మహిళా ఉపాధ్యాయులకు సద్దుల బతుకమ్మ రోజే ఎన్నికల శిక్షణ ఇవ్వడం ఏంటీ….???
అధికారుల వింత ప్రవర్తన తో బతుకమ్మ ఆడలేక ఆవేదన చెందిన మహిళా ఉపాధ్యాయులు.
ప్రభుత్వం బతుకమ్మ ఆడమని సెలవులిస్తే అధికారులు శిక్షణ ఇవ్వడం ఏంటి..?
ఇది బతుకమ్మ పండుగ స్ఫూర్తికే విరుద్ద్ధం
ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యాన్ని సైతం లెక్కచేయని అధికారులు
అధికారుల తీరు మారాలి.విచక్షణతో ఆలోచించాలి.
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ విమర్శ
కేసముద్రం/ నేటి ధాత్రి
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రిసైడింగ్ అధికారులైన మహిళా ఉపాధ్యాయులకు సైతం సోమవారం సద్దుల బతుకమ్మ రోజే ఎన్నికల సోమవారంశిక్షణ ఇవ్వడాన్ని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ ఖండించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, మహిళలందరూ ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని ఆయన అన్నారు. ఈ పండుగ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించిందని ఈ క్రమంలోనే మహిళా ఉపాధ్యాయులు అందరూ తమ పుట్టింటికి వెళ్లి పండుగ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలోనే అధికారులు ఉన్నఫలంగా ఎన్నికల శిక్షణ నిర్వహించడం ఏంటి..? అని విమర్శించారు. మహిళా ఉపాధ్యాయులను బతుకమ్మ ఆడనీయకుండా వారిని మనోవేదనకు గురిచేయడం సమంజసం కాదని, ఇది బతుకమ్మ పండుగ స్ఫూర్తికే విరుద్ధమని అన్నారు.
ఈరోజు తప్ప అధికారులకు వేరే రోజు ఏది అనుకూలంగా కనిపించలేదా..? అని ప్రశ్నించారు.
“దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యనట్లు ” ఉంది అధికారుల ప్రవర్తన అని ఎద్దేవా చేశారు . అధికారులు విచక్షణతో ఆలోచించి ఉంటే బాగుండేదని, కనీసం ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యాన్ని పరిగణలోకి తీసుకున్నా ఈ శిక్షణ కార్యక్రమం తేదీ మారేదని, మహిళా ఉపాధ్యాయులు నష్టపోయే వారు కాదని, వారు మనోవేదనకు గురయ్యే వారు కాదని ఆయన ఆవేదన వ్యక్తం వారు. సంబంధిత అధికారులు భవిష్యత్తులోనైనా ఇలాంటి తప్పిదాలు చేయకుండా ఉండాలని అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లంచాలు అడుగుతున్న పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. లబ్ధిదారుల నుంచి బిల్లుల కోసం లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులపై కాల్ సెంటర్ ద్వారా విచారణ జరిపి, ఇప్పటివరకు 10 మందిని సస్పెండ్ చేశారు. ఈ విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. లంచం అడిగితే 1800 599 5991 నెంబర్ కు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు అందిన 24 గంటల్లో క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి( సి ఎం ఆర్ ఎఫ్ )
◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ : పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ యన్.గిరిధర్ రెడ్డి నివాసంలో బుధవారం జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన 19 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్( సి ఎం ఆర్ ఎఫ్ ) చెక్కులను తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు. -:లబ్ధిదారులు:- రాజు మైకలి-47,500/- ఎండీ సోహైల్ షా-25,000/- అబ్దుల్ నబీ-27,000/- కళ్యాణ్ ఉమాదేవి-60,000/- దామావతి-60,000/- వోతి శ్రీనివాస్-29,500/- ఎస్ మహేష్ కుమార్-60,000/- దోమల రమేష్-60,000/- పర్వీన్ బేగం-35,000/- చౌహాన్ రవీందర్-50,000/- బేగరి దశరథ్-50,000/- బి.నవాబ్ మియా-24,000/- ఎండీ షాబుద్దీన్-60,000/- ఎదిగి దత్త గౌడ్-30,000/- ఎన్ అశ్వని-30,500/- ఎన్ అశ్వని-30,500/- పవార్ రేణుకా బాయి-20,000/- మంగలి సురేష్-60,000/- తలారి బిక్షపతి-55,000/- మొత్తం = 1,053,500/- ఈ సందర్భంగా యన్.గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.ఈ సహాయ నిధి చెక్కుల మంజూరు కై కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారికి,సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి చెక్కులు పొందిన లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రాంలింగా రెడ్డి,సిడిసి చైర్మన్ ముబీన్,మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి,మాజీ వైస్ యం.పి.పి వి.రాములు,డిసిసి ఉపాధ్యక్షుడు ముల్తాని,మైనార్టీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భీమయ్య నర్సింహారెడ్డి,ప్రతాప్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి,కిరణ్ గౌడ్ జగదీశ్వర్ రెడ్డి మల్లికార్జున్ నర్సింహులు ఇమామ్ పటేల్,హన్మంత్ రెడ్డి బర్కత్ మరియు కౌన్సిలర్లు మాజీ సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లబ్దిదారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పేదల సొంతింటి కలను నెరవేర్చే వారి జీవన ప్రయాణ మెరుగుపరచడానికి తెలంగా ణ ప్రభుత్వం ఇందిరమ్మ నిర్మా ణాన్ని అమలు చేసింది ఈ పథకం ద్వారా రాష్ట్రంలో నిరుపేదలైన సొంతింటి ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి తగిన సహాయం చేస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, మొరం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు చర్చించారు. శాయంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఇందిరమ్మ గృహాల నిర్మాణం కొరకు కావలసిన ఇసుక మొరం వాటిపై ప్రభుత్వ అధికారులు చర్చించారు. ఇందిరమ్మ ఇండ్ల ఇసుక రవాణా పూర్తిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభు త్వ నిబంధనలు అనుగు ణంగా సరఫరా వ్యవస్థను నిమిత్తం ఇసుక తరలించే వాహనాలకు లైసెన్సు కలిగి ఉండి కూపన్ల సహాయంతో సరఫరా చేయాలి ఇసుకను ఎక్కువ రేట్లకు అమ్మకూడదని తెలియజేశారు ఇట్టి నియమా లను పాటించక పోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో సీఐ రంజిత్ రావు ,ఎస్సై పరమేశ్వర్, ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో ఫణిచంద్ర , గ్రామపంచాయతీ కార్య దర్శి అధికారులు పాల్గొ న్నారు.
