వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఘనంగా పోచమ్మ బోనాలు..

వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఘనంగా పోచమ్మ బోనాలు

చందుర్తి, నేటిధాత్రి :

చందుర్తి మండలం జోగాపూర్ గ్రామం వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో అంగరంగ వైభవంగా బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిల్లలు అమ్మవారి, పోతరాజుల విన్యాసాలతో ఆకట్టుకున్నారు. తెలంగాణ బోనాల సాంస్కృతిక పాటలతో నృత్యాలతో పిల్లలు గ్రామ ప్రధాన కూడలిల వద్ద నృత్యాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ సద్గుణ చారి మాట్లాడుతూ ….. ఆషాడ మాసంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ పండగను దేవతకు ఒక ప్రతిరూపంగా భావిస్తారు. బోనం వండి అమ్మవారికి నైవేద్యం పెడతారు. మహిళలు కొత్త మట్టి, ఇత్తడి కుండలో పాలు బెల్లం బియ్యం కలిపి వండుతారు. దీనిని వేప ఆకులు, పసుపు మరియు సింధూరంతో అలంకరిస్తారు. మహిళలు ఈ బోనాలను తలపై మోసుకొని దేవాలయంలో అమ్మ దేవతకు గాజులు మరియు చీరతో సహా బోనం నైవేద్యం పెడతారు. బోనాలు అంటే కాలిని మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ మొదలైన వివిధ రూపాల్లో పూజించడం అని వివరించారు. పాఠశాల విద్యార్థులు వివిధ వేషధారణలో బోనాలు నెత్తిన పెట్టి పోతరాజుల విన్యాసాలతో గ్రామంలోని ప్రధాన కూడలి వెంట పోచమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. చిన్నప్పటినుండి మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల విద్యార్థులకు అవగాహన పెంపొందించడానికి పాఠశాలలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని పాఠశాల కరస్పాండెంట్ సద్గుణ చారి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇంగ్లీష్ టీచర్ చర్యలు తీసుకోవాలి..

ఇంగ్లీష్ టీచర్ చర్యలు తీసుకోవాలి
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్
మహాదేవపూర్
జులై 23 నేటి ధాత్రి
గత కొంతకాలంగా ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ డుమ్మా కొడుతున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సురేష్ డిమాండ్ చేశారు ప్రైవేట్ పాఠశాలల నుండి అనేకమంది విద్యార్థులు మహాదేవపూర్ లోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో విద్యను అభ్యసించడానికి చేరుతున్నారన్నారు. ఓవైపు ప్రభుత్వ పాఠశాల టీచర్ల పనితీరు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆనంద వ్యక్తం చేసినప్పటికీ ప్రైమరీ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ లేక విద్యార్థులకు సబ్జెక్టులో వెనుకబడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో మంగళవారం పాఠశాలను తనిఖీ చేయగా ఇంగ్లీష్ సార్ నెల రోజులు దాటిందని హెచ్ఎం చెప్పడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు ఇంగ్లీష్ టీచర్ స్థానంలో మరో ఉపాధ్యాయుని నియమించి విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు సంపూర్ణంగా విద్యను అందించేలా కృషి చేయాలని అధికారులను కోరారు అదేవిధంగా విధులకు డుమ్మా కొడుతున్న టీచర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు

కే.యు ఆంగ్ల విభాగంలో పీహెచ్డి సూపర్వైజర్ గా ప్రొఫెసర్.

కే.యు ఆంగ్ల విభాగంలో పీహెచ్డి సూపర్వైజర్ గా ప్రొఫెసర్ నవీన్ ఎంపిక

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

కాకతీయ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో పీహెచ్డి సూపర్వైజర్ గా నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ ఎంపికయ్యారు.
ప్రొఫెసర్ మల్లం నవీన్ ను కాకతీయ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో పీహెచ్డీ గైడ్ షిప్ ను అందించింది.కాగా
వీరు ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) సభ్యులుగా కొనసాగుతున్నారు.
కాకతీయ యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ కే. ప్రతాప రెడ్డి,రిజిస్ట్రార్, ఆర్ట్స్ డీన్ ఈ సందర్భంగా అభినందించారు.తెలంగాణ ప్రభుత్వం నుండి స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డును,ఏల్టాయి నుండి నేషనల్ లెవెల్ బెస్ట్ టీచర్ అప్రిసియేషన్ అందుకుని,వివిధ నేషనల్, ఇంటర్నేషనల్ సెమినార్లలో దాదాపు 59 పరిశోధన పత్రాలను, వివిధ జర్నల్ మరియు పుస్తకాలలో దాదాపు 30 వ్యాసాలను ఇప్పటివరకు ఆయన సంపర్పించారు.ఈ సందర్భంగా జరిపిన సమావేశంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, వివిధ కళాశాలల నుంచి అధ్యాపకులు ప్రొఫెసర్ మల్లం నవీన్ ను ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా పరిశోధనలు చేసే విద్యార్థులకు మెంటారుగా ,సూపర్వైజర్ గా తన యొక్క విద్యార్థులు పరిశోధన గ్రంథం సమర్పించడంలో తగు సలహాలు సూచనలు ఇస్తూ పరిశోధక విద్యార్థుల యొక్క అత్యున్నత డిగ్రీ( పీహెచ్డీ పట్టా) పొందడంలో పారదర్శకంగా, నిజాయితీగా నాణ్యమైన పరిశోధనలు రావడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ గొప్ప అవకాశం కల్పించిన కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కే. ప్రతాప రెడ్డి, రిజిస్టర్, ఆర్ట్స్ డీన్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కు ఉన్నత గౌరవం దక్కడంతో కళాశాల యొక్క కీర్తి మరో మైలురాయి దాటినట్టు అధ్యాపక మిత్రులు సిబ్బంది, విద్యార్థులు సంతోషాన్ని ప్రకటించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version