తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన అగ్ని కణం శ్రీకాంత చారి
శ్రీకాంతచారి వర్ధంతికి ఘనమైన నివాళులు
కేసముద్రం/ నేటి ధాత్రి*
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన ఆత్మ బలిదానంతో తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన తొలి అమరవీరుడు శ్రీకాంత్ చారి అని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు చాగంటి కిషన్ అన్నారు. బుధవారం కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చాగంటి కిషన్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు అవకాశాలను ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రజలకు దక్కకుండా చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ ద్వారా సమస్యలు పరిష్కరించబడతాయని ఉద్యమం లేచిన నేపథ్యంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తిన లేపడానికి తన ప్రాణాలను బలిదానం చేసిన అమరవీరుడు శ్రీకాంత్ చారి అని కొనియాడారు. తన శరీరం మంటలతో దహనం అవుతున్న లెక్కచేయకుండా జై తెలంగాణ అంటూ నినదించిన వీరుడని అన్నారు. శ్రీకాంత్ చారి అమరత్వాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరని అన్నారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచిన హామీలలో భాగమైన ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం,ఇళ్లను ఇస్తామని ఆమె ఇవ్వడం జరిగింది తక్షణమే ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్ర స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తించి పెన్షన్ సౌకర్యం, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు దశ్రు నాయక్,మంద భాస్కర్, శివారపు శ్రీధర్ సోమారపు వెంకటయ్య,కళ్ళెం శ్రీనివాస్, వాంకుడోత్ సూర్య, నర్సిరెడ్డి, రమేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