జనగామ నుండి సిద్దిపేట వరకు బస్సు లో అందని మహిళల ఉచిత బస్సు సౌకర్యం
అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్న కండక్టర్లు
చేర్యాల నేటిధాత్రి
జనగామ డిపో పరిధిలో ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలలో గొప్పగా చెప్పుకునే ఆర్టీసీ ఉచిత మహిళల బస్సు సౌకర్యం ప్రయాణం అనే పథకం జనగామ డిపో పరిధిలో గల కండక్టర్లు పలు కారణాలు చూపిస్తూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తాలేరని విమర్శలు వస్తున్నాయి ఇక్కడ తిరిగే మహిళలు వాపోతున్నారు జనగామ సిద్దిపేట వెళ్లే దారిలో నిత్యం కండక్టర్లు మొండివైఖరితో మహిళలను ఇబ్బందులకు గురిచేస్తూ డబ్బులు తీసుకుంటూ ఏమైనా ఉంటే డిపో మేనేజర్ కు కంప్లైంట్ చేసుకోమని దురుసుగా ప్రవర్తిస్తున్నారు తెలంగాణ అని రాసి ఉన్న మహాలక్ష్మి పథకం కింద ఫోటో సరిగ్గా లేదని ఫోటో లేటెస్ట్ గా లేదని కుంటి సాకులు చెబుతూ మహిళలను ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు వెంటనే డిపో మేనేజర్ చర్యలు తీసుకొని ప్రభుత్వం తీసుకు వచ్చిన మహిళలు కు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన ప్రజా ప్రభుత్వం
సీఎం, డిప్యూటీ సీఎం కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
సోమవారం హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో సింగరేణి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను దసరా పండుగ సందర్భంగా కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ను ప్రకటించింది. లాభాల్లో 34 శాతం కార్మికులకు పంచింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విలేకరుల సమావేశంలో తెలిపారు. కాగా, సింగరేణి లాభం మొత్తం రూ.2360 కోట్లు. అందులో కార్మికుల వాటా మొత్తం రూ. 819 కోట్లు. ఒక్కో కార్మికునికి రూ.1,95,610 ఇవ్వనున్నారు. ఈసారి కాంట్రాక్టు కార్మికులకూ రూ.5,500 చొప్పున బోనస్ను చెల్లించనున్నారు. దీంతో, భూపాలపల్లిలో 5,500 కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది. కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లను వేరువేరుగా కలిసి పుష్పగుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు.
