డ్రగ్స్ భూతాన్ని అరికడదాం-భావితరాలకు మంచి భవిష్యత్తుని అందిద్దాం
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐ.పీ.ఎస్
జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటుగా విద్యాసంస్థలలో మాధకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమం
సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )
సిరిసిల్ల జిల్లాలోని మాధకద్రవ్యాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నాషా ముక్త్ భారత్ అభియాన్ ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం మేరకు జిల్లాలో విద్యాసంస్థల్లో మాధకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జిల్లా పోలీస్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మాధకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమంలో అధికారులు, సిబ్బందితో కలసి పాల్గొన్న జిల్లా ఎస్పీ.
District SP Mahesh B. Gite IPS
జిల్లాలో అక్రమంగా గంజాయి సేవించిన, క్రయవిక్రయాలు జరిపిన,కఠిన చర్యలు తప్పవని ఈసందర్భంగా హెచ్చరించారు.గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ లు ,నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ గంజాయి రవాణాపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు. జిల్లాలో ఈసంవత్సరం 40 కేసులల్లో 98 మందిని అరెస్ట్ చేసిన 3.700 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.గంజాయికి సంబంధించిన సమాచారం సబంధిత పోలీస్ వారికి సమాచారం అందించి గంజాయి రహిత జిల్లాగా మర్చడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి పద్మ,సి.ఐ లు నటేష్,రవి,ఆర్.ఐ లు రమేష్, మధుకర్, యాదగిరి,ఎస్.ఐ లు శ్రీకాంత్, ప్రేమంనందం, జునైద్, శ్రవణ్, శ్రీనివాస్, రమేష్,పోలీస్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సామాన్య ప్రజలకు నిత్య సేవలు అందించే శ్రామికులు ఆటో డ్రైవర్స్ అని టీపీసీసీ సభ్యులు, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు పెండెం రామానంద్ అన్నారు.ప్రపంచం ఆటో డ్రైవర్స్ దినోత్సవం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో ర్యాలీ చేపట్టగా ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ సభ్యులు,గౌరవ అధ్యక్షులు పెండెం రామానంద్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆటో కార్మికులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామానంద్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల కష్టాలను అర్థం చేసుకొని ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అందించే విధంగా చొరవ తీసుకుంటామని చెప్పారు.ఆటో డ్రైవర్లకు వ్యక్తిగతంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో కాకతీయ యూనియన్ అధ్యక్షులు ఇస్రం కుమార్,పట్టణ ఇన్చార్జి కొమ్ము వినయ్ కుమార్, ఐఎన్టియుసి నాయకులు ఆకుతోట ఇంద్రసేనారెడ్డి, పాకాల రోడ్ ఆటో యూనియన్ అధ్యక్షులు దేశి విజయ్, ఉపాధ్యక్షులు ఈదుల శ్రీను, కార్యదర్శి మండల రమేష్, కోశాధికారి వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు పోగుల రాజు, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఓర్సు తిరుపతి,మాజీ కౌన్సిలర్ యెలకంటి విజయ్,మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్,వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, ప్రధాన కార్యదర్శి బైరి మురళి,కార్యదర్శులు మోటం రవి,గిరగాని రమేష్,నాంపెల్లి వెంకటేశ్వర్లు,బూస నర్సింహరాములు,బిట్ల మనోహర్,రామగోని శ్రీనివాస్,మైధం రాకేష్, రామగోని సుధాకర్,గండు గిరివరంగంటి విక్రమ్ సాయి తదితరులు పాల్గోన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేంద్రముచట్ట భద్రత కల్పించాలలి తెలంగాణ జన సమితి వనపర్తి నేటిదాత్రి . తెలంగాణ రాష్ట్రంలోబీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత భద్రత కల్పించాలని తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాష డిమాండ్ చేశారు వనపర్తి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో తెలంగాణ జనసమితి నేతలు మాట్లాడారు తెలంగాణలోబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభ ఆమోదించిన బిల్లులకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని వారు కోరారుతెలంగాణ జనసమితి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు విద్యా, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టంచేసి తొమ్మిదవ షెడ్యూల్ ఈసమావేశంలో పిక్కిలి బాలయ్యశాంతారామ్ నాయక్ కె రమేష్. తదితరులు ఉన్నారు
ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్ కనెక్షన్ల ఏర్పాటకు చర్యలు
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:
ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు గాను గ్యాస్ కనెక్షన్లు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు,గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో కలెక్టర్ సమావేశమై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కట్టెల పొయ్యితో కాకుండా గ్యాస్ ద్వారా వంట చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఈనేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న సుమారు 500 ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అందుకు ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు సహకరించాలని కోరారు. ప్రతి మండలానికి సుమారు 35 నుండి 40 ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నందున ఆయా మండల ఎల్పిజి ఏజెన్సీల నుండి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేలా చూడాలని ఎల్పిజి ఏజెన్సీ ప్రతినిధులను కోరారు.వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆర్ బి ఎస్ కె ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో,కేజిబివిలలో విద్యార్థులకు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయుటకు సంబంధిత విద్యాసంస్థల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి,జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డిఓ కౌసల్యాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు,జిల్లా బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, ప్రత్యేక అధికారులు మండల విద్యాశాఖ అధికారులు,కెజిబివి స్పెషల్ ఆఫీసర్లు,గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత .
