మున్సిపాలిటీ ఎన్నికలకు సహకరించాలి: తహసిల్దార్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని తహసిల్దార్ దశరథ్ కోరారు.రాజకీయ పార్టీల నాయకులతో జరిగిన సమావేశంలో, వార్డుల సంఖ్య పెరగడంతో ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సన్నద్ధమైనట్లు తెలిపారు. పట్టణంలో 1000 మందికి ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ప్రజలు తమ సమస్యలను నేరుగా కౌన్సిలర్లకు చెప్పుకోవచ్చని, ప్రజాస్వామ్యబద్ధంగా కౌన్సిలర్లను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