◆:- ప్రభుత్వం బాధ్యత వహిస్తూ నష్టపరిహారం అందించాలి
◆:- పి. రాములు నేత జాగో తెలంగాణ వ్యవస్థాపకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోయింది వెంటనే పూర్తిగా చెత్తను తొలగించాలి ప్రజలు తమ ఇష్టారిథిగా ఎక్కడపడితే అక్కడ చెత్త వేయుచున్నారు ఇలా పాడవేయకుండా ప్రజలను చైతన్య పరచాలి జహీరాబాద్ పట్టణంలో మురికి కాలువలలో నిండుగా మురికి పేరుకుపోవడంతోని విపరీతమైన దోమలు ఏర్పడి ప్రజలకు డెంగు మలేరియా లాంటి వ్యాధులు సోకుతున్నాయి వెంటనే వీటిని నిర్మూలించాలి మురికి కాలువలు నిండుకుండ లాగా తయారైనాయి మురికి కాలువలు పూర్తిగా పైకప్పులతో మూసి వేయబడ్డాయి వాటిని తొలగించి మురికి కాలువలు శుభ్రం చేయించాలి పురపాలక సంఘం అధికారులు ప్రత్యేక పరిపాలన అధికారి జహీరాబాద్ పట్టణ పురవీధులను పరిశీలించాలి పి. రాములు నేత జాగో తెలంగాణ వ్యవస్థాపకులు జహీరాబాద్ పట్టణంలో గత నాలుగు రోజులుగా వేరువేరు స్థలాల వద్ద కొండముచ్చులు ప్రజల మీద దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి ఈ దాడిలో శాంతినగర్ హమాలీ కాలనీ రాంనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలలో దాదాపుగా పదిమందిపై అనగా మారుతి రావు సిద్దు శాంతాబాయి శంకర్ లక్ష్మి శంకరమ్మ జీవరత్నం గార్లపై కొండముచ్చులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినాయి గాయపడ్డ చాలామంది నిరుపేదలు ఉన్నారు రోజువారి కూలీలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వీరందరినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగు నష్టపరిహారాన్ని చెల్లించాలని సవినయంగా బాధితుల పక్షాన పి.రాములు నేత జాగో తెలంగాణ వ్యవస్థాపకులు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ ఘటనపై జాగో తెలంగాణ వ్యవస్థాపకులు పి. రాములు నేత మాట్లాడుతూ మూగజీవాలు ఈ రకంగా పట్టణంలో చేరి దాడి చేయడానికి తగు కారణం చూస్తుంటే జహీరాబాద్ పట్టణం ఎక్కడ చూసినా మురికితో నిండిపోయి ఉండడం కనబడుతుంది వాస్తవానికి జహీరాబాద్ పట్టణంలో పూర్తిస్థాయి చెత్త సేకరణ కార్యక్రమం జరగడం లేదు పురపాలక సంఘం అధికారులు ప్రజలకు ఎక్కడపడితే అక్కడ చెత్తను తినుబండరాలను పార వేయకుండా ఈ రకంగా పారవేసే వారి గురించి పురపాలక సంఘం అధికారులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టకపోవడం ప్రధాన కారణంగా కనబడుతుంది పురపాలక సంఘం పరిధిలో ఎక్కడ చూసినా విపరీతమైన చెత్త పేరుకుపోయి ఉన్నది మురికి కాలువలు మురికితో నిండుకుండ లాగా తయారైపోయాయి ఏ మూలమలుపులో చూసినా కూడా తినుబండారాలతో కూడిన చెత్త పేరుకుపోయి ఉంది దీనిని ఆసరా చేసుకొని వీధి పందులు వీధి కుక్కలు కొండముచ్చులు పశువులు ప్రజల నివాసాల మధ్య చేరిపోయి అనేక రకాలుగా ప్రజలకు ఇబ్బంది పెడుతున్నాయి ఇకనైనా పురపాలక సంఘం అధికారులు ప్రత్యేక పాలన అధికారి స్థానిక సంస్థల జిల్లా అధికారి జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే దసరా దీపావళి పండుగల సందర్భంగా జహీరాబాద్ లో పేరుకుపోయిన చెత్తాను పూర్తిగా తొలగించి ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా ప్రజలను చైతన్య పరచాలని ఇలాంటి కార్యక్రమం పురపాలక శాఖ తీసుకుంటే మా వంతు సహకారం గా మేము కూడా కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేస్తున్నాం అదేవిధంగా అడవి శాఖ వారికి బాధితులను ఆదుకోవాలని తెలపగా అందుకు సానుకూలంగా స్పందించిన సంగారెడ్డి జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు జహీరాబాద్ అటవీశాఖ సిబ్బంది బాధితులను కలిసి వారి వివరాలను సేకరించారు మా శాఖ తరపు నుండి బాధితులకు వారికి జరిగిన నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వం చే పరిహారం ఇప్పించడం జరుగుతుందని జహీరాబాద్ అటవీ శాఖ అధికారులు బాధితులతో మరియు వారి పక్షాన ఉండి పోరాడుతున్న జాగో తెలంగాణ నాయకులకు తెలిపారు కార్యక్రమంలో జహీరాబాద్ అటవీ శాఖ అధికారులు పి. కృష్ణమ్మ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జి. కిరణ్ కుమార్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మరియు బీట్ ఆఫీసర్లు గంగాభవాని భాస్కర్ నిజాముద్దీన్ సంజీవ్ గార్లు మరియు జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్, మాదినం శివప్రసాద్ , గొల్లమల్లు , కాలనీవాసులు సిహెచ్ సంతోష్ ,సిహెచ్ జగదీష్ ,జామ్ గారి రాజ్ కుమార్ ,నారాయణపేట రాజ్ కుమార్ పాల్గొన్నారు,
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తాహసిల్దార్ కార్యాలయం ముట్టడి
నడికూడ,నేటిధాత్రి:
వికలాంగులకు,వృద్ధులకు,వితంతువులకు,ఒంటరి మహిళలకు,నేత,గీత,బీడీ కార్మికులతో పాటు ఇతర పెన్షన్ దారులందరికీ పెన్షన్ పెరగాలని,నూతన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ వెంటనే మంజూరు కావాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తాహసిల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పై విషయమై తమతో మనవి చేయునది ఏమనగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ రూ.4000 నుండి రూ 6000/- పెంచుతామని, అలాగే వృద్ధులు వితంతువులతో పాటు ఇతర పెన్షన్ దారుల పెన్షన్లు రూ. 2000/-నుండి రూ 4000/- పెంచుతామని హామీ ఇచ్చారు.ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాగ్దానం చేశారు.కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవీ చేపట్టి 22 నెలలు గడిచినా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచలేదు.ఇది ఘోరమైన మోసం.ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ వికలాంగులు,వృద్ధులు వితంతువులతో పాటు ఇతర పెన్షన్ దారులకు ఏ మాత్రం సరిపోవడం లేదు.దీని వల్ల వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి.ప్రస్తుత పెన్షన్ వల్ల నెల రోజుల పాటు పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యంగా జీవించే పరిస్థితి కూడా లేదు.అంగవైకల్యం, నిస్సహాయ స్థితి,నిరాదరణ వల్ల ఇప్పటికే ఎన్నో అవమానాలు,అవహేళనలు ఎదుర్కొంటున్న వికలాంగులు, వృద్ధులు,వితంతువులతో పాటు ఇతర పెన్షన్ దారుల యొక్క దీన పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. కనీసం సరియైన తిండి తినడానికి కూడా సరిపోని పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదని గుర్తు చేస్తున్నాం. కనుక ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వికలాంగుల పెన్షన్ రూ 6000/-అలాగే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేత గీత బీడీ కార్మికులతో పాటు ఇతర చేయూత పెన్షన్ దారుల పెన్షన్ రూ 4000/- పెంచాలని మరియు పూర్తి కండరాల క్షీణత కలిగిన వారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వలె నెలకు రూ 15000/- పింఛను ఇవ్వాలని అలాగే నూతన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ మంజూరు చేయాలని తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని నడికూడ మండల తహసీల్దార్ పోలేపాక రాణి ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్ చిలువేరు సంపత్ మాదిగ,నడికూడ మండల అధ్యక్షులు సుమన్ మాదిగ, కార్యదర్శి మేకల రవి మాదిగ,రంజిత్ మాదిగ, శ్యామ్ మాదిగ,మొగిలి మాదిగ,రాజు,రమేష్,ప్రణయ్,తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలి
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో ఉన్న ఆశ్రమ పాఠశాల వద్ద వర్కర్స్ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీ వేజ్,కాంటినింజెంట్ వర్కర్ల సమస్యల పరిష్కారంకై రాష్ట్రవ్యాప్తంగా ఆశ్రమ పాఠశాల వర్కర్స్ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు ఈ ధర్నా కార్యక్రమానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కిషన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పనిచేస్తున్న డైలివెజ్ డైలీవేజ్, కాంటినెంట్, పార్ట్ టైం వర్కర్లకు గత 30 సంవత్సరాలుగా పైగా జిల్లాకలెక్టర్ గెజిట్ ప్రాకారం వేతనాలు చెల్లిస్తున్నారు. కాని ఇప్పుడు 2021 జూన్ 15వ తేదీన బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఆర్థిక శాఖ విడుదల చేసిన జీ ఓ 3 364 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. దీని ఫలితంగా వేతనాలు బాగా తగ్గుతున్నాయి. కావునా జీ.ఓ 64 మలును నిలిపివేయాలని, ఇప్పుడు చెల్లిస్తున్న. విధంగానే జిల్లా కలెక్టర్ కనీస వేతనాల సర్క్యులర్ (గెజిట్) ప్రకారం యధావిధిగా వేతనాలు చెల్లించాలని కొరుతున్నాము. 212 జి.ఒ ను సవరించి 2014 నాటికి 5 సంవత్సరాల సర్వీస్ వున్న వారందరిని పర్మినెంట్ చేయాలని, మిగతా పోరందరికి నల్గొండజిల్లాలో కోంతమందికి ఇస్తున్న విదంగా టైం స్కేల్ ఇన్వాలని, ఔట్సోర్సింగ్ విదానం అమలు చేయరాదని కోరుతున్నాము.
జీఓ నెం.64తో భారీగా తగ్గిపోతున్న వేతనాలు : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచవలసిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా 2021లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీఓ నెం.64ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయటం వలన గిరిజన కార్మికుల వేతనాలు నెలకు రూ॥ 4 వేల నుండి 15 వేలవరకు తగ్గుతున్నాయి. ఉదా॥ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పుడు నెలకు రూ.26,800/-ల వేతనం పొందుతున్న డైలీవేజ్ వర్కర్ జీవో నెం. 64 అమలుచేస్తే జీతం నెలకు రూ.11,700/-లకు తగ్గిపోతుంది. అంటే ఒక్క నెలకు రూ.15100/-లు నష్టపోతాడు. మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్ నెలకు రూ.5,500/-లు, నాన్ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న వర్కర్లు నెలకు రూ.4.530/-లు జీతాన్ని నష్టపోతారు. అన్ని జిల్లాలలో జిల్లాకలెక్టర్ గెజిట్లు జి.ఒ 64 కన్నా ఎక్కువగా వున్నాయి. జీఓ నెం.64 ప్రకారం వేతనాలు చెల్లిస్తే అన్ని జిల్లాల్లో వేతనాలు తగ్గుతాయి అని వారు అన్నారు పర్మినెంట్ / టైం స్కేల్ చేయాలి అప్పటి వరకు జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు చెల్లించాలి. మరణించిన వారి స్థానంలో కుటుంబ సభ్యులకు పని కల్పించాలి పూర్తి కాలం పని చేస్తున్న వారందరికి పూర్తి వేతనాలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో బోడ పద్మ విజయ బొచ్చు స్వరూప స్వామి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