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 22 లక్షల మంది పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరులో 90% విద్యార్థులు తాము చదువుకుంటున్న పాఠశాలకు దూరంగా నివాసం ఉంటున్నవారు. కాబట్టి ప్రతి ప్రభుత్వ ప్రాథమిక మరియు ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు చేసి విద్యార్థులను స్కూల్స్ కు తీసుకెళ్లాలి. దీని ద్వారా వారి సమయం, శక్తి వృధా కాకుండా ఉంటుంది. చదువుపై మరింత శ్రద్ధ పెడతారు. ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయి.కొంత మేరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్ గా ఏర్పాటు చేసుకునే అవకాశం కలుగుతుంది.. తప్పకుండా ఈ డిమాండ్ ను నెరవేర్చాలని మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ లకు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేనియెడల ధర్నాలు రాస్తారోకాలు చేస్తామని అన్నారు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విధంగానే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని అన్నారు, కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చిట్యాల మండల సభ్యులు శీలపాక నాగరాజ్, పుల్ల అశోక్, నేరెళ్ల రమేష్, మట్టే వాడ కుమార్ సాదా రాకేష్ ముదిరాజ్, క్యాతం నాగరాజ్ పద్మశాలి తదితరులు పాల్గొన్నారు.
పారిశ్రామిక వాడలో జరిగిన అగ్నిప్రమాద ఘటన స్థలిని పరిశీలించిన హరీష్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి
పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కనీసం సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం అత్యంత దారుణమని ఎద్దేవా చేశారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలిని ఎమ్మెల్యేలు మాణిక్ రావు,చింతా ప్రభాకర్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ,ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడి అందిస్తున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఘటన జరిగి ఐదు గంటలు గడుస్తున్నా సహాయక చర్యలు అందించడంలో, కుటుంబ సభ్యులకు వివరాలు తెలపడంలో వైఫల్యం అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం ఇంత పెద్ద పేలుడు జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.
వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, ప్రమాదం జరిగే సమయంలో కంపెనీలో మొత్తం 140 మంది పని చేస్తున్నట్లు తెలుస్తున్నది.
మొత్తం నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది.
8 మంది మృతి చెందగా, దాదాపు 26 మందిని పలు ఆసుపత్రులకు తరలించారు.మిగతా వారి పరిస్థితి తెలియరావడం లేదు.
ఎంత మంది బయటికి రాగలిగారు అనేది అర్థం కాని పరిస్థితి కుటుంబ సభ్యులు వచ్చి ఆందోళన చెందుతున్నారు.
తమవారి జాడ చెప్పాలని అధికారులను వేడుకుంటున్నారు.
కుటుంబ సభ్యులకు వివరాలు తెలిపే ప్రయత్నం చేయాలని కలెక్టర్, ఎస్పీ లను కలిసి చెప్పాను.
ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ పని చేస్తున్నారు.
కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు.
ప్రమాదం జరిగి 5 గంటలు గడుస్తున్నా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.కంట్రోల్ రూం పెట్టండి, కామన్ ఫోన్ నెంబర్ పెట్టండి అని అధికారులకు సూచించారు.ప్రమాదం జరిగి 5 గంటలు అవుతున్నది ఏం చేస్తున్నారు?
వివరాలు తెలియక కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నరు?
ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ వెతికేందుకు ఎన్డీఆర్ఎఫ్ అద్బుతంగా పని చేస్తున్నది.
కానీ, ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వం, అధికార యంత్రాంగం పని చేస్తున్నది అని ప్రశ్నించారు.
ప్రత్యేక అధికారులను పెట్టుకోండి, అటెండెన్స్ లిష్ట్ పెట్టుకోండి.డ్యూటీలో ఎంత మంది ఉన్నరు అంటే కలెక్టర్ ఒక లెక్క, ఎస్పీ ఒక లెక్క చెబుతున్నారని ఆరోపించారు.
5 గంటల నుంచి ఏ వివరాలు లేవు, బాధ్యత రాహిత్యంగ పని చేస్తున్నది ప్రభుత్వం అసలు కార్మిక శాఖ, ప్రభుత్వం ఏం చేస్తున్నది?
ఇక్కడకు వచ్చే కుటుంబ సభ్యులు ఎవరిని కలవాలో చెప్పండి.
హ్యాండ్ మైక్ పెటుకొని గైడ్ చేసే బాధ్యత లేదా?
గాయపడ్డ వారిని ప్రైమేరీ కేర్ ఆసుపత్రుల్లో జాయిన్ చేస్తున్నారు.
30శాతం కాలితే డేంజర్, కార్పొరేట్ ఆసుపత్రులకు వారిని ఎందుకు పంపడం లేదు ఏఐజీ, కేర్, అపోలో ఆసుపత్రులకు పంపండి.
మొదటి గంటలో ట్రీట్మెంట్ అందితే ప్రాణాలు కాపాడవచ్చు.
