కలెక్టర్ కార్యాలయ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలి..

కలెక్టర్ కార్యాలయ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలి

వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

కలెక్టరేట్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంసిపిఐ(యు) జిల్లా బృందం

వరంగల్ జిల్లా ప్రతినిధి/ నర్సంపేట,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా ప్రజల సౌకర్యార్థం నత్తనడకన సాగుతున్న జిల్లా కలెక్టరేట్ సముదాయపనులను వేగవంతం చేసి త్వరితగతిన ప్రారంభించాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.
ఎంసీపీఐయు వరంగల్ జిల్లా ప్రతినిధి బృందం అజాoజాహి మిల్ గ్రౌండ్లో నిర్మిస్తున్న వరంగల్ జిల్లా కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులను గురువారం సందర్శించారు ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ జిల్లాల విభజన జరిగి సంవత్సరాలు గడుస్తున్న వరంగల్ జిల్లా ప్రజలకు జిల్లా కార్యాలయాలు సొంత జిల్లాలో లేకపోవడం ఎంతో అసౌకర్యాన్ని గురిచేస్తున్నదని అన్నారు. పరిపాలన సౌకర్యార్థం అధికార యంత్రాంగాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జిల్లాలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన జిల్లా ప్రజలకు మాత్రం ఒరిగింది శూన్యమని ఎద్దేవా చేశారు.నేటికీ హన్మకొండ జిల్లాలోనే కలెక్టర్ కార్యాలయం ఇతర ఆఫీసులు ఉండడం అన్యాయం అన్నారు.గత ప్రభుత్వం,ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించడం జరగటంలేదని ఆరోపించారు.నిర్మాణ పనులను ప్రారంభించి మూడు సంవత్సరాలు కావస్తున్న పనులు నత్తనడకన నడుస్తున్నాయని పనుల్లో నాణ్యత లోపం కనబడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల ప్రయోజనాలను అవసరాలను గుర్తించకుండా స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను బలి పశువులను చేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రానికి వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా చేస్తామని చెప్పిన పాలకులు అది విస్మరించి కనీసం జిల్లా కలెక్టర్ కార్యాలయం సైతం సకాలంలో పూర్తి చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా జిల్లాలో ఉన్న మంత్రి, ఎమ్మెల్యేలు తక్షణమే పట్టించుకోని జిల్లా కేంద్ర కార్యాలయాలను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్రా ప్రతాప్, నగర కార్యదర్శి మాలోత్ సాగర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సుంచు జగదీశ్వర్, ముక్కెర రామస్వామి,జిల్లా నాయకులు మహమ్మద్ ఇస్మాయిల్, మల్లికార్జున్, ఐతమ్ నాగేష్, గణిపాక ఓదేలు, తాటికాయల రత్నం,నగర నాయకులు మహమ్మద్ మెహబూబ్ పాష తదితరులు పాల్గొన్నారు.

సబ్ సెంటర్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి..

సబ్ సెంటర్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సబ్ సెంటర్ల నిర్మాణ పురోగతి పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-30T154633.723-1.wav?_=1

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సబ్ సెంటర్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సిరిసిల్ల జిల్లాలో మంజూరైన 16 పి.హెచ్.సి సబ్ సెంటర్ల నిర్మాణ పనుల పురోగతి పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సిరిసిల్ల జిల్లాలో మంజూరైన 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాలలో 3 పి.హెచ్.సి లు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చామని,మరో పి.హెచ్.సి ప్రారంభానికి సిద్ధంగా ఉందని, గంభీర్ రావు పేట రూఫ్ దశలో ఉందని అధికారులు వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ,సిరిసిల్ల జిల్లాకు మంజూరైన 16 సబ్ సెంటర్ల మంజూరు కాగా 5 సబ్ సెంటర్ల నిర్మాణానికి స్థల సమస్యలు ఉన్నాయని తెలుసుకున్న కలెక్టర్ సంబంధిత మండల తహసిల్దార్ లతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి భూ సమస్యలను పరిష్కరించారు. పి.సెచ్.సి సబ్ సెంటర్ నిర్మాణ పనులు అదేవిధంగా గంభీరావుపేట్ పిహెచ్సి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ పంచాయతి రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పి.హెచ్.సి, సబ్ సెంటర్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు అందుబాటులో పెట్టిందని, పనులు ఆలస్యం కాకుండా ప్రత్యేక చోరువతో పని చేయాలని అన్నారు. అగ్రహారం, తిప్పపూర్ బస్టాండ్ ప్రాంతంలో కొత్త సబ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించాలని అన్నారు.
ఈ సమావేశంలో ఈ ఈ పి ఆర్ సుదర్శన్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆగిన వంతెన పనులు పూర్తయ్యేనా?