భగత్ సింగ్ స్పూర్తితో డ్రగ్స్, గంజాయి, మాధకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దం
ఫార్మా, కెమికల్ పరిశ్రమల పేరిట డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి
ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి చెంచాల మురళి
కరీంనగర్, నేటిధాత్రి:
చాప కింద నీరులా ప్రవహిస్తున్న డ్రగ్స్ దందా కోట్ల రూపాయల మాఫియాగా ఎదుగుతుంటే డ్రగ్స్ నిర్మూలన కోసమే ఏర్పడిన ఈగల్, నార్కోటిక్, ఎన్ఫోర్స్మెంట్ వింగ్, ఎలైట్ యాక్షన్ గ్రూప్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వంటి సంస్థలు ఏం చేస్తున్నాయని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) నగర కార్యదర్శి చెంచాల మురళి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటీవల చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో కోట్లు విలువ చేసే డ్రగ్స్, సంబంధిత కెమికల్స్ పట్టుబడటం సిగ్గు చేటు అని, డ్రగ్స్, గంజాయి, మాధక ద్రవ్యాలను నిర్మూలించాలని,రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశ్రమలలో ప్రభుత్వం తక్షణమే విస్తృత తనిఖీలు చేపట్టాలని, డ్రగ్స్ తయారు చేస్తున్న,సరఫరా చేస్తున్న దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈసందర్భంగా చెంచల మురళి మాట్లాడుతూ షహీద్ భగత్ సింగ్ సెప్టెంబర్ 28న మన దేశంలో జన్మించారని,దేశ స్వాతంత్య్రం కోసం ఉరికొయ్యలను సైతం లెక్కచేయకుండా, భవిష్యత్తు తరాల కోసం బ్రిటీష్ ముష్కరులను ఎదిరించి వీరోచిత పోరాటాలు చేసి వీరమరణం పొందరన్నారు. కానీ,భగత్ సింగ్ కలలుగన్న స్వరాజ్య ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. విద్యార్థులకు, యువతకు ఆదర్శప్రాయుడైన భగత్ సింగ్ స్పూర్తితో నేటి యువత చెడు మార్గాలను, చెడు అలవాట్లను విడనాడాలని,అందుకే భగత్ సింగ్ 118వ జయంతి సందర్భంగా స్టాప్ డ్రగ్స్ -స్టార్ట్ స్పోర్ట్స్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు, ఇందులో భాగంగానే ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. అదే విధంగా అతి తక్కువ సమయంలో యువకులను లోబరచుకొని, యువతను నిర్వీర్యం చేసే డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాల వలన వ్యక్తులు, కుటుంబాలు తద్వారా సమాజమే సంక్షోభానికి గురవుతుందని, వీటిపట్ల కఠినంగా వ్యవహరించి డ్రగ్స్ నిర్మూలనలో తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదేనని వారు డిమాండ్ చేశారు. చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్ యాజమాన్యాన్ని ప్రధాన నిందితుడు శ్రీనివాస్, విజయ్ ఓలేటి, తానాజి పట్వారీ తదితరులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. రాష్ట్రంలో అనుమతి లేని కెమికల్,ఫార్మా ఇతర కంపెనీలపై దృష్టి పెట్టాలని అనుమతి లేని ఫ్యాక్టరీల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల ఏర్పాటు చేసుకోవడానికి అద్దె,లీజుకు ఇస్తున్న యజమానులు బాధ్యతను మరువకుండా ఆయా పరిశ్రమల్లో ఏమి తయారు చేస్తున్నారో ముందుగా పరిశీలించాలన్నారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ డ్రగ్స్ ను అరికట్టడంలో చొరవ చూపిస్తున్నా ఆయా శాఖల అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అటువంటి అధికారులను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో కార్తీక్, అభిషేకం, విష్ణువర్ధన్,శశి, అవినాష్, రమేష్, వేణు,రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఆధార్ వివరాల్లో తప్పులు ఉంటే త్వరగా సరిచేయాలని జిల్లా కలెక్టర్లను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ ఆదేశించారు. లబ్ధిదారులకు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (APBS) ద్వారా నగదు చెల్లింపులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే లబ్ధిదారుల్లో దాదాపు 30 శాతం మంది ఆధార్ రికార్డుల్లో తప్పులు ఉండటంతో వివరాలు సరిపోలడం లేదని అధికారులు గుర్తించారు. దీని వల్ల పేమెంట్స్ నిలిచిపోయే ఛాన్స్ ఉండటంతో ఆధార్లో తప్పుల సవరణ వెంటనే చేపట్టాలని పేర్కొన్నారు.
సింగరేణి కి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి..