నిర్లక్ష్యంతో గోల్డెన్ అవర్ మిస్ చేస్తున్నారు.
క్షతగాత్రులకు మంచి వైద్యం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని పేర్కొన్నారు.
కుటుంబాలకు సమాచారం అందించడంలోనూ ఫెయిల్ ఎంత మంది డ్యూటీలో ఉన్నారో గుర్తించడంలో ఫెయిల్ పారిశ్రామిక వాడలో వరుసగా ఇది మూడో సంఘటన.
గతంలో జరిగిన సంఘటనలో 5గురు చనిపోయారు.
వరుస అగ్రి ప్రమాదాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు?
ఏడాదిలో మూడో సంఘటన జరగటం దురదృష్టకరం.
ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది.
సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ఫెయిల్ దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలి.
ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే కాపాడే విధంగా చర్యలు రూపొందించాలి.
చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు మంచి వైద్యం అందించి 50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు.
వలస ఆదివాసి గ్రామంలో వాలీబాల్ కిట్లు పలకలు అందజేసిన కరకగూడెం పోలీసులు
కరకగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు వలస ఆదివాసి నిమ్మలగూడెం, నీలాద్రి పేట, గండి గ్రామాలలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి ఆదివాసి ప్రజలు మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించద్దని తెలిపారు ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధి దిశగా ప్రయాణించాలని అభివృద్ధిని అడ్డుకునే మావోయిస్టులకు సహకరించరాదని తెలిపారు. మావోయిస్టులని కాలం చెల్లిన సిద్ధాంతాలని యువత పిల్లలు విద్య ద్వారానే ఉన్నంత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు అసంఘిక శక్తులకు సహకరించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ అనవసరంగా జైలు పాలై కేసులు పాలు కావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడుల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పివి నాగేశ్వరరావు, మరియు స్పెషల్ పార్టీ టి జి ఎస్ పి సిబ్బంది పాల్గొన్నారు.
వనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కాగితాల లక్ష్మయ్య
వనపర్తి నెటిదాత్రి:
shine junior collegeవనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కాగితాల లక్ష్మయ్య నియామకం అయ్యారు .వనపర్తి వనపర్తి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాగర్ కర్నూల్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు బి రాములు పార్టీ నేతల ఆధ్వర్యంలో నియామక పత్రం అందజేశారు .ప్రధాన కార్యదర్శిగా డి బాలరాజ్ కోశాధికారిగా ఏర్పుల చిన్నయ్య కార్యదర్శిగా గంధం రాజు కోమరి పుల్లూరి విశ్వనాధం దస్తగిరి ఉపాధ్యక్షులుగా పోలేపల్లి బాలయ్య నియామకం అయ్యారు ఈ సందర్భంగా పార్లమెంట్ నాగర్కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు వనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షున్ని కమిటీ సభ్యులను అభినందించారు వారికి దిశా నిర్దేశం చేస్తూ వనపర్తి పట్టణంలో అన్ని వార్డులు పర్యటించి వార్డులో ఉన్న సమస్యలపై సంబంధిత అధికారులకు తెలపాలని ప్రజల సమస్యలు పరిష్కరించుటకు కృషి చేయాలని సూచించారు ప్రతి మూడు నెలలకు ఒకసారి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం ఉంటుందని గైర్హాజరు కాకుండా కమిటీ నాయకులు పాల్గొన్నారు సూచించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల కొరకు పనిచేయాలని కోరారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించే సమావేశాలకు మూడు నెలలు రాకుంటే వారి వారి పదవిని తొలగిస్తామని రాములు తెలిపారు తెలుగుదేశం పార్టీ ని దివంగత ఎన్టీ రామారావు స్థాపించారని బడుగు బలహీన వర్గాలకు పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు వనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉందని ఓటు బ్యాంకు కూడా ఉన్నదని స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపాలిటీ జెడ్పిటిసి సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశిస్తే అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ నుండి అభ్యర్థులను ఉంచుతామని ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో హోటల్ బలరాం ఫారుక్ ఎండి దస్తగిరి శంకర్ ఆవుల శ్రీను అప్పయపల్లి బాలయ్య చిట్యాల బాలరాజు ఉపేంద్ర బి శేఖర్ తదితరులు పాల్గొన్నారు
ఇందిరా మహిళా శక్తి చీరలతో సిరిసిల్ల ప్రజలకు చేతినిండా ఉపాధి
బతుకమ్మ చీరల బకాయిలు 280 కోట్లు చెల్లించాం
రూ. 50 కోట్లతో యార్న్ బ్యాంకు ఏర్పాటు
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేనేత జౌళి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్
సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి ):
shine junior college
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తితో చేతినిండా పని కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్లలోని గణేష్ నగర్ లో ఉన్న మామిడాల నారాయణ, కొండ సుభాష్ కు మరమగ్గాల యూనిట్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులతో కలిసి ఈ రోజు చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు కార్మికులతో మాట్లాడారు. వేముల శ్రీనివాస్, మెరుగు శ్రీనివాస్ తదితర కార్మికులతో ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ మాట్లాడారు. ప్రతి రోజు ఎన్ని మీటర్ల చీర ఉత్పత్తి చేస్తున్నారని? వారానికి ఎంత ఆదాయం వస్తుందని? అడిగి తెలుసుకున్నారు. చీరల ఉత్పత్తిలో ఏమైనా ఇబ్బంది ఎదురవుతున్నాయని ఆరా తీశారు. తమకు ప్రతివారం రూపాయలు 4000 నుంచి 5000 వరకు ఆదాయం వస్తుందని కార్మికులు వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి, కార్మికులను ఆదుకునేందుకు చేతినిండా పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని వివరించారు. ఇందులో భాగంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇందిరా మహిళ శక్తి కింద చీరల ఉత్పత్తి ఆర్డర్లు అందించామని తెలిపారు. కార్మికులు, ఆసాములు కోరిన విధంగా ధర నిర్ణయించామని వెల్లడించారు.
