండల కమిటీ సమావేశం భైరబోయిన నరసయ్య అధ్యక్షతన స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగింది. తొలుత వామపక్ష నేతలు సురవరం సుధాకర్ రెడ్డి , ఎంసిపిఐ యు కేరళ నాయకులు నారాయణన్ మృతిపట్ల శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం హాజరైన రమేష్ మాట్లాడుతూ పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేస్తూ , మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరిస్తామన్నారు.గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరు బాటకు శ్రీకారం చుడుతామని పేర్కొన్నారు.భారత రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ బిజెపి ప్రభుత్వం దేశ సంపదనంతా కార్పొరేట్ బడాబాబులకు ధారాదత్తం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.మతం పేరుతో భారత పౌరుల పట్ల చిచ్చు పెడుతున్న బిజెపి సర్కార్,విదేశీ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందన్నదని ఆరోపించారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాపురావు,వంగల రాగసుధ,డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి,కేశెట్టి సదానందం,కర్నే సాంబయ్య,గుర్రం రవి గణిపాక బిందు,స్వరూప తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం పోటీ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T152624.682-1.wav?_=4

స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పొటీ: సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ
నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:

 

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని గ్రామాలలో సిపిఎం పోటీ చేస్తుందని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. శుక్రవారం చండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఒకటి, రెండు హామీలను అమలు చేసిన అవి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆయన అన్నారు. స్థానిక సమస్యలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగానే ఉన్నామని, ఒంటరిగానే పోటీ చేయాలనుకున్నామని, ఎవరైనా కలిసి వస్తే ఆలోచిస్తామని ఆయన అన్నారు. దేశ లౌకిక విధానం, ఫెడరలిజానికి బిజెపి రూపంలో ప్రమాదం పొంచి ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతులకు సరిపడ యూరియాను అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యావని ఆయన అన్నారు. యూరియా కోసం కావాలని గంటల తరబడి క్యూలైన్లలో నిలబడిన దొరకని పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నేర్మట నుండి బంగారిగడ్డ వరకు బీటీ రోడ్డు నిర్మించాలని, అదేవిధంగా పుల్లెంల నుండి నేర్మట వరకు రోడ్డు నిర్మాణం చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు రావడం వలన సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.జెడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి బల్లెం స్వామి, రైతు సంఘం మండల కార్యదర్శి ఈరటి వెంకటయ్య, నారపాక శంకరయ్య, బొమ్మరగోని యాదయ్య, ఈరగట్ల నరసింహ, స్వామి, కలిమెర సైదులు, కొత్తపల్లి వెంకన్న, లక్ష్మమ్మ, ఎన్. శంకర్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షునిగా కృష్ణమూర్తి ఎన్నిక…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T152151.133.wav?_=5

 

కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షునిగా కృష్ణమూర్తి ఎన్నిక

పరకాల నేటిధాత్రి

 

హన్మకొండ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ ఉపాధ్యక్షునిగా ఆత్మకూర్ గ్రామానికి చెందిన జిల్లెల్ల కృష్ణమూర్తి ని జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చెందర్ మరియు ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ సుంకరి శ్రీనివాస్ లు శుక్రవారం రోజున నియమించారు.ఈ సందర్బంగా ఎన్నికైన కృష్ణమూర్తి మాట్లాడుతూ నామీద నమ్మకంతో నాకు ఈ పదవిని అప్పగించినందుకు కాంగ్రెస్ పార్టీకి నా సేవలను అందిస్తానని పార్టీ అభివృద్ధి కి కృషిచేస్తానని,పార్టీ రాష్ట్ర నాయకత్వం,జిల్లా నాయకత్వం ఎటువంటి కార్యక్రమాలు అప్పగించిన తప్పకుండ హాజరై నెరవేరుస్తానని తెలిపారు.

రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన బిజెపి నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T150239.383.wav?_=6

 

రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన బిజెపి నాయకులు

బీజేపీ మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల లో ఊర నవీన్ రావు అధ్యక్షుడి ఆధ్వర్యంలో రోడ్డు పైనా గుంతలు పుడ్చడం కార్యక్రమం
బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం కు ఓసి-3బాధిత గ్రామాలు నగరంపల్లి గ్రామం లోని ముసళ్ల కుంట గండి పడి నగరంపల్లి అప్పయ్యపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బంది కలిగి సీతారాంపూర్, బంగ్లాపల్లి, అప్పయ్య పల్లి నుండీ మండల కేంద్రం లోని పాఠశాలల కు వెళ్లే విద్యార్థులు మరియు వ్యవసాయా పనులకు వెళ్లే రైతులు ఇబ్బందులకు గురి అవుతున్న కారణం గా బీజేపీ కార్యకర్తలు స్వచ్చ భారత్ కార్యక్రమం లో భాగంగా రోడ్డు పై ఏర్పడ్డ గుంతలను పుడ్చారు అనంతరం నవీన్ రావు మాట్లాడుతు సింగరేణి యాజమాన్యం యుద్ధ ప్రతిపదికన రోడ్డు మరమ్మత్తు చర్యలు చేపట్టి ఆయా గ్రామాల మధ్య రాకపోకలు ఇబ్బంది లేకుండా చూడాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమం లో బూత్ అధ్యక్షులు భూక్యా హరిలాల్, ఇనుగాలా మొగిలి నాయకులుమామిడిపల్లి మల్లన్న, మైదాం శంకర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

సబ్జెక్ట్ ల వారీగా సామార్ధ్యo పెంచాలి..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T144238.347-1.wav?_=7

 

సబ్జెక్ట్ ల వారీగా సామార్ధ్యo పెంచాలి

ఏ.ఐ ద్వారా విద్యాబోధనకు కృషి చేయాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట, నేటిధాత్రి:

 

 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వారి వారి తరగతికి సంబందించిన అన్ని సబ్జెక్ట్ ల సామర్థ్యాలు సాధించేలా విద్యా బోధన అందించాలని,విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ఉపాధ్యాయులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
జిల్లా కలెక్టర్ లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలల్లో నాణ్యమైన విద్య అందించాలని సంబంధిత ఎంఈఓ లకు ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఆదేశాల మేరకు జిల్లాలో పాఠశాల విద్య అభివృద్ధికి ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపిలో భాగంగా బేస్ లైన్ ఫలితాలు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ లో ఆన్ లైన్ చేయాలని ఎఫ్ఏ-1 మార్కులను కూడా సిసిఇ వెబ్ పోర్టల్ లో వెంటనే అప్లోడ్ చేయాలని సూచించారు.
హరితహారంలో భాగంగా విద్యాశాఖ టార్గెట్లు 100 శాతం పూర్తి చేసి విద్యార్థులతో మొక్కలు నాటించి వాటిని సంరక్షించే బాధ్యతలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ప్రతి స్కూల్లో ముల్లాపొదలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రతి స్కూళ్లలో కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు మునగా,నిమ్మ,దానిమ్మ, ఉసిరి,గోరింటాకు,కరివేపా తదితర మొక్కలను నాటాలని..నాటిన ప్రతి మొక్కని ఎకో క్లబ్ మిషన్ లైఫ్ వెబ్ పోర్టల్ లో ఆన్లైన్ చేయాలని ఆదేశించారు.కంప్యూటర్స్ ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యా బోధన అందించుటకు తెలుగు,ఇంగ్లీష్,మాథ్స్ నైపుణ్యలను సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.విద్యార్థుల,ఉపాధ్యాయులు అటెండెన్స్ ఎఫ్ఆర్ఎస్ ద్వారా 100 శాతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు,యు,సృజన్ తేజ,ఏఎంఓ, ఎంఈఓలు సెక్టోరియల్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.

గిడుగు రామ్మూర్తి అవార్డు సతీష్ యాదవ్‌కు సన్మానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T143645.834.wav?_=8

 

గిడుగు రామ్మూర్తి అవార్డు అందుకున్న సతీష్ యాదవ్ కు సన్మానము
వనపర్తి నేటిదాత్రి .

 

పాండిచ్చేరిలో డాక్టరేట్ విజయవాడలో గిడుగు రామ్మూర్తి అవార్డు అందు కున్న సందర్భంగా కొత్తకోట లో యాదవ సంఘం నాయకుల సన్మానం చేశారు. గత 20 సంవత్సరాలు వనపర్తి ప్రజాసమస్యలపై గతంలో పాత బస్టాండ్ రామాటాకీస్ నుండి మారెమ్మ కుంట వరకు పెండింగులో ఉన్న రోడ్డు విస్తరణ సి సి రోడ్ల నిర్మాణం మూరికి కాలువలు నిర్మాణ ము తల్లి తండ్రులులేనిచిన్న పిల్లలకు స్వ oత ఖర్చుతో అఖిలపక్షం ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ కృషి సన్మానముచేసిన వారిలో మాజీ ఎంపీ టి సి సత్యం ముంత సత్యం యాదవ్ మాజీ ఎంపిటిసి జి రాముల యాదవ్ మాజీ కౌన్సిలర్, ఎం బాల కొండయ్య టీ మన్యం యాదవ్ పెంటన్న యాదవ్, పి శంకర్ యాదవ్, కురుమూర్తి, శివన్న కుమార్ బాలచంద్రి యాదవ్ లు సతీష్ ను అభినందించారు