సిఐటియు బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి గత ఆర్థిక సంవత్సరం సింగరేణి సంస్థ సాధించిన లాభాలలో 35% వాటాను వెంటనే చెల్లించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి డిమాండ్ చేశారు. పట్టణం లోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక సంవత్సరం ముగిసి 5 నెలలు పూర్తయినప్పటికీ లాభాల వాటా ప్రకటించక పోవడం దుర్మార్గం అన్నారు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఎన్నికల కోడ్ అమలు అయితే కార్మికుల లాభాల వాటా చెల్లించడం మరింత ఆలస్యం అవుతుందని వెంటనే గుర్తింపు సంఘం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 35% వాటా చెల్లించాలన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కల సాధన కోసం ఈనెల 11,12 తేదిలలో సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు, డిపార్ట్మెంటు లలో వినూత్న రీతిలో కార్మికు ల అభిప్రాయాల సేకరణ కోసం ఓటింగ్ నిర్వహించడం జరుగు తుందని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఓటింగ్ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కమిటీ నాయకులు రామగిరి రామస్వామి, వైస్ ప్రెసిడెంట్ రమేష్, సంజీవ్, సురేష్, మల్లేష్, తాజుద్దీన్, శ్రీధర్, కుమారస్వామి, ఆదర్శ్ లు పాల్గొన్నారు.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు (Vinayaka immersion) ప్రశాంతంగా ముగియడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
తొమ్మిది రోజులపాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, అత్యంత భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి, ఉత్సవ కమిటీల సభ్యులు, మండపాల నిర్వాహకులు, క్రేన్ ఆపరేటర్లు, భక్తులు అందరికీ అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. హైదరాబాద్ నగరంలో లక్షలాది విగ్రహాలు క్రమపద్ధతిలో నిర్దేశిత సమయానికి ట్యాంక్‌బండ్‌తో సహా మిగతా అన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం సాఫీగా, ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
వికలాంగుల పెన్షన్ రూ 6 వేలకు మరియు వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు అన్ని రకాల చేయూత పెన్షన్లు రూ 4 వేలకు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈ నెల 8న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ చిట్యాల మండల అధ్యక్షుడు దొడ్డే శంకర్ మాదిగ అన్నారు. శుక్రవారం ఆయన చిట్యాల మండల కేంద్రంలో మాట్లాడుతూ ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వికలాంగుల పెన్షన్ రూ 6 వేలకు పెంచి ఇస్తున్నాడు కానీ తెలంగాణలో రూ 6 వేలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం మోసం చేసింది అన్నారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే మహాధర్నాకు మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల వికలాంగులు మరియు చేయూత పెన్షన్ దారులు మహాధర్నకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. పెంచిన పింఛన్లు అమలు చేసేంతవరకు ఎంతటి పోరాటానికైనా ఎమ్మార్పీఎస్ వెనుకాడదని తెలియజేశారు.
శుక్రవారం కేసముద్రం మున్సిపాలిటీ స్థానిక జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల నుండి ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వరకు కేసముద్రం మండల సీనియర్ హాకీ మరియు బాస్కెట్బాల్ క్రీడాకారులు మరియు హై స్కూల్ విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో మేజర్ ధ్యాన్ చంద్ జన్మదిన పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం వన్ కె రన్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కొమ్ము రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబాద్ డిఎస్పి తిరుపతిరావు మరియు కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి హాజరై జెండా ఊపి రన్ ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో ఉత్సాహంగా రన్ లో ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు పరిగెత్తారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథి మహబూబాద్ డిఎస్పి తిరుపతిరావు మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఆగస్టు 29/ 2012 నుండి ఈ క్రీడా దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్నారని క్రీడాకారులు ధ్యాన్ చంద్ స్ఫూర్తిగా తీసుకొని దేశానికి మంచి పేరు తేవాలన్నారు. గంట సంజీవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు మరియు క్రీడాకారులకు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్రంలో ముఖ్యమంత్రి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడ పాఠశాలలను ఏర్పాటు, అచ్యునుత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నగదు పురస్కారాలతో సత్కరిస్తున్నారని తెలిపారు.కాబట్టి క్రీడాకారులు గ్రామీణ స్థాయి నుంచి పట్టుదలతో ఆడి ఉన్న శిఖరాలు చేరుకొని మన గ్రామానికి రాష్ట్రానికి దేశానికి పేరు తేవాలని ఆకాంక్షించారు. అనంతరం వేం ట్రస్టు ద్వారా జాతీయస్థాయిలో రాణించిన కేసముద్రం చెందిన 10 మంది క్రీడాకారులకు హాకీ మరియు బాస్కెట్బాల్ క్రీడాకారులకు సన్మానం చేయడం జరిగింది, దానితోపాటు 25 వేల విలువైన క్రీడా సామాగ్రి బాస్కెట్బాల్స్ హాకీ స్టిక్స్ బ్యాడ్మింటన్ రాకెట్స్ వాలీబాల్స్ టెన్నికోల్ రింగ్స్ మొదలగునవి వేం ట్రస్ట్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్ రాజ్, స్థానిక నాయకులు రావుల మురళి,అల్లం నాగేశ్వరరావు, బండారు వెంకన్న, బండారు దయాకర్,సతీష్, కదిర సురేందర్, స్థానిక హెచ్ఎం బి రాజు, ఎంఈఓ కాలేరు యాదగిరి, పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ నరసయ్య, ఫిజికల్ డైరెక్టర్ కొప్పుల శంకర్, దామల్ల విజయ్ చందర్ తో పాటు మండల క్రీడాకారులు మరియు ప్రజా ప్రతినిధులు దాదాపు 200 మంది పాల్గొన్నారు.