ఇందిరా మహిళా శక్తి చీరలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని కార్మికులు, ఆసాములకు దాదాపు 8 నెలల పాటు ఉపాధి లభిస్తుందని తెలిపారు. గతంలోని బతుకమ్మ చీరల బకాయిలు దాదాపు 280 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా దశాబ్దాల కల నెరవేరుస్తూ వేములవాడలో రూపాయలు 50 కోట్లతో యార్న్ బ్యాంకు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అవసరమైన యార్న్ అంతా అక్కడ అందుబాటులో పెడుతున్నామని తెలిపారు. ఇతర ప్రభుత్వ శాఖ ఆర్డర్లు సిరిసిల్లకు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడేవారు అని ఇప్పుడు చేతినిండా పని ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్డర్లను ఆసాములు, కార్మికులు సద్వినియోగం చేసుకొని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. సెస్ పరిధిలోని బ్యాక్ బిల్లింగ్ సమస్య కోర్టు పరిధిలో ఉందని దానిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్,కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇన్సూరెన్స్ పాలసీ బాండ్ లు అందజేత బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు మెట్ పల్లి: జర్నలిస్టుల భద్రత కొరకు ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయం అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు అన్నారు. టీయూడబ్ల్యూజే(ఐజేయు) ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పాలసీలు చేయించగా ఆ పాలసీ బాండ్లను సోమవారం రోజు డాక్టర్ రఘు చేతుల మీదుగా జర్నలిస్టులకు అందజేయడం జరిగింది. డాక్టర్ రఘు మాట్లాడుతూ జర్నలిస్టుల భద్రత కొరకే ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించడం ఎంతో అభినందనీయం అని, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ఉన్న విలేకరులకు ప్రభుత్వం ద్వారా కూడా అందవలసిన సహాయ సహకారాల కోసం నేనెప్పుడూ పాటు పడుతా అని డాక్టర్ రఘు అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరం సంజీవ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ ఉపాధ్యక్షులు జంగం విజయ్ సాజిద్ పాషా, గౌరవ అధ్యక్షులు మాసుల ప్రవీణ్, గౌరవ సలహాదారులు దాసం కిషన్ ,క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పొనగాని మహేందర్, కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ ,రఫీ ఉల్లా, సోహెల్ , హైమద్, అఫ్రోజ్,విజయసాగర్, సభ్యులు ఆదిల్ పాషా, ఆగ సురేష్,ఏసవేని గణేష్ ,ఎండి అభిద్ తదితరులు పాల్గొన్నారు.
గత సీజయన్ లో రైతు భరోసా ఇవ్వని రైతులకు వెంటనే రైతు బరోసా డబ్భులు ఇవ్వాలని బిఆర్ఎస్ నర్సంపేట మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో అధ్యక్షుడు నామాల సత్యనారాయణ మాట్లాడుతూ గతకాలం సీజన్ లో రైతులకు రైతు భరోసా కేవలం 3 ఎకరాలలోపు ఉన్న కొందరు రైతులకు మాత్రమే రైతు భరోసా వేశారని ఇప్పుడు వానాకాలం సీజన్ మొదలు అవుతుందని అన్నారు.గౌరవ తెలంగాణ తోలి ముఖ్యమంత్రి కేసిఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో రైతు బందును సమయానికి రైతుల ఖాతాలో వేసి రైతులకు అదుకున్నారని పేర్కొన్నారు. నేడు ముఖ్యమంత్రి ఓక సీజన్ రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేశాడని ఆరోపించారు.ఎలాంటి అంక్షలు లేకుండా రైతు భరోసా బాకి ఉన్న రైతులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరాములు,మోతే జైపాల్ రెడ్డి,మోతే పద్మనాభ రెడ్డి,కోమల్ల గోపాల్ రెడ్డి,బండారి రమేష్,మోటూరి రవి,కోడారి రవి,తాల్లపెల్లి రాం ప్రసాద్,భూక్య వీరన్న,కడారి కుమారస్వామి,పెద్ది శ్రీనివాస్ రెడ్డి,వళ్ళల కర్ణకార్,అల్లి రవి,మర్ద నవీన్,సంగెం శ్రీకాంత్,చిప్పు రాజు తదితరులు ఉన్నారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం శారీరక ద్రుఢత్వం లభిస్తుంది
ప్రతి మండలానికి ఒక క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
చందుర్తి నేటిధాత్రి:
క్రీడలతో మానసిక ఉల్లాసం,శారీరక ద్రుఢత్వం లభిస్తుందనీ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..శుక్రవారం చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో నిర్వహించిన మూడపల్లి ప్రీమియం లీగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా విలేజ్ టూ విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మొదటి విజేత తంగళ్ళపల్లి రెండో విజేత మూడ పల్లి గ్రామ క్రీడాకారులకు బహుమతులు అందజేశారు…
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటలు ఆడటం వల్ల శారీరక దృఢత్వం లభిస్తుందనీ తెలిపారు…మన ప్రాంతంలో అనేక మంది క్రీడాకారులకు నిలయంగా మారిందన్నారు..గతంలో విద్యార్థి దశలో ఉన్న సమయంలో కోర్టు లైన్ పోసే వాడినని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు..
