ఆశ్రమ పాఠశాల వర్కర్స్ రిలే నిరాహార దీక్ష….

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-15T144604.104.wav?_=1

 

ఆశ్రమ పాఠశాల వర్కర్స్ రిలే నిరాహార దీక్ష

భోజనాలు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

విద్యార్థులే వంట చేసుకుంటున్నారు

జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో ఉన్న ఆశ్రమ పాఠశాల వద్ద వర్కర్స్ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీ వేజ్,కాంటినింజెంట్ వర్కర్ల సమస్యల పరిష్కారంకై రాష్ట్రవ్యాప్తంగా ఆశ్రమ పాఠశాల వర్కర్స్ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు ఈ ధర్నా కార్యక్రమానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కిషన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పనిచేస్తున్న డైలివెజ్ డైలీవేజ్, కాంటినెంట్, పార్ట్ టైం వర్కర్లకు గత 30 సంవత్సరాలుగా పైగా జిల్లాకలెక్టర్ గెజిట్ ప్రాకారం వేతనాలు చెల్లిస్తున్నారు. కాని ఇప్పుడు 2021 జూన్ 15వ తేదీన బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఆర్థిక శాఖ విడుదల చేసిన జీ ఓ 3 364 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. దీని ఫలితంగా వేతనాలు బాగా తగ్గుతున్నాయి. కావునా జీ.ఓ 64 మలును నిలిపివేయాలని, ఇప్పుడు చెల్లిస్తున్న. విధంగానే జిల్లా కలెక్టర్ కనీస వేతనాల సర్క్యులర్ (గెజిట్) ప్రకారం యధావిధిగా వేతనాలు చెల్లించాలని కొరుతున్నాము. 212 జి.ఒ ను సవరించి 2014 నాటికి 5 సంవత్సరాల సర్వీస్ వున్న వారందరిని పర్మినెంట్ చేయాలని, మిగతా పోరందరికి నల్గొండజిల్లాలో కోంతమందికి ఇస్తున్న విదంగా టైం స్కేల్ ఇన్వాలని, ఔట్సోర్సింగ్ విదానం అమలు చేయరాదని కోరుతున్నాము.

 

 

జీఓ నెం.64తో భారీగా తగ్గిపోతున్న వేతనాలు : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచవలసిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా 2021లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీఓ నెం.64ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయటం వలన గిరిజన కార్మికుల వేతనాలు నెలకు రూ॥ 4 వేల నుండి 15 వేలవరకు తగ్గుతున్నాయి. ఉదా॥ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పుడు నెలకు రూ.26,800/-ల వేతనం పొందుతున్న డైలీవేజ్ వర్కర్ జీవో నెం. 64 అమలుచేస్తే జీతం నెలకు రూ.11,700/-లకు తగ్గిపోతుంది. అంటే ఒక్క నెలకు రూ.15100/-లు నష్టపోతాడు. మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్ నెలకు రూ.5,500/-లు, నాన్ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న వర్కర్లు నెలకు రూ.4.530/-లు జీతాన్ని నష్టపోతారు. అన్ని జిల్లాలలో జిల్లాకలెక్టర్ గెజిట్లు జి.ఒ 64 కన్నా ఎక్కువగా వున్నాయి. జీఓ నెం.64 ప్రకారం వేతనాలు చెల్లిస్తే అన్ని జిల్లాల్లో వేతనాలు తగ్గుతాయి అని వారు అన్నారు
పర్మినెంట్ / టైం స్కేల్ చేయాలి
అప్పటి వరకు జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు చెల్లించాలి.
మరణించిన వారి స్థానంలో కుటుంబ సభ్యులకు పని కల్పించాలి పూర్తి కాలం పని చేస్తున్న వారందరికి పూర్తి వేతనాలు ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ ధర్నా కార్యక్రమంలో బోడ పద్మ విజయ బొచ్చు స్వరూప స్వామి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version