ఆగిన వంతెన పనులు పూర్తయ్యేనా?

◆:- ఎనిమిదేళ్లుగా అసంపూర్తిగానే మిగిలిన వంతెన

◆:- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T122654.349.wav?_=2

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం తెలంగాణ రా ష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచిన, ప్రభుత్వాలు మా 8న కొన్ని పనులు ప్రారంభ దశలోనే ఉండిపోయాయి: మండల పరిధిలోని ఝరాసంగం, చిలపల్లి రహదారిపై నూతన వంతెన గత ఎనిమిది ఏళ్ల క్రితం మంజూరు అప్పట్లో ఆ వంతెన పూర్తయితే పొట్టిపల్లి, బర్దిపూర్, చిల్లపల్లి తాండ, ఎల్గోయి గ్రామాలకు వెళ్లే వాహనదారులు, ప్రజల ఇబ్బందులు తప్పుతాయని అందరూ భావించారు. కానీ అప్పట్లో వంతెన ని ర్మా ణం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు ప్రా రంభించి చేతులు దులుపుకొని వెళ్లి పోవడంతో ఆ వంతెన నిర్మాణ దశలోనే నిలిచిపోయింది.

2017 ఆగస్టు 11న ప్రధానమంత్రి సడక్ యోజన ని ధుల క్రింద సుమారు 55 లక్షలు నిధులతో మంజూరైన ఈవంతెన నిర్మాణ దశలోనే నిలిచిపోవడంతో ఆ యా గ్రామాల ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం బర్దిపూర్,పొట్టిపల్లి చిలపల్లి చిలపల్లి తం డా, ఎల్గోయి గ్రామాల ప్రజలతో పాటు కేతకి సంగమేశ్వ ర స్వామి ఆలయానికి వచ్చే మహారాష్ట్ర, కర్ణాటక భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు.ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మా ణానికి అదనపు నిధులను మంజూరు చే యించి అసంపూర్తిగా ఉన్న వంతెనను పూర్తి చేయగలరని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

◆:- వంతెనకు పూర్తి కావాలంటే రూ.70 లక్షల

◆:- నిధులు కావాలి…. (పిఆర్ఎ శశిధర్ రెడ్డి)

అసంపూర్తిగా ఉన్న వంతెన కు పూర్తి చేయాలంటే రూ. 70 లక్షల నిధులు అవసర మవుతాయని వాటిని మం జూరు నిమి త్తం ప్రతిపాద నలు తయారు చేసి పంపిం చడం జరిగింది.

◆:- ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం…. (ఎండి.ఆరిఫ్, చిలపల్లి గ్రామస్థుడు)

రహదారిపై వంతెనలేకపో వడంతో వర్షాకాలంలో తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని అకస్మాత్తుగా గ్రామంలో ఎవరికై నా అనారోగ్యం పాలైతే ఆసు పత్రికి వెళ్లాలంటే కష్టంగా మారిందని త్వరలో వం తెన పూర్తి చేసి ఇబ్బందులు దూరం చేయాలి.

డబుల్ బెడ్రూమ్ ఇళ్లకోసం కృషి చేస్తాం.

డబుల్ బెడ్రూమ్ ఇళ్లకోసం కృషి చేస్తాం’

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్లో వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ ఇంఛార్జి షేక్ మహేబూబ్ హాజరయ్యారు. జర్నలిస్ట్ల పిల్లలకు స్కూల్ ఫీజులో 50% రాయితీ అమలు కాకపోతే డీఈవో చర్యలు తీసుకోవాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకోసం కృషి చేస్తామని తెలిపారు. కొందరు జహీరాబాద్ జర్నలిస్ట్లు యూనియన్లో చేరగా వారిని మహేబూబ్ స్వాగతించారు.

250 రోజుల షూటింగ్‌ మూడేళ్ల కష్టం..

