చిత్తారమ్మ దేవాలయంలో వినాయక విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు..
రామాయంపేట ఆగస్టు 29 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట పట్టణంలోని చిత్తారమ్మ దేవాలయంలో భక్తి శ్రద్ధల మధ్య వినాయక విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మర్కు బాలరాజు దంపతులు తమ కుటుంబ తరపున వినాయక విగ్రహాన్ని ఆలయానికి అందజేశారు. అనంతరం పురోహితుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించబడ్డాయి. ఆలయంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు.
ప్రతిష్ఠ అనంతరం వినాయకునికి అర్చనలు, అష్టోత్తర శతనామ పూజలు, హారతులు నిర్వహించగా, తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడి, మంగళవాయిద్యాలతో కేరింతలు కొట్టింది.
ఈ సందర్భంగా మర్కు బాలరాజు దంపతులు మాట్లాడుతూ.. “గణపతి బాప్పా ఆరాధనతో అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. కుటుంబానికి, సమాజానికి శాంతి, ఐశ్వర్యం కలుగుతుందని విశ్వసిస్తున్నాం” అని తెలిపారు. ఆలయ కమిటీ సగర సంగం సభ్యులు, పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.