ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమించాలి.

ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమించాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి
జమ్మికుంట:నేటిధాత్రి

 

 

 

 

స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమించాలని సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి పిలుపునిచ్చారు.

మంగళవారం రోజున జమ్మికుంట మండల కమిటీ సమావేశం కామ్రేడ్ జక్కుల రమేష్ యాదవ్ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ,పట్టణ కేంద్రంలో ప్రజలు అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.

సమస్యలను అధ్యయనం చేసి ఎక్కడికక్కడ నిర్దిష్ట కార్యాచరణతో ఆందోళన, పోరాటాలు నిర్వహించాలన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు నిరంతర పోరాటాలు చేయాలన్నారు.

భూ సమస్యలు పరిష్కరించాలన్నారునిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి ఉద్యోగాలు లేని యువతకు నిరుద్యోగ భృతి కేటాయించాలని డిమాండ్ చేశారు.

యాసంగి రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు పంపిణీ చేయాలన్నారు.

అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు.

ఇందిరమ్మ ఇళ్లలో రాజకీయ జోక్యం లేకుండా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు.

కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలకు రేషన్ కార్డు అనుసంధానం చేస్తున్నారు కాబట్టి రేషన్ కార్డు లేనటువంటి అర్హులకు వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రజా అనుకూల నిర్ణయాలను స్వాగతిస్తూనే ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు ఉదృతం చేస్తామన్నారు.

పంటల బీమా పథకాన్ని అమలు చేయాలన్నారు.

మహిళలకు నెలకు 2500 రూపాయలు వెంటనే ప్రకటించి అమలు చేయాలన్నారు.

హుజురాబాద్ నియోజకవర్గం లో పెండింగ్లో ఉన్న రెండవ దఫా దళిత బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు తయారు చేస్తుందన్నారు.

29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కూల్ గా గా చేసిందని, కార్మికుల శ్రమను పెట్టుబడుదారులు దోచుకునేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు.

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ సామాజిక, ఆర్థిక భద్రతకు విఘాతం కలిగిస్తుందన్నారు.

రైతు వ్యతిరేక చట్టాలు తెస్తూ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి వేసిందన్నారు.

ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించకుండా దళారుల దోపిడీకి ఊతమిస్తుందన్నారు.

దేశంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోయాయి అన్నారు.

జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం నిర్వహించాలని సిపిఎం శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జమ్మికుంట మండల కార్యదర్శి శీలం అశోక్, మండల కమిటీ సభ్యులు కన్నం సదానందం, వడ్లూరి కిషోర్, దండి గారి సతీష్, చల్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కార్మిక చట్టాల పరిరక్షణపై ఉద్యమించాలి.

కార్మిక చట్టాల పరిరక్షణపై ఉద్యమించాలి

సివిల్ సప్లై హామాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గుంపెల్లి మునీశ్వర్

కేసముద్రం నేటి ధాత్రి:

ఏఐటియూసి అనుబంధ సివిల్ సప్లై హామాలి వర్కర్స్ యూనియన్ మహబూబాబాద్ జిల్లా మహాసభ వడ్డెబోయిన లక్ష్మీనరసయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా స్టేట్ సివిల్ సప్లై హమాలీ రాష్ట్ర అధ్యక్షులు గుంపల్లి మునిశ్వర్, ఏఐటీయూసీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు బి. అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని అన్నారు. సంస్కరణల పేరుతో కార్మిక చట్టాలను కుదించి, కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు చెప్పిన ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్యల వారధిగా ఉంటూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యవసర వస్తువులను సరఫరా చేస్తున్న కార్మికులను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని వారు అన్నారు. పెరుగుతున్న నిత్యవసర ధరలకు అనుగుణంగా కూలి రేట్లు లేవనీ, హమాలీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు రేషపల్లి నవీన్, మంద భాస్కర్, చొప్పరి శేఖర్,కాసు సాయి చరణ్,పెరుగు కుమార్,వీరవెల్లి రవి, వంకాయలపాటి జకరయ్య,రాజబోయిన శ్రీను, భానోత్ రాజు, ఎల్లుట్ల నారాయణ, అల్లరి నారాయణ, కొనుకటి మల్లారెడ్డి వెలిశాల ప్రభాకర్, సరిత తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శ నేతపుచ్చలపల్లి సుందరయ్య స్పూర్తితో ఉద్యమించాలి.

