జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ గుడా డివిజన్‌లో ఇంటింటా ప్రచారం
◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్ గుడా డివిజన్‌లోని 253,254,255,256,257, 258 బూత్ లో నిర్వహించిన ఇంటింటా ప్రచార కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్,ఎమ్మెల్యే వీర్లపల్లీ శంకర్, బిసి కార్పొరేషన్ చైర్మన్ నూతి.శ్రీకాంత్ గౌడ్,సిని నటుడు సుమన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి,యువ నాయకుడు,ప్రజా సంకల్పంతో నిండిన నవీన్ యాదవ్ గారిని గెలిపించడం అత్యంత కీలకమనితెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,స్థానిక నాయకులు,మహిళలు,యువత మరియు ప్రజలు పాల్గొన్నారు.
