ఇసుక అక్రమ రవాణా ఫై ఉక్కు పాదం
ఇందిరమ్మ ఇండ్ల ఇసుక మొరం పై అధికారుల సమీక్ష
శాయంపేట నేటిధాత్రి:
పేదల సొంతింటి కలను నెరవేర్చే వారి జీవన ప్రయాణ మెరుగుపరచడానికి తెలంగా ణ ప్రభుత్వం ఇందిరమ్మ నిర్మా ణాన్ని అమలు చేసింది ఈ పథకం ద్వారా రాష్ట్రంలో నిరుపేదలైన సొంతింటి ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి తగిన సహాయం చేస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, మొరం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు చర్చించారు. శాయంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఇందిరమ్మ గృహాల నిర్మాణం కొరకు కావలసిన ఇసుక మొరం వాటిపై ప్రభుత్వ అధికారులు చర్చించారు. ఇందిరమ్మ ఇండ్ల ఇసుక రవాణా పూర్తిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభు త్వ నిబంధనలు అనుగు ణంగా సరఫరా వ్యవస్థను నిమిత్తం ఇసుక తరలించే వాహనాలకు లైసెన్సు కలిగి ఉండి కూపన్ల సహాయంతో సరఫరా చేయాలి ఇసుకను ఎక్కువ రేట్లకు అమ్మకూడదని తెలియజేశారు ఇట్టి నియమా లను పాటించక పోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో సీఐ రంజిత్ రావు ,ఎస్సై పరమేశ్వర్, ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో ఫణిచంద్ర , గ్రామపంచాయతీ కార్య దర్శి అధికారులు పాల్గొ న్నారు.