250 రోజుల షూటింగ్‌ మూడేళ్ల కష్టం

రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న భారీ చిత్రం ‘కాంతార చాప్టర్‌-1’. ‘రాజకుమార’, ‘కేజీఎఫ్‌’, ‘సలార్‌’, ‘కాంతార’ వంటి విజయవంతమైన…

రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న భారీ చిత్రం ‘కాంతార చాప్టర్‌-1’. ‘రాజకుమార’, ‘కేజీఎఫ్‌’, ‘సలార్‌’, ‘కాంతార’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన హోంబలే ఫిల్మ్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ‘కాంతార చాప్టర్‌-1’ మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. దాదాపు 250 రోజుల షూటింగ్‌, మూడు సంవత్సరాల కష్టాన్నంతా ఈ వీడియోలో చూపించారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ వినేష్‌ ఆధ్యాత్మిక దృశ్యాలను అద్భుతంగా డిజైన్‌ చేశారు. కాగా, ఈ సినిమా అక్టోబరు 2న కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్‌ భాషల్లో రిలీజ్‌ కానుంది.

ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే జిఎస్ఆర్.

ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే జిఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-25.wav?_=3

భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని ఆలయాలను సీజీఎఫ్ నిధులతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి రూరల్ మండలం ఆజంనగర్, గొల్లబుద్దారం గ్రామాలల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఆజంనగర్ గ్రామంలో రూ.10 లక్షలతో శ్రీ శివ కేశవస్వామి దేవాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గొల్లబుద్దారం రూ.50 లక్షలతో శ్రీ రామాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో అన్ని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు భూపాలపల్లి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులను చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం రామాలయంలో ఎమ్మెల్యే మొక్కను నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రూరల్ మండలం అధ్యక్షుడు సుంకర రామచంద్రయ్య తాసిల్దార్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పిలుపు

హుజురాబాద్, జమ్మికుంట, సైదాపూర్ మండల కమిటీల నియామకం

Everyone should work towards a corruption-free society.

“నేటిధాత్రి”,హుజురాబాద్ (కరీంనగర్ జిల్లా): దేశంలో ప్రతి పౌరుడు తమ హక్కులను బాధ్యతలు తెలుసుకొని అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఇమ్మడి ప్రణయ్ అధ్యక్షతన హుజురాబాద్ పట్టణంలో హుజురాబాద్, జమ్మికుంట, సైదాపూర్ మండల కమిటీల నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది సుంకనపల్లి రాము, రాష్ట్ర కమిటీ సభ్యులు గుర్రాల సదన్న, రావుల రాజేశం, పాక శ్రీనివాస్ యాదవ్, పరకాల సమ్మయ్య గౌడ్, జిల్లా ఉపాధ్యక్షురాలు పులుగు లతారెడ్డి తదితరులు హాజరైన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య మాట్లాడుతూ రోజురోజుకు అవినీతి రాజ్యమేలుతుందని, దేశ సంపద, ప్రజాధనం అవినీతి అక్రమార్కుల చేతిలో దుర్వినియోగం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బలమైన ప్రజా పోరాటాల ద్వారానే దేశాన్ని అవినీతిపరుల నుండి కాపాడుకోగలమని ఆయన అన్నారు. అవినీతి అక్రమార్కులను సమాజంలో దోషులుగా చూపించే కార్యచరణను జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రూపొందించిందని ఆయన పేర్కొన్నారు. అవినీతి రహిత సమాజం కోసం తమ సంస్థ చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్ర కమిటీ సభ్యులు రావుల రాజేశం, పాక శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘనపై స్పందించడమే కాకుండా మంచిని పెంచడం మానవత్వాన్ని పంచడం వంటి కార్యక్రమాలతో పాటు భారత రాజ్యాంగ చట్టాలను అనుసరించి పెన్ను పేపర్ ను ఉపయోగించి దేశంలో మార్పు, చైతన్యం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఈ ప్రయత్నంలో 14 రాష్ట్ర కమిటీలు మన రాష్ట్రంలో 33 జిల్లా కమిటీల నిర్మాణం పూర్తి చేశామని వారు తెలిపారు. అనంతరం జిల్లాలోని పలు మండల కమిటీల ప్రతినిధులకు నియమక పత్రాలు అందించారు.
హుజురాబాద్ మండల కమిటీ
అధ్యక్షురాలుగా: తాళ్లపెళ్లి దేవేంద్ర
ప్రధాన కార్యదర్శిగా: సబ్బని మాధవి
ఉపాధ్యక్షులుగా: జంపాల సువర్ణ, ఆకునూరి గణేష్
అధికార ప్రతినిధిగా: కొడిమ్యాల పవన్ కుమార్
హుజురాబాద్ పట్టణ అధ్యక్షురాలుగా: మల్లెల సరిత

