రిస్కు టీం అలర్ట్…
రాంపూర్, నస్కల్
ఎస్డిఆర్ఎఫ్, ఎస్టీఆర్ఆఫ్
నిజాంపేట: నేటి ధాత్రి
ముంపు గ్రామాలైన నస్కల్, రాంపూర్ గ్రామాల్లో 40 మంది ఎస్డీ ఆర్ఆఫ్, ఎస్టీఆర్ఆఫ్ బృందాలు గ్రామాల్లో అలర్ట్ గా ఉన్నాయని నిజాంపేట తహసిల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కామారెడ్డి బీబీపేట మండలంలో గల పెద్ద చెరువు కు గండి పడడంతో వరద ఉధృతి అధికమైందని గురువారం రాత్రి ముంపు గ్రామల్లో గల ప్రజలను పాఠశాలలో, రైతు వేదికలో సుమారు 400 మంది గ్రామస్తులకు భోజనాలు కల్పించి సురక్షిత ప్రాంతాల్లో ఉంచడం జరిగిందన్నారు. గ్రామంలో నిరంతరం పర్యవేక్షణ చేయడం జరిగిందన్నారు.
గ్రామస్తులకు భరోసా కలిగిస్తూ రాత్రి వేళలో గ్రామంలోనే బసచేయడం జరుగుతుందన్నారు. ప్రజలు భయపడవలసిన అవసరం లేదని రిస్క్ టిమ్స్ ఉన్నాయని భరోసా కల్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజీరెడ్డి, పోలీస్ సిబ్బంది, రిస్క్ టిమ్స్ ఉన్నారు.