మొక్కలే మానవ మనుగడకు మూలం

మొక్కలే మానవ మనుగడకు మూలం= జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్..

*ప్రాణ యోగ ఆశ్రమంలో వృక్షారోపణ 2025 కార్యక్రమం ప్రారంభం..

రామచంద్రపురం(నేటి ధాత్రి)

మానవ మనుగడకు మొక్కలే మూలాధారమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం రామచంద్రపురం మండలం, కుప్పం బాదురు సమీపంలోని ప్రాణ యోగ ఆశ్రమంలో వృక్షారోపణ –2025 కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు.ప్రాణ యోగ ఆశ్రమ నిర్వాహకులు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులలో మొక్కల పెంపకానికి ముందుకొచ్చిన ప్రాణ యోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాస్ గురూజీకి అభినందనలు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంపొందించడం కోసం కృషి చేస్తే పర్యావరణ పరిరక్షణ,, సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చున్నారు. అనంతరం ప్రాణ యోగ ఆశ్రమం ఆధ్వర్యంలో రావి, మర్రి చెట్ల నాటారు. ఆశ్రమం పక్కన ఉన్న ప్రజల ఫారెస్ట్ భూమిలో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం 300మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడం హర్షనీయమన్నారు.ప్రాణ యోగ ఆశ్రమ కైలాష్ గురూజీ మాట్లాడుతూ “వృక్షాన్ని నాటడం అనేది భవిష్యత్తును నాటడమే. ఆధ్యాత్మికత చైతన్యంతో నాటినప్పుడు అది ఆధ్యాత్మిక కార్యంగా మారుతుంది, దీనివలన భూమికే కాదు, జీవాత్మకూ మహోన్నతమైన ఉపయోగం కాగలదు,

 

 

 

 

 

అని పేర్కొన్నారు. వృక్షారోపణ 2025 అనేటువంటి కార్యక్రమం ప్రకృతి పరిరక్షణతో పాటు, ఆధ్యాత్మికతను సమాజంలో బలపరిచే శుభారంభమన్నారు.ఆశ్రమ నిర్వాహకులు తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వేలాది మందికి యోగ, ధ్యానం, ఆధ్యాత్మిక దైవచింతలపై చక్కటి అవగాహన కల్పించడం సంతోషమన్నారు.
అనంతరం ప్రాణ యోగ ఆశ్రమంలో పరిశుభ్రత పచ్చదనాన్ని భక్తుల వసతి భవనాలు, గోశాలలను పరిశీలించారు. ప్రాణ యోగ ఆశ్రమ నిర్వాహకులు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ను దుస్యాలువాతో సన్మానించి, జ్ఞాపకం అందజేశారు. ఈ వృక్షారోపణ కార్యక్రమంలో తిరుపతి ఐఐటి డైరెక్టర్ కే ఎన్ సత్యనారాయణ,ఐఆర్ఎస్ అధికారిణి పాయల్ గుప్తా, భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణరాజు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పి. రాజేంద్ర ప్రసాద్, రాయుడు. ఎంపీడీవో ఇందిరమ్మ, ఏపీవో సుజాత, వ్యవసాయ శాఖ అధికారిణి మమత, వీఆర్వో రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు..

పర్యావరణ పరిరక్షణతోనే మానవమనుగడ సాధ్యం

పర్యావరణ పరిరక్షణతోనే మానవమనుగడ సాధ్యం –

ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు..

*ప్లాస్టిక్ భూతం నుండి పంచ భూతాలను కాపాడుకుందాం..

*చైర్మన్ సుగుణమ్మ..

*మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం –

కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి(నేటి ధాత్రి) జూన్ 05: 

 