ఎల్లపుడూ క్రీడాకారులకు తన వంతు సహాయ సహారాలు ఉంటాయని అన్నారు.. రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి వాలీబాల్, కబడ్డి పోటీలు జిల్లా పరిదిలో తన వంతు ప్రోత్సాహకం ఉంటుందన్నారు… రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాలకు పెద్ద పీట వేస్తన్నరని అందులో భాగంగా రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు…
క్రీడాకారులు జీవితంలో ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని ఎదుర్కొనే ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నారు.. సిరిసిల్ల ప్రాంతంలో మంత్రుల చేతుల మీదుగా అనేక అభివ్రుద్ది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిoదన్నారు..
మన ప్రాంతంలో కోరుట్ల, సిరిసిల్ల,వేములవాడ ప్రాంతాల్లో క్రీడాకారులకు నూతన స్టేడియం లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.. ఇప్పటికే సిరిసిల్ల పట్టణంలో బతుకమ్మ తెప్ప వద్ద క్రీడా ప్రాంగణాన్ని చూడటం జరిగిందనీ తెలిపారు..గ్రామీణ ప్రాంతాల్లోనీ క్రీడాకారులను వేలికి తీయడానికి సీఎం కప్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపoటి రామస్వామి, మాజీ జెడ్పిటిసి నాగం కుమార్, సింగిల్ విండో వైస్ చైర్మన్ పుల్కం మోహన్, నాయకులు. బద్దం తిరుమలరెడ్డి, ప్రసాద్, బాణాల రవీందర్ పుల్కల్ లచ్చయ్య, మేకల గణేష్ క్రీడాకారులు పాల్గొన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కనీస సౌకర్యాలను అందించటమే మా లక్ష్యం
ఎస్పీ రోహిత్ రాజు
మావోయిస్టు ప్రభావిత గ్రామాల ప్రజలకు మినీ రైస్ మిల్లులు అందజేత
నేటిధాత్రి చర్ల:
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారికి కనీస సౌకర్యాలను అందజేయటమే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు.
ఈ రోజు చర్ల మండలంలోని మావోయిస్టు ప్రభావిత సరిహద్దు గ్రామాలైన 20 గ్రామాలకు మినీ రైస్ మిల్లులను అందజేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు రాళ్లపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ అధికారి నరేందర్ భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ కూడా పాల్గొన్నారు సుమారుగా 50 లక్షల రూపాయల వ్యయంతో 20 గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మినీ రైస్ మిల్లులను ఏర్పాటు చేయడం జరిగిందని. ఎస్పీ తెలిపారు మినీ రైస్ మిల్లు కొరకు ఏర్పాటు చేసిన షెడ్డుతో కలిపి ఒక్కో యూనిట్ విలువ 250000 రూపాయల ఖర్చుతో 20 గ్రామాలలో 20 యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేశారు రాళ్లపురం గ్రామంలో చర్ల పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ నిషేధిత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు విద్య వైద్యం రవాణా వంటి కనీస సౌకర్యాలతో పాటు మౌళిక సదుపాయాలను కూడా అందించటమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని అన్నారు తమ గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉన్న పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలని అట్టి సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి కృషి చేస్తామని తెలిపారు ఏజెన్సీ గ్రామాలలోని యువత అన్ని రంగాల్లో ముందుండాలని తెలిపారు రాళ్లపురం గ్రామం నుండి జాతీయ స్థాయిలో సెయిలింగ్ క్రీడలో పాల్గొన్న ఆడమయ్యను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు అనంతరం అడమయ్యను ఎస్పీ గ్రామస్తుల సమక్షంలో ఘనంగా సన్మానించారు నిషేధిత మావోయిస్టు పార్టీ నాయకులు తమ ఉనికిని చాటుకోవడానికే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అలాంటి అసాంఘిక శక్తులకు ఎవరూ సహకరించకూడదని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం తరపున పోలీసు శాఖ ఆదివాసి ప్రజలకు అందిస్తున్న అభివృద్ధిని చూసి లొంగిపోయిన మావోయిస్టులకు కల్పిస్తున్న