ఇందిరమ్మ ఇళ్లు.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఆధార్ వివరాల్లో తప్పులు ఉంటే త్వరగా సరిచేయాలని జిల్లా కలెక్టర్లను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ ఆదేశించారు. లబ్ధిదారులకు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (APBS) ద్వారా నగదు చెల్లింపులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే లబ్ధిదారుల్లో దాదాపు 30 శాతం మంది ఆధార్ రికార్డుల్లో తప్పులు ఉండటంతో వివరాలు సరిపోలడం లేదని అధికారులు గుర్తించారు. దీని వల్ల పేమెంట్స్ నిలిచిపోయే ఛాన్స్ ఉండటంతో ఆధార్లో తప్పుల సవరణ వెంటనే చేపట్టాలని పేర్కొన్నారు.