అమిత్‌షాపై అభ్యంతకర వ్యాఖ్యలు.

 అమిత్‌షాపై అభ్యంతకర వ్యాఖ్యలు.. మహువా మొయిత్రాపై ఎఫ్ఐఆర్

 

అమిత్‌షాపై మహువా మొయిత్రా వ్యక్తిగత విమర్శలకు దిగారు. బంగ్లాదేశ్‌ నుంచి చొరబాట్లను అడ్డుకోవడంలో షా విఫలమయ్యారన్నారు. ఆయన తలను నరికి బల్లపై పెట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాయపూర్: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)పై ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది.

స్థానికుడు ఒకరు చేసిన ఫిర్యాదుపై మనా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైనట్టు పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 196, సెక్షన్ 197 కింద ఆమెపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. దీనికి ముందు పశ్చిమబెంగాల్‌లోని కృష్ణానగర్‌లో పోలీసులకు బీజేపీ ఫిర్యాదు చేసింది. మహువా అసహ్యకరమైన, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. ఇదే టీఎంసీ వైఖరా అని ప్రశ్నించింది. అయితే మహువా వ్యాఖ్యలపై టీఎంసీ అధికారికంగా స్పందించలేదు.నదియా జిల్లాలో గత గరువారంనాడు ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మహువా మొయిత్రా పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సరిహద్దు భద్రత విషయంలో తన బాధ్యతల నుంచి తప్పించుకుంటోందన్నారు. ఈ సందర్భంగా అమిత్‌షాపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. బంగ్లాదేశ్‌ నుంచి చొరబాట్లను అడ్డుకోవడంలో షా విఫలమయ్యారన్నారు. ఆయన తలను నరికి బల్లపై పెట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మన సరిహద్దులను కాపాడటానికి ఎవరూ లేకపోతే, వేరే దేశం నుంచి ప్రతి రోజూ ప్రజలు ప్రవేశిస్తుంటే, చొరబాటుదారులు మన తల్లులు, సోదరీమణులపై కన్నేయడంతోపాటు మన భూములను లాక్కుంటున్నారని మన దేశ పౌరులు ఫిర్యాదు చేస్తుంటే.. మొదట మీరు అమిత్‌షా తల నరికి బల్లపై పెట్టాలి’ అని వ్యాఖ్యానించారు.

 

మాతో ఎవరూ సరితూగరు..

మాతో ఎవరూ సరితూగరు..

 

 

డీఎంకేతో సరితూగగల పార్టీ ఏదీ లేదని రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ కేంద్ర మంత్రి అమిత్‌ షాను ఉద్ధేశించి పేర్కొన్నారు. తిరునల్వేలిలో శుక్రవారం సాయంత్రం జరిగిన బీజేపీ బూత్‌ కమిటీల సమావేశంలో అవినీతిని ప్రోత్సహిస్తున్న డీఎంకే ప్రభుత్వాన్ని వేళ్లతో సహా పీకి పారేద్దామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

చెన్నై: డీఎంకేతో సరితూగగల పార్టీ ఏదీ లేదని రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ(Minister KN Nehru) కేంద్ర మంత్రి అమిత్‌ షాను ఉద్ధేశించి పేర్కొన్నారు. తిరునల్వేలిలో శుక్రవారం సాయంత్రం జరిగిన బీజేపీ బూత్‌ కమిటీల సమావేశంలో అవినీతిని ప్రోత్సహిస్తున్న డీఎంకే ప్రభుత్వాన్ని వేళ్లతో సహా పీకి పారేద్దామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో, తిరునల్వేలిలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్‌ అప్పావుతో కలసి పాల్గొన్న మంత్రి కేఎన్‌ నెహ్రూ మాట్లాడుతూ… వేళ్లతో సహా పీకి పారేసేందుకు డీఎంకే చెట్టు కాదని, కోట్లాది మంది ప్రజల మద్దతుతో నాలుగేళ్లకు పైగా సుపరిపాలన అందిస్తుందన్నారు. 15 ఏళ్లుగా తమకు గిట్టని పార్టీల ప్రభుత్వాలను వేళ్లతో పీకేయడమే బీజేపీ పని అని, డీఎంకే గురించి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను పట్టించుకోబోమన్నారు.

 

అన్నాడీఎంకే-బీజేపీ కూటమిలో ఇంకా స్పష్టత రాలేదని, ఇప్పటికి మూడు సార్లు రాష్ట్రానికి వచ్చిన అమిత్‌ షా ప్రతి సభలో, సంకీర్ణ ప్రభుత్వమేనని చెబుతున్నారే కానీ, అది ఏ పార్టీ నేతృత్వంలో ఉందో చెప్పకుండా దాటవేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎంజీఆర్‌లాగే సీఎం స్టాలిన్‌కు కూడా మహిళల ఆదరణ పెరుగుతోందని, అందువల్ల వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి అధికారం కాపాడుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version