మహిళా ఉపాధ్యాయుల పాత్ర కీలకం.. కలెక్టర్ ప్రావీణ్య…

మహిళా ఉపాధ్యాయుల పాత్ర కీలకం.. కలెక్టర్ ప్రావీణ్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో శనివారం సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయులే రోల్ మోడల్ అని పేర్కొన్నారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, మహిళల కోసం తొలి పాఠశాలను స్థాపించిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా,జహీరాబాద్ నియోజకవర్గ (ఎం పి పి ఎస్) రెజింతల్, న్యాల్కల్ మండల ప్రధానోపాధ్యాయులు సఫియ సుల్తానా భాగ్యసాములుగా పాల్గొన్నారు,

ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న సఫియ సుల్తానా…

ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న సఫియ సుల్తానా

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

భారతదేశ మహిళా విద్య చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిన మహనీయురాలు చదువుల తల్లి సావిత్రిభాయి ఫూలే జయంతి ని పురస్కరించుకొని,గత సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.ఈ సంవత్సరం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు,ప్రతి జిల్లాలో 10 మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను సన్మానించాలనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దాంట్లో భాగంగా, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో,జిల్లాలోని 10 మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ,డిఇఓ వెంకటేశ్వర్లు ,నిర్మల జగ్గారెడ్డి మరియు వివిధ సంఘాల నాయకులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా,ఎం పి పి ఎస్ రెజింతల్, న్యాల్కల్ మండల ప్రధానోపాధ్యాయులు సఫియ సుల్తానా తమ విద్యా సేవలకు గాను,జిల్లా కలెక్టర్ డిఇఓ నిర్మల జగ్గారెడ్డి మరియు వివిధ సంఘాల నాయకుల చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించడం జరిగింది.

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాలికి సన్మానం…

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాలికి సన్మానం

నేటి ధాత్రి అయినవోలు:-

 

సావిత్రిబాయి పూలే జయంతి మరియు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐనవోలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఐనవోలు గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దల సమక్షంలో జరిగింది.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గడ్డం రఘువంశీ గౌడ్ మాట్లాడుతూ, భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా స్త్రీ విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారి సేవలు చిరస్మరణీయమని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నిరూపించిన ఆమె ఆలోచనలు నేటికీ మహిళలకు, ఉపాధ్యాయులకు ప్రేరణగా నిలుస్తున్నాయన్నారు. సమాజ నిర్మాణంలో మహిళా ఉపాధ్యాయులు పోషిస్తున్న కీలక పాత్ర అమూల్యమైందని పేర్కొంటూ వారి త్యాగం, సేవాభావాన్ని ఈ సందర్భంగా ఘనంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పల్లకొండ సురేష్, ఉపసర్పంచ్ అడ్డగూడి సతీష్, వార్డు సభ్యులు దూపెల్లి రాజు, సుజాత కుమార్, నాగలక్ష్మి అశోక్, సరిత జాన్సన్, కొత్తూరి రాజు, పురుషోత్తం, చందు, ప్రవీణ్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version