జమ్మికుంట మండల కమిటీ
అధ్యక్షురాలుగా: ఇటికాల స్వరూప
ప్రధాన కార్యదర్శిగా: ఆరె వసంత

జమ్మికుంట పట్టణ కమిటీ
అధ్యక్షురాలుగా: మధిరే హేమలత
ప్రధాన కార్యదర్శిగా: గూడెపు లలిత
ఉపాధ్యక్షురాలుగా: మౌనిక

సైదాపూర్ మండల కమిటీ
అధ్యక్షురాలుగా: మూల భూలక్ష్మి
ఉపాధ్యక్షులుగా: తలారి రాము
ప్రధాన కార్యదర్శిగా: జంగ కవిత
తదితరులకు నియామక పత్రాలు అందించి సంస్థ విధివిధానాలకు అనుగుణంగా కృషి చేయాలని పేద ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన.!

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

నిజాంపేట, నేటి ధాత్రి

వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ నీళ్లు నిలువ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని రాంపూర్, నగరం గ్రామాలలో కలెక్టర్ పర్యటించి ఫ్రైడే ఫ్రైడే పరిసరాల పరిశుభ్రత, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి పిచ్చి మొక్కలు తొలగించాలన్నారు మురుగు కాలువలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు దోమలను పారద్రోలేందుకు పాగింగ్ చేపట్టాలన్నారు. సిజనల్ వ్యాధులు చికెన్ గున్య ,మలేరియా , డెంగ్యూ, విష జ్వరాలు రాకుండా సిబ్బందులు అందుబాటులో ఉండాలని అధికారులు పర్యవేక్షణ చేపట్టాలన్నారు.

లోటత్తు ప్రాంతాల్లో నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటూ అపరిశుభ్రత ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలన్నారు పంచాయతీ సెక్రెటరీ, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ,అంగన్వాడీలు క్షేత్రస్థాయిలో గ్రామాలను సందర్శించి ప్రజల ఆరోగ్యం పరిరక్షణపై తగిన సూచనలు, సలహాలు అందించాలన్నారు అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. నగరం గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు మొత్తం లబ్ధిదారులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజిరెడ్డి, ఎంపీ ఓ ప్రవీణ్, హౌసింగ్ ఏఈ సంధ్య, ఆర్ ఐ ప్రీతి ,హిమద్ ,పంచాయతీ సెక్రటరీ లు హరిప్ హుస్సేన్, చంద్ర హాసన్, ఆశ వర్కర్లు ,అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

బుధవారం భూపాలపల్లి రూరల్ మండలంలోని ఎస్‌.ఎన్‌.కొత్తపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు జంగా రాణి, నాలుక రామ్మూర్తి, తరగంప కరుణలత ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడి ఇంటి నిర్మాణం ఎప్పుడు ప్రారంభించారు, ఇప్పటి వరకు ఎంతవరకు పూర్తి చేశారు, ఏవైనా సాంకేతిక లేదా సామగ్రి సంబంధిత సమస్యలున్నాయా?, ఇసుక ఎక్కడి నుండి తీసుకుంటున్నారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపట్టిన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందజేస్తోందని కలెక్టర్ తెలిపారు. మండలంలోని కాల్వపల్లి వద్ద ఉన్న ఇసుక స్టాక్‌పాయింట్ నుండి ఇసుక అందుబాటులో ఉందని, లబ్ధిదారులు అక్కడినుండే తీసుకోవచ్చని స్పష్టం చేశారు.
ఇంటి నిర్మాణం పనులను దశలవారీగా పూర్తి చేస్తూ సంబంధిత ఫోటోలు, వివరాలను వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిర్మాణం నాణ్యతకు ఎలాంటి రాజీ లేకుండా పని చేయాలని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలు పరిశీలించారు. వర్షాలు వల్ల మురుగు నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్యం కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రం చేయాలని సూచించారు. ప్రతి కుటుంబం తప్పని సరిగా ప్రతి శుక్రవారం డ్రై డే పాటించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమలు వ్యాప్తి జరుగకుండా నియంత్రణ చర్యలు విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పిడి లోకిలాల్, ఎంపిడిఓ నాగరాజు, గృహ నిర్మాణ శాఖ ఏఈ రాయలింగు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ రహదారిపై నాసిరకం పనులు.

