ట్రాన్స్ జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం ఉంటుంది
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:
ట్రాన్స్ జెండర్లు ఆత్మగౌరవంతో జీవించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి తో కలిసి టెండర్లతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ ల సంక్షేమానికి చర్యలు చేపడతామన్నారు. ఆధార్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు జారీతో పాటు ఆధార్ కార్డులో పేరు, జెండర్ మార్చుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ట్రాన్స్ జెండర్ లందరికీ గుర్తింపు కార్డులను, రేషన్ కార్డులను అందజేస్తామన్నారు. ట్రాన్స్ జెండాలలో వికలాంగులకు దివ్యాంగుల పెన్షన్ మంజూరు కి చర్యలు చేపడతామన్నారు.ట్రాన్స్ జెండర్లకు కార్మిక శాఖ ద్వారా లేబర్ కార్డులను అందిస్తామన్నారు.ఎంజిఎం ఆసుపత్రిలో ట్రాన్స్ జెండర్ లకు వారంలో ఒకసారి చికిత్స జరిగేలా ప్రత్యేక ఓపిని కూడా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్ లకు తెలిపారు. స్వశక్తి మహిళా తరహాలో ట్రాన్స్ జెండర్లు సంఘాలు ఏర్పడితే వ్యాపార యూనిట్లకు ఏర్పాటు రుణాలు అందిస్తామన్నారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, జడ్పీ సీఈఓ, డి ఆర్ డి ఓ రామిరెడ్డి, డి డబ్ల్యు ఓ రాజమణి, ట్రాన్స్ జెండర్ల కమ్యూనిటీ అడ్వైజర్ ఈవి శ్రీనివాసరావు, ట్రాన్స్ జెండర్ ల రాష్ట్ర అధ్యక్షురాలు ఓరుగంటి లైలా, సభ్యులు అశ్విని, రీమిష, పూర్ణిమ రెడ్డి, నక్షత్ర, త్రిపుర,శాస్త్రి,జాహ్నవి, తదితరులు పాల్గొన్నారు.