సాంబయ్య పార్థదేహానికి పూలమాల వేసిన బొచ్చు చందర్పరకాల నేటిధాత్రి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,పిఎసిఎస్ మాజీ ఛైర్మెన్,డిసిసిబి డైరెక్టర్,తెలంగాణ ఉద్యమ నాయకుడు,బీసీ హక్కుల, గౌడ్ సంఘం నేత పూజారి సాంబయ్య గౌడ్ అకాల మరణం చెందగా వారి పార్దివదేహానికి హనుమకొండ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చందర్ పూలమాలలు వేసి,నివాళులు అర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చందర్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిన్నాల గోనాద్,రంజాన్ అలీ,ఎస్టీ సెల్ పరకాల నియోజకవర్గ అధ్యక్షులు పాలకుర్తి శ్రీనివాస్,రిటైర్ కో ఆపరేటివ్ అధికారి శంషుద్దీన్,మాజీ వార్డ్ మెంబర్ లక్కం వసంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.