భవిష్యత్తు తారల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం.

భవిష్యత్తు తారల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం..

మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి..
– ఎస్సై దికొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజం కలిసి రావాలని “ఇది ఒక వ్యక్తిని చంపడమే కాదు, సమాజంలోని అన్ని రకాల సమస్యలకు దారితీస్తుంది. డ్రగ్కు నో చెప్పడంలో యువత అప్రమత్తంగా ఉండాలి మరియు బాధ్యతగా ఉండాలి” అని పొత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ అన్నారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా ( సే నో టూ డ్రగ్స్ ) అనే నినాదం తో పొత్కపల్లి ఓదెల మోడల్ స్కూల్, హై స్కూల్, కస్తూర్బా విద్యార్థులతో విద్యార్థులతో కలిసి ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో ఓదెల సెంటర్లో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు మరియు ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా పొత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని విద్యార్థి దశలోనే పిల్లలను మంచి మార్గంలో నడిపించడం సమాజం యొక్క ప్రధాన బాధ్యత అని చుట్టూ జరుగుతున్న అనైతిక కార్యకలాపాల గురించి వారిలో అవగాహన పెంచాలి.డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల ప్రభావం ఇప్పుడు పల్లెప్రాంతాలకూ విస్తరించిందనీ,వీటి నుంచి యువతను కాపాడుకోవాలి” అని తెలిపారు.
గంజాయి వంటి మాదకద్రవ్యాలు రవాణాకు సులభ మార్గాలనీ, విద్యార్థులు,యువత వీటికి బలవుతున్నారనీ,మత్తులో ఉన్న వ్యక్తి తన చర్యల్ని గుర్తించలేని స్థితికి చేరతాడనీ,ఈ అలవాటు అనేక ఆరోగ్య సమస్యలతో పాటు నేరపూరిత జీవితానికి దారితీస్తుందని అన్నారు.
అంతేకాకుండా సరదా కోసం అయినా డ్రగ్స్ వైపు అడుగు వేయకండనీ,ఇవి కేవలం వ్యక్తిని కాదు, కుటుంబాన్నీ నాశనం చేస్తాయనితెలిపారు. డ్రగ్స్‌కి బలైపోకుండా మీ భవిష్యత్తును కాపాడుకోనీ విజేతలుగా ఎదగండి” అంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల విద్యాధికారి రమేష్, అధ్యాపక బృందం, పోలీస్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

పర్యావరణం పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.

పర్యావరణం పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.

ఘనంగా అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం వేడుకలు.

ఆకట్టుకున్న అటవీ శాఖ అధికారుల బైక్ ర్యాలీ.

మహాదేవపూర్- నేటి ధాత్రి:

 

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ శాఖ రేంజ్ అధికారి రవి అన్నారు. గురువారం రోజు అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా మహదేవ్పూర్ అటవీ శాఖ రేంజ్ తో పాటు డివిజనల్ అధికారులు బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి రవి మాట్లాడుతూ, పచ్చదనం పర్యావరణ మానవ జీవనశైలిలో ఎంతో ప్రాముఖ్యత తో పాటు ఆరోగ్య రక్షణ కూడా కలిగిస్తుండని, పచ్చదనాన్ని కాపాడుటకు చెట్లు అడువులను రక్షించడం అటవీ శాఖ తోపాటు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, కుటీర పరిశ్రమల ద్వారా అందించే సంచులను వాడాలని సూచించారు. అడవుల్లో ప్లాస్టిక్ సంచులు,బాటిల్స్, అడవుల్లో వేయకూడదని, అడవుల్లో వృక్షాలను నరకకుండా కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పాటించాలని, అడవుల రక్షణ ప్రకృతి పరిరక్షణ మానవ మనుగడకు ముడిపడి ఉందన్న విషయం, ప్రజలంతా గుర్తుంచుకోవాలని అన్నారు.

ఆకట్టుకున్న అటవీ శాఖ అధికారుల బైక్ ర్యాలీ.

అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మహదేవ్పూర్ రేంజ్ తో పాటు సబ్ డివిజన్ ఫారెస్ట్ అధికారులు మరియు సిబ్బంది, పర్యావరణం ప్రతి ఒక్కరి బాధ్యత పర్యావరణాన్ని కాపాడాలి ప్లాస్టిక్ నిషేధించాలని అటవీ శాఖ కార్యాలయం నుండి ,అటవీ శాఖ అందించిన ద్విచక్ర వాహనాలపై సిబ్బంది అధికారులు మండల కేంద్రమంతా ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. పెద్ద సంఖ్యలు అటవీ శాఖ సిబ్బంది పచ్చని రంగు ద్విచక్ర వాహనాల ర్యాలీ ప్రదర్శన, ప్రకృతి అందంలా తలపించింది, అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో,ఎఫ్ ఆర్ ఓ రవి , డిఆర్ఓ రాజేశ్వర్, ఎఫ్ ఎస్ ఓ,లు. వరుణ్,ఆనంద్,తిరుపతి సుమన్, హసన్ ఖాన్, ఫయాజ్ అహ్మద్, అఫ్జల్,ఎఫ్ బి ఓ లు సదానందం, దిలీప్, అంజయ్య, విటల్,సురేందర్ సంజీవ్ అనిల్ రాజశేఖర్, త్రివేణు తో పాటు బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత .

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత గ్రామ కార్యదర్శి కృష్ణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కార్యదర్శి కృష్ణ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోహిర్ మండల బేడంపేట గ్రామ యుపిఎస్ పాఠశాల ప్రాంగణంలో స్వచ్ఛత కార్యక్రమం గురువారము నిర్వహించారు.
పంచాయతీ కార్యదర్శి పర్యావరణం కలుషితం కాకుండా ప్రకృతిని పెంచాలని మరియు గ్లోబల్ వార్మింగ్ అరికట్టాలని వివరించడం జరిగింది ప్రకృతి బాగుంటేనే ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని వారు ప్లాస్టిక్ వ్యర్థాలను నదుల్లో పడేయొద్దని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version