జహీరాబాద్‌లో రాబడిని అందజేసిన సీఎం సహాయనిధి చెక్

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T142227.901.wav?_=9

 

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు ,డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలం బొప్పన్పల్లి గ్రామానికి చెందిన జి సిద్ధప్ప గారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి విడుదలైన రూ.15,000/- విలువ గల చెక్కును ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో అందజేసిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్ షెరీ సత్యం ముదిరాజ్,గ్రామ యువ నాయకులు శశి వర్ధన్ రెడ్డి బి బసంతి తదితరులు .

నస్కల్–రాంపూర్ వరద అలర్ట్..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T130333.404.wav?_=10

రిస్కు టీం అలర్ట్…
రాంపూర్, నస్కల్
ఎస్డిఆర్ఎఫ్, ఎస్టీఆర్ఆఫ్

నిజాంపేట: నేటి ధాత్రి

ముంపు గ్రామాలైన నస్కల్, రాంపూర్ గ్రామాల్లో 40 మంది ఎస్డీ ఆర్ఆఫ్, ఎస్టీఆర్ఆఫ్ బృందాలు గ్రామాల్లో అలర్ట్ గా ఉన్నాయని నిజాంపేట తహసిల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కామారెడ్డి బీబీపేట మండలంలో గల పెద్ద చెరువు కు గండి పడడంతో వరద ఉధృతి అధికమైందని గురువారం రాత్రి ముంపు గ్రామల్లో గల ప్రజలను పాఠశాలలో, రైతు వేదికలో సుమారు 400 మంది గ్రామస్తులకు భోజనాలు కల్పించి సురక్షిత ప్రాంతాల్లో ఉంచడం జరిగిందన్నారు. గ్రామంలో నిరంతరం పర్యవేక్షణ చేయడం జరిగిందన్నారు.

Flood Alert in Nasakal & Rampur

గ్రామస్తులకు భరోసా కలిగిస్తూ రాత్రి వేళలో గ్రామంలోనే బసచేయడం జరుగుతుందన్నారు. ప్రజలు భయపడవలసిన అవసరం లేదని రిస్క్ టిమ్స్ ఉన్నాయని భరోసా కల్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజీరెడ్డి, పోలీస్ సిబ్బంది, రిస్క్ టిమ్స్ ఉన్నారు.

మహిళా యువత కి గ్రామోద్యోగ్ వికాస్ యోజన పథకం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T125804.058.wav?_=11

మహిళా యువత కి గ్రామోద్యోగ్ వికాస్ యోజన పథకం.

అవగాహనా కార్యక్రమం నిర్వహించిన జన శిక్షణ సంస్థ.

కాశిబుగ్గ నేటిధాత్రి

 

జన శిక్షణ సంస్థాన్ వరంగల్ అధ్వరం లో కె.వి.ఐ.సి హైదరాబాద్ వారు కేంద్ర ప్రభుత్వ గ్రామోద్యోగ్ వికాస్ యోజన పథకం పై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం జి డబ్ల్యు ఎం సి కమ్యూనిటీ హాల్,సోమిడి గ్రామం,ఖాజీపేట లో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి కి ముఖ్య అతిధి గా వరంగల్ జిల్లా ఎల్ డిఎం హవేలీ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హవేలి రాజు మాట్లాడుతూ స్వయం ఉపాధితో ఎదగాలనుకొనే మహిళలు వారు ఎంచుకున్న రంగానికి సంబందించిన నైపుణ్యాలు, మెలుకువలు నేర్చుకొని కె వి ఐ సి వారి గ్రామోద్యోగ్ పథకాన్ని వినియోగిచుకొని ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు. అలాగే మహిళలకు,యువతకి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల గురించి వివరించారు.ఈ కార్యక్రమం లో కె.వి.ఐ.సి అధికారి లతాదేవి మరియు ఇతర అధికారులు గ్రామోద్యోగ్ పథకం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువ భారత్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ కుమార్ మరియు జె ఎస్ ఎస్ డైరెక్టర్ ఎండి ఖాజా మసియద్దిన్ యువతకు,మహిళలకు నైపుణ్య శిక్షణల యొక్క ఆవశ్యకత గురించి వివరించారు.ఈ అవగాహన కార్యక్రమం లో వివిధ ప్రాంతాలనుంచి 150 మహిళలు, యువత పాల్గొన్నారు.