పర్యావరణ పరిరక్షణ తోనే భవిష్యత్తులో మానవ మనుగడ సాధ్యమవుతుందని, ఇందుకోసం మొక్కలు పెంచాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సీతమ్మ రోడ్డు నందు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, కమిషనర్ ఎన్.మౌర్య, అర్బన్ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ విజయకుమార్, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సదా శివం, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి.మునికృష్ణ, కార్పొరేటర్ దూదికుమారిలు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రం అయిన తిరుపతిలో పర్యావరణ పరిరక్షణ కొరకు అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. 5090 మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టామని అన్నారు. నాటిన మొక్కలను యువకులు, మహిళలు దగ్గరుండి కాపాడుకోవాలనీ అన్నారు. బీట్ ప్లాస్టిక్ పొల్యూష‌న్ థీమ్ తో ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సవాణ్ని నిర్వ‌హించుకుంటున్నామ‌ని, ఒక‌సారి వాడి ప‌డేసే ఫ్లాస్టిక్ కు ప్ర‌జ‌లు దూరంగా ఉండాల‌ని ఆయ‌న కోరారు. ప్లాస్టిక్ పొల్యూష‌న్ త‌గ్గింపులో భాగంగా ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు ఒక‌సారి వాడి ప‌డేసే ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించార‌ని ఆయ‌న తెలిపారు. ప్లాస్టిక్ విన‌యోగంతో ప్ర‌జ‌ల ఆరోగ్యంతో పాటు జంతువుల ఆరోగ్యం దెబ్బ‌తింటోంద‌ని ఆయ‌న చెప్పారు. కాబ‌ట్టి ప్ర‌జ‌లు ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాల‌ని ఆయ‌న కోరారు.రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు హరితాంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నారని మనందరం వారికి సహకరించాలని పిలుపునిచ్చారు. గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తోందని అన్నారు. ప్లాస్టిక్ రహిత నగరాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.ఈ సంవత్సరం థీమ్ ను అందరూ ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని అన్నారు. పంచ భూతాలను కలుషితం చేస్తున్న ప్లాస్టిక్ నివారణకు అందరూ కంకనబద్ధులు కావాలని పిలుపునిచ్చారు.
నగరపాలక సంస్థ కమిషనర్, తుడా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకై నగరపాలక సంస్థ పరిధిలో 5090 మొక్కలు, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో 15 వేలు మొక్కలు నాటుతున్నామని అన్నారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని ప్లాస్టిక్ ఫ్రీ సిటీ గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మొక్కలు నాటిన తరువాత వాటిని సంరక్షించాలని అన్నారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా వినియోగించే వాటి పట్ల కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. అందరి సహకారంతో ప్లాస్టిక్ ను పూర్తి స్థాయిలో నిషేదించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు, ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి,డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, ఏసిపి బాలాజి, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ

పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ

ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి :

 

పర్యావరణంతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని, పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్.దిలీప్ కుమార్ నాయక్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలుష్య కారకాలైన పరిశ్రమల వ్యర్థాలు, ట్రాన్స్పోర్టేషన్ అడవుల నరికివేతపై ద్రుష్టి సారించాలి ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి సాలిడ్ వేస్ట్ మానేజ్మెంట్ సరిగా చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.శ్రావణ్ రావు స్పెషల్ పి.పి విష్ణువర్ధన్ రావు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందారపు శివకుమార్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ కంప అక్షయ జి. ప్రియాంక న్యాయవాదులు మంగళపల్లి రాజ్ కుమార్ సంగేమ్ రవీందర్ రజినీకాంత్ భూపాలపల్లి ఎస్సై రమేష్ కోర్టు సిబ్బంది, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మానవాళి మనుగడకు మూలం సైన్స్

మానవాళి మనుగడకు మూలం సైన్స్

నర్సంపేట,నేటిధాత్రి:

మానవాళి మనుగడకు మూలం సైన్స్ అని శ్రీ గురుకుల ఫౌండర్ మోతె సమ్మిరెడ్డి అన్నారు.నర్సంపేట మహేశ్వరం గ్రామంలో జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం జరిగింది.ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా మహేశ్వరం శ్రీ గురుకుల ఫౌండర్ మోతె సమ్మిరెడ్డి పాల్గొన్నారు.మానవ జీవన మనుగడకు సైన్స్ తప్పనిసరి అవసరమని ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది నడిపిస్తున్నది సైన్స్ అని తెలిపారు. విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,డిక్షనరీలు బహుమతిగా అందజేసి,విద్యార్థులు అనేక ఆవిష్కరణలు జరపాలని, బాగా కష్టపడి చదవాలని తెలిపారు.ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత ప్రధానోపాధ్యాయులు స్వరూప, అర్జున్ సాగర్, వేణుబాబు,శ్రీలత, రాజేశ్వరి,రమేష్,రేఖ,శ్రీలత, కరుణాకర్,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version