బీసీ రిజర్వేషన్ లపై బంద్ కు సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దత్తు….

బీసీ రిజర్వేషన్ లపై బంద్ కు సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దత్తు.

◆:- జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

బీసీ రిజర్వేషన్ లను అమలు చెయ్యాలని ప్రజలంతా కోరుతున్న సందర్భంలో బీసీ రిజర్వేషన్ లపై హైకోర్టు స్టే ఇవ్వడం తగదని వెంటనే రిజర్వేషన్ లను కల్పించాలని కోరుతూ ఈ నెల 18 నాడు బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన బంద్ లో సిపిఐ జిల్లా శ్రేణులన్నీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చెయ్యాలని సిపిఐ పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్ పిలుపునిచ్చారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ లు అమలు చెయ్యాలని ప్రజలు రాష్ట్రాలు కోరుతుంటే బీజేపీ ప్రభుత్వం నిమ్మకనిరేతినట్లు వ్యవహారిస్తుందని అన్నారు,ఇప్పుడు బీజేపీ అసలు స్వరూపం బయటపడుతుందని అన్నారు. అగ్రవర్ణ కులాల వెనుకబడిన వారికీ ఏ రాష్ట్రం కానీ,ప్రజలు కానీ అడగలేదని,ఎక్కడా ధర్నాలు కానీ నిరసనలు జరగలేదని కానీ బీజేపీ ప్రభుత్వం 10 శాతం కూడా లేనివారికీ 10 శాతం రిజర్వేషన్ లు ఇచ్చి పార్లమెంట్ లో అమోదింప చేసుకొని సుప్రీమ్ కోర్టు విధించిన 50 శాతం పరిమితి కూడా మించిపోయిందని,ఇది బీజేపీ కి అగ్రవర్ణాలకు ఇచ్చే సహకారమని అగ్రవర్ణాల పై చూపుతున్న ప్రేమ బీసీలపై చూపుతున్న వివక్షత కనబడుతుంది అన్నారు కానీ బీసీ లు అడిగితే మాత్రం చెయ్యట్లేదని ఇప్పటికైనా బీజేపీ నాటకాలు మానేసి బీసీ బిల్లును పార్లమెంట్ లో అమోదించాలని లేకపోతే ఒక విషయం మాత్రం బిజెపి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ఉద్యమానికి పురిటి గడ్డ దేశంలోనే తెలంగాణకు ఉద్యమాలు నిర్మించిన చరిత్ర కలదు నిజాం నుంచి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ ఇలాంటి పోరాటాలు నిర్వహించిన చరిత్ర తెలంగాణకు కలదు. ఇలాంటి పోరాటాలు బీసీ ఇల్లు కోసం ఉధృతం కాకముందే కేంద్ర ప్రభుత్వం బిసి బిల్లు ఆమోదించాలని లేనిపక్షంలో బీజేపీ ని రానున్న ఎన్నికల్లో తిరస్కరిస్తారని అన్నారు.బీసీ రిజర్వేషన్ లు అమలు అయ్యేంత వరకు సిపిఐ పార్టీ కార్యకర్తలు పోరాటాలకు నాయకత్వం వహించాలని కోరారు.

శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి యధావిధిగా కొనసాగించడం కోసం సర్క్యులర్ జారీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-14T134333.368.wav?_=1

 

 

శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి యధావిధిగా కొనసాగించడం కోసం సర్క్యులర్ జారీ

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు ప్రెస్ క్లబ్ లో బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయ నిర్మాణాల్లో భాగంగా దర్శనాలు
భక్తులకు నిలిపివేస్తూ ఏకాంత సేవలు చేస్తూ అర్జిత సేవలు మరియు భక్తులు రాజన్న దర్శించుకునేదంతా భీమన్న ఆలయంలోకి మార్చడం అన్న విషయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ చేసిన ఆందోళనను మరియు గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ యొక్క సూచనలను తీసుకొని ఈరోజు హిందువుల మనోభావాలను దెబ్బ తినకుండా అదే రకంగా భక్తుల యొక్క నమ్మకాలను వమ్ము చేయకుండా రాజన్న ఆలయ ఆవరణలోనే దర్శనాలను ఏర్పాటు చేస్తూ అదే రకంగా అర్జిత సేవలను కూడా ఏర్పాటు చేస్తూ ఏదైతే రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేం ఆహ్వానిస్తూ ఉన్నాం అదే రకంగా భారతీయ జనతా పార్టీ హిందువుల మనోభావాలు భక్తులను నమ్మకాల పట్ల విశ్వాసంతో చేసే కార్యక్రమాలు తప్ప అభివృద్ధికి ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ ఆటంకం కాదు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం యొక్క అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది కాంక్షిస్తుంది కానీ అందులో భాగంగా భక్తులకు రాజన్నను దూరం చేస్తాం అంటేనే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది భీమన్న ఆలయంలో అర్జిత సేవలను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది ఆపివేయడం వంటివి చేయడం ద్వారా,నిన్న బిజెపి చేసిన ధర్నాకు అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దర్శనాలు యధావిధిగా కొనసాగించడం జరుగుతుందని సర్క్యులర్ జారీ చేసినందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు మరియు అలాగే నిన్న జరిగినటువంటి ధర్నాకు మద్దతు ఇచ్చినటువంటి హిందూ బంధువులకు మరియు బీజేపీ కార్యకర్తలకు మా ధన్యవాదాలు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బిజెపి పట్టణ అధ్యక్షుడు ధూమాల శ్రీకాంత్,స్టేట్ కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్,మోర రవి,కోడం వినయ్, దూడం సురేష్,దేవేందర్ రెడ్డి,మెరుగు శ్రీనివాస్,సిద్ధి దేవరాజు,వేముల వైశాలి,శ్రీనివాస్, శ్రీధర్,శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు జడ్జిపై దాడి చేసిన లాయర్ పై దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-11T132348.391.wav?_=2

 

సుప్రీంకోర్టు జడ్జిపై దాడి చేసిన లాయర్ పై దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి

అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య
మొగులపల్లి నేటి ధాత్రి

 

భారతదేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్.గవాయి పైకి ఓ మతోన్మాద అడ్వకేట్ రాకేష్ కిషోర్ షూ విసిరేసి చేసిన దాడి ప్రజాస్వామ్య రాజ్యాంగం పైన జరిగిన దాడిగానే బావిస్తూన్నామని , అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య డిమాండ్ చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ సందర్బంగా జాతీయ అవార్డు గ్రహీత పుల్ల మల్లయ్య మాట్లాడుతూ భారతదేశ అత్యున్నతమైన సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బిఆర్.గవాయి పైకి అడ్వకేట్ రాకేష్ కిషోర్ షూ విసిరి దాడికి ప్రయత్నించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు . భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్.గవాయి పై దాడికి పాల్పడిన ఢిల్లీ కోర్టు న్యాయవాది రాకేష్ కిశోర్ పై దేశ ద్రోహం కేసు పెట్టి, అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ సంఘటన ను అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు . నిమ్న జాతి వర్గానికి చెందిన వ్యక్తి భారత సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా పని చేయడం గిట్టని మతోన్మాది ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. సిజెఐ బిఆర్ గవాయి పై ఇలాంటి మతోన్మాద ఉన్నత చదువులు చదివిన రాకేష్ కిషోర్ అనే అడ్వకేట్ సభ్య సంస్కారం లేకుండా షూ విసిరి అవమాన పర్చిన అడ్వకేట్ ఆ వృత్తికే గౌరవం లేకుండా చేశాడన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించి ముఖ్యంగా దీనికి భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి అమిత్ షా ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేసి ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని నిరూపించు కోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి రాజేందర్, మండల నాయకులు వంతడుపుల సారంగపాణి, జీడి సంపత్, బండారి రాజు, అంబేద్కర్ యువజన సంఘం మొగుళ్ళపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు బండారి కుమార్ , బండారి బిక్షపతి, చెరిపెల్లి సురేందర్, బండారి రాజయ్య, బండారి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

బిజెపి రిజర్వేషన్లను అడ్డుకోవడం వల్ల నే బీసీలకు అన్యాయం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-11T131713.653.wav?_=3

 

బిజెపి రిజర్వేషన్లను అడ్డుకోవడం వల్ల నే బీసీలకు అన్యాయం

రాష్ట్రంలో బీసీలు ఉద్యమానికి బిఎస్యూ సంపూర్ణ మద్దతు

బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్

పరకాల నేటిధాత్రి

 

బిజెపి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వళ్లనే హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై స్టేట్ ఇచ్చారని బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా సురేష్ మాట్లాడుతూ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడానికి మాత్రం రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకున్నారని ఉన్నంత కులాల వారి మీద ఉన్న ప్రేమ బీసీల పట్ల బిజెపి పార్టీకి లేనే లేదని స్పష్టంగా అర్థమవుతుందని బీసీ ప్రధాని న నీ చెబుతూ మోడీ బీసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధమైన చర్యలన్ని తీసుకొని అన్ని రాజకీయ పార్టీలను బీసీ సంఘాలను కలుపుకొని చిత్తశుద్ధితో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

కాంగ్రెస్ వ్యవహారం – బీసీలకు అన్యయం…

కాంగ్రెస్ వ్యవహారం – బీసీలకు అన్యయం.

వెల్దండ/ నేటి ధాత్రి :

 

బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు విధానంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసత్యాలతో, అబద్ధాలతో కాలయాపన చేస్తూ వచ్చింది అని వెల్దండ మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు జంగిలి యాదగిరి ఆరోపించారు. ఈ రోజు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించవలసి వచ్చినప్పుడు న్యాయ నిపుణలతో సలహాలు సూచనలు తీసుకొని ప్రజలకు హామీలు ఇవ్వాలి.కోర్టులో 42% బీసీ కోటా నిలబడదు అని తెలిసినా కూడా తమ రాజకీయ లబ్దికోసం దుందుడుకు తనంతో, దూకుడు వ్యవహారంతో బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం కల్పిస్తామని అమలు కాని హామీలు ఇచ్చి, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి చూస్తే ఆయన ప్రజల కోసం ముఖ్యమంత్రి కాలేదు, ప్రజలను మోసం చేయడానికి ముఖ్యమంత్రి అయినట్టు అర్థమవుతుంది. స్థానిక ఎలక్షన్లు జరగకపోవడంతో గ్రామాలలో అభివృద్ధి ఎప్పుడో అటకెక్కింది, దానితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల సమస్యలు ఎవరికి చెప్పాలో అర్ధం కావడం లేదు. కాబట్టి ఇలాంటి అసమర్థ ముఖ్యమంత్రితో తెలంగాణకు మరింత అన్యాయం జరిగే అవకాశం ఉంది.కావున బీసీ ప్రజలారా ఇకనైనా మేల్కోనండి రేవంత్ రెడ్డి కుట్రా రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనీ కోరారు.

రాజా సింగ్ వ్యాఖ్యలపై ముస్లిం సంఘాల ఆవేదన…

మెట్ పల్లి అక్టోబర్ 10 నేటి ధాత్రి

 

దసరా పండుగ సందర్భంగా గోషా మహల్ శాసనసభ్యుడు రాజా సింగ్ మహమ్మద్ ప్రవక్త ముస్లిం ల పట్ల అనుచిత వాక్యాలు చేయడం జరిగింది. ఆయన వాక్యాలు యావత్ ముస్లిం ప్రజలకు బాద కలిగించే విధంగా ఉన్నాయి. అంతే కాకుండా మత విద్వేషాలను రెచ్చ గొట్టే విధంగా ఉన్నాయి. ఆయనపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి.
కావున మాయందు దయతలచి మహమ్మద్ ప్రవక్త ముస్లిం ల పట్ల అనుచిత వాక్యాలు చేసిన గోషా మహల్ శాసనసభ్యుడు రాజా సింగ్ పై తగు చట్టరీత్యా చర్యలు తీసుకోగలరని తమరిని సవినయంగా ప్రార్థిస్తున్నాము.
మెటుపల్లి పట్టణ ముస్లిం ప్రజలు.