జాతీయ రహదారిపై నాసిరకం పనులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

నారాయణఖేడ్ మీదుగా బీదర్, జహీరాబాద్ వైపు వెళ్తున్న జాతీయ రహదారి పనులను కాంట్రాక్టర్ నాసిరకంగా చేపట్టడంతో వాహదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని పిప్రి వద్ద రహదారిపై నాణ్యమైన మట్టి కాకుండా నల్లమట్టి వేయడం వల్ల బుధవారం రాత్రి కురిసిన చిరుజల్లులకే బురదమయంగా మారడంతో వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా వెళ్తున్న రోడ్డుపై వాహనం జారి పడిపోతున్నారు. భారీ వర్షాలు కురిస్తే ఇక అంతే సంగతి అని వాపోతున్నారు.

మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి. ‌

*మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి*. ‌

**ఎంఈఓ లింగాల కుమారస్వామి ** ‌

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:


మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలను ఎంఈఓ లింగాల కుమారస్వామి ప్రారంభించారు. ఎంఈఓ మాట్లాడుతూ. విద్యార్థులు మత్తు పదార్థాలైనటువంటి గంజాయి, స్మోకింగ్, మద్యపానంతో ఎంతో అన్నార్దాలు జరుగుతున్నాయని మాదక ద్రావ్యాల నిర్ములనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలని వాటి వలన కలిగే అనార్ధాలపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, వెంకన్న, భాగ్యశ్రీ, రవీందర్, పద్మ, కొమురల్లి, ఎం ఆర్ సి. సిబ్బంది వేణు, శ్రీనివాస్, శివకుమార్, చంద్రమౌళి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కేఎల్ రాహుల్ కష్టం చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

సెంచరీలు ఊరికే రావు.. కేఎల్ రాహుల్ కష్టం చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

 

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు.

పరుగుల వరద పారిస్తున్న రాహుల్..

ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు.

 

 

 

 

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ ఫార్మాట్లకు అతీతంగా రాణిస్తున్నాడు. టీ20, వన్డే, టెస్టులు.. ఇలా ఫార్మాట్ ఏదైనా సరే బరిలోకి దిగితే పరుగుల వర్షం కురిపించాల్సిందే అనేలా అతడి బ్యాటింగ్ సాగుతోంది. ఈ ఏడాది ఆరంభంలో చాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన రాహుల్.. ఆ తర్వాత ఐపీఎల్‌లో అదే ఫామ్‌ను కొనసాగించాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోనూ దుమ్మురేపుతున్నాడు. లీడ్స్ టెస్ట్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో 137 పరుగులతో భారత బ్యాటింగ్‌ను ముందుండి నడిపించాడు. అతడి సెంచరీకి అంతా ఇంప్రెస్ అవుతున్నారు. వాటే బ్యాటింగ్ అంటూ మెచ్చుకుంటున్నారు.

సెంచరీ బాదిన రాహుల్.. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (118)తో కలసి నాలుగో వికెట్‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. వీళ్లిద్దరూ రాణించడం వల్లే 364 పరుగులు చేయగలిగింది భారత్. దీంతో రాహుల్‌ను అంతా పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని లోటు కనపడకుండా చేస్తున్నాడని, అతడి బ్యాటింగ్ అద్భుతమని ప్రశంసిస్తున్నారు. ఈ జోరు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. ఈ తరుణంలో కేఎల్ ప్రాక్టీస్ వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మ్యాచ్‌కు వెళ్లే ముందు సన్నాహకాల్లో రాహుల్ పడిన కష్టాన్ని ఇందులో చూడొచ్చు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

Shine Junior Colleges

భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లిగోరి మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, పద్దెనిమిది మంది లబ్దిదారులకు ఉత్తర్వుల మంజూరి పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు పలువురు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. అంతకుముందు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుడైన పాలకుర్తి తిరుపతి – స్వప్న ఇంటి నిర్మాణ పనులను ఎమ్మెల్యే టెంకాయ కొట్టి, మట్టి తీసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం తిరుపతి దంపతులకు ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు

ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి పనులు శరవేగం.

ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి పనులు శరవేగం

 ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసిన

★ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్

★ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో శాంతినగర్ మరియు డ్రైవర్ కాలనీ లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ మరియు మాజీ మంత్రి డా౹౹చంద్రశేఖర్ మాట్లాడుతూ అరుహులైన ఇల్లు లేని నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి 5 ఐదు లక్షల రూపాయలు ఇవ్వనుంది.ఈ పథకం పేద ప్రజలకు నీడగా నిలవనుంది అని వారు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ ఛైర్మెన్ గిరిధర్ రెడ్డి,మాజీ ఇండస్ట్రియల్ ఛైర్మెన్ తన్వీర్,పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు,ఏయంసి.డైరెక్టర్ జఫ్ఫార్,మాజీ ఎంపీటీసీ అశోక్,కాంగ్రెస్ నాయకులు మంకల్ శుభాష్,శుక్లవర్ధన్ రెడ్డి,ఖాజా,తదితరులు పాల్గొన్నారు.