పునరావాస సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని మావోయిస్టు పార్టీలో పనిచేసే సభ్యులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు రాళ్లపురం గ్రామం నుండి నిషేధిత మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న పొడియం లక్ష్మి కుటుంబాన్ని సందర్శించి ఆమె కుటుంబ సభ్యులకు దుస్తులను అందజేశారు ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన మినీ రైస్ మిల్లును ప్రారంభించి అట్టి మిషన్ పని చేసే విధానాన్ని ఎస్పీ పరిశీలించారు ఈ సమావేశంలో పాల్గొన్న గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం చర్ల మండల పరిధిలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు
ఈ కార్యక్రమంలో చర్ల సీఐ రాజు వర్మ ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎస్సై నర్సిరెడ్డి ఎస్సై కేశవ్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
స్థానిక యువతకు ఉపాధి కల్పించని పరిశ్రమలు అవరమా?..టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం 50వరకు పరిశ్రమలు ఉన్నాయి అందులో ముఖ్యమైనవి మహీంద్రా&మహీంద్రా,దిగ్వాల్ పిరామిల్,రాక్ వూల్,విఎస్టీ,గిరిధర్ ఎక్స్ ప్లోజెస్,హాట్ సన్, మరియు కొత్తగా వచ్చేవి నీమ్జ్,ఇండస్ట్రీరియాల్ పార్క్,చాలా ఉన్నాయి.ఒక ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయంటే అక్కడ ఉన్న భూముల ధరలు,ఆ ప్రాంతంలో ప్రజా జీవనానికి అవసరమయ్యే కనీస ఖర్చులు పెరిగిపోతాయి,నియోజకవర్గంలో యువతకు ఉపాధి,ఉద్యోగాలు అయితే రాలేదు కానీ అన్నిటి ధరలు పెరిగిపోయాయి.ఒక ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం చాలా రాయితీలు ఇస్తుంది అవి తక్కువ ధరలకు భూములు,నీరు,విద్యుత్,పెట్టుబడిపై రాయితీలు,ట్యాక్స్ మినహాయింపు,రోడ్డు రవాణా సౌకర్యం మొదలైనవి కల్పిస్తారు,అందుకు స్థానిక పరిశ్రమలలో నైపుణ్యం లేని యువతకు 70% నుండి 80% మరియు నైపుణ్యం ఉన్న యువతకు 50% నుండి 60% స్థానికులనే భర్తీ చేయాల్సి ఉంటుంది కానీ నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలలో ఎక్కడా కూడా స్థానికులకు ప్రాధాన్యత నిచ్చింది మాత్రం అంతంత మాత్రమే స్థానిక యువత ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు,దిగ్వాల్ రసాయన కర్మాగారం వల్ల ప్రజలకు ఉపాధి లేదు కానీ త్రాగడానికి నీరు దొరికే పరిస్థితి లేదు,చిలమామిడి శివారులో గల గిరిధర్ ఎక్స్ పోర్ట్ వల్ల చుట్టు ప్రక్కల ఇండ్లు కూలిపోయే పరిస్థితి, గోవిందపూర్ లో గల హాట్ సన్ పరిశ్రమలో డైరీకి సంబంధించి ఉత్పత్తి అవుతాయి కానీ దానికి కావాల్సిన పాలను ఎక్కడో బయటి నుండి తెప్పించుకుంటున్నారు ఉద్యోగాలు చూస్తే నైపుణ్యం గల వారు అంతా తమిళనాడు వారే నైపుణ్యం లేని వారిని యుపి,బీహార్,వారిని తీసుకున్నారు దీనిపై ఆరా తీసుకుందామంటే అక్కడ అధికారులు కనీసం మాట్లాడాటానికి కూడా సిద్ధంగా లేరు, నియోజకవర్గంలో సుమారు 2లక్షల 80 వేల మంది యువత ఉన్నారు వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది కానీ అది మర్చిపోయారు.వీటన్నిటిని బట్టి చూస్తే ఈ పరిశ్రమల వల్ల స్థానిక యువతకు ఉపాధి దొరకాలేదు కాని కాలుష్యం,కనీస వసతుల ధరలు పెరిగిపోయాయి మరియు ఇక్కడి సంపదను ఇతరులు కొల్లగొట్టుకుపోతున్నారు దీనిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు/ ప్రభుత్వంపై ఉన్నది కానీ ప్రభుత్వం అది మర్చిపోయింది.పరిశ్రమల యాజమాన్యాలు ఇప్పటికైనా స్పందించి స్థానిక యువతకు పెద్దపీట వేస్తూ ఉద్యోగాలు కల్పించాలి లేనిచో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం, స్థానిక యువత మొత్తం దీన్ని అర్థం చేసుకొని ప్రతిఘటించాల్సిన బాధ్యత యువతపై ఉన్నది త్వరలో ఉద్యమించి ఈ అన్యాయాన్ని అరికట్టాలని కోరారు,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్,శికారి గోపాల్,శ్రీనివాస్, లు ఉన్నారు.
