కాంగ్రెస్ వ్యవహారం – బీసీలకు అన్యయం.
వెల్దండ/ నేటి ధాత్రి :
బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు విధానంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసత్యాలతో, అబద్ధాలతో కాలయాపన చేస్తూ వచ్చింది అని వెల్దండ మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు జంగిలి యాదగిరి ఆరోపించారు. ఈ రోజు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించవలసి వచ్చినప్పుడు న్యాయ నిపుణలతో సలహాలు సూచనలు తీసుకొని ప్రజలకు హామీలు ఇవ్వాలి.కోర్టులో 42% బీసీ కోటా నిలబడదు అని తెలిసినా కూడా తమ రాజకీయ లబ్దికోసం దుందుడుకు తనంతో, దూకుడు వ్యవహారంతో బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం కల్పిస్తామని అమలు కాని హామీలు ఇచ్చి, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి చూస్తే ఆయన ప్రజల కోసం ముఖ్యమంత్రి కాలేదు, ప్రజలను మోసం చేయడానికి ముఖ్యమంత్రి అయినట్టు అర్థమవుతుంది. స్థానిక ఎలక్షన్లు జరగకపోవడంతో గ్రామాలలో అభివృద్ధి ఎప్పుడో అటకెక్కింది, దానితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల సమస్యలు ఎవరికి చెప్పాలో అర్ధం కావడం లేదు. కాబట్టి ఇలాంటి అసమర్థ ముఖ్యమంత్రితో తెలంగాణకు మరింత అన్యాయం జరిగే అవకాశం ఉంది.కావున బీసీ ప్రజలారా ఇకనైనా మేల్కోనండి రేవంత్ రెడ్డి కుట్రా రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనీ కోరారు.