బీసీ రిజర్వేషన్ హైకోర్టు స్టే పై బీసీ సంఘాల రాస్తారోకో…

బీసీ రిజర్వేషన్ హైకోర్టు స్టే పై బీసీ సంఘాల రాస్తారోకో

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీసీ సమాజ్,బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీలకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రాస్తారోకోను శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్,బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్ మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కూడా బీసీలకు రావాల్సిన హక్కులు రాకుండా పోవడం వల్ల బీసీలు వెనుక పడుతున్నారని,తెలంగాణ రాష్ట్రం లో అనేక రకమైన బీసీ ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బీసీ ప్రజలందరికీ హామీ ఇచ్చి ఆ మేరకు ఈ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవోను తీసుకొచ్చారన్నారు.స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుకు పోతున్న తరుణంలో అగ్రవర్ణాలైనా రెడ్డిలు ఈ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవో కు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లడం జరిగింది.గురువారం హైకోర్టులో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ ఆపుతూ స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపి వేశారన్నారు.తీర్పు బీసీ మెజార్టీ ప్రజల మనోభాలకు వ్యతిరేకంగా ఉంది అని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్,బిజెపి పార్టీలు ఇప్పటికైనా మెజారిటీ ప్రజలైన బీసీలకు అనుకూలంగా వ్యవహరించి బీసీలకు దక్కాల్సిన విద్యా,ఉద్యోగ,రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్లను కల్పించడానికి ముందుకు రావాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా కాంగ్రెస్,బీఆర్ఎస్,బిజెపిలో ఉన్న బీసీ నాయకులందరూ ఏకతాటిపై వచ్చి బీసీ ప్రజలకు రావాల్సిన రిజర్వేషన్లు సాధించడంలో ముందు ఉండాలని,లేనిపక్షంలో బీసీ ప్రజల ముందు మిమ్ములను దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు.ఇప్పటికైనా హైకోర్టు కు అన్ని రాజకీయ పార్టీలను బీసీ రిజర్వేషన్ల పైన తమ అభిప్రాయాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని బీసీ సంఘాలను అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని బీసీల రిజర్వేషన్ల ను 9 షెడ్యూల్లో పెట్టడం కోసం కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని కోరారు.కాంగ్రెస్,బీఆర్ఎస్,బిజెపి పార్టీలు బీసీల ప్రజల మనోభాలతో చెలగాటం ఆడితే రాబోవు కాలంలో రాష్ట్రాన్ని స్తంభింప చేయడం జరుగుతుందని,అగ్రవర్ణాలు కూడా బీసీలకు రావాల్సిన హక్కులకు అడ్డుపడితే తెలంగాణలో అగ్రవర్ణ ఎమ్మెల్యేలు,ఎంపీలకు ఓట్లతో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు కర్నే శ్రీధర్,ఏదునూరి రమేష్,విద్యార్థి ఉద్యమ నాయకుడు చేరాల వంశీ,బొలిశెట్టి లక్ష్మణ్,గరిగే చేరాలు,వైద్య భాస్కర్,వైద్య రవి,కట్కోజుల రమణాచారి, కంటి రవీందర్,నరసింహ చారి,రాళ్ల బండి రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

జస్టిస్ బిఆర్ గవాయి పై దాడి చేసిన రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలి…

జస్టిస్ బిఆర్ గవాయి పై దాడి చేసిన రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలి

ములుగు టౌన్ నేటి దాత్రి

 

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై చెప్పుతో దాడి చేయడం దేశ చరిత్రలోనే అత్యంత దౌర్భాగ్యమైన దినమని ఈ దాడికి పాల్పడిన వ్యక్తి సనాతన ధర్మం గురించి ప్రస్తావించడం అంటే దాడి వెనకాల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారనేది స్పష్టంగా అర్థమతుందని ఈ దాడి కి పూర్తి బాధ్యత వారే వహించాలని డిమాండ్ చేశారు.