*-కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి *
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ టౌన్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి నివాసంలో గురువారం కోహీర్ మండలం మనియార్ పల్లీ గ్రామానికి చెందిన బి.బుజ్జమ్మ 60,000 /- (ఆరవై వేలరూపాయల) ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్దిదారు భర్తకు సీఎం రిలీఫ్ ఫండ్(CMRF) చెక్కును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.ఈ సహాయ నిధి చెక్కుల మంజూరు కై కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారికి,సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి చెక్కులు పొందిన లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హర్షద్ పటేల్,శ్రీకాంత్ రెడ్డి,అక్బర్,జుబెర్,అశ్విన్ పాటిల్,అరుణ్,నరేష్ బబ్లూ,బి.మల్లికార్జున్,ఇమామ్ పటేల్,మహ్మద్.గౌసోద్దీన్,నర్సింహా యాదవ్,మానియార్ పల్లీ కాంగ్రెస్ నాయకులు అమర్నాథ్,మోహీన్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రఫీ పోటీల్లో డబుల్ అవార్డు విజేత..
ఫోటోగ్రఫీలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఇరుకుల్ల వీరేశం
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన ఇరుకుల్ల వీరేశం ఫోటోగ్రఫీని హాబీగా ప్రారంభించి స్వంత నైపుణ్యంతో అనేక సుందర ఛాయాచిత్రాలను సృష్టించి వివిధ్ ఫోటోగ్రఫీ పోటీలకు పంపించి ఎన్నో అవార్డులను గెలుచుకున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డులను సైతం కైవసం చేసుకున్నారు. 2022 లో ఎన్ ప్రింట్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (ప్రింట్ అండ్ డిజిటల్) వారు అంతర్జాతీయంగా ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించగా ఇందులో 27 దేశాలు పాల్గొన్నాయి. భారతదేశం తరపున ఈ పోటీలో ఆన్ లైన్ లో పాల్గొన్న ఇరుకుల్ల వీరేశం అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలలో ప్రింట్ కలర్ విభాగంలో 8 అవార్డులను సాధించారు. 2016 సంవత్సరం నుండి ప్రతి ఏటా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏదో ఒక అవార్డును సాధించారు. ఫోటోగ్రఫీని ప్రాణంగా భావించే వీరేశం, గిరిజనుల అందాలను చిత్రీకరించడానికి అరకులోయ, ఒడిస్సా, వినాయక నిమజ్జనం దృశ్యాల కోసం మహారాష్ట్ర, హిమాలయాల సౌందర్యం ఒడిసి పట్టడానికి జమ్మూ కాశ్మీర్ లాంటి వైవిద్య భరితమైన ఎన్నో ప్రాంతాలను సొంత డబ్బులు వెచ్చించి అత్యంత వ్యయ ప్రయాసల కోర్చి పర్యటించారు. అక్కడి అందాలను తన కెమెరాల్లో బంధించి ఎన్నో విలువైన ఛాయాచిత్రాలను ఆవిష్కరించారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఐ అండ్ పిఆర్ శాఖ నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఇరుకుల్ల వీరేశం కు కేటగిరి రాజీవ్ యువ వికాసంలో తృతీయ బహుమతి మరియు కేటగిరి రైతు భరోసా లో కన్సోలేషన్ బహుమతి లభింఛాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పలు సంక్షేమ పథకాల పైన తీసిన ఛాయా చిత్రాలకు గాను పోటీ నిర్వహించగా అందులో రాజీవ్ యువ వికాసం ఫోటోకు తృథియ బహుమతి & రైతు భరోసా ఫోటోలు ఎంపిక చేశారు. ఈ బహుమతిని మంగళవారం హైదరాబాదులోని గ్రీన్లాండ్స్ గ్రీన్ పార్క్ హోటల్ లో సమాచార మరియు పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సమాచార, పౌర సంబంధాల కమిషనర్ సిహెచ్ ప్రియాంక, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా వీరేశం అవార్డు అందుకున్నారు. గ్రామీణ నేపథ్యం కలిగిన వీరేశం.. సునిశిత దృష్టితో ప్రకృతి అందాలు, గిరిజన జీవితాలు, సంస్కృతి సంప్రదాయాలు పరిశీలించి తన కెమెరాలతో బంధించి చూపర్లను సమ్మోహిత పరుస్తున్నాడు.అతని ప్రతిభకు లభిస్తున్న పురస్కారాల పట్ల ఫోటోగ్రఫీ అభిమానులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
తెల్ల రేషన్ కార్డు కలిగి దారిద్ర్య రేఖకు దిగువన గల కుటుంబాలకు పేదలకు ఖరీదైన శస్త్ర చికిత్సలు ఇతర వైద్య చికిత్సలు ఉచితంగా అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిందని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ నిఖిల్ స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్ ఉమ్మడి వరంగల్ జిల్లా డిస్ట్రిక్ట్ మేనేజర్ పి విక్రమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ అలాగే కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చని అన్నారు. చిట్యాల మండల కేంద్రం సమీప వెంకట్రావుపల్లి (సి) గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు కాలు విరిగితే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా ఆపరేషన్ చేయించుకున్న రోగిని ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అధికారుల ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య మిత్ర గుర్రపు రాజమౌళి మంగళవారం పేషంటు ను కలిసి వివరాలు సేకరించారు. వెంకట్రావుపల్లి (సి)గ్రామానికి చెందిన రంపిస లింగాభాయి(84) అను మహిళ వృద్ధురాలు ప్రమాదవశాత్తు ఈనెల 10న తమ ఇంటి