బాలాజీ టెక్నో స్కూల్లో మాతృభాష దినోత్సవం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలం లక్నపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్ లో గిడుగు వేంకట రామమూర్తి పంతులు జన్మదినాన్ని పురస్కరించుకొని మాతృభాష దినోత్సవం జరుపుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు తెలుగు భాష మాధుర్యాన్ని తెలిపేందుకు వీలుగా పద్య రచన,కావ్యరచన పోటీలను నిర్వహించారు.పాఠశాల ప్రిన్సిపాల్ పి .రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషో ద్యమానికి మూలపురుషుడైన గిడుగు వెంకట రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు, బహుభాషావేత్త, చరిత్రకారుడు ,సంఘసంస్కర్త అయిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు 1863 ఆగస్టు 29 శ్రీకాకుళం జిల్లాలో పర్వతాలపేట గ్రామంలో జన్మించారన్నారు.తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని,వీలును తెలియజెప్పిన మహనీయుడని ,అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు అని, పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వీలైందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రియాజుద్దీన్,రమేష్ , రవీందర్ ,గణేష్, భాగ్యలక్ష్మి, నరేష్ ,విశాల, రంజిత్, విజయరాణి, రవీందర్ రెడ్డి, భవాని చంద్ ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం…
గొప్ప ఫీల్డ్ ఆటగాడు, దిగ్గజ మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్.సి. సి థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో బాలాజీ టెక్నో స్కూల్ లో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ పి. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఆగస్టు 29 ని భారతదేశం జాతీయ క్రీడా దినోత్సవం గా జరుపుకుంటామని పేర్కొన్నారు.ఈ సంవత్సరం క్రీడా వేడుకలకు ఫిట్ ఇండియా మిషన్ నాయకత్వం వహిస్తుందని, ప్రతి సంవత్సరం “ఖేల్ కే మైదాన్ మై” అనే థీమ్ తో దేశవ్యాప్తంగా క్రీడలను నిర్వహిస్తారని తెలిపారు.మేజర్ ధ్యాన్ చంద్ 1929 నుండి 1936 వరకు ఒలంపిక్స్ లో భారతదేశ ఆధిపత్యం చెలాయించేలా కృషి చేశాడని వీరి నాయకత్వంలో భారత్ 1948లో హాకీ క్రీడలో స్వర్ణం సాధించిందని తెలిపారు.అనంతరం విద్యార్థులకు, ఎన్.సి.సి క్యాడేట్లకు క్రీడా పోటీలను నిర్వహించారు పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు భవాని చంద్ ,రవీందర్ రెడ్డి, పార్వతి ,వినోద్ ,గోపి, సతీష్, అరుంధతి, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
అక్షర ద స్కూల్,బిట్స్ లో జాతీయ క్రీడా దినోత్సవం..
నర్సంపేట పట్టణంలోని బాలాజీ విద్యా సంస్థలలో ఒక్కటైనా అక్షర ద స్కూల్,బిట్స్ స్కూల్ లో లో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిదులుగా బాలాజీ విద్యాసంస్థలు చైర్మన్ డాక్టర్ ఆండ్ర రాజేంద్రప్రసాద్ రెడ్డి హాజరైయ్యారు.హాకీ క్రీడ దిగ్గజం ధ్యాన్ చంద్ జయంతి సందర్బంగా క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.ఒలంపిక్ క్రీడలలో మూడు బంగారు పథకాలు తెచ్చిన అందించిన గొప్ప క్రీడాకారుడు ధ్యాన్ చంద్ అని తెలిపారు.చదువులతో పాటు అన్ని రకాల క్రీడల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు.కోశాదికారి డాక్టర్ వనజ, ఈ కార్యక్రమంలో బిట్స్ స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి గౌడ్,అక్షర ద స్కూల్ ప్రిన్సిపల్ భవాణి,ఉపాద్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.