ములుగు జిల్లా కేంద్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) ములుగు మండల నాయకులు కొర్ర రాజు ఆధ్వర్యంలో అయన అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల బాద్యులు రత్నం. ప్రవీణ్ మాట్లాడుతూ
ఆర్ ఎస్ ఎస్ మూఢత్వం ముసుగులో ఉన్న అరాచక న్యాయవాది రాకేష్ కిషోర్ తన బూటు విసిరి దాడికి పాల్పడినాడని, దాడి జరిగి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికి ఇంతవరకు దాడి చేసిన వ్యక్తి పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లో బీజేపీ ప్రభుత్వ అంతరంగ ఆంతర్యం ఏమిటనేది అర్థమవుతుందని అన్నారు ఇది యావత్తు భారత ప్రజానీకానికి గుండెకాయ లాంటి రాజ్యాంగం పైన చేసిన దాడిగా ఉంది అని ఆర్ఎస్ఎస్ పథకం ప్రకారం చేసిన దాడి అని అన్నారు దళితుడుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండటాన్ని ఆర్ఎస్ఎస్ బిజెపి జీర్ణించుకోలేకపోతుందన్నారు ఇటీవల ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల వేడుకలకు జస్టిస్ గవాయి తల్లిని ఆహ్వానించగా ఆమె తిరస్కరించినందుకుగాను యూపీలో బిజెపి సర్కార్ బుల్డోజర్లతో ఇండ్లను కూల్చి వేస్తున్న సందర్భంగా జస్టిస్ గవాయి బుల్డోజర్ న్యాయం చెల్లదు రాజ్యాంగ న్యాయం చెల్లుతుందని తీర్పునివ్వడం, మరికొన్ని న్యాయ తీర్పుల ఆధారంగా ఆర్ఎస్ఎస్ బిజెపి ఒక పథకం ప్రకారం కక్ష పెంచుకొని జస్టిస్ గవాయిపై ఉద్దేశపూర్వక దాడి చేసిందన్నారు సనాతన ధర్మాన్ని అడ్డుకునే వారందరినీ ప్రతిఘటిస్తామని న్యాయవాది రాకేష్ కిషోర్ మాట్లాడుతున్నాడు ఇది వ్యక్తి విసిరిన చెప్పు కాదు ఆర్ఎస్ఎస్ విసిరిన అగ్రకుల ఆధిపత్య విషర్పమని అన్నారు. ఈ దాడి రాజ్యాంగం పైన ,దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన అత్యున్నత న్యాయస్థానం పైన జరిగిన దాడిగా పరిగణించాలన్నారు
అత్యున్నత న్యాయస్థానాలలో కూడా ఆర్ఎస్ఎస్ మూక దాడులు ఆగట్లేదన్నారు దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి అనేక కీలక తీర్పులు ఇచ్చే జస్టిస్ గవాయ్ దళితుడు కావడం వల్లే ఈ వివక్షకు ఒడిగడుతున్నారని చెప్పారు. సనాతన ధర్మం లో సమానత్వం ఉందా అని ప్రశ్నించారు సనాతన ధర్మంలో సతీసహగమనం బాల్య వివాహాలు కుల వివక్ష జోగిని వ్యవస్థ అసమానతలు తప్ప సనాతన ధర్మంలో సమానత్వం లేదన్నారు సనాతన దర్మం కోసం పని చేసేవారు ముందుగా వారు దాన్ని పాటించాలని ఈ దేశంలో ఎన్ని మత ధర్మాలు ఉన్నప్పటికీ అవి వ్యక్తిగతంగానే అమలు చేసుకోవచ్చని ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు రాజ్యాంగబద్ధంగా మెదులుకోవాలని ఆయన కోరారు ఈ దాడి పై ప్రధానమంత్రి పెదవులతో ఖండించడమే కాదు పూర్తి బాధ్యత వహించి బహిరంగ క్షమాపణ చెప్పాలని అలాగే దాడి కి పాల్పడిన అడ్వకెట్ రాకేష్ కిషోర్ ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దేశ అత్యున్నత న్యాయస్థానంలోనే అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తికి రక్షణ లేకుండా పోయిందన్నారు. బిజెపి ఆర్ఎస్ఎస్ నీచ సంస్కృతీ కి ఈ భౌతిక దాడి నిదర్శనం అన్నారు
మన రాష్ట్రంలో గత కొన్ని రోజుల క్రిందట సిద్దిపేట లో ఇద్దరు ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్న న్యాయవాదులు సామాజిక మాధ్యమాలలో జస్టిస్ గవాయిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరిచారన్నారు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ వెనుకాల ఉన్న లాయర్లందరూ జస్టిస్ గవాయ్ ఎడల ఈ వైఖరి కలిగి ఉన్నారంటానికి ఈ దాడి రుజువు చేస్తుందన్నారు జస్టిస్ గవాయి పై దాడి కేవలం ఒక వ్యక్తి పై చేసింది కాదన్నారు తక్షణమే సుప్రీంకోర్టు న్యాయవాది రాకేష్ కిషోర్ బార్ కౌన్సిల్ మెంబర్షిప్ రద్దు చేసి చేతులు దులుపుకోవడం కాకుండ వెంటనే అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించాలని ఆయన పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని దేశ ప్రజల మెదడులో విద్వేషాలను నింపుతున్న ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్ఎస్ఎస్ విష సంస్కృతి బహిస్కరించాలని నిషేదించాలని ఈ ఘటనను దేశంలోని ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని ఆయన కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు కొర్ర రాజు గొంది సాంబయ్య డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కలవల రవీందర్ కొడపాక చంటి నాయకులు చందర్ రాజు మోహన్ ప్రదీప్ కార్తీక్ పాణి సునీల్ తదితరులు పాల్గొన్నారు

అగ్రవర్ణాల కుట్రతోనే బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు స్టే

అగ్రవర్ణాల కుట్రతోనే బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు స్టే

42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి

బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద నిరసన

ధర్నా రాస్తారోకో, స్తంభించిన ట్రాఫిక్, పోలీసుల చొరవతో నిరసన విరమణ

నర్సంపేట నేటిధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అగ్రవర్ణాల కుట్రలో భాగంగానే హైకోర్టు స్టే విధించిందని బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు,నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ డ్యాగల శ్రీనివాస్ ఆరోపించారు. రెడ్డి జాగరణ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టులో వేసిన దాఖలు పట్ల గురువారం హైకోర్టు మద్యంతర స్టే విధించింది. దీంతో త్వరలో జరగవలసిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో పాటు బీసీ కులాల విద్య ఉద్యోగ ఉపాధిలో రిజర్వేషన్లు కోల్పోయే పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జీజుల శ్రీనివాస్ పిలుపుమేరకు జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డు అమరవీరుల స్థూపం వద్ద రాస్తారోకో ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. సుమారు 25 నిమిషాల పాటు జరిగిన ధర్నా రాస్తారోకో పట్ల సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ ఎక్కడెక్కడ స్తంభించింది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ అరుణ్ కుమార్ బీసీ సంక్షేమ సంఘం నాయకులతో మాట్లాడి నిరసన విరమింప చేశారు. అనంతరం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీల హక్కులు రిజర్వేషన్ల కోసం కొన్ని ఏండ్లుగా చేస్తున్న పోరాటం ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అగ్రవర్ణ కులాల కుట్రలో భాగంగా హైకోర్టులో ఫిర్యాదు మేరకు హైకోర్టు స్టే విధించిందని పేర్కొన్నారు. దీంతో బీసీలకు ఉద్యోగ,ఉపాధితో పాటు అన్ని విధాల అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు బీసీలుగా ఏనాడు కూడా దానిని వ్యతిరేకించి కోర్టులకు వెళ్లలేదని తెలిపారు. బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు ఇచ్చిన స్టేను వెంటనే ఎత్తివేసి 42 శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు స్టే విధించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు చొరవ తీసుకొని బీసీలకు న్యాయం చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం కొట్లాడుతున్న మపై పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు ముద్రబోయిన రమేష్ ముదిరాజ్, జిల్లా అధికార ప్రతినిధి మరుపల వీరస్వామి కురుమ, జిల్లా సహాయ కార్యదర్శి మట్ట రమేష్ యాదవ్, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, పట్టణ కార్యదర్శిలు గాండ్ల శ్రీనివాస్, భేతి భాస్కర్, పట్టణ యూత్ అధ్యక్షుడు గోపగాని నాగరాజు గౌడ్, బీసీ జిల్లా నాయకులు డ్యాగం శివాజీ, దుగ్గొండి మండల అధ్యక్షుడు పొన్నాల మహిపాల్, ఉపాధ్యక్షుడు చొప్పరి భాస్కర్ ముదిరాజ్, యూత్ అధ్యక్షుడు బండారి ఉదయ్ కిరణ్, మండల నాయకులు బండారి ప్రకాష్ ముదిరాజ్, చెన్నారావుపేట మండల అధ్యక్షుడు బర్ల యాకయ్య, మహిళా అధ్యక్షురాలు బండి విజయ, కార్యదర్శి చామంతుల రమేష్, చెన్నారావుపేట టౌన్ మహిళా అధ్యక్షురాలు ముంజ లక్ష్మి, మహిళా ప్రధాన కార్యదర్శి కారుపోతుల శ్రీదేవి, మహిళా నాయకురాలు వైనాల రజిత, గొర్రె వినయ్, శ్రీకాంత్, ల్యాగల ప్రవీణ్ కుమార్, సింగనబోయిన నవీన్ తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే..