ఆదర్శ నేత పుచ్చలపల్లి సుందరయ్య స్పూర్తితో ఉద్యమించాలి

 

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు

 

ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు..

 

నర్సంపేట, నేటిధాత్రి:

 

 

 

ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన పుచ్చలపల్లి సుందరయ్య స్పూర్తితో ఉద్యమించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు పిలుపునిచ్చారు.

పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి వేడుకలు నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం దగ్గర సుందరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈసందర్బంగా సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెళ్లి బాబు మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు.

కులవ్యవస్థను నిరసించిన సుందరయ్య అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డిలోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నాడని కొనియాడారు.

సహచరులు పుచ్చలపల్లి సుందరయ్యను “కామ్రేడ్ పి.ఎస్.” అని పిలిచేవారని అన్నారు.

సుందరయ్య మార్క్సిస్ట్ పార్టీ నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపాడు.

స్వాతంత్ర్య సమరంలోని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు.

సుందరయ్య భార్య కూడా సీపీఐ-ఎంలోని ముఖ్య నాయకురాలు.

తెలంగాణ ప్రజల పోరాటం – దాని పాఠాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం వంటి పుస్తకాలు, నివేదికలు రాశాడు గొప్ప కమ్యూనిస్టు నాయకుడు అని పేర్కొన్నారు.

పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘ కాలం పనిచేసిన సుందరయ్య ఆ సమయంలో పార్లమెంటుకు కూడా సైకిల్ మీద వెళ్లి ఆదర్శ కమ్యూనిస్ట్ పార్టీ నేతగా మన్నన్నలు పొందాడన్నారు.

నిజాం పాలన కాలంలో సాగిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ఒక ముఖ్యమైన ఘట్టం.

ఆ పోరాటానికి నాయకత్వం వహించిన వాళ్లులో ముఖ్యులు సుందరయ్య అని ఆ పోరాటం చివరి దశలో 1948 నుండి 1952 వరకు సుందరయ్య అజ్ఞాతంలో గడిపాడని అన్నారు.

భూస్వామి విధానాలకు వ్యతిరేకంగా జాగిరిదారులకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన కమ్యూనిస్టు ఉద్యమనేత అని చెప్పారు. ఆ పోరాటంలో 10 లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేశారని ఈ సందర్భంగా గుర్తుకు చేశారు.

పేదల ఆకలి తీర్చేందుకు అంబలి కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు.

పేదల నిత్యవసర అవసరాలు తీర్చేందుకు పట్టణం నుండి తన సైకిల్ పై నిత్యవసర వస్తువులు తెచ్చి గ్రామంలో పేదలకు పంపిణీ చేసేవారని, పేదల కోసం ఆసుపత్రి ఏర్పాటు, యువకుల కోసం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారని వివరించారు.

1930 లోనే సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి కుల వివక్షత వ్యతిరేకంగా పోరాడారన్నారు, ప్రజల భాగస్వామ్యంతో బందరు కాల్వ పూడిక తీసి రైతులకు మేలు చేశారన్నారు.

ఆనాడే కూలి సంఘం,కర్షక సంఘం, కార్మిక సంఘాలను స్థాపించారని గుర్తు చేశారు.

చివరి శ్వాస వరకు అను నిత్యం పేదప్రజల కోసం పోరాడిన సుందరయ్య పోరాట స్ఫూర్తిని పునికిపుచ్చుకొని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు అయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి,పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, పట్టణ కమిటీ సభ్యులు గడ్డమీది బాలకృష్ణ, కంది కొండ రాజు బేంబెలి మలహల్ రావు, కలకోట అనిల్, ఎండీ ఫరిదా, బిట్ర స్వప్న, ఉదయగిరి నాగమణి,రుద్రరపు లక్ష్మి నాయకులు జగన్నాధం కార్తీక్, గణిపాక ఇంద్ర,యాక లక్ష్మి, ఎల్లయ్య, సంతోష్, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

బోధించు – సమీకరించు- పోరాడు .!

బోధించు – సమీకరించు- పోరాడు అనే నినాదంతో* ముందుకు వెళ్ళాలి.

ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అంబేద్కర్ ఆశయాలు సిద్దాంతాలు భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని 2023-24&25 -లలో వేసిన కమిటీ లు మినహా మిగిలిన గ్రామ కమిటీలను వేయాలని అందుకబోదించు -సమీకరించు – పోరాడు* అనే నినాదంతో గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రజలకు మహానీయుల గురించి తెలియజెప్పాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* అన్నారశని వారం రోజున చిట్యాల మండల కేంద్రంలో మల్లయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కమిటీ లను 2023–24-& 25 సంవత్సరా, లలో వేసిన కమిటీలు మిసహ మిగిలిన కమిటీ లు ఏర్పాటు చేయాలని అన్నారు. అంబేద్కర్ గారి తో పాటు మహనీయుల ఆశయాలను సిద్ధాంతాలను భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని గ్రామాల్లో ప్రజలకు చెప్పాలన్నారు . రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో దళితుల పట్ల కుల వివక్షత ఇంకా గ్రామాల్లో కొనసాగుతుందన్నారు. దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలకు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను భారత రాజ్యాంగం గురించి తెలియజెప్పి వారిని చైతన్య వంతులను చేయాలన్నారు. బోధించు సమీకరించు పోరాడు అనే నినాదంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మే నెల 31* వరకు అన్ని గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘాలను పూర్తి చెయ్యాలని మండల కమిటీలు భాద్యతలు తీసుకుని గ్రామ కమిటీలు పూర్తి చెయ్యాలన్నారు.

ఎన్నికల హామీల అమలుకోసం ఉద్యమిద్దాం.

ఎన్నికల హామీల అమలుకోసం ఉద్యమిద్దాం

సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

జమ్మికుంట మండల సిపిఐ నూతన కమిటీ ఎన్నిక
జమ్మికుంట :నేటిధాత్రి

 

 

అంతరాలు లేని సమ సమాజ స్థాపన కోసం పేదల పక్షాన సిపిఐ నిరంతరం పోరాడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల సిపిఐ పదవ మహాసభ జరిగింది. ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి హాజరై మాట్లాడారు.ఈ సభలోలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పంజాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలపై ఉద్యమ పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్టులకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుటకు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు సిపిఐ నిరంతరం కృషి చేస్తుందన్నారు. గ్రామాల్లో సిపిఐ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. .సిపిఐ పార్టీ ఆవిర్బవించి వంద సంవత్సరాలు అవుతుందని, మార్కిసిజం లేనినిజం సిద్ధాంతాలతో సమ సమాజ స్థాపనే లక్ష్యంగా దోపిడీ లేని సమాజం కోసం అంతరాలు లేని వ్యవస్థ కోసం దేశంలోనే మొట్టమొదటి రాజకీయ పార్టీ సిపిఐ అన్నారు. నాటి నుండి నేటి వరకు కార్మిక, కర్షకుల సమస్యలతో పాటు దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతూ హక్కుల సాధన కోసం, సమస్యల పరిష్కారం పోరాడుతున్న ఏకైక పార్టీ అని అన్నారు. దేశాన్ని పాలిస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి కేవలం కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు సంపన్న వర్గాలకు అనూకూల నిర్ణయాలు చేస్తూ దేశ సంపదను కోళ్లగొడుతూ కాలయాపన చేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కేంద్రంలో,రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న వారిని హామీలను అమలు పరుచాలని సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని కలిగించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను వే వేగవంతంగా అమలు చేసి పేదలను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఆలస్యం అవుతుందని,ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, పెన్ష్షన్స్ పెంపు, రైతుల ఋణమాఫీ తదితర హామీలను వెంటనే నేర వేర్చాలని, లేకుంటే ప్రజా ఉద్యమాలు తప్పవని హేచ్చరించారు. అనంతరం జమ్మికుంట మండల సిపిఐ నూతన కమిటీ ని ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా గజ్జి అయిలయ్య, సహాయ కార్యదర్శిగా గరిగే రాములు, శీలం రాజేందర్, 11 మంది సభ్యులతో కార్యవర్గం ఎన్నుకున్నారు. ఈ సభలో ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ కళ్యాణ్, మహిళా సమాఖ్య నాయకురాలు, శారద, ఐల రాజేందర్, శ్రీరాములు, సీపీఐ కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version