సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన ప్రజా ప్రభుత్వం
సీఎం, డిప్యూటీ సీఎం కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
సోమవారం హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో సింగరేణి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను దసరా పండుగ సందర్భంగా కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ను ప్రకటించింది. లాభాల్లో 34 శాతం కార్మికులకు పంచింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విలేకరుల సమావేశంలో తెలిపారు. కాగా, సింగరేణి లాభం మొత్తం రూ.2360 కోట్లు. అందులో కార్మికుల వాటా మొత్తం రూ. 819 కోట్లు. ఒక్కో కార్మికునికి రూ.1,95,610 ఇవ్వనున్నారు. ఈసారి కాంట్రాక్టు కార్మికులకూ రూ.5,500 చొప్పున బోనస్‌ను చెల్లించనున్నారు. దీంతో, భూపాలపల్లిలో 5,500 కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది. కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లను వేరువేరుగా కలిసి పుష్పగుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు.