ప్రజాపాలనకు ఆకర్షితులై యువత కాంగ్రెస్ పార్టీలో చేరిక…

ప్రజాపాలనకు ఆకర్షితులై యువత కాంగ్రెస్ పార్టీలో చేరిక

– కాంగ్రెస్ పార్టీలో చేరిన 50 మంది యువకులు

సిరిసిల్ల(నేటి ధాత్రి ):

 

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, ప్రజాపాలనకు ఆకర్షితులై యువత స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన సుమారు 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడితో పాటు మాజీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, టౌన్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, బ్లాక్ అద్యక్షులు సూర దేవరాజు కండువా కప్పి యువకులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజాపాలనకు ఆకర్షితులై యువత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని అన్నారు. అదే ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో భారీగా ప్రజాప్రతినిధులను గెలిపించుకునేలా పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు పెద్దపీట వేస్తున్న తరుణంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తు ముందుకెళుతున్నామని చెప్పారు. పార్టీ పట్టిష్టత కోసం నిబద్ధతతో పని చేయాలని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ నూతనంగా పార్టీలో చేరిన యువకులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ జిల్లా సభ్యులు సంగీతం శ్రీనాథ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డిమల్ల భాను, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు చుక్క రాజశేఖర్, యూత్ కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు పోగుల దేవరాజు, పట్టణ యూత్ మాజీ అధ్యక్షుడు చిందం శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రటరీ ఆకేని సతీష్, నాయకులు కలిం, ఆడెపు ప్రసాద్, రాపల్లి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్..

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

కలెక్టర్ స్నేహ శబరీష్

శాయంపేట నేటిధాత్రి:

 

మూడో విడత గ్రామపంచా యతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం శాయంపేట మం డల కేంద్రంలోని జెడ్పిహె చ్ఎస్ బాలికల పాఠశాల ఆవర ణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీ లించారు పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా యా, పోలింగ్ ప్రక్రియ సజావు గా సాగుతుందా! లేదా! అని పరిశీలించింది. మండలంలోని ప్రజలు ప్రతి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకో వాలని సూచించింది.ఈ సందర్భంగా మండలంలో పోలింగ్ ప్రశాంతంగా నిష్పక్షపా తంగా కొనసాగుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఫణి చంద్ర, ఎమ్మా ర్వో, గ్రామపంచాయతీ సిబ్బం ది ప్రభుత్వ రంగంలో పనిచేసే అధికారులు పాల్గొన్నారు.

సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మహమ్మద్ సమియోద్దీన్..

సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మహమ్మద్ సమియోద్దీన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

గ్రామ ప్రజలు చాలా తెలివైనవారు గ్రామాలు అభివృద్ధి చేసేవారినే ఎన్నుకుంటారు.
ప్రముఖ సామాజికవేత్త మనూర్ మండల బెల్లాపూర్ గ్రామ మహమ్మద్ సమియోద్దీన్
మండల పరిధిలోని తమ గ్రామంలో ప్రముఖ సామాజికవేత్త సమియోద్దీన్ తన కుటుంబ సభ్యులతో కలసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా మహమ్మద్ సమియోద్దీన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉండే యువకులు ప్రజలు ఎంతో చైతన్యవంతులని గ్రామాలను అభివృద్ధి చేసే నాయకులను సర్పంచ్ గా వార్డ్ మెంబర్లు గా ఎన్నుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని గ్రామాలు అభివృద్ధి చెందుతూనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ఒక్క ఓటుతో ఏమవుతుందనుకోకు – ప్రతి ఓటే ప్రజాస్వామ్యానికి పునాది..

ఒక్క ఓటుతో ఏమవుతుందనుకోకు – ప్రతి ఓటే ప్రజాస్వామ్యానికి పునాది!

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

ప్రజాస్వామ్యం ప్రజల చేతిలోనే ఉంటుంది.ఆ శక్తి ఓటు రూపంలో మనకు లభించింది. ఒక్క ఓటు విలువ లేదని అనుకోవడమే ప్రజాస్వామ్యానికి అతి పెద్ద నష్టం.అనేక ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతోనే విజయం లేదా ఓటమి నిర్ణయమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనం వేసే ఓటే నాయకులను నిర్ణయిస్తుంది.పాలన దిశను మార్చుతుంది.ఓటు హక్కు మనకు ఉచితంగా రాలేదు. ఎన్నో త్యాగాలు,పోరాటాల ఫలితంగా అది మనకు దక్కింది.అందుకే ఓటు వేయకపోవడం అంటే ఆ త్యాగాలను నిర్లక్ష్యం చేసినట్లే. నా ఒక్కరితో ఏమవుతుందిలే అనుకోవద్దు.ప్రతి ఒక్కరి ఓటు కలిసినప్పుడే బలమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది.కాబట్టి ప్రతి పౌరుడు బాధ్యతగా ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి.ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు,మన కర్తవ్యమూ.నేడు వేసే ఒక్క ఓటే రేపటి మంచి భవిష్యత్తుకు పునాది గా మారుతుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version