టిఆర్పీ జిల్లా నాయకుడు రవి పటేల్..

భూపాలపల్లిలో ధర్నా, రాస్తారోకో..

లీడర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

భూపాలపల్లి నేటిధాత్రి

 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పీ)జిల్లా నాయకుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్త బంద్ లో భాగంగా పార్టీ జిల్లా నాయకులు రవి పటేల్ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా, రాస్తారోకో చేశారు. అంతకుముందు నాయకులు, కార్యకర్తలు కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న విషయాన్ని గమనించిన ఎస్సై సాంబమూర్తి ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తమ సిబ్బందితో వెళ్లి ధర్నా చేస్తున్న నాయకులను బలవంతంగా లాక్కెళ్లి, అదుపులోకి తీసుకుని వదిలేశారు. ధర్నా సందర్భంగా టిఆర్పీ జిల్లా నాయకుడు రవి పటేల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను అణిచివేయడానికి పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించి ఉద్యమాన్ని అణిచివేసే విధంగా కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఏం జరిగినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడేది లేదన్నారు.

బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇచ్చే వరకు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి పార్టీలకు బీసీలపై చిత్తశుద్ధి లేదని, 42 శాతం రిజర్వేషన్లపై అన్ని పార్టీలు తమ ద్వంద వైఖరిని ప్రకటిస్తున్నాయన్నారు. 64శాతం ఉన్న బీసీలు తమ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ 9లో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా దొంగ కారణాలు చెప్పి వెనకబడేస్తున్నారని విమర్శించారు. అన్ని పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంలో లేదని, కావున ప్రజలంతా కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి నేతలను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్పీ జిల్లా నాయకులు కరుణాకర్, చంద్రశేఖర్, సంతోష్, శ్రీను, వెంకన్న, సమ్మయ్య, నవీన్, అక్షయ్, సన్నీ, శంకర్రావు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

చే గెవారా ఆశయాలను కొనసాగించాలి….

చే గెవారా ఆశయాలను కొనసాగించాలి

కామ్రేడ్ చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లా కేంద్రంలోని చే గువేరా వర్ధంతి సందర్భంగా ఏఐఎఫ్ టీయు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ చే గెవారా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు. రాజకీయ నాయకుడు. ఇతడు పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యతిరేకించాడు. క్యూబా ప్రభుత్వం లో కాస్ట్రో తరువాత అంతటి శక్తివంతుడైన నాయకుడు.

అర్జెంటీనా లోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14 న ఒక మధ్య తరగతి కుటుంబంలో చే జన్మించాడు.

1953 లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం
నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్ పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతులను గురించి తెలుసుకున్నాడు. విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు చేగువేరా భావించాడు ఎన్నో పోరాటాలు చేసిన అతడు 39 సంవత్సరాలు అనేక ప్రజా పోరాటాలు చేసినారు
1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోసారియా అనే పట్టణంలో జన్మించిన చెగువేరాను..
1967 అక్టోబర్ 9న బొలీవియాలోని లా హిగువేరాలో అమెరికా సీఐఏకు బలైపోయారు. ఆయన్ని ఓ పాఠశాలలో బంధించి కాల్చి చంపారు. ఓ మహా ప్రస్థానానికి ముగింపు పలికారు. కావున చేగువేరా ఆశయాలను కొనసాగించాలి

ఖమ్మం జిల్లాలో తాటిచెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి…

ఖమ్మం జిల్లాలో తాటిచెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి

మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాదారం గ్రామంలో తాటిచెట్లు నరికినవారిపై కేసులు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. నర్సంపేట పట్టణంలో సంఘం సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ
మాదారం గ్రామంలో గత 40 సంవత్సరాల నుండి కల్లు వృత్తిపై జీవనాధారం కొనసాగించే వందల కుటుంబాలు ఆ గ్రామంలో గీత కార్మికులు ఉన్నారన్నారు.మాదారం గ్రామంలో ఒక పెద్ద మనిషి పంట పొలాన్ని కొనుగోలుచేసి గత సంవత్సరం కొన్ని తాటిచెట్లను తీసివేయగా గీత కార్మికులు వెళ్లి నిరసన వ్యక్తంచేయగా ఆరోజు ఆపేశారన్నారు. ఈ నెల 8న మరలా వందల తాటిచెట్లను జె.సి.బిలతో కూల్చివేయడం
మొదలుపెట్టారన్నారు.గీత కార్మికులకు విషయం తెలిసి అడ్డుకోగా చెట్లను
కూల్చడానికి సిద్ధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.చెట్లను నరికి గీత కార్మికులు పొట్టకొట్టొద్దని వేడుకున్నా ఆపలేదని అవేదన వ్యక్తం చేశారు.
జీవనాధారం మొత్తం కల్లువృత్తిపై ఆధారపడి ఉంటున్న గీత కార్మికులు రోడ్డునపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.ఇప్పటికైనా ఆబకారిశాఖ అధికారులు స్పందించి గీత కార్మికులకు తగిన న్యాయం చేయాలని, లేనిఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోడిశాల సదానందం గౌడ్,జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్, రాష్ట్ర కార్యదర్శి మద్దెల సాంబయ్య గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి శీలం వీరన్న గౌడ్,సలహాదారులు రామగోని సుధాకర్ గౌడ్, గౌడ సంఘం పట్టణ అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు గౌడ్,కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, తాళపెల్లి శ్రీనివాస్ గౌడ్,మొగలగానిసురేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు జూలూరి హరిప్రసాద్ గౌడ్, జునూరి నరేష్ గౌడ్,డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్,గిరగాని కిరణ్ గౌడ్,రమేష్ గౌడ్, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కెటిపిపి విద్యుత్ ఉద్యోగ సంఘాల నిరసన

