రామకృష్ణాపూర్ కు ఆర్టీసీ బస్సు సౌకర్యం

రామకృష్ణాపూర్ కు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించండి

సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మంచిర్యాల నుండి రామకృష్ణాపూర్ పట్టణానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో మంచిర్యాల డిపో మేనేజర్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. రామకృష్ణాపూర్ పట్టణానికి గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ సేవలు లేవని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటైన నేపథ్యంలో ఆర్టీసీని పునరుద్ధరించాలని డిపో మేనేజర్ కు వినతిపత్రం అందించడం జరిగిందని జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ తెలిపారు. డిపో మేనేజర్ స్పందించి వారం రోజులలో బస్సు సౌకర్యం ఏర్పాటు చేసేలా చొరవ తీసుకుంటామని తెలిపినట్లు వారు తెలియజేశారు.వినతి పత్రం అందించిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పకాయల లింగయ్య, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌల్, కాదండి సాంబయ్య, మామిడి గోపి, వనం సత్యనారాయణ, మొండి ,మారేపల్లి రవి ,చందర్, సిరికొండ రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.

పెంచిన ఆర్టీసీ బస్ టికెట్లను ధరను వెంటనే తగ్గించాలి.

పెంచిన ఆర్టీసీ బస్ టికెట్లను ధరను వెంటనే తగ్గించాలి

బిజెపి పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్

పరకాల నేటిధాత్రి

 

బస్సు పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ సామాన్య ప్రజలతోపాటు,విద్యార్థుల బస్సు పాస్ 20 శాతం,పెంచిన తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రం
ఆర్డినరీ పాస్ ధరను రూపాయలు 1150 నుండి రూ.1400కు,మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధరను 1300 నుండి 1600 కు,డీలక్స్ పాస్ ధరను 1450 నుండి 1800 పెంచిన టీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడవారికి ఉచితమని మగవారి దగ్గర టికెట్ రేట్లు పెంచి ప్రజల మీద భారం వేస్తుంన్నారని,పెంచిన ఆర్టీసీ టికెట్ ధరను వెంటనే తగ్గించాలని లేనియెడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో
ప్రజల తరఫున ధరలు తగ్గించేవరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని
బిజెపి పరకాల పట్టణ అధ్యక్షులు
గాజుల నిరంజన్ డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version