కార్మికులంతా రక్షణ సూత్రాలను అనుసరించి పని చేయాలి..

కార్మికులంతా రక్షణ సూత్రాలను అనుసరించి పని చేయాలి..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

 

సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులు, అధికారులు ప్రతి ఒక్కరూ రక్షణ సూత్రాలను అనుసరించి పని చేయాలని, ఇంటి నుండే రక్షణతో హెల్మెట్ ధరించి డ్యూటీకి రావాలని, డ్యూటీలో ఎల్లప్పుడూ రక్షణ పరికరాలు ధరించి పని చేయాలని మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ అన్నారు.

మంగళవారం రామకృష్ణాపూర్ సిహెచ్పీ లో డీజీఎం బీ బీ ఝా ఆధ్వర్యంలో స్పెషల్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించగా ముఖ్య అతిథులుగా మందమర్రి ఏరియా జిఎం దేవేందర్, బెల్లంపల్లి ఏరియా రీజినల్ సేఫ్టీ జీఎం రాజ్ కుమార్, ఏరియా సేఫ్టీ అధికారి రవీందర్, ఏజీఎం వెంకటరమణ ,ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఏరియా వైస్ ప్రెసిడెంట్ లింగయ్య, ఫిట్ సెక్రటరీ రామకృష్ణ, ఇంజనీర్ జాకీర్ హుస్సేన్ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా జిఎం దేవేందర్ మాట్లాడారు. సింగరేణిలో పనిచేసే కార్మికులు రక్షణ సూత్రాలను పాటించాలని, ప్రతి పనిలో నిబద్ధత కలిగి ఉండాలని, ఆరోగ్యం పై దృష్టి సారించాలని, ప్రతి కార్మికుడు ఆరోగ్య సింగరేణియుడి గా ఉండాలని అన్నారు. సింగరేణి సంస్థ కార్మికుల సేఫ్టీ కోసం ప్రతిదీ సమకూరుస్తుందని, కార్మికులు సైతం సంస్థ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు.

4 గంటలు పని చేసే నటులు కూడా ఉన్నారు.

4 గంటలు పని చేసే నటులు కూడా ఉన్నారు: దీపికా పదుకొణే వివాదంపై రానా వ్యాఖ్యలు

 

 

నేటిధాత్రి:

 

 

 

 

భారతీయ సినిమా పరిశ్రమలో నటీనటుల పని గంటలపై జరుగుతున్న చర్చకు నటుడు రానా దగ్గుబాటి తనదైన శైలిలో స్పందించారు.

నటి దీపికా పదుకొణె…

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి పనివేళల విషయంలో విభేదాల కారణంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే వార్తల నేపథ్యంలో, రానా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమని, ఇక్కడ నిర్దిష్ట ప్రమాణాలను చేరుకోవడానికి ఎక్కువ గంటలు పనిచేయడం, ఎక్కువ కృషి చేయడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒక ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ, “భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని మనం అర్థం చేసుకోవాలి.

మనం అభివృద్ధి చెందిన దేశం కాదు.

తలసరి ఆదాయం పరంగా చూస్తే మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో బహుశా 186వ స్థానంలో ఉంటుంది” అని పేర్కొన్నారు.

తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చిన వైనాన్ని గుర్తుచేస్తూ, “కొన్ని కుటుంబాలు, వందలాది మంది తమ సర్వస్వాన్ని వదులుకుని ఒక నగరం నుంచి మరో నగరానికి వచ్చి ఇక్కడ పరిశ్రమను స్థాపించారు.

నాకు ఇది పనిలా కాకుండా ఒక జీవన విధానంలా అనిపిస్తుంది” అని తెలిపారు.

పరిశ్రమను బట్టి మారే పనివేళలు

పనిగంటలు అనేవి ఒక పరిశ్రమ నుంచి మరో పరిశ్రమకు, అలాగే ప్రాజెక్టును బట్టి కూడా గణనీయంగా మారుతాయని రానా వివరించారు.

“ఉదాహరణకు, మహారాష్ట్రలో 12 గంటల షిఫ్ట్ ఉంటుంది, తెలుగులో 8 గంటల షిఫ్ట్ ఉంటుంది.