కెటిపిపి విద్యుత్ ఉద్యోగ సంఘాల నిరసన

గణపురం నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పై దాడికి యత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కెటిపిపి ప్రధాన ముఖద్వారం అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ఎస్సీ & ఎస్టీ విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ఈ దాడి దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో చీకటి రోజని, భారత రాజ్యాంగం, ప్రజాస్వా మ్యంపై జరిగిన దాడిగానే భావిస్తున్నామని దాడికి పాల్పడిన వారికీ తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు సనతన దర్మం పిచ్చి ఎంత ముదిరింది అంటె దళితుడు ఐన సుప్రీంకోర్టులో సిజేఐ గవాయ్‌పై బూటు విసిరె స్థాయికి చేరింది.ఈ చర్యను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లు అందరు తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్పీ & ఎస్టీ జెఎసి నాయకులు తదితరులు పాల్గొన్నారు

దత్తగిరిని సందర్శించిన జిల్లా ఎస్పీ …

దత్తగిరిని సందర్శించిన జిల్లా ఎస్పీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

Vaibhavalaxmi Shopping Mall


ఝరాసంగం : ప్రకృతికి, మానసిక ప్రశాంతతకు

నిలయమైన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో బుధవారం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన మహా మృత్యుంజయ లక్ష జప యజ్ఞానికి హాజరయ్యారు. వారికి ముందుగా ఆలయ రాజగోపురం వద్ద అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతిర్లింగాలకు అభిషేకం, శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని మంగళ హారతి నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి మహారాజ్, సిద్దేశ్వరానందగిరి మహారాజ్ ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై దాడిని ఖండిస్తున్నాం…

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై దాడిని ఖండిస్తున్నాం

సోతుకు ప్రవీణ్ కుమార్
సిపిఐ పట్టణ కార్యదర్శి

భూపాలపల్లి నేటిధాత్రి

 

Vaibhavalaxmi Shopping Mall


సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై జరిగిన దాడి నీ నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ప్లకాడ్ల తో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండించాలని ,

జస్టిస్ గవాయ్ పై ఆర్ ఎస్ ఎస్ ముసుగులో ఉన్న అరాచక న్యాయవాది రాకేష్ కిషోర్ తన బూటు విసిరి దాడికి పాల్పడినాడని ఇది ఆర్ఎస్ఎస్ పథకం ప్రకారం చేసిన దాడి అని సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ అన్నారు.ఈ దాడిని కమ్యూనిస్టు పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.ఈ దాడులు కేవలం జస్టిస్ గవాయ్ పైన మాత్రమే కాదు భారతదేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపైన దాడి గా చూడాలని అన్నారు.జస్టిస్ గవాయ్ ఎల్లప్పుడూ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా తీర్పులు ఇచ్చారనీ, అది గిట్టని మతోన్మాద శక్తులు లాయర్ రాకేష్ కిషోర్ రూపంలో దాడులు చేపిస్తున్నారని తెలిపారు. బిజెపి ఆర్ఎస్ఎస్ మతోన్మాద అరాచకాలను ఆపాలని లాయర్ రాకేష్ కిషోర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు.ఈ దాడికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పూర్తి బాధ్యత వహించాలన్నారు. దేశ ప్రజల మెదడులో విద్వేషాలను నింపుతున్న ఆర్ఎస్ఎస్ విష సంస్కృతి వల్లే ఈ భౌతిక దాడులు జరుగుతున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు క్యాతరాజ్ సతీష్, నేరెళ్ల జోసెఫ్, పీక రవి, రవీందర్, జనార్ధన్, పొనగంటి లావణ్య, పల్లెల రజిత, పెద్దమామల సంధ్య, ఇటికల శ్రీలత, పోతుగంటి స్వప్న, వాసం రజిత, సుభద్ర రాజమణి తదితరులు సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

చీఫ్ జస్టిస్ గవాయ్‌పై దాడి – కఠిన చర్యలు కోరిన గుడికందుల రమేశ్

సుప్రీం చీఫ్ జస్టిస్ గవాయి పై దాడి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి

మందమర్రి నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

భారత అత్యున్నత పదవిలో ఉన్న సుప్రీం చీఫ్ జస్టిస్… జస్టిస్ గవాయి పై జరిగిన దాడి.. యావత్ న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై దాడి జరిగినట్లు అని సామాజిక ఉద్యమ నాయకుడు గుడికందుల రమేశ్ అన్నారు. బుధవారం మందమర్రిలో మాట్లాడుతూ…..సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ దాడికి యత్నించిన వ్యక్తి వ్యక్తిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఒక కేసు విచారణ సందర్భంగా వాదనలు వినిపిస్తున్న లాయర్ రాకేష్ ఏకంగా చీఫ్ జస్టీస్ బీఆర్ గవాయ్ పై దాడి చేసేందుకు యత్నించాడు. తన షూను తీసి సీజేపై విసిరేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, తోటి లాయర్లు అప్రమత్తమై తనను అడ్డుకున్నారు.భారత దేశ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న బీఆర్ గవాయ్ పై జరిగిన దాడి దేశ ప్రజలను కలచివేసింది. ఈ ఘటనను పలు పార్టీల నేతలు, ప్రముఖులు ఖండించాలని కోరుతూ, మన దేశ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న గౌరవనీయులపై దాడి చేసి భయపెట్టే ఈ
నీచమైన ఘటనను ఖండించడానికి మాటలు సరి పోవని అన్నారు. ఇది మన దేశ చరిత్రలో ఒక చీకటి రోజని ఇలాంటి పిరికిపంద దాడులతో తాను వెనక్కి తగ్గబోనని ధైర్యంగా ప్రకటించిన మన అజేయమైన భారత ప్రధాన న్యాయమూర్తి బీ.ఆర్.గవాయ్ కు ప్రజాస్వామ్యవాదుల మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు.

