రామాయంపేటలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ..
రామాయంపేట ఆగస్ట్ 25 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వచ్చిన 400 మట్టి వినాయక విగ్రహాలను మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ ఎం. దేవేందర్ గారు పంపిణీ ప్రారంభించారు.
ప్రజలు పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా మట్టి విగ్రహాలను అందజేస్తోందని కమిషనర్ తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల జల కాలుష్యం పెరుగుతుందని, మట్టి విగ్రహాల వలన పర్యావరణానికి మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
తదనంతరం మిగిలిన విగ్రహాలను మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులకు వార్డు అధికారులు, మహిళా రిసోర్స్ పర్సన్‌ల సమక్షంలో పంపిణీ పూర్తి చేశారు. ప్రజలు అధిక సంఖ్యలో మట్టి వినాయక విగ్రహాలను స్వీకరించి సంతోషం వ్యక్తం చేశారు.