కొండముచ్చుల దాడిలో గాయపడ్డ బాధితులకు
◆:- ప్రభుత్వం బాధ్యత వహిస్తూ నష్టపరిహారం అందించాలి
◆:- పి. రాములు నేత జాగో తెలంగాణ వ్యవస్థాపకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోయింది వెంటనే పూర్తిగా చెత్తను తొలగించాలి ప్రజలు తమ ఇష్టారిథిగా ఎక్కడపడితే అక్కడ చెత్త వేయుచున్నారు ఇలా పాడవేయకుండా ప్రజలను చైతన్య పరచాలి జహీరాబాద్ పట్టణంలో మురికి కాలువలలో నిండుగా మురికి పేరుకుపోవడంతోని విపరీతమైన దోమలు ఏర్పడి ప్రజలకు డెంగు మలేరియా లాంటి వ్యాధులు సోకుతున్నాయి వెంటనే వీటిని నిర్మూలించాలి మురికి కాలువలు నిండుకుండ లాగా తయారైనాయి మురికి కాలువలు పూర్తిగా పైకప్పులతో మూసి వేయబడ్డాయి వాటిని తొలగించి మురికి కాలువలు శుభ్రం చేయించాలి పురపాలక సంఘం అధికారులు ప్రత్యేక పరిపాలన అధికారి జహీరాబాద్ పట్టణ పురవీధులను పరిశీలించాలి
పి. రాములు నేత జాగో తెలంగాణ వ్యవస్థాపకులు
జహీరాబాద్ పట్టణంలో గత నాలుగు రోజులుగా వేరువేరు స్థలాల వద్ద కొండముచ్చులు ప్రజల మీద దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి ఈ దాడిలో శాంతినగర్ హమాలీ కాలనీ రాంనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలలో దాదాపుగా పదిమందిపై అనగా మారుతి రావు సిద్దు శాంతాబాయి శంకర్ లక్ష్మి శంకరమ్మ జీవరత్నం గార్లపై కొండముచ్చులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినాయి గాయపడ్డ చాలామంది నిరుపేదలు ఉన్నారు రోజువారి కూలీలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వీరందరినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగు నష్టపరిహారాన్ని చెల్లించాలని సవినయంగా బాధితుల పక్షాన పి.రాములు నేత జాగో తెలంగాణ వ్యవస్థాపకులు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ ఘటనపై జాగో తెలంగాణ వ్యవస్థాపకులు పి. రాములు నేత మాట్లాడుతూ మూగజీవాలు ఈ రకంగా పట్టణంలో చేరి దాడి చేయడానికి తగు కారణం చూస్తుంటే జహీరాబాద్ పట్టణం ఎక్కడ చూసినా మురికితో నిండిపోయి ఉండడం కనబడుతుంది వాస్తవానికి జహీరాబాద్ పట్టణంలో పూర్తిస్థాయి చెత్త సేకరణ కార్యక్రమం జరగడం లేదు పురపాలక సంఘం అధికారులు ప్రజలకు ఎక్కడపడితే అక్కడ చెత్తను తినుబండరాలను పార వేయకుండా ఈ రకంగా పారవేసే వారి గురించి పురపాలక సంఘం అధికారులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టకపోవడం ప్రధాన కారణంగా కనబడుతుంది పురపాలక సంఘం పరిధిలో ఎక్కడ చూసినా విపరీతమైన చెత్త పేరుకుపోయి ఉన్నది మురికి కాలువలు మురికితో నిండుకుండ లాగా తయారైపోయాయి ఏ మూలమలుపులో చూసినా కూడా తినుబండారాలతో కూడిన చెత్త పేరుకుపోయి ఉంది దీనిని ఆసరా చేసుకొని వీధి పందులు వీధి కుక్కలు కొండముచ్చులు పశువులు ప్రజల నివాసాల మధ్య చేరిపోయి అనేక రకాలుగా ప్రజలకు ఇబ్బంది పెడుతున్నాయి ఇకనైనా పురపాలక సంఘం అధికారులు ప్రత్యేక పాలన అధికారి స్థానిక సంస్థల జిల్లా అధికారి జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే దసరా దీపావళి పండుగల సందర్భంగా జహీరాబాద్ లో పేరుకుపోయిన చెత్తాను పూర్తిగా తొలగించి ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా ప్రజలను చైతన్య పరచాలని ఇలాంటి కార్యక్రమం పురపాలక శాఖ తీసుకుంటే మా వంతు సహకారం గా మేము కూడా కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేస్తున్నాం అదేవిధంగా అడవి శాఖ వారికి బాధితులను ఆదుకోవాలని తెలపగా అందుకు సానుకూలంగా స్పందించిన సంగారెడ్డి జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు జహీరాబాద్ అటవీశాఖ సిబ్బంది బాధితులను కలిసి వారి వివరాలను సేకరించారు మా శాఖ తరపు నుండి బాధితులకు వారికి జరిగిన నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వం చే పరిహారం ఇప్పించడం జరుగుతుందని జహీరాబాద్ అటవీ శాఖ అధికారులు బాధితులతో మరియు వారి పక్షాన ఉండి పోరాడుతున్న జాగో తెలంగాణ నాయకులకు తెలిపారు కార్యక్రమంలో జహీరాబాద్ అటవీ శాఖ అధికారులు పి. కృష్ణమ్మ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జి. కిరణ్ కుమార్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మరియు బీట్ ఆఫీసర్లు గంగాభవాని భాస్కర్ నిజాముద్దీన్ సంజీవ్ గార్లు మరియు జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్, మాదినం శివప్రసాద్ , గొల్లమల్లు , కాలనీవాసులు సిహెచ్ సంతోష్ ,సిహెచ్ జగదీష్ ,జామ్ గారి రాజ్ కుమార్ ,నారాయణపేట రాజ్ కుమార్ పాల్గొన్నారు,