పుష్కరాలకు వెళ్లే భక్తులకు అన్నదానం చేయడం అభినందనీయం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు వెళ్లే భక్తులకు దాతల సహకారంతో కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వరుసగా పన్నెండు రోజుల పాటు ఉచిత అన్నదానం చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం మధ్యాహ్నం కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన శిబిరం వద్ద ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాళేశ్వరం పుష్కరాలకు వచ్చి వెళ్లే భక్తులకు పన్నెండు రోజులు అన్నదానం చేయడం అభినందనీయమని, ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన దాతలకు, సేవా కార్యక్రమాలు చేసిన ప్రతీ ఒక్కరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ సోలీస్ ఐకేర్ వారికి ఇతర దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా, వచ్చే ఏడాది మేడారం మహా జాతర జరిగినన్ని రోజులు కూడా ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన( డిడియు-జి కే వై ) కార్యక్రమంలో భాగంగా గ్రామీణ నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉపాధి వైపు మళ్ళించే విధంగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణ రావు ఆదేశానుసారం కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వ ర్యంలో ఆసక్తిగల నిరుద్యోగ యువతీ యువకుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని 18-30 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువకులు కార్యక్రమాన్ని వినియోగించు కోవాలని సూచించారు. హైదరాబాద్ లో నాలుగు నెలలు వివిధ రంగాలలో ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించి, ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ జ్ఞానాన్ని పెంచి భవి ష్యత్తులో ఎంతో ఉపయోగక రంగా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణ రావు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకు లకు ఉపాధి కల్పించడం ప్రధానంగా తీసుకున్నారని, ఇలాంటి కార్యక్రమాలు, జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాబోవు రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుందన్నారు. శిక్షణలో భాగంగా మండల పరిధిలో సుమారు 50 మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకు న్నట్లు డిడియు- జీకే వైఅధికారులు సునీల్, శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు చల్లా చక్రపాణి,మారేపల్లి రవీందర్ చిందంరవి,దుబాసి కృష్ణమూర్తి భాస్కర్, మారేపల్లి రాజు, కట్టయ్య, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
క్యాతనపల్లి రైల్వే గేట్ సమీపంలో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ నిర్మించిన నేపథ్యంలో రవాణా మెరుగుపడిందని, ప్రజల రాకపోకలకు అనువుగా ఉన్న నేపథ్యంలో బస్సు సర్వీసు నడిపించేలా చొరవ తీసుకోవాలని మంచిర్యాల ఆర్టీసీ డిపో అడిషనల్ క్లర్క్ ఎం ఎం రావు, స్టేషన్ మేనేజర్ గోలీ శంకర్ లకు టిపిసిసి జనరల్ సెక్రటరీ పిన్నింటి రఘునాథరెడ్డి తో కలిసి బస్సు సౌకర్యం కల్పించండి అని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు వినతి పత్రం అందించారు. మంచిర్యాల నుండి రామకృష్ణాపూర్, ఆర్కే వన్ వరకు బస్సు లు నడిపించాలని కోరామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపు రాజం, పలిగిరి కనకరాజు, రాం సాయి, భాస్కర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం రైతులకు బోర్లు మోటార్లు సోలార్లు మంజూరు చేయాలి.
కొత్తగూడ, నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లోమంగళవారం రోజు ఆదివాసి సంక్షేమ పరిషత్ అత్యవసర సమావేశం కొతగూడ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగింది ఈ యొక్క సమావేశానికి ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దనుసరి రాజేష్ గారు పాల్గొని మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి పోడు వ్యవసాయం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న నిరుపేద ఆదివాసి రైతులకు వర్షం ఆధారంగానే వ్యవసాయం సాగిస్తున్నారు దీనితో వర్షాలు సకాలంలో రాకపోవడం వలన పంటలు ఎండిపోయి కొంతమంది నిరుపేద ఆదివాసి రైతులు అప్పుల పాలవుతున్నారని వారన్నారు. వర్షాధారంపై పోడు వ్యవసాయం చేస్తూ నిరుపేద ఆదివాసి రైతులను ప్రభుత్వమే ఆ యొక్క రైతులకు వ్యవసాయ బోర్లు కరెంట్ లైన్ లేదా బోర్లు మోటార్లతోపాటు సోలార్లు మంజూరు చేసి ఈ యొక్క నిరుపేద ఆదివాసి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. లక్షలాది రూపాయలు వెచ్చించి కరెంటు తెచ్చుకోలేని సన్న కారు చిన్న కారు ఆదివాసి రైతులకు సోలార్ విద్యుత్ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని వర్షాలు తక్కువ ఉన్నా కానీ బోరు మోటర్ సోలార్ ఉండటంతో దళారుల ఊబి నుండి బయటపడడమే కాకుండా వడ్డీలకు డబ్బులు తెచ్చుకోకుండా అప్పుల ఊబి నుండి వారిని వారు కాపాడుకోవడం కాకుండా వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి జీవనాధారంగా మారుతుందని వారు సూచించారు. అంతేకాకుండా పోడు వ్యవసాయంపై జీవనం సాగిస్తున్న కొంతమంది నిరుపేద ఆదివాసి రైతులకు ఇప్పటివరకు హక్కు