మహిళా యువత కి గ్రామోద్యోగ్ వికాస్ యోజన పథకం.
అవగాహనా కార్యక్రమం నిర్వహించిన జన శిక్షణ సంస్థ.
కాశిబుగ్గ నేటిధాత్రి
జన శిక్షణ సంస్థాన్ వరంగల్ అధ్వరం లో కె.వి.ఐ.సి హైదరాబాద్ వారు కేంద్ర ప్రభుత్వ గ్రామోద్యోగ్ వికాస్ యోజన పథకం పై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం జి డబ్ల్యు ఎం సి కమ్యూనిటీ హాల్,సోమిడి గ్రామం,ఖాజీపేట లో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి కి ముఖ్య అతిధి గా వరంగల్ జిల్లా ఎల్ డిఎం హవేలీ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హవేలి రాజు మాట్లాడుతూ స్వయం ఉపాధితో ఎదగాలనుకొనే మహిళలు వారు ఎంచుకున్న రంగానికి సంబందించిన నైపుణ్యాలు, మెలుకువలు నేర్చుకొని కె వి ఐ సి వారి గ్రామోద్యోగ్ పథకాన్ని వినియోగిచుకొని ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు. అలాగే మహిళలకు,యువతకి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల గురించి వివరించారు.ఈ కార్యక్రమం లో కె.వి.ఐ.సి అధికారి లతాదేవి మరియు ఇతర అధికారులు గ్రామోద్యోగ్ పథకం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువ భారత్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ కుమార్ మరియు జె ఎస్ ఎస్ డైరెక్టర్ ఎండి ఖాజా మసియద్దిన్ యువతకు,మహిళలకు నైపుణ్య శిక్షణల యొక్క ఆవశ్యకత గురించి వివరించారు.ఈ అవగాహన కార్యక్రమం లో వివిధ ప్రాంతాలనుంచి 150 మహిళలు, యువత పాల్గొన్నారు.