జస్టిస్ బిఆర్ గవాయి పై దాడి చేసిన రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలి…

జస్టిస్ బిఆర్ గవాయి పై దాడి చేసిన రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలి

ములుగు టౌన్ నేటి దాత్రి

 

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై చెప్పుతో దాడి చేయడం దేశ చరిత్రలోనే అత్యంత దౌర్భాగ్యమైన దినమని ఈ దాడికి పాల్పడిన వ్యక్తి సనాతన ధర్మం గురించి ప్రస్తావించడం అంటే దాడి వెనకాల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారనేది స్పష్టంగా అర్థమతుందని ఈ దాడి కి పూర్తి బాధ్యత వారే వహించాలని డిమాండ్ చేశారు.

ములుగు జిల్లా కేంద్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) ములుగు మండల నాయకులు కొర్ర రాజు ఆధ్వర్యంలో అయన అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల బాద్యులు రత్నం. ప్రవీణ్ మాట్లాడుతూ
ఆర్ ఎస్ ఎస్ మూఢత్వం ముసుగులో ఉన్న అరాచక న్యాయవాది రాకేష్ కిషోర్ తన బూటు విసిరి దాడికి పాల్పడినాడని, దాడి జరిగి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికి ఇంతవరకు దాడి చేసిన వ్యక్తి పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లో బీజేపీ ప్రభుత్వ అంతరంగ ఆంతర్యం ఏమిటనేది అర్థమవుతుందని అన్నారు ఇది యావత్తు భారత ప్రజానీకానికి గుండెకాయ లాంటి రాజ్యాంగం పైన చేసిన దాడిగా ఉంది అని ఆర్ఎస్ఎస్ పథకం ప్రకారం చేసిన దాడి అని అన్నారు దళితుడుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండటాన్ని ఆర్ఎస్ఎస్ బిజెపి జీర్ణించుకోలేకపోతుందన్నారు ఇటీవల ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల వేడుకలకు జస్టిస్ గవాయి తల్లిని ఆహ్వానించగా ఆమె తిరస్కరించినందుకుగాను యూపీలో బిజెపి సర్కార్ బుల్డోజర్లతో ఇండ్లను కూల్చి వేస్తున్న సందర్భంగా జస్టిస్ గవాయి బుల్డోజర్ న్యాయం చెల్లదు రాజ్యాంగ న్యాయం చెల్లుతుందని తీర్పునివ్వడం, మరికొన్ని న్యాయ తీర్పుల ఆధారంగా ఆర్ఎస్ఎస్ బిజెపి ఒక పథకం ప్రకారం కక్ష పెంచుకొని జస్టిస్ గవాయిపై ఉద్దేశపూర్వక దాడి చేసిందన్నారు సనాతన ధర్మాన్ని అడ్డుకునే వారందరినీ ప్రతిఘటిస్తామని న్యాయవాది రాకేష్ కిషోర్ మాట్లాడుతున్నాడు ఇది వ్యక్తి విసిరిన చెప్పు కాదు ఆర్ఎస్ఎస్ విసిరిన అగ్రకుల ఆధిపత్య విషర్పమని అన్నారు. ఈ దాడి రాజ్యాంగం పైన ,దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన అత్యున్నత న్యాయస్థానం పైన జరిగిన దాడిగా పరిగణించాలన్నారు
అత్యున్నత న్యాయస్థానాలలో కూడా ఆర్ఎస్ఎస్ మూక దాడులు ఆగట్లేదన్నారు దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి అనేక కీలక తీర్పులు ఇచ్చే జస్టిస్ గవాయ్ దళితుడు కావడం వల్లే ఈ వివక్షకు ఒడిగడుతున్నారని చెప్పారు. సనాతన ధర్మం లో సమానత్వం ఉందా అని ప్రశ్నించారు సనాతన ధర్మంలో సతీసహగమనం బాల్య వివాహాలు కుల వివక్ష జోగిని వ్యవస్థ అసమానతలు తప్ప సనాతన ధర్మంలో సమానత్వం లేదన్నారు సనాతన దర్మం కోసం పని చేసేవారు ముందుగా వారు దాన్ని పాటించాలని ఈ దేశంలో ఎన్ని మత ధర్మాలు ఉన్నప్పటికీ అవి వ్యక్తిగతంగానే అమలు చేసుకోవచ్చని ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు రాజ్యాంగబద్ధంగా మెదులుకోవాలని ఆయన కోరారు ఈ దాడి పై ప్రధానమంత్రి పెదవులతో ఖండించడమే కాదు పూర్తి బాధ్యత వహించి బహిరంగ క్షమాపణ చెప్పాలని అలాగే దాడి కి పాల్పడిన అడ్వకెట్ రాకేష్ కిషోర్ ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దేశ అత్యున్నత న్యాయస్థానంలోనే అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తికి రక్షణ లేకుండా పోయిందన్నారు. బిజెపి ఆర్ఎస్ఎస్ నీచ సంస్కృతీ కి ఈ భౌతిక దాడి నిదర్శనం అన్నారు
మన రాష్ట్రంలో గత కొన్ని రోజుల క్రిందట సిద్దిపేట లో ఇద్దరు ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్న న్యాయవాదులు సామాజిక మాధ్యమాలలో జస్టిస్ గవాయిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరిచారన్నారు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ వెనుకాల ఉన్న లాయర్లందరూ జస్టిస్ గవాయ్ ఎడల ఈ వైఖరి కలిగి ఉన్నారంటానికి ఈ దాడి రుజువు చేస్తుందన్నారు జస్టిస్ గవాయి పై దాడి కేవలం ఒక వ్యక్తి పై చేసింది కాదన్నారు తక్షణమే సుప్రీంకోర్టు న్యాయవాది రాకేష్ కిషోర్ బార్ కౌన్సిల్ మెంబర్షిప్ రద్దు చేసి చేతులు దులుపుకోవడం కాకుండ వెంటనే అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించాలని ఆయన పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని దేశ ప్రజల మెదడులో విద్వేషాలను నింపుతున్న ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్ఎస్ఎస్ విష సంస్కృతి బహిస్కరించాలని నిషేదించాలని ఈ ఘటనను దేశంలోని ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని ఆయన కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు కొర్ర రాజు గొంది సాంబయ్య డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కలవల రవీందర్ కొడపాక చంటి నాయకులు చందర్ రాజు మోహన్ ప్రదీప్ కార్తీక్ పాణి సునీల్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version