దసరా ఉత్సవాలు మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాల పునరుజ్జీవనానికి ప్రతీక…
మడికొండ రామలీల మైదానంలో అంగరంగ వైభవంగా జరగబోయే దసరా ఉత్సవాల ఏర్పాట్లు…
భక్తిశ్రద్ధలతో పాటు సాంస్కృతిక వైభవం నిండిన వాతావరణంలో జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, స్థానికులు సమన్వయంతో కృషి చేయాలి..
దసరా ఉత్సవాల స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు
హన్మకొండ (నేటిధాత్రి):
హన్మకొండ జిల్లా కాజీపేట పరిధిలో మండల పరిధిలోని మడికొండ అయోధ్యపురం రోడ్డులో గల మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన రామలీల మైదానంలో అంగరంగ వైభవంగా జరగబోయే బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా మైదానాన్ని శుభ్రపరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతూ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ
దసరా ఉత్సవాలు మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాల పునరుజ్జీవనానికి ప్రతీక. ప్రజలంతా సక్రమంగా పాల్గొనేలా విద్యుత్, నీరు, పారిశుధ్యం, భద్రత, పార్కింగ్, ట్రాఫిక్ సదుపాయాలు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం.
ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో పాటు సాంస్కృతిక వైభవం నిండిన వాతావరణంలో జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, స్థానికులు సమన్వయంతో కృషి చేయాలన్న ఎమ్మెల్యే నాగరాజు దసరా ఉత్సవాలు ప్రతి ఇంటికీ పండుగ వాతావరణాన్ని తీసుకొస్తాయి. సమాజంలో ఐకమత్యం, సత్సంకల్పం, ధర్మం కోసం పోరాడిన శ్రీరాముని మహోన్నతతను గుర్తుచేస్తాయి. భద్రతా బందోబస్తు వరకు అన్ని అంశాలను పక్కాగా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా భాగస్వామ్యం లేకుండా ఏ కార్యక్రమం విజయవంతం కాదని అందరూ గుర్తించాలి. కాబట్టి స్థానికులు, సన్నాహక కమిటీ సభ్యులు, అధికారులు కలసి పనిచేస్తే ఈ ఏడాది దసరా ఉత్సవాలు చారిత్రాత్మకంగా నిలుస్తాయి” అని వివరించారు.
ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు….