దళితుల నివాస షెడ్డును కూల్చడం దుర్మార్గం…

దళితుల నివాస షెడ్డును కూల్చడం దుర్మార్గం.

పలమనేరు(నేటి ధాత్రి)
సెప్టెంబర్ 23:

 

 

గంగవరం మండలం కల్లుపల్లి పంచాయితీ బూడిద పల్లి గ్రామంలో ఓ దళిత కుటుంబం నివాసముంటున్న షెడ్డు ను కూల్చడం దుర్మార్గమైన చర్య అని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు డి.వి. మునిరత్నం, యువజన నాయకులు సోమరాజు, మహిళా నాయకులు రత్నమ్మ, సరస్వతి, జగదీశ్వరి అన్నారు. అందులో భాగంగా మంగళవారం పలమనేరు పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు కార్యదర్శి మణి అధ్యక్షతన జరిగిన సంఘటనపై అత్యవసర సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బూడిద పల్లి గ్రామం వద్ద అగ్రకుల, పెత్తందారులు సుమారు 16 ఎకరాల వరకు ప్రభుత్వ భూమితో పాటు దళితులకు కేటాయించిన స్మశాన భూమిని సైతం ఆక్రమించుకున్న వారిపై ఏమాత్రం చర్యలు తీసుకోకుండా దళిత కుటుంబంపై ఎందుకు అధికారులు దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డారని నిలదీశారు. అదే స్థలాన్ని అగ్రకులాలు వారు ఆక్రమించుకొని ఉంటే దళితులకు కావాల్సినప్పుడు అధికారులు వారి వద్ద నుండి తీసిచ్చే సామర్థ్యం ఉందా అని మండిపడ్డారు. దళితుల షెడ్డు కూల్చివేత వ్యవహారం స్థానిక ఎమ్మెల్యేకు సన్నిహితముగా ఉన్న అధికారి కనుసన్నుల్లోనే జరిగిందని ప్రజాభిప్రాయం మేరకు అనుమానం వ్యక్తం చేశారు. ఆ అధికారి పైన ప్రజలు గతంలో ఎన్నో ఆరోపణలు చేసి ఎమ్మెల్యేకు చెడ్డ పేరు తెచ్చారని అప్పటిలో
ప్రజలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారని గుర్తు చేశారు.ఒక సెంటు నేల కోసం దళిత కుటుంబాన్ని అవమానం చేసి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించిన మండల తహసీల్దార్, పోలీస్ అధికారులపై ఎస్సీ ,ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సేవకులుగా సేవ చేయాలనే సంకల్పముతో వచ్చే అధికారులు వ్యవహారం చూస్తుంటే అక్రమార్కులను వదిలి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లుగా ఉందని అభివర్ణించారుబాధిత కుటుంబానికి ప్రత్యామ్నాయంగ స్థలం కేటాయించి, రక్షణ కల్పించాలని, ఇన్ని సంవత్సరాలుగా ఆ స్థలం కోసం దళిత కుటుంబాన్ని క్షభకు గురిచేసి, మహిళ ఆత్మహత్యాయత్నానికి కారుకులైన అగ్రకుల పెత్తందారులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారుఈ కార్యక్రమంలో శివ, నారాయణ శెట్టి, సుమతి, వాణి, నాగవేణి, చిన్నా, శాంతమ్మ, సూర శ్రీనివాసులు, ఇతరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version