పత్రాలు అందకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారని అంతేకాకుండా హక్కు పత్రాలు వచ్చినకాని కొన్ని గ్రామపంచాయతీలలో కార్యదర్శిలు ఇవ్వకపోవడం వలన చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు అలాంటి నిరుపేద ఆదివాసి రైతులకు తక్షణమే హక్కు పత్రాలు మంజూరు చేయాలని అంతేకాకుండా ముద్రించిన అడవి హక్కు పత్రాలు ఆఫీసు బీరువాల్లో ఉంచుకుంటున్నారే తప్ప ఆ యొక్క రైతులకు చేరవేయడం లేదు ఇదిలా ఉంటే కొంతమంది దళారులు ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతర రైతులకు కూడా అటవీ హక్కు పత్రాలను మంజూరు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి వాటిని పరిశీలించి రద్దు విధంగా చర్యలు తీసుకోవాలని ఇక నిరుపేద ఆదివాసి రైతులకు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేసి ఆదివాసి రైతులకు ఇవ్వడంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ లోపంతో పూర్తిగా విఫలమైనారని వారు ఆరోపించారు ఇలాంటి తప్పిదాలను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు గుర్తించి ఆ యొక్క అటవి హక్కు పత్రాలను ఆ రైతులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరినారు. ప్రభుత్వం మంజూరు చేసిన సోలార్ బోర్లులను 6 సంవత్సరాల వ్యవధి కాకుండా 1 సంవత్సరం లోపే సోలార్ బోర్డులను ఆదివాసి రైతులకు అందే విధంగా చూడాలని వారు అన్నారు అదేవిదంగా ఈ నెల 25న ఎన్నుకోబోయే నూతన మండల కమిటీకి మండలములోని ఆదివాసీ యువకులు హాజరుకగలరని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు మంకిడి సురేష్ ,జిల్లా కోశాధికారి పూనెం జనార్దన్ మండల నాయకులు చుంచ అనిల్, చింత శ్రీకాంత్, పులుసం హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు
పేదలందరికీ సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యం… – దేశంలోనే సన్న బియ్యం అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ – కాంగ్రెస్ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు మొగుళ్ళపల్లి
నేటి ధాత్రి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాష్టకంగా: చేపట్టిన ఉచిత సన్నబియ్యం పథకాన్ని మొగుళ్లపల్లి మండలపరిధిలోని పాత ఇ స్సీ పేట గ్రామంలో జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు డీలర్ బొచ్చు లక్ష్మి లబ్ధిదారులకు స్వయంగా బియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా తక్కల్లపల్లి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేదవాడీ ఇంటికి సన్నబియ్యం చేరాలన్న గొప్ప సంకల్పంతో చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఉగాది, రంజాన్ పండుగల శుభసందర్భంగా దారిద్రరేఖకు దిగువనున్న పేదవారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. పేదవారికి పట్టెడన్నం పెట్టాలన్న గొప్ప ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని 2కోట్ల 61లక్షల మందికి పేదలకు తలకు ఆరు కిలోల సన్నబియ్యం అందజేస్తున్నామని తెలిపారు. అందుకు 10600 కోట్లు కేటాయించింది అయినప్పటికీ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. .పేదలు దొడ్డు బియ్యం తినలేకపోవడం వలన పీడీఎస్ బియ్యాన్ని మిల్లర్లు, దళారులు రీ సైక్లింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి పేదవారి ఇంట ప్రతిరోజూ పండుగ జరగాలన్న ఆలోచనతో, పేద వారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించాం. దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచింది. ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది. రైతుల శ్రమ ఎక్కడికీ పోదు. ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల మేరకు రుణమాఫీ చేశాం. 7,625 కోట్ల మేరకు రైతు భరోసా చెల్లించాం. రైతు భరోసా 10 వేల నుంచి 12 వేలకు పెంచిన గొప్ప ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. సన్నవడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని రైతులను ప్రోత్సాహకాలు అందిస్తున్న గొప్ప ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
రాష్ట్రంలోని పేద ప్రజలకు సన్న బియ్యం అందుబాటులో ఉండాలి పేదలకు పౌష్టిగా ఆహారం అందాలని వచ్చే నాలుగు సంవత్సరాలు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇది ప్రజా ప్రభుత్వం పేద ప్రజల మేలు కోరే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలకు సన్నబియ్యం పంపిణీ ఈ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు,18వ వార్డు, 8వ వార్డులలో ఏర్పాటు చేసిన సన్న బియ్యం పంపిణీ పథకం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పేదలకు సన్నబియ్యం పంపిణీలు చేసిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉగాది కానుకగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభించారు శ్రీమంతుల తరహాలో సన్నబియ్యం పేదలకు కూడా అందాలని దేశంలో ఎక్కడా లేని విధంగాతెలంగాణ రాష్ట్రంలో సీఎం సన్న బియ్యం పంపిణి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసమే చేస్తుందని అందుకే వారి ఆకలి తీర్చేందుకు ఈ పథకాన్ని తేవడం జరిగింది.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.