కానీ మహారాష్ట్రలో ఉదయం 9 గంటలకు పని మొదలుపెడితే, తెలుగులో మేం ఉదయం 7 గంటలకే మొదలుపెడతాం.

అలాగే, షూటింగ్ జరిగే ప్రదేశం, నగరం, సెట్‌లో చిత్రీకరిస్తున్నారా లేదా స్టూడియోలోనా అనే అంశాలు కూడా పనిగంటలను ప్రభావితం చేస్తాయి.

సెట్‌లో షూట్ చేయడానికి ఎక్కువ సన్నాహాలు అవసరం, అదే స్టూడియో అయితే సౌకర్యవంతంగా ఉంటుంది.

కాబట్టి ఇది ప్రాజెక్టును బట్టి మారుతుంది.

దీన్ని ఒక సాధారణ విషయంగా చూడకూడదు” అని ఆయన స్పష్టం చేశారు.

నటీనటులను ఎక్కువ గంటలు సెట్‌లో ఉండమని బలవంతం చేస్తారా అన్న ప్రశ్నకు రానా సమాధానమిస్తూ, “ఎవరూ ఎవరినీ బలవంతం చేయడం లేదు.

ఇది ఒక ఉద్యోగం.

‘మీరు ఈ షో చేయాల్సిందే’ అని ఎవరూ మిమ్మల్ని నిర్బంధించలేరు.

ఇది పూర్తిగా వ్యక్తిగత ఎంపిక.

జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై ప్రతి ఒక్కరికీ వారి వారి అభిప్రాయాలు ఉంటాయి.

కేవలం 4 గంటలు మాత్రమే షూట్ చేసే నటులు కూడా ఉన్నారు.

అది వారి పనివిధానం” అని తెలిపారు.

దేశ జనాభాలో 70-80 శాతం మంది రోజుకు 100 రూపాయలు సంపాదించే పరిస్థితులున్నాయని, ఈ కోణంలో చూసినప్పుడు మనం ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉందని రానా అన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా.. పనిచేయాలి.

పంచాయతీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా.. పనిచేయాలి.

బాలానగర్ /నేటి ధాత్రి.

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో శనివారం బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బూత్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గోపాల్ నాయక్ మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పథకాలు వైఫల్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో నెలకొన్న సమస్యలపై అధికారులను నిలదీస్తూ.. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. ప్రజలపై సత్సంబంధాలు మెరుగుపరిచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీని పలువురు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

మద్రిలో ఇందిరమ్మ ఇళ్ళ పనులు ప్రారంభం.

మద్రిలో ఇందిరమ్మ ఇళ్ళ పనులు ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతో కలిసి అధికారులు శుక్రవారము ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు వేసి పనులు ప్రారంభించారు.కొహీర్ మండల పరిధిలోని మద్రిలో గ్రామానికి చెందిన లబ్ధిదారురాలకు అధికారులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పరచి నిర్మాణ విధానాన్ని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భారతి, ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు అజీమ్, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.

వికసిత్ భారత లక్ష్యంగా బిజెపి పని చేస్తుంది.

*వికసిత్ భారత లక్ష్యంగా బిజెపి పని చేస్తుంది

బిజెపి మాజీ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు జన్నేమొగిలి

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

 

 

శాయంపేట మండల కేంద్రంలో బిజెపి మండల నూతన కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి హాజర య్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి 11 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వికసిత్ భారత్ లక్ష్యంగా బిజెపి పని చేస్తుంది భారతదేశం 2047 నాటికి ఒక పూర్తిగా వికసిత దేశంగామారా లన్న దృష్టితో ఏర్పడిన అభిప్రా యం భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికిదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన దేశంగా నిలిపే లక్ష్యంతో నరేంద్ర మోడీ పని చేస్తున్నారు

వికసిత్ భారత్ లక్ష్యం

 

 

Former BJP

 

 