పొన్నం ప్రభాకర్ దళిత మంత్రికి క్షమాపణ చెప్పాలి

దళిత మంత్రి అడ్లూరు లక్ష్మన్ కుమార్ ని దూషించిన పొన్నం ప్రభాకర్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి -బెజ్జంకి అనిల్ మాదిగ

కరీంనగర్, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ ని అసభ్యపదజాలంతో దుషించిన పొన్నం ప్రభాకర్ ఇరవైనాలుగు గంటల్లోనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసమావేశంలో ఎమ్మార్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ మాట్లాడుతూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని వివేక్ తో పొన్నం ప్రభాకర్ దున్నపోతుగానికి టైం తెలియదు ఏమి తెలియదు అని అహంకారంగ మాట్లాడిన పొన్నం ప్రభాకర్ వైఖరి నిరసిస్తూ ఇరవై నాలుగు గంటల్లో బహిరంగ క్షేమాపణ చెప్పాలి లేదా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతాం పొన్నం తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే ఈనెల 8న జిల్లావ్యాప్తంగా పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తాం, ఈనెల 9నాడు పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడి చేస్తాం అన్నారు.

 

ఈఇరవై నాలుగు గంటలు పోన్నం ప్రభాకర్ కి ఇస్తున్నాం. ఒక దళిత మంత్రిని అవమాన పరుస్తూ వివేక్ తో మాట్లాడినప్పుడు ఒక దళిత మంత్రిగా ఉండి కనీసం స్పందించలేదంటే దళిత పదం నీబతుకు తెరువు కోసమే తప్ప దళిత జాతి భవిష్యత్తు కోసం మీరు ఏమి ఉపయోగపడరు అన్నది స్పష్టంగా మాకు అర్థమవుతుంది తక్షణమే పొన్నం ప్రభాకర్ మాటలను ఒక మంత్రిగా మీరు స్పందించాల్సిన బాధ్యత మీమీద కూడా ఉంది అని మేము వివేక్ కూడా గుర్తు చేస్తున్నాం. పొన్నం ప్రభాకర్ ఇరవై నాలుగు గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బోయిని కొమురయ్య మాదిగ, చెంచాల నవీన్ మాదిగ, తడగొండ శంకర్ మాదిగ, దండు అంజయ్య మాదిగ, కొత్తూరి రాజన్న మాదిగ, దండు వరలక్ష్మి మాదిగ, రేపాక బాబు మాదిగ, అలువాల సంపత్ మాదిగ, కనకం నరేష్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ…

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ

సింగరేణి యాజమాన్యం ముక్కు పిండి కార్మికుల జీతాలు వసూల్ చేస్తాం

సింగరేణి యాజమాన్యం పైన ఘాటు వ్యాఖ్యలు చేసిన మహేష్ వర్మ

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహించిన ధర్నా,నిరసన కార్యక్రమానికి మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు తెలిపింది.కాంట్రాక్ట్ కార్మికులకు 4నెలల జీతాలను ఇవ్వకుండా,విధులకు తీసుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తూన్నారన్న విషయంపై టీఆర్పీ పార్టీ మంచిర్యాల జిల్లా నాయకులు మహేష్ వర్మ మాట్లాడుతూ.. సిఆర్ఆర్ కంపెనీ,ఉదయ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కాంట్రాక్ట్ కార్మికులతో 4 నెలలుగా జీతాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, కార్మికులను విధులకు కూడా తీసుకోకుండా కంపెనీ పూర్తిగా ఎత్తేశారని అన్నారు.కాంట్రాక్ట్ యాజమాన్యానికి సంబంధించి ఎవరు లేకపోవడంతో ఎవరిని సంప్రదించాలని కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఈ విషయం పై సింగరేణి జనరల్ మేనేజర్ ని కలవగా డబ్బులు ఇప్పిస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి ఇప్పుడు మాకు సంబంధం లేదని మాట మార్చారని మండిపడ్డారు.కార్మికుల జీతాలు ఇప్పిస్తానని మాటమార్చిన జనరల్ మేనేజర్ అధికారిగా అనర్హుడని అన్నారు.కీలక బాధ్యత ఉద్యోగంలో ఉండి కార్మికుల జీతాలు ఇప్పించడం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.ఇలాంటి మోసపూరిత కంపెనీలకు కాంటాక్ట్ ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు.కార్మికుల శ్రమ దోచుకున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని,వాటిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని,వాటి లైసెన్సులు పేపర్ ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కార్మికుల జీతాలు వడ్డీతోసహా చెల్లించాలని లేనిపక్షంలో రానున్న రోజుల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సింగరేణి యాజమాన్యంపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంటాక్ట్ కంపెనీల,సింగరేణి యాజమాన్యం ముక్కు పిండి వసూల్ చేస్తామని,బాధిత కార్మికులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పాకాల దినకర్,దాస్యపు దీపక్ కుమార్,పడాల శివతేజ, సిపతి సాయి కుమార్,ఎండి లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

భారత రాజ్యాంగ పరిరక్షణ నిరసన ధర్నాను జయప్రదం చేయండి..

*భారత రాజ్యాంగ పరిరక్షణ నిరసన ధర్నాను జయప్రదం చేయండి.. ఎఐబియస్పీ.

