జహీరాబాద్ లో వక్స్ సవరణ చట్టం వ్యతిరేకంగా సలహా సమావేశం…

జహీరాబాద్ లో వక్స్ సవరణ చట్టం వ్యతిరేకంగా సలహా సమావేశం

◆:- అక్టోబర్ 3న దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ దేశవ్యాప్తంగా వక్స్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి అనుసంధానంగా, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని పోలీస్ స్టేషన్ సమీపంలోని అదబీ హాల్ లో శనివారం జూహార్ నమాజు అనంతరం ఒక ముఖ్యమైన సలహా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో వివిధ మతాలు, మతపరమైన సంస్థలు, సామాజిక సంఘాలు, పత్రికా రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ, 2025 సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల తర్వాత కూడా, వక్స్ సవరణ చట్టంలోని పలు విభాగాలు ఇంకా అమలులో ఉన్నాయని, ఇవి ముస్లిం సమాజం యొక్క మతపరమైన, రాజ్యాంగబద్ధ హక్కులకు ప్రమాదకరమని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే అక్టోబర్ 3న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ( ఏఐఎంపిఎల్బి ) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం రెండవ దశలో జరగనుంది. అందులో భాగంగా జహీరాబాద్ మరియు పరిసర మండలాలు కోహీర్, ఝరాసంగం, మొగడంపల్లి, న్యాలకల్ లలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి వ్యాపార బంద్ కొనసాగనుంది. ప్రజాసౌకర్యం దృష్ట్యా ఆసుపత్రులు మరియు మెడికల్ షాపులకు మినహాయింపు ఇవ్వబడింది. ‘వక్స్ రక్షించు రాజ్యాంగాన్ని రక్షించు ఉద్యమం’ కన్వీనర్ మాట్లాడుతూ, ఈ నిరసన కేవలం బంద్ కాకుండా, ముస్లిం సమాజం యొక్క ఐక్యత, బాధ్యత, చైతన్యం మరియు హక్కుల పట్ల చురుకుదనాన్ని ప్రతిబింబించే కార్యక్రమంగా ఉండబోతుందని తెలిపారు. ఈ సమావేశంలో సమావేశంలో ముఖీ అబ్దుసబూర్ కాసిమీ, మౌలానా అబ్దుల్ ముజీబ్ కాసిమీ, ముఫ్తా నజీర్ అహ్మద్ హుస్సామీ, అయూబ్ ( ఎం. పి. జే ), యూసుఫ్ (ముస్లిం యాక్షన్ కమిటీ), మొయిజ్ (ముస్లిం యాక్షన్ కమిటీ), ఇజాజ్ (పత్రికా ప్రతినిధి), మహబూబ్ మౌరీ (పత్రికా ప్రతినిధి), అబ్దుల్ మజీద్ (ఈద్గా కమిటీ అధ్యక్షుడు), హాఫిజ్ అక్బర్, అబ్దుల్ ఖదీర్ (జమియతుల్ ఉలమా), అడ్వొకేట్ సమీర్, అబ్దుల్ వహీద్, మౌలానా కమాన్ పట్టేవాలే, ముహమ్మద్, ముఫ్తా మొయిన్, ముఫ్తా సిరాజ్, ముఫ్తా అబ్దుల్ వాసిః, మౌలానా అబ్దుల్ ఘనీ, ఐయూబ్ సహారా, వసీం ( పిటి ), అలీ, డా. నసీర్ సన్రోహీ, అలీం (జిమ్), ఖదర్ ఖాన్, అయూబ్ ఖాన్, వసీం (పేపర్ షాప్), తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version