ఆర్థిక అభివృద్ధి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా తీర్చిదిద్దడం,ఉత్పాదకతను పెంచడం, ఉద్యోగావకాశాలను సృష్టించడం, ఐటీ, మానుఫా క్చరింగ్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో అభివృద్ధిసమాజ పరంగా సమగ్రత సామాజిక సమానత్వం, లింగ సమాన త్వం, విద్యావృద్ధిఆరోగ్య సదుపాయాల వృద్ధిపట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడం పరిశుభ్రమైన, పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధి
గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తుల ప్రోత్సాహంకాలుష్య నియంత్రణ, నీటి వనరుల పరిరక్షణసాంకేతికత ఆధారిత అభివృద్ధిడిజిటల్ ఇండియా అభియాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ వంటి రంగాల్లో ముందంజ భారత విలువలు మరియు సంస్కృతిని పరిరక్షించుకుంటూ అభివృద్ధి సంస్కృతి,భాషలు, సంప్రదా యాలను గౌరవిస్తూ ఆధుని కతను అంగీకరించడం భారత యువతకు ఒక ప్రేరణాత్మక దిశను చూపుతుంది.దీని ద్వారా ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులు,సంస్కరణలు ఒక దీర్ఘకాలిక దృష్టికోణంతో అమలవుతాయి.ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ స్థానం మరింత శక్తివంతంగా మారుతుంది అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ కానుగుల నాగరాజు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు, యువ మోర్చా జిల్లా కార్యదర్శి లాడే శివ, మండల ఉపాధ్యక్షుడు కోమటి రాజశేఖర్, మండల ప్రధాన కార్యదర్శులు మామిడి విజయ్, భూతం తిరుపతి, మండల కార్యదర్శులు మేకల సుమన్, వంగరి శివ శంకర్, కొంగరి భారతి, సీనియర్ నాయకులు మోత్కూరు సత్యనారాయణ, బూత్ అధ్యక్షులు కడారి చంద్రమౌళి, వంగల భాస్కర్ రెడ్డి, మును కుంట్ల చంద్రమౌళి,కన్నెబోయిన రమేష్, మూడేడ్ల పైడి, పరుష బోయిన శంకర్, బత్తుల రాజే ష్, కొంగర సుధాకర్, ఎర్ర తిరుపతిరెడ్డి, మూడేడ్ల రాంప్ర సాద్ తదితరులు పాల్గొన్నారు

చెరువులలో పూడికతీత పనులు చేపట్టాలి

చెరువులలో పూడికతీత పనులు చేపట్టాలి దళిత గిరిజన మత్స్య సహకార సొసైటీలు ఏర్పరచాలి

తాళిపేరు డ్యామ్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తాలిపేరు డ్యాం అభివృద్ధికి నిధులు కేటాయించాలి
సీనియర్ జర్నలిస్ట్ నరసింహ

టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ ప్రత్యేక చొరవ చూపాలి

నేటిధాత్రి చర్ల :

 

చర్ల మండల కేంద్రంలోని 60 చెరువులను మినీ తాలిపేరు డామ్ గా తీర్చిదిద్దాలి గేట్లను అమర్చాలి చేపల సాగుకు మరియు వ్యవసాయ రైతుల అవసరాలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని సీనియర్ జర్నలిస్ట్ నరసింహ అన్నారు అదేవిధంగా దళిత గిరిజన మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేసి చేప పిల్లలను పంపిణీ చేసి ఆర్థిక అభివృద్ధికి పాటుపడాలి బయట ప్రాంతం నుండి వచ్చే చేపల వ్యాపారస్తులను అడ్డుకోవాలని స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించాలి
భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మరియు ఐటీడీఏ పీవో రాహుల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు తాలుపెరు డ్యామ్ ను మరియు చెరువులను సందర్శించాలి సమగ్ర ప్రణాళికతో చర్ల మండల కేంద్రంలో సాగునీటి కాలువలు లిఫ్ట్ ఇరిగేషన్ కొరకు ఈ ప్రాంతంలో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి చర్ల మండల ప్రజల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని స్థానిక దళిత గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రజల ఆకాంక్ష అన్నారు అదేవిధంగా తాలిపేరు డ్యామ్ ను పూర్తిస్థాయిలో బాగుచేయాలని హైడ్రాలిక్ గేట్లను అమర్చాలని తాళి పేరు లోపల భాగంలో సిల్ట్ ను పూర్తిగా తొలగించి నీటి నిలువ సామర్థ్యం పెంపొందించి చేపల సాగుకు అనుకూలంగా మరియు రైతులకు సాగునీటిని అందించే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మండలంలోని ప్రతి చెరువుకు నీటిని పంపిణీ చేయాలి ని ఎండాకాలంలో కూడా పూర్తిస్థాయి నీటిమట్టం ఉండేలా చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీటి కాలువల ద్వారా నీటిని పంపిణీ చేయాలి చెరువులను సుందరీకరంగా తీర్చిదిద్దాలని సీనియర్ జర్నలిస్ట్ నరసింహ అన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version