పలమనేరు(నేటి ధాత్రి)
అక్టోబర్ 01:

అక్టోబర్ 9వ తేదీ మాన్యశ్రీ కాన్షిరాం వర్ధంతి సందర్భంగా విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో జరుగు భారత రాజ్యాంగ పరిరక్షణ నిరసన ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏ ఐ బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి డివి మునిరత్నం కోరారు. అందులో భాగంగా జయరామ్ గౌడ్ , సోమరాజు, మహిళ నాయకురాలు సరస్వతి అధ్యక్షతన పలమనేర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన ధర్నా కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా డివి మునిరత్నం మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ,
క్రైస్తవ లను
ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, దెబ్బ కొట్టాలనే దురుద్దేశంతో కేంద్రంలోని బిజెపి, దాని అనుబంధ సంఘం ఆర్ఎస్ఎస్ రెండు కలిసి రాజ్యాంగంలోని లౌకిక- సామ్యవాదం అనే రెండు పదాలను తొలగించాలని ముమ్మరంగా ప్రయత్నం చేశారని గుర్తు చేశారు.ఆ రెండు పదాల తొలగింపు విషయములో సుప్రీం కోర్ట్ స్పందించి లౌకిక, సామ్యవాదం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉన్నందున తొలగించరాదని తీర్పు ఇచ్చినప్పటికీ చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగాన్నే మార్చే ప్రక్రియకు ఆర్ఎస్ఎస్ బిజెపి శ్రీకారం చుట్టాయి అన్నారు.ఆ రెండు పదాలు తొలగించడం వలన దేశంలోని 80% మంది ఎస్సీ ,ఎస్టీ ,బీసీప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలుకు దూరంగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. బడుగు, బలహీన, వర్గాలకు ప్రాథమిక హక్కులుగా లౌకికత్వం, సామ్యవాదం పునాదులుగా ఉంటాయని గతంలోనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయులలో మత సంబంధమైన వివక్ష ఉండరాదని, తమకు ఇష్టమైన మతాన్ని పాటించి ప్రచారం చేసుకునే హక్కు భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కుల్లో భాగమేనన్నారు. బిజెపి ,ఆర్ఎస్ఎస్ మనువాదాన్ని ముందుకు తీసుకొచ్చి దేశ ప్రజలకు నిత్యం సవాలుగా మారుతున్న మతతత్వం
పెట్టుబడిదారీ విధానాలను తీసుకురావాలనే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు,ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బిజెపికి అనుకూలంగా ఉండే నాయకుల చేత సనాతన ధర్మం, మనువాద శాస్త్రాన్ని బలవంతంగా ప్రసంగాల్లో చెప్పిస్తున్న విషయం నగ్న మెరిగిన సత్యం అన్నారు.దేశ ప్రజలకు ఇష్టం లేని మతతత్వం పెట్టుబడి దారి విధానాలను కష్టంగా రుద్దాలని చూస్తున్న బిజెపి ,ఆర్ఎస్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ కట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం,క్రైస్తవ మైనార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈనెల 9వ తేదీ విజయవాడ నగరంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగు భారత రాజ్యాంగ పరిరక్షణ లౌకిక, సామ్యవాద పదాలను తొలగించరాదు అనే నిరసన ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గుర్రం సుబ్రహ్మణ్యం, నారాయణ శెట్టి, సాంబశివ, వాణి, శాంతమ్మ, చిన్న, మనోహర్, వెంకటపతి, షేట్, శ్రీనివాసులు, సురేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు

జహీరాబాద్ లో వక్స్ సవరణ చట్టం వ్యతిరేకంగా సలహా సమావేశం…

జహీరాబాద్ లో వక్స్ సవరణ చట్టం వ్యతిరేకంగా సలహా సమావేశం

◆:- అక్టోబర్ 3న దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ దేశవ్యాప్తంగా వక్స్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి అనుసంధానంగా, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని పోలీస్ స్టేషన్ సమీపంలోని అదబీ హాల్ లో శనివారం జూహార్ నమాజు అనంతరం ఒక ముఖ్యమైన సలహా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో వివిధ మతాలు, మతపరమైన సంస్థలు, సామాజిక సంఘాలు, పత్రికా రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ, 2025 సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల తర్వాత కూడా, వక్స్ సవరణ చట్టంలోని పలు విభాగాలు ఇంకా అమలులో ఉన్నాయని, ఇవి ముస్లిం సమాజం యొక్క మతపరమైన, రాజ్యాంగబద్ధ హక్కులకు ప్రమాదకరమని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే అక్టోబర్ 3న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ( ఏఐఎంపిఎల్బి ) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం రెండవ దశలో జరగనుంది. అందులో భాగంగా జహీరాబాద్ మరియు పరిసర మండలాలు కోహీర్, ఝరాసంగం, మొగడంపల్లి, న్యాలకల్ లలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి వ్యాపార బంద్ కొనసాగనుంది. ప్రజాసౌకర్యం దృష్ట్యా ఆసుపత్రులు మరియు మెడికల్ షాపులకు మినహాయింపు ఇవ్వబడింది. ‘వక్స్ రక్షించు రాజ్యాంగాన్ని రక్షించు ఉద్యమం’ కన్వీనర్ మాట్లాడుతూ, ఈ నిరసన కేవలం బంద్ కాకుండా, ముస్లిం సమాజం యొక్క ఐక్యత, బాధ్యత, చైతన్యం మరియు హక్కుల పట్ల చురుకుదనాన్ని ప్రతిబింబించే కార్యక్రమంగా ఉండబోతుందని తెలిపారు. ఈ సమావేశంలో సమావేశంలో ముఖీ అబ్దుసబూర్ కాసిమీ, మౌలానా అబ్దుల్ ముజీబ్ కాసిమీ, ముఫ్తా నజీర్ అహ్మద్ హుస్సామీ, అయూబ్ ( ఎం. పి. జే ), యూసుఫ్ (ముస్లిం యాక్షన్ కమిటీ), మొయిజ్ (ముస్లిం యాక్షన్ కమిటీ), ఇజాజ్ (పత్రికా ప్రతినిధి), మహబూబ్ మౌరీ (పత్రికా ప్రతినిధి), అబ్దుల్ మజీద్ (ఈద్గా కమిటీ అధ్యక్షుడు), హాఫిజ్ అక్బర్, అబ్దుల్ ఖదీర్ (జమియతుల్ ఉలమా), అడ్వొకేట్ సమీర్, అబ్దుల్ వహీద్, మౌలానా కమాన్ పట్టేవాలే, ముహమ్మద్, ముఫ్తా మొయిన్, ముఫ్తా సిరాజ్, ముఫ్తా అబ్దుల్ వాసిః, మౌలానా అబ్దుల్ ఘనీ, ఐయూబ్ సహారా, వసీం ( పిటి ), అలీ, డా. నసీర్ సన్రోహీ, అలీం (జిమ్), ఖదర్ ఖాన్, అయూబ్ ఖాన్, వసీం (పేపర్ షాప్), తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version