స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పొటీ: సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ
నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని గ్రామాలలో సిపిఎం పోటీ చేస్తుందని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. శుక్రవారం చండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఒకటి, రెండు హామీలను అమలు చేసిన అవి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆయన అన్నారు. స్థానిక సమస్యలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగానే ఉన్నామని, ఒంటరిగానే పోటీ చేయాలనుకున్నామని, ఎవరైనా కలిసి వస్తే ఆలోచిస్తామని ఆయన అన్నారు. దేశ లౌకిక విధానం, ఫెడరలిజానికి బిజెపి రూపంలో ప్రమాదం పొంచి ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతులకు సరిపడ యూరియాను అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యావని ఆయన అన్నారు. యూరియా కోసం కావాలని గంటల తరబడి క్యూలైన్లలో నిలబడిన దొరకని పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నేర్మట నుండి బంగారిగడ్డ వరకు బీటీ రోడ్డు నిర్మించాలని, అదేవిధంగా పుల్లెంల నుండి నేర్మట వరకు రోడ్డు నిర్మాణం చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు రావడం వలన సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.జెడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి బల్లెం స్వామి, రైతు సంఘం మండల కార్యదర్శి ఈరటి వెంకటయ్య, నారపాక శంకరయ్య, బొమ్మరగోని యాదయ్య, ఈరగట్ల నరసింహ, స్వామి, కలిమెర సైదులు, కొత్తపల్లి వెంకన్న, లక్ష్మమ్మ, ఎన్. శంకర్ తదితరులు పాల్గొన్నారు.