సెప్టెంబర్ 2న తుది ఓటర్ జాబితా…..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T125657.684-1.wav?_=12

గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష

పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురణ

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీ తుది ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్, పోలింగ్ కేంద్రాల లిస్ట్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా అప్ డేట్ చేయడం జరుగుతుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 12 మండలాల పరిధిలో 260 గ్రామ పంచాయతీ లలోని 2268 వార్డులలో 3,52,134 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ఆగస్టు 28న విడుదల చేసి గ్రామపంచాయతీ కార్యాలయాలలో అంటించడం జరిగిందని అన్నారు.

District Collector Sandeep Kumar Jha

జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ వారిగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితా తయారు చేశామని, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు ఈ జాబితా పరిశీలించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 30 లోపు తెలియజేయాలని , ఆగస్టు 31 లోపు వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి సెప్టెంబర్ 2న తుది ఓటర్ జాబితా ప్రచురించడం జరుగుతుందని అన్నారు.ప్రతి మండలం పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 2268 డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితా ఎంపీడీవో ఆగస్టు 28న తయారు చేశారని, వీటిపై అభ్యంతరాలను ఆగస్టు 30 లోపు ఎంపిడిఓ కార్యాలయంలోఅందించాలని అన్నారు. సెప్టెంబర్ 2న తుది పోలింగ్ కేంద్రాల జాబితా తయారు చేయడం జరుగుతుందని అన్నారు. 600 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఏర్పాటు చేస్తున్నామని ,జిల్లాలో ఎక్కడైనా అదనపు పోలింగ్ కేంద్రం అవసరమంటే వివరాలు అందిస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి షరీపుద్దిన్, డివిజనల్ పంచాయతీ అధికారి నరేష్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

సాంబయ్య పార్థదేహానికి పూలమాల వేసిన బొచ్చు చందర్పరకాల…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T125344.982.wav?_=13

సాంబయ్య పార్థదేహానికి పూలమాల వేసిన బొచ్చు చందర్పరకాల నేటిధాత్రి

 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,పిఎసిఎస్ మాజీ ఛైర్మెన్,డిసిసిబి డైరెక్టర్,తెలంగాణ ఉద్యమ నాయకుడు,బీసీ హక్కుల, గౌడ్ సంఘం నేత పూజారి సాంబయ్య గౌడ్ అకాల మరణం చెందగా వారి పార్దివదేహానికి హనుమకొండ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చందర్ పూలమాలలు వేసి,నివాళులు అర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చందర్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిన్నాల గోనాద్,రంజాన్ అలీ,ఎస్టీ సెల్ పరకాల నియోజకవర్గ అధ్యక్షులు పాలకుర్తి శ్రీనివాస్,రిటైర్ కో ఆపరేటివ్ అధికారి శంషుద్దీన్,మాజీ వార్డ్ మెంబర్ లక్కం వసంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్రాన్స్ జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T124959.968.wav?_=14

ట్రాన్స్ జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం ఉంటుంది

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

ట్రాన్స్ జెండర్లు ఆత్మగౌరవంతో జీవించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి తో కలిసి టెండర్లతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ ల సంక్షేమానికి చర్యలు చేపడతామన్నారు. ఆధార్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు జారీతో పాటు ఆధార్ కార్డులో పేరు, జెండర్ మార్చుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ట్రాన్స్ జెండర్ లందరికీ గుర్తింపు కార్డులను, రేషన్ కార్డులను అందజేస్తామన్నారు. ట్రాన్స్ జెండాలలో వికలాంగులకు దివ్యాంగుల పెన్షన్ మంజూరు కి చర్యలు చేపడతామన్నారు.ట్రాన్స్ జెండర్లకు కార్మిక శాఖ ద్వారా లేబర్ కార్డులను అందిస్తామన్నారు.ఎంజిఎం ఆసుపత్రిలో ట్రాన్స్ జెండర్ లకు వారంలో ఒకసారి చికిత్స జరిగేలా ప్రత్యేక ఓపిని కూడా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్ లకు తెలిపారు. స్వశక్తి మహిళా తరహాలో ట్రాన్స్ జెండర్లు సంఘాలు ఏర్పడితే వ్యాపార యూనిట్లకు ఏర్పాటు రుణాలు అందిస్తామన్నారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, జడ్పీ సీఈఓ, డి ఆర్ డి ఓ రామిరెడ్డి, డి డబ్ల్యు ఓ రాజమణి, ట్రాన్స్ జెండర్ల కమ్యూనిటీ అడ్వైజర్ ఈవి శ్రీనివాసరావు, ట్రాన్స్ జెండర్ ల రాష్ట్ర అధ్యక్షురాలు ఓరుగంటి లైలా, సభ్యులు అశ్విని, రీమిష, పూర్ణిమ రెడ్డి, నక్షత్ర, త్రిపుర,శాస్త్రి,జాహ్నవి, తదితరులు పాల్గొన్నారు.

సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T124735.975.wav?_=15

సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్

ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్

హన్మకొండ, నేటిధాత్రి:

 

వినాయక చవితి పండుగ సందర్భంగా రెండు రోజుల క్రితం
లస్కర్ బజార్ మరియు కుమార్ పల్లి మార్కెట్లలో వస్తువులు తీసుకుంటుండగా కొంతమంది దొంగలు ఫిర్యాదుదారుల దృష్టి మరల్చి వారి జేబులో ఉన్న సెల్ ఫోన్ ని దొంగతనం చేసినారు హనుమకొండ పోలీస్లు అట్టి దొంగతనం చేసిన జార్ఖండ్ కి చెందిన ఐదుగురు దొంగలను పట్టుకొని వారి వద్ద నుండి 1,50,000 విలువగల మూడు సెల్ ఫోన్ లను సీజ్ చేసి రిమాండ్ తరలించడం జరిగినది.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఝార్ఖండ్ కి సంబంధించిన కొందరు దొంగల ముఠా రెండు రోజుల క్రితం హనుమకొండ స్టేషన్ పరిధిలో ఉన్న రద్దీ ప్రాంతాలలో ప్రజల దృష్టి మరల్చి ఒక ప్లాస్టిక్ కవర్ అడ్డుపెట్టి ప్రజల సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్నారు కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు
అట్టి దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైమ్ పార్టీ సిబ్బంది రావుఫ్ అశోక్ మరియు మహేందర్ లను సీఐ మచ్చ శివకుమార్ అభినందించారు.

కుక్కలు రోడ్లపై హల్ చల్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T124529.503.wav?_=16

కుక్కలు రోడ్లపై హల్ చల్

గొర్రెల మందల తలపిస్తున్న కుక్కల మంద

అధికారులు స్పందించాలంటూ ఉన్న ప్రజలు

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో కేసముద్రం విలేజ్ లో
కుక్కలు వీధి వీధులలో సైరవిహారం చేస్తూ సందు సందులలో గుంపులు గుంపులుగా కలియ తిరుగుతూ దాడి చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి, చిన్నపిల్లలను ఇస్తారు చింపినట్టుగా చిన్నారులను చితిమేసిన సంఘటనలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి, అదేవిధంగా రోడ్లపై గ్రామంలో వీధుల వెంట వందల సంఖ్యలో గొర్రెల మందల లాగా విహారం చేస్తూ వచ్చిపోయే వాహనముల వెంట పడుతూ వాహనదారులు కుక్కల దాడిని తప్పించుకునే క్రమంలో భయాందోళనతో బైకులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. అదే క్రమంలో మరణాలు సంభవించే అవకాశం లేకపోలేదు, కానీ అధికారులు చోద్యం చూసినట్టు చూస్తూ అనేక ప్రమాదాలు జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నారు తప్ప కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం విడ్డూరం.తక్షణమే అధికారులు స్పందించి కుక్కల యొక్క దాడులనుంచి ప్రజలు గురికాకముందే కుక్కలను గ్రామాల నుండి నివారించే చర్యలు చేపట్టాలని లేకపోతే రాబోయే రోజుల్లో కుక్కల సంఖ్య పెరిగి చిన్న పిల్లలు మరియు పెద్దలు కూడా వీధుల్లోకి రావాలంటే రాలేని పరిస్థితి నెలకొంటుందని వెంటనే కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కేసముద్రం ప్రజలు కోరుకుంటున్నారు.

అటకెక్కిన పారిశుధ్యం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T124114.280.wav?_=17

 

అటకెక్కిన పారిశుధ్యం
* పట్టించుకోని పంచాయతీ అధికారి

మహాదేవపూర్ ఆగస్టు 29 (నేటి దాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పనులు అటకెక్కాయని శుక్రవారం రోజున గ్రామ ప్రజలు వాపోయారు. గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లవాడలో రోడ్డుకు ఇరుప్రక్కల మురుగునీటి కాలువలు లేక రోడ్డుపై మురుగునీరు నిలిచి ఇండ్లలోకి వస్తున్నాయని వాపోయారు. గ్రామ ప్రజలు, వ్యవసాయదారులు రాకపోకలు నిర్వహిస్తున్నారు పొరపాటున ఎవరైనా కాలుజారి కింద పడితే మునిగే ప్రమాదం ఉందనీ ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారి చొరవ తీసుకొని మురుగునీటి వ్యవస్థను మెరుపరిచి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుచున్నారు. 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version