సమీపంలో కాలుజారి కింద పడగా ఆమెకు ఎడమ కాలు విరిగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను పరకాల పట్టణంలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పటల్ ఐనా సుశ్రుత హాస్పిటల్ కి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి తెల్ల రేషన్ కార్డు ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆమెకు ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఈ సందర్భంగా పేషంట్ లింగాభాయి మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం నా ప్రాణాలను కాపాడిందని ఆపరేషన్ కోసం హాస్పటల్ వారు నావద్ద చిల్లిగవ్వ కూడా తీసుకోకుండా ఉచితంగా ఆపరేషన్ చేసి నాణ్యమైన వైద్యం అందించి ఉచిత భోజనం వసతి రవాణా చార్జీలు మెడిసిన్ అందించి తనను ఇంటికి చేర్పించారని ఆమె తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం లేకపోతే తన కుటుంబం అప్పుల పాలు అయ్యేదని ఇబ్బందులు పడే వారమని ఆమె అన్నారు. నా ప్రాణాలను కాపాడిన రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ నిఖిల్ స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్ డిస్ట్రిక్ట్ మేనేజర్ పి విక్రమ్ టీం లీడర్ యామంకి అనిల్ సుశ్రుత హాస్పిటల్ వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యంమనీ జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. ఊర్కొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే ప్రసంగించారు. “మా ప్రభుత్వానికి పేదల సంక్షేమమే ప్రథమ కర్తవ్యం. అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నాం. రేషన్ కార్డు కేవలం ఒక పత్రం కాదు, ఇది పేద కుటుంబానికి భరోసా, భవిష్యత్తుకు ఆర్థిక బలం.
MLA Janampally Anirudh Reddy.
పేదల ఆకలి తీర్చడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో ఇది కీలకం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డూ మంజూరు చేయలేదని విమర్శిస్తూ, అర్హులు ఎన్నో ఏళ్లు ఎదురు చూసినా.. దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తుచేశారు. కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ న్యాయం జరుగుతోందని తెలిపారు. “మా పాలనలో ఎవరూ ఆకలితో ఉండరని, ప్రతి అర్హుడికి సకాలంలో ప్రభుత్వం అందించే లబ్ధి చేరుస్తాం” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఊర్కొండ మండలానికి 163 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం, 1619 పాత రేషన్ కార్డుల్లో ఆడిషన్స్ పూర్తయ్యాయని వివరించారు. ఇప్పటికే గుడిగానిపల్లి, మాదారం గ్రామాలకు రూ.12 లక్షల నిధులతో అంగన్వాడి భవనాలు మంజూరు అయ్యావని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి కార్మికులకు లాభాల వాటా 40% వెంటనే ఇవ్వాలి
భూపాలపల్లి నేటిధాత్రి
సింగరేణి కంపెనీ. చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ను సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మెమొరండం ఇచ్చిన శ్రామిక శక్తి గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం అరుణోదయ గౌరవ అధ్యక్షురాలు. విమలక్క ఏఐఎఫ్ టియు రాష్ట్ర కార్యదర్శి. ఎం. పోచ మల్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 24-25-సంవత్సరపు. సింగరేణి కార్మికులు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా చెమటను రక్తంగా మార్చి. సింగరేణి సంస్థను కాపాడుకోవాలని. ఈ దేశానికి వెలుగులు ఇవ్వాలని. 8 గంటలు. పనిచేస్తూ అధిక ఉత్పత్తి సాధించిన. యజమాన్యం ఇప్పటివరకు. సాధించిన ఉత్పత్తి వేయాని ప్రకటించకపోవడం. యజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ. ఇప్పటికైనా. సాధించిన ఉత్పత్తిని ప్రకటిస్తూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. వచ్చినా ఉత్పత్తి ఆదాయం నుండి. 40% ఎదురుచూస్తున్న సింగరేణి కార్మికులకు ఇప్పించాలని. ఉత్పత్తిలో భాగస్వామ్యమైన కాంట్రాక్ట్ కార్మికులకు గత సంవత్సరము. ప్రభుత్వము లాభాల వాటగా. 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది 24-25-సంవత్సరం. కూడా. 10.000 రూపాయలు. ఇవ్వాలని గత విఆర్ఎస్ ఉద్యోగాలు కొనసాగించాలని. పాత పద్ధతిని అమలు చేయాలని. మారుపేర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సొంతింటి కల అమలు చేయాలని ఓసిపిలను రద్దుచేసి భూగర్భ గనులను నిర్మించాలని. నాలుగు లేబర్ కోడ్ లను రద్దుచేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని . ఫెరాక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని. వేలం పాట లేకుండా సింగరేణి సంస్థను సింగరేణికే ఇవ్వాలని తదితర కార్మిక సమస్యల పైన మెమోరండం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం. ప్రధాన కార్యదర్శి. వెల్తురు సదానందం. నాయకులు. విజయ్. ఐఎఫ్టియు నాయకులు. చంద్రగిరి శంకర్ స్త్రీ విముక్తి. నాయకురాలు. లావణ్య. డిస్మిస్ సంఘాల నాయకురాలు. రాజేశ్వరి. లక్ష్మి. రాజేశ్వరి. రాజు తదితరులు పాల్